పేలని ,కాలని టపాసులు—సరదాకి

 పేలని ,కాలని టపాసులు—సరదాకి  

  సావిట్లో వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాను .ఇంతలో వంటింట్లోంచి బ్రేవ్ మని త్రేపుకుంటూ పోకిరి సినిమాలో ‘’బ్రహ్మి ‘’లాగా అరపాంటు టీ షర్ట్ వేసుకొని బయటికొస్తూ ‘’హేపీ దివాలీ బావా ‘’అంటూ బయటికి వచ్చాడు మా బామ్మర్ది బ్రహ్మి .వాడి వాలకం చూస్తె వాళ్ళ అక్కయ్య పెట్టిన ఒక డజను గారెలు తిని ,ఒక ‘’ఆప్కోరా చెంబెడు ‘’కాఫీ లాగించి వచ్చి నట్టున్నాడు .’’దివాలీ ఏమిట్రా దివాలా హవాలా ‘’లాగా అన్నాను .’’బావా మేష్టరి నుంచి రిటైర్ అయి పది హేను ఏళ్ళు అయినా  ఇంకా ‘’కేరేక్షన్ వర్క్ ‘’మానలేదు .. అన్నాడు .’’తప్పు కాయి బాబూ దీపావళి శుభా కాంక్షలు ‘’అన్నాడు బ్రహ్మి .’’ఏ రా మీ ఇంటికి ఎప్పుడు మీ అక్క ఫోన్ చేసినా ఇంట్లో లేరు ,ఎక్కడికో వెళ్లారు ,ఎప్పుడొస్తారో తెలీదు వస్తే నేనే ఫోన్ చేయిస్తా అని మీ ఆవిడ చెబుతోంది .అంత తీరిక లేని వ్యవ హారాలెం చేస్తున్నావు ?ఏదైనా పార్టీ పెట్టి సభలు ,సమావేశాలు చేస్తున్నావా?’’అన్నాను .వాడు ‘’అదేమీ  లేదు బావా , ఏదో సభలు సమావేశాలకు వెళ్లి ఖాళీ బుర్రలో ఇంత సరుకు నింపుకొని వస్తున్నాను .నీతో మాట్లాడా లంటే సరుకుఉండాలిగా‘’అన్నాడు .’’ఇంతకి ఏమిట్రా దీపావళి విశేషాలు ?’’అడిగా .’’ఏముంది బావో !అంతా దివాలా గా రాష్ట్రం పరిస్తితి .నీలం తుఫానోచ్చి పంటంతా గాలం వేసి లాక్కె ల్లిపోయింది .దీనాతి దీనం గా ప్రజలు ఆకాశం వైపు చూస్తున్నారు దిక్కేవ్వరో తెలీక ,ఆదుకోనేదేవ్వరో అర్ధం కాక ‘’అన్నాడు .’’అదేమిట్రా !సిఎం .విహంగ వీక్షణం చేశాడని ఎంతైనా సాయం చెయ్య టానికి సిద్ధం అని డబ్బుకేమీ ఇబ్బంది లేదని హామీ ఇచ్చాట్ట గా ‘’అన్నాను .’’పిచ్చోడివి బా !మా ఆయనే ఉంటె —తో పనేంటి ?’’అని విన లేదా ?’’.ఆయన దగ్గర డబ్బులేమీ లేవు .పైవాళ్ళు రాల్చేది తక్కువ .అయినా ఎందుకో బావా కిరణ్ గారి చుట్టూ కిరణాల సోకు పోయింది .దిగులుగా ఉంటున్నాడు .నాదేం  పోయింది అన్న   వేదాంతం లో పడ్డ ట్టున్నాడు‘’అన్నాడు .ఇవన్నీ మామూ లేగా .ఇక వదిలేయ్యమన్నాను .

