అంతర్ముఖ మహా యోగి – బెల్లం కొండ రామ రాయ కవి
వైష్ణవ సంప్రదాయానికి చెందిన బెల్లం కొండ రామ రాయ కవి నియోగి బ్రాహ్మణులు .గుంటూరు జిల్లా నరస రావు పేట దగ్గరున్న పామిడి పాడులో 1876 లో జన్మించారు .సంపన్న కుటుంబం .రుక్ శాఖ కు చెందినవారు .వీరు ఆశ్వలాయన సూత్ర బద్ధులు .వీరిది భారద్వాజస గోత్రం .చిన్న తనం లోనే తండ్రిని కోల్పోయిన అభాగ్యుడీయన .మొదట ఆంగ్ల విద్యనూ నేర్చుకొన్నారు .పిమ్మట దాని పై విరక్తి ఏర్పడి ,సంస్క్రుతాధ్యనం కోన సాగించారు .వీరు మొదట విశిష్టాద్వైత మతాన్ని అవలంబించారు .హయగ్రీవ ఉపాసన తో సర్వం సాదించుకొన్నారు .చాలా కుశాగ్ర బుద్ధి కల వీరు చిన్న నాటే రోజు సంస్కృతం లో కవితలు అల్లే వారు .వీరి సంస్కృత పాండిత్యం కాళిదాసు రఘు వంశం లో రెండు ,కుమార సంభవం లో రెండు సర్గ లతో నే ఆగి పోయింది ..మేఘ దూతాన్ని విన్నారు .తర్వాతా అన్నిటిని చక్కగా అన్వయించు కొన్నారు ..
పద హారవ ఏటనే ‘’రుక్మిణీ పరిణయం ‘’,’’రమా పరిణయం ‘’,అనే చంపూ కావ్యాలను రాశారు .నెల్లూరు కు చెందిన సింగ రాజు వెంకట రామణ య్య గారి కుమార్తె ఆది లక్ష్మమ్మ ను పరిణయ మాడారు .వీరి మంత్రాను ష్టానం చాలా తీవ్రం గా ఉండేది .గొంతు వరకు నీటిలో ఉండి మంత్రాన్ని అనుష్టించే వారు .చింత తోట లో అరుగు మీద కూర్చుని ఉపాసన చేసే వారు .ఇంటిలో నిత్యం హయగ్రీవ అర్చన చేస్తూ ,విద్యార్ధులకు భోజన భాజనాలను సమకూరుస్తూ ,సాహిత్యం ,అలంకార శాస్త్రాలను విద్య బోధించే వారు ..పురిమళ్ళరామ శాస్త్రి ,సుబ్రహ్మణ్య శాస్త్రుల గార్ల వద్ద తర్క ,వ్యాకరణాలను అధ్యయనం చేశారు .వ్యాఖ్యావ్యాకరణాలను స్వయం గా నేర్చిన మేధావి బెల్లంకొండ కవి .సిద్ధాంత కౌముది పై ‘’శరద్రాత్రి ‘’అనే వ్యాఖ్య రాసిన పండిత ప్రకాండులు .
ప్రతి రోజు వేదాంత గ్రంధ అధ్యన, అధ్యాపనం చేస్తూ ,అద్వైత వేదాంత గ్రంధాల నన్నిటిని స్వంత బుద్ధి తో అన్వ యించుకొని ఆమూలాగ్రం గ్రహించిన అపర అగస్త్యులు .వంశ పారం పర్యం గా వస్తున్న వైష్ణ వానికి దూరమై ,ఆ గురువులను వదిలేసి అద్వైత సిద్ధాంతం లో నిష్టను పెంచుకొన్నారు ..శంకరాద్వైతానికి పాథాలు చెప్పారు .అద్వైతం వీరి నర నరానాజీర్ణించుకొని పోయింది 143 గ్రంధాలను రచించిన మహా రచయిత అయారు .స్వయం గా వారే 30 కి పైగా గ్రంధాలను ముద్రించుకొన్నారు .అతి చిన్న వయసు లో ఇన్ని గ్రంధాలు రచించిన రచయిత లేడు అని పించుకొన్నారు ..
రామ రాయ కవి రచించిన స్తోత్ర గ్రంధాలు చాలా ఉన్నాయి .అలాగే శతక సంఖ్య కూడా ఎక్కువే .అందులో అష్టక స్తోత్రాలు 68 ఉన్నాయి .అన్నిటి లోను అద్వైత సిద్ధాంత ప్రతి పాదనే చేసి అపర శంకరు లని పించారు .భగవత్పాదుల గీతా భాష్యానికి వీరు వ్యాఖ్య రాశారు .వీరి గ్రంధాలