అమెరికా లో జర్మన్ హవా –10(చివరి భాగం )

  అమెరికా లో జర్మన్ హవా –10(చివరి భాగం )
                                                      మొదటి సేతు నిర్మాతలు జర్మన్లే
           1831 లో ”జాన్ ఆగస్టస్ రో బ్లింగ్ ”ప్రభుత్వ సర్వేయర్ గా పని చేసి ,విసుగెత్తి ప్రష్యా నుంచి అమెరికాలోని సాక్సన్ చేరాడు .అక్కడి జోహాన్స్ హీర్టింగ్ ను పెళ్ళాడి తొమ్మిది మంది సంతానాన్ని కన్నాడు .అందులో వాషింగ్ టన్ ఆగస్టస్ ఒకడు .ఈయన కు వ్యవసాయం ఇష్టం లేదు .ఫారం మేషిన్రి నిరి డిజైన్ చేసే అవకాశం కోసం అర్జీ పెట్టాడు .ఆరేళ్ళ తర్వాతా పెన్సిల్వేనియా లో ఇంజినీర్ గా చేరాడు .అక్కడి ఆలిఘని పర్వతాలు రవాణా కు ఆవ రోదం గా ఉన్నాయని భావించాడు .పడవలను రై, కార్ల మీదా చేర వేయాల్సి వచ్చేది .అలాంటి సమయం లో ఇంక్లైనేడ్ ప్లేన్ వెనక్కి వచ్చి కార్మికులను బలి గోన్నది .కనుక ఇంకా గట్టి రోప్ ను తయారు చేయాలని అనుకొన్నాడు .తానే ఇనుప వైర్ల ను కేబుల్ గా చుట్టే ఏర్పాటు చేశాడు .ఇదే అతని ఇన్నోవేషన్ .దీనితో సస్పెన్షన్ బ్రిడ్జి కి దారి ఏర్పడింది .
               అమెరికా లో సస్పెన్షన్ బ్రిడ్జి కి ఆద్యుడు రోబ్లింగ్ .రెండు గట్టి పునాది నిర్మాణాల పై రెండు లేక మూడు బరువైన కేబుల్స్ ,నీటికి చాలా ఎత్తున ఉండేట్లు ఏర్పాటు చేస్తారు .1845 లో పిట్స్ బర్గ్ లోని మొనోఘిలా నది మీద మొదటి సస్పెన్షన్ బ్రిడ్జి ని నిర్మించాడు .ఆయనే డిజైన్ చేసి తానే నిర్మాణం పూర్తీ చేశాడు .ఉత్తర అమెరికా లో రైల్ రోడ్ నిర్మాణానికి సాయ పడ్డాడు .కెనడా దేశపు విపరీత మైన చలినీ ,మలేరియా ను నాలుగు శీతాకాలల్లో తట్టుకొని నయాగరా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించిన మహా గొప్ప మేధావి ఇంజినీర్ రోబ్లింగ్ .దాని పై రైళ్ళు నడిపించాడు .గ్రేట్ వేస్త్రెన్ రైల్వే ఆఫ్ కెనడా తో రోచెస్టర్ నయాగరా అనే న్యు యార్క్ సెంట్రల్ రైల్ రోడ్ కు కలిపాడు .1857లోని డిప్రెషన్ ,సివిల్ వార్ లను తట్టుకొని సిన్సినాటి బ్రిడ్జి ని 1886 లో పూర్తీ చేశాడు .1051 అడుగుల పొడవున్న ప్రపంచం లోనే అప్పటికి పెద్ద బ్రిడ్జి .1854 లో బ్రూక్లిన్ ,న్యూయార్క్ లజనాభా బాగా పెరిగింది ఈస్ట్ రివెర్ నుంచి మాన్ హతాన్ కు ఫెర్రి మీద వెళ్ళ వలసి వచ్చేది .దీని పై బ్రిడ్జి కట్టే ప్రయత్నం 1869 లో ప్రారంభించాడు .