             కాసేపాగి’’ కొత్త టపాకాయలేమోచ్చాయి మార్కెట్లోకి .?ఎవరెవరు ఏమేమి కాలుస్తున్నార్రా ?’’అని అడిగా .వాడు కాసేపు బుర్ర గోక్కొని’’ బలే ప్రశ్న వేశావు బా “’అన్నాడు వాడు .’’సరే దస్త్రం విప్పుతున్నాను ‘’అన్నాడు .’’కానీ, ఆలస్యం చేయకు ‘’అన్నాను .’’బావా పాపం రాజకీయ నాయకులు కాల్చినవి పే ల్చినవి ఏవీ కాంతిఇవ్వలేదట ,పేలనూ లేదని మీడియా -మీది మీదికొచ్చి మరీ వాయిస్తోంది .మన కే సి యార్ ఒక కొత్త బాంబు తయారు చేయించి అతిగా గఫ్ఫాలు కొట్టి మీడియా నంతా పిలిచి విందు ఇచ్చి ,దాన్ని ఎంతో కస్టపడి వాళ్ళబ్బాయి ,అమ్మాయి లతో నిప్పు పెట్టిన్చాడట .అది ఉండి ఉండి కాలుతూ ,ఆరుతూ తుస్సు బస్సు మంటూ కూల బడిందట  అస్సలు పే లనే పేల లేదట ..కారణం ఏమిటని విచారిస్తే అది ఇప్పటికే గుజరాత్ రేవుల్లో ను ,పోలవరం డాం నీళ్ళ లోను నాన్ని నాని అలా అయిందని చెవులు కోరుక్కొంటున్నారు .

             ‘’ నాకో సంగతి తెలిసిన్దిరా నిజమో అబద్ధమో తెలీదు ‘’’’వదులు బా వదులు నిజమో కాదో నేను చెబుతా‘’అన్నాడు ‘’సరే విను .పాపం రాహుల్ గొప్ప మతాబా చేయించాడని ,దాన్ని యు.పి.లో కాలుద్దామని ప్లాన్ చేసి ఆర్భాటం చేశాడని ,తీరా కాల్చే సమయానికి అది నిప్పులు చేరగటం పోయి కాంతి రావటం మాని ‘’ఆశా నిరాశేనా మిగి లింది చిన్తేనా ?’’అని పాడుకోన్నాడని ,అందుకే ఇప్పటి దాకా తనమీద నిప్పులు చెరిగిన మాయావతి ,ములాయం ల సాయం తీసుకొని నిప్పు ధట్టిస్తున్నాడని ,పాపం బావ గారేమైనా సాయం చేస్తాడేమో ననుకొంటే ఆయన పీకల్లోతు మునిగాడనో ,మున్చాడనో విన్నాను .’’అన్నాను .. ‘’నిజమే బావా ! ఏంతో  ఆశ పడి కాళ్ళు అరిగే టట్లు   తిరిగి ఎన్నేళ్ళ నుంచో ప్రాక్టిస్ చేస్తే చివరికి తుస్సు మన్నది .కాని కుర్రాడు ములాయం కొడుకు మూన్నేల్లల్లో బాంబు తయారు చేయించి బ్రహ్మాండం బద్దలు కొట్టించి ‘’మాయాజాలం ‘’చేదించి భేరీ భండారాలు మోగించి నట్లు టపాసులు పేల్చాడు, కాల్చాడు .ఆ వెలుగుల్లో శబ్దాల తో ది ల్లీ అదిరింది ,కంపించింది బావోయ్ దానితో యవ్వ రాజ్య పట్టాభిషేకం కూడా తుస్సు మంది ఇక వైరాగ్యమే మిగిలింది ‘’అని పూరించాడు బామ్మర్ది బ్రహ్మి .

         ‘’బావా ఈసంగతి తెలుసా ?’’అడిగాడు మళ్ళీ ‘’యే సంగతి అన్నాను “’’అదే మన సి.ఏం.పెట్టిన చిచ్చు బుడ్డి సంగతి >’’అన్నాడు ‘’తెలీదు చెప్పు ‘’అన్నాను .’’డిల్లీ వెళ్లొచ్చిన దగ్గర్నుంచి చిర్రు బుర్రులెకాని ముఖం లో మతాబాలు వెలగటం లేదని ,ఎంతో ఆర్భాటం గా తయారు చేయించిన చిచ్చు బుడ్డి అడుగు నుండి నిప్పులు చిమ్మి తుస్సు మందని ,పైకి రవ్వలేరాలేదని  అనుకుంటున్నారు ‘’అని చెప్పాడు ‘కారణం ఏమిఅయి  ఉంటుందను కొంటున్నారు ?’’అడిగా‘’అందులో మందు కూరమని మంత్రుల కిస్తే ,గాలి నింపారని మందు బదులు ఇసక కూరి ,మాయ చేశారని ఇదంతా కావాలనే చేశారని ట్యాంక్ బండ్ మీద చెప్పుకొంటున్నారు ‘’అన్నాడు .

