పీథి కా పుర పీథాది పతి –ఉమర్ ఆలీషా కవి
ఉమర్ ఆలీషా గారు కవి ,రాజకీయ నాయకులు ,ఖిలాఫత్ ఉద్యమ నాయకులు మహర్షి మోహి యుద్దీన్ కుమారులు .వంశ పారంపర్య పీథాది పతులు .తండ్రి గారు భాషా గురు వరేణ్యులు .కనుక కవిత్వం ఉగ్గు బాల తోనే అలవడింది .తల్లి గారు చాంద్ బీబీ .28-2-1885 న తూర్పు గోదావరిజిల్లా పిథాపురం లో జన్మించారు .తండ్రి గారు ఉర్దూ ,అరబ్బీ ,పారశీక సంస్కృతాలలో మహా పండితులు .శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీథ సంస్తాపకులు .ఆత్మ విద్య లో మార్గ దర్శులు .వీరి పూర్వీకు లందరూ ఈ కోవకే చెందినా వారు .
ఉమర్ ఆలీషా గారు చిన్నప్పుడే సంస్కృతాంధ్రాలలో నిష్ణాతు లయారు .తర్వాత పారశీక ,ఆంగ్ల ,అరబ్బీ భాష లో ప్రావీణ్యంసంపాదించారు .ఆంగ్లం లో మంచి ఉపన్యాసకులు .ఆంగ్ల పద్య కావ్యాలలో ఏమా త్రం ప్రవేశం లేదు ..వీరికి పోతన లాగా సహజం గా నె కవిత్వం అబ్బింది .సహజ కవులు గా కీర్తి గడించారు .పద్నాలుగవ ఏట నే ధారాళం గా తెలుగు లో కవిత్వం చెప్పి అందర్ని మెప్పించారు .పద్దెనిమిదవ ఏట ‘’మణి మాల ‘’అనే నాటకం రాసి ప్రచు రించారు ..ఏంతో మంది ఆలీషా గారికి ఉద్యోగం ఇస్తానని ఆహ్వానించినా వీరు ఆశ పడని స్వాభి మానులు .భాషా ,దేశ సేవ లో జీవితాన్ని పండించుకొన్నారు .
ఉమర్ గారు ఇస్లాం మతస్తులు .మాత్రు భాష ఉర్దూ .సుమారు యాభై గ్రంధాలు రచించారు .అందులో నాటకాలు ,ఖండ కావ్యాలు ,పద్య కావ్యాలు ,చరిత్రా ఆధ్యాత్మిక గ్రంధాలు ,నవలలు అనువాదాలు ఉన్నాయి .నాటకాలలో మణి మాల ,విచిత్ర బిల్హణీయం ,చంద్ర గుప్త ,కౌరవ రంగము ,అనసూయా దేవి,కళ ఉన్నాయి .పద్య కావ్యాలలో ఉమర్ఖయ్యాం ,మహమ్మద్ ప్రవక్త జీవితం ,సూఫీ వేదాంత ధర్మంముఖ్య మైనవి . ,సర్గ మాత ,పేర్కొన దగినవి .ఖండ కావ్యాలలో ముఖ్య మైనది బార్హిణీదేవి ..అనేక నవలలు ,పారశీక రచనల అనువాదాలు చాలా ఉన్నాయి .ఎన్నో సాహిత్య వ్యాసాలూ రాశారు .
ఆలీ గారి రాజకీయ జీవితమూ విశేష మైనదే .ముస్లిం లీగ్ కు మద్రాస్ విభాగానికిఉపాధ్యక్షులు గా పని చేశారు . ఉత్తర మద్రాస్ నుంచి పార్ల మెంట్ కు ఎన్నిక అయి దేశ సేవ చేశారు. 1936-45 వరకు అయిదేళ్ళుపార్ల మెంట్ సభ్యులు గా ఉన్నారు . .బెనారస్ హిందూ విశ్వ విద్యాలం లో తెలుగు కవితా విభాగానికి సభ్యుడి గా గౌర వింప బడ్డారు .ఆంద్ర విశ్వ విద్యాలయం ముస్లిం బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో తెలుగు శాఖ కు సభ్యులయారు .ఆలీ బ్రదర్స్ లో ఒక రైన షౌకత్ ఆలీ గాంధీజీ ఒకే రైల్ లో ప్రయాణం చేస్తూ ఉంటె వాల్టేరు స్టేషన్ లో ఆలీ ని పోలీసులు అరెస్ట్ చేసి జైలు కు పంపారు ..గాంధి గారు అప్పటికప్పుడు స్టేషన్ లోని జనాన్ని ఉద్దేశించి మాట్లాడి ఆలీ దేశ సేవను మెచ్చారు .ఆ తర్వాత ఉమర్ ఆలీషా మహోదయులు ఉత్తేజ పూర్వక ఉపన్యాసం చేసి అందరిని చైతన్య పరచారు ..
ఉమరాలీషా గారిని ఆలీఘర్ యుని వేర్సిటి’ మౌల్వీ’’ బిరుదు నిచ్చి సత్క రించింది ఆంధ్ర విశ్వ విద్యాలయం పండిత బిరుదు తో సత్కరించింది .ఇంటర్నశానల్ అకాడెమి ఆఫ్ అమెరికా 1936 లో ‘’డాక్టర్ ఆఫ్ లెటర్స్ ‘’తో గౌరవించింది .
వారు రాసిన ‘’తత్వ సందేశం ‘’అనే ఆధ్యాత్మిక గ్రంధం చాలా ప్రాచుర్యం పొందింది .మహమ్మద్ రసూల్ చరిత్ర మంచి పేరు తెచ్చు కొంది ..స్త్రీవిద్య ను ప్రోత్స హిస్తు పుస్తకాలు రాశారు .స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన విషయాల పై రచనలు చేశారు .అస్పృశ్యతా నివారణకోసం పాటు బడటమే కాక రచనలూ చేశారు .వర కట్న నిషేధం పై ఉద్యమం నడిపి వ్యాసాలూ రాశారు .ఇక ఫిలాసఫీ లో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలూ రాసి మార్గ దర్శనం చేశారు .అటు భాషా సేవ ఇటు మాత్రు దేశ సేవ తో బాటు ఆధ్యాత్మిక గురువు గా,సంఘ దురాచార నిర్మూలన ,మహిళాభ్యున్నతికి కృషి చేసి ఉమర్ ఆలీషా గురు వరేన్యులులు అందరికి దగ్గ రయ్యారు ..ఒక శిష్యుని కోరిక మన్నించి నరసా పురం వెళ్లారు .అక్కడే23-2-1945 న అకస్మాత్తుగా’’ సెరిబ్రల్ హెమరేజి’’ కి లోనై అరవై యవ ఏట తనువు చాలించారు .
మరో మహానేయుని చరిత్ర తో మళ్ళీ కలుద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-11-12—ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


Very interesting. Thank you.
LikeLike
http://www.sriviswaviznanspiritual.org/
https://www.youtube.com/user/GuruSpeech/videos?view=0
Please check the above links for more details about their ఆస్థానం
thanks
LikeLike