అతని కాలు రెండు దుంగల మధ్య ఇరుక్కు పోయింది కాలు తీసేయాల్సి వచ్చి కొత్తకాలు పెట్టారు .ధనుర్వాతం వచ్చి మూడు వారాలలో చని పోయాడు .కొడుకు వాషింగ్ టన్ రోబ్లింగ్ 1872  లో తండ్రి ప్లాన్ ప్రకారమే నిర్మాణం కోన సాగించి ,ఫౌండేషన్ పని లో నీటిలో చాలా కాలం మునిగి ఉండాల్సి వచ్చేది .అప్పుడు ఒక వింత జబ్బు” కాస్సైన్ ”కు గురై సైట్ కు వెల్ల లేక తన అపార్ట్ మెంట్ లోనే కూర్చుని పనిని పర్య వేక్షించాడు భార్య ఎమిలి సైట్ లో ఉండి  పని చేయించేది 1595 అడుగుల పొడవుతో రెండు పెద్ద గ్రానైట్ టవర్ల తో ,నాలుగు స్టీల్ కేబుల్స్ తో ఎన్నో వేల సస్పెషన్ తీగేలతో ఆ బ్రిడ్జి తయారైంది .ఇప్పుడు అదే అతి పెద్ద బ్రిడ్జి .1883 లో దాని ప్రారంభోత్సవాన్ని పది లక్షల మంది జనం చూశారు .ప్రెసిడెంట్ చెస్టర్ ఆర్ధర్ దాని పై నడిచి అందర్ని ఉత్సాహ పరిచాడు .తండ్రీ కొడుకులైన రోబ్లింగ్ ల కల అలా సార్ధక మైంది ఎమిలీ తోడ్పాటుతో .
                                            విద్యా రంగం లో జర్మన్ల చేయూత 
       1838 లో కరోలినా లూయిసా ఫ్రాన్క్లెన్ బెర్గ్ తాను ఒహాయు లోని కొలంబస్ లో మొదటి కిండర్గార్టన్   స్కూల్ ను పెట్టానని చెప్పింది .అయితే ఇది విజయ వంతం కాలేదు .తర్వాత ఇరవై ఏళ్లకు గేర్మని నుంచి ఆమె తిరిగి వచ్చి కిండర్ గార్తాన్ లను ఎక్కువగా ఏర్పాటు చేసి అభి వృద్ధి చేసింది .అప్పటికి విద్యార్ధి నెల జీతం డెబ్భై అయిదు సెంట్లు మాత్రమె .మార్గరేట్ శుజ్జ్ 1958 లో విస్కాన్సిస్ లోని వాటర్ టౌన్ లో కే.జి.లను ఏర్పాటు చేసింది ఇవి ఇప్పుడు తామర తంపరగా పెరిగాయి .ఇవన్నీ జర్మని మేదో జనితాలే .తర్వాతా ఇవి పబ్లిక్ సిస్టం తో కలిసి పని చేశాయి .ఇవాళ్ళ కే.జి లేని ఎలిమెంటరి స్కూల్ లేనే లేదు అమెరికా లో .పరిస్ తాన్ లోని అడ్వాన్సెడ్ స్టడి ,న్యు స్కూల్ ఫర్ సోషల్ రిసెర్చ్ లు న్యు యార్క్ లో ఏర్పడ్డాయి .ఇవన్ని శరణార్ధుల పాలిటి శరణాలయాలయాయి .పొలిటికల్ సోషల్ సైన్సు ల లో కూడా స్కూళ్ళు వచ్చాయి ఆల్విన్ జాన్సన్ న్యు స్కూల్ అని ఏర్పరచాడు .బ్లాక్ మౌంటేన్ కాలేజి లో లిబరల్ ఆర్ట్స్ వచ్చాయి .ఇది నార్త్ కరోలినా లో ఉండి .ఇదే తర్వాతా రూరల్ రేఫ్యుజి ఫర్ మేని ఏమిగ్రీ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ గా మారింది .