             ‘’  సరే రాఘవులు ,నారాయణ ఏం కాల్చార్రా ?’’అడిగా .’’ఈ సారి వె రైటీ చేయాలని ఇద్దరు కూర్చుని తూటా లు తయారు చేశారట బా..అందులో ఒకరికి తెలీకుండా ఒకరు జిల్లీ మందు బదులు జిల్లేడు బొగ్గు మాత్రమె కూరారట .ఇద్దరు జాయింట్ గా సుందరయ్య భవన దగ్గర కాల్చే ప్రయత్నానికి ఇరు పార్టీల కార్య కర్తలు హాజ  రయ్యారట .ఇద్దరు భారీగా ఉన్న ఆ తూటా ను అంటిం న్చారట .మసి, పొగా తప్ప చుమ్యి చంయి లేదట .అంతా ముసి ముసి నవ్వులు నవ్వుకోన్నారట .ఏమిటి ఇట్లా జరిగిందని జాయింట్ కమిటీ వేసి నిజం తెల్చమన్నారట .అప్పుడు బండారం బయట పడిందని కంకి కొడవలి ,కత్తి సుత్తి సాక్షిగా తెల్చారట .కలిసి పని చెయ్యటం అంటే వెనక పోట్లు అన్న మాట అని రాజకీయ విశ్లేషకులు విపరీతార్ధం లాగారు బా ‘’అన్నాడు .

                  ‘’సరే మన బాబు గారి బాంబు  సంగతి చెప్పవా ?’’అడిగా .’’బావోయ్ .అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అంటుకొని భగ్గు మంటోంది ,నిప్పులు కుమ్మ రిస్తోంది సింహాసనం ఎక్కేసినట్లు వీరంగం వేస్తోంది వీర విహారం చేస్తోంది దివిటీలా వెలుగుతోంది అంటున్నారు ‘’అని సన్నాయి నొక్కులు నొక్కాడు .’’ఇది నీ ఊహా నిజమా ?’’అన్నా .’’ఊహా ,అపోహా కలిసిన నిజం ‘’అని తేల్చాడు వాడు .’’పాపం జగనన్న టపాకాయల సంగతేంటి ?’’అడిగా .‘’.ఏముంది శోకాల తిమిరావాలీ దీపావళీ ‘’అని పాడుకొంటూ ,తల్లి ,అమ్మ పాద యాత్రలకు సంతోషించాలో లేదో తెలీక తల్లడిల్లుతూ నిర్వేదం బాంబు లు కాలుస్తున్నాడట .అవి ఎగర లేకా ,తిరగ లేకా ,పేల లేకా, కాల లేకా ,వెలుగివ్వలేక శోకాశ్రువులు రాలుస్తున్నాయట ఇంకెంత కాలం ఇంకెంత దూరం గద్దే అని అరుస్తున్నాయట.“’అన్నాడు .కేశవ రావు గారు భూ చక్రం తిరిగి నట్లు హస్తిన చుట్టూ ,అమ్మ వారి చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగి పోయి విష్ణు చక్రం అయినా కాలుద్దామని యత్నిస్తే అది తిరగకా కదలకా చెయ్యి కాలిందట .దానితో ఫిర్యాదు చేస్తూ అంతిమ లేఖాస్త్రం సంధిం చాడట  ”అన్నాడు .”ఒరే .ఇవన్నీ పేలక పోవటానికి కాలక పోవ టానికి అసలు కారణం రాష్ట్రాన్ని ముంచెత్తిన నీలం తుఫాను వర్షం, నిండా ముంచిన వరదలేమో .దానికి నువ్వు ఇంత కలర్ ఇచ్చావు ”అన్నాను . ఇంతలో మా ఆవిడ ‘’యే మండీ!  వాడి పిల్లలు ఇంటి దగ్గర వాడికోసం ఎదురు చూస్తూ ఉంటారు .మీ సోది ఆపి వాణ్ణి ఇంటికి వెళ్ళ నివ్వండి లేక పోతే మా మరదలు వాడి మీద బాంబులు పెలుస్తుంది ‘’అని మా మీద మాటల తూటాలు పేల్చింది .నవ్వుకొంటూ- ”బ్రహ్మీలాగు ”జేబుల్లో  చేతులు పెట్టుకొని చిద్విలాసం గా కదిలాడు బామ్మర్ది బ్రాహ్మీ .

                   ఇదంతా ఉత్తిత్తినే –సరదాకి –లైట్ తీసుకొంటారుగా

                దీపావళి శుభా కాంక్ష లతో

                 మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –13-11-12-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.