                                                          మేధో వలస 
1833-45 మధ్య హిట్లర్ కు భయ పడి ఒక లక్షా ముప్పహి వేల మంది జర్మన్లు అమెరికా చేరారు .ఇక్కడ స్వంత సంస్థలను ఏర్పరచుకొన్నారు .అమెరికన్ పౌరసత్వమూ పొందారు .దేశ మంతటా విస్తరించారు .వీరి వల్లనే సాంస్కృతిక మేదో వలస పెరిగింది .బ్రెయిన్ డ్రైన్అయి ఇక్కడ గైన్అయారు .ఏమిగ్రీ శిక్షకుడు జోసఫ్ ఆల్బెర్స్ ఆబ్స్త్రాక్ట్ పైంటర్ .కలర్ తెరపి మీద కృషి చేశాడు .అతని సబ్జెక్ట్ -”-ది ఇంతేన్సిటి  ఆఫ్ పిగ్మేన్త్స్ అండ్ హౌ దే ఫంక్షన్ విత్ వాన్ అనదర్ ”.అతని homage to the square ,ascending yellow square within a white square within a blue square ఉండి ఆశ్చర్యం కలిగిస్తాయి .పేరుకు తగ్గటీ ”effect of ascending of movement towards the edges of the canvas ”కానీ పించి దిగ్భ్రాంతిని కల్గిస్తుందని విశ్లేషకులు మెచ్చారు అందులో లైన్ ,ఆంగిల్ ,షేప్ ,స్పేస్ లను వీక్షించే వీలుంటుంది .ఇక్కడ వాస్తవం తో పాటు జామెట్రీ ఆర్ట్ ,అనేక వైవిధ్యం తో కన్పించటం విశేషం అంటారు తెలిసిన వాళ్ళు .
          1919లో ”బాహాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ”ఏర్పడింది .ఇవి ఇంటి నిర్మాణం కోసం వచ్చినవి .ఆధునిక డిజైన్ ను నేర్పిస్తారు .ఇవాళ డిజైన్ అనేది ఒక కల గా విస్తృతమైంది .అదే సంపూర్ణ ఆర్కి టేక్చర్  అయి కూర్చుంది .ఈ జర్మన్ ఆర్టిస్టుల వల్ల అమెరికా ఆర్కి టేక్చర్ బాగా పెరిగి పోయింది హార్వర్డ్ లోని గ్రోపియాస్ ,చికాగో లోని మీస్ లు సృజనాత్మక ప్రోపోర్శన్లు ,స్పేస్ ప్లాన్ యే రూం ,బిల్డింగ్ యే సొసైటీ అన్నీ వచ్చాయి .మీస్ ను ”the poet of steel and glass ”అన్నారు .చికాగో అంతా ఇతని దిజైనే అంటే అతిశయోక్తి కాదు .గ్రోపియాస్ కేంబ్రిడ్జి లోని గ్రాడ్యు ఎట్ సెంటర్ ,బోస్టన్ లోని నేషనల్ షామాట్ బాంక్  ,టెంపుల్ ఇస్రాయిల్ డిజైన్ల సృష్టి కర్త .ట్యూ బ్యులర్ స్టీల్ చైర్ నిర్మాత  మార్సెల్ బర్ర్ .మెసా చుసేత్స్ లో లింకన్ లో ఉన్న ఇళ్ళు ,అనేక హోమేస్ అతను డిజైన్ చేసినవే .
                                            విజ్ఞాన శాస్త్ర పురోగతి 
          జర్మని నుండి హిట్లర్ దుర్మార్గాన్ని సహించలేక ఎందరో విజ్ఞాన శాస్త్ర వేత్తలు అమెరికా చేరి ఇక్కడి శాస్త్ర పురోగతికి తోడ్పడ్డారు .వారి సేవలు అమూల్యం .అలంటి ఎందరిలో చుక్కల్లో చంద్రుడు ఆల్బర్ట్ అయిన్ స్టీన్ .అలాగే రాకెట్ పితామహుడు ”వాన్ బ్రాన్ ”జర్మని దేశాస్తుడే .హిట్లర్ కు తెలీకుండా జర్మని నుంచి తప్పించి అమెరికా తీసుకొచ్చి రాకెట్ లను డిజైన్ చేయించారు అమెరికా వాళ్ళు అలబామా లో హన్త్స్ విల్ లో వాన్ బ్రాన్ స్పేస్ సెంటర్ ను ఆయన గౌరవార్ధం ఏర్పరచారు .ఇక్కడే అధునాతన రాకెట్ లను రూప కల్పనా చేసి ప్రయోగించి అమెరికాకు ఆధిక్యాన్ని చేకూర్చిన వాడు  బ్రాన్ .అపన్ హీమేర్ అనే జర్మన్ అమెరికన్ ,వేర్నేర్ వాన్ బ్రాన్ లిద్దరూ మాన్ హటాన్ లో న్యూక్లియర్ ఫిషన్ పై కృషి చేశారు .బ్రాన్ ప్రపంచం లోనే మొదటి ఆపెరేషనల్ గైడెడ్ మిస్సైల్ ను ,v2స్పేస్ షటిల్ ను తయారు చేశాడు .స్పేస్ ప్రోగ్రాం లో అమెరికా ముందడుగు వెయ టానికి మార్గ దర్శకుడయాడు .1958 లో మొదటి సాటి లైట్ ఎన్కౌంటర్ ఒకటి ని ఆర్బిట్ లో ప్రవేశ పెట్టిన గ్రూప్ లో బ్రాన్ ఉన్నాడు .అయన రాకెట్ ఇంజినీర్ .అదే తర్వాతా నాసా గా మారింది .సాటర్న్ ఫైవ్ ,రాకెట్ లాంచ్ వెహికల్ ,లో అపోల్లో రెండు ను చంద్రుని మీద కు పంపారు .నాసా కు అసిస్టంట్ డైరెక్టర్ అయాడు .1972 లో అతని ఆధ్వర్యం లో తొమ్మిది ఫ్లైట్స్ ను ,ఆరు లూనార్ లాందిన్గ్స్ ఆఫ్ అపోల్లో స్పేస్ క్రాఫ్ట్ ప్రోగ్రాములు జరిగాయి .ఆపన్ హీమార్ అణు బాంబు తయారీ లో ప్రముఖ పాత్ర వహించాడు .ఇలా ఎందేరెందరో శాస్త్ర వేత్తలు అమెరికా పటాన్నే మార్చి వెయ టానికి తోడ్పడ్డారు .
                                    సంగీత నృత్యాలలో ప్రభావం
                  జర్మని ఆహారం పానీయం ,నృత్యాలు ,సంగీతం బాగా ప్రేరణ నిచ్చాయి .జర్మన్ సంగీత కారుడు జోహానా సెబాస్టియన్ బాచ్ సంగీతానికి అమెరికా లో గొప్ప క్రేజు .బీథోవెన్ ,ఫ్రాంక్ సకు బెర్ట్ ,రిచార్డ్ వాగ్నేర్ లు జర్మన్ సంగీతం లో సిద్ధ హస్తులు .వీరి సంగీతాన్ని అమెరికన్లు విపరీతం గా ఆద రించారు .ఇంకా ఇప్పటికి జర్మన్లు సంగీత కచేరీలు స్టేజి దశ లోనే ఉన్నాయి .కాని అమెరికన్లు పాప్యులర్ ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ అంటే ఇష్ట డ తారు .
                                   అమెరికా లోని ఇప్పటి జర్మన్లు మూడవ తరానికి చెందిన వారు .ఇటీవలి కాలం లో జర్మన్లకు ,అమెరికన్లకు తగాదాలు లేవు.stewbendaay parades అందరు హాజరవుతున్నారు .జర్మన్ పండుగలను అందరు గౌరవించి హాజరై అంతా ఒకటే ననే భావం కల్గిస్తున్నారు .
1959 లో జర్మన్ అమెరికన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది .జర్మన్ సంస్కృతీ లోని మంచిని అన్ని చోట్లా వ్యాపింప జేయాలని వారి ఆశయం .ఇప్పటికి నలభై నాలుగు మిలియన్ల జర్మన్ అమెరికన్లు జర్మన్ వార సత్వాన్ని గురించి చెప్పుకొంటారు .”we must all work together so that our most priceless possessions ,our heritage ,and knowledge of our cultural contributions -will not be lost ”అని జర్మన్ అమెరికన్లు చెప్పుకొంటారు .ఇదీ జాతుల సమ్మేళనం ,అమెరికా జాతీయతే అందరిది .అదే అందర్ని కట్టి పడేస్తోంది .”లాంగ్ లివ్ జర్మన్ అమెరికన్ అస్సిమిలేషన్ ”
                        సమాప్తం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –9-11-12-ఉయ్యూరు 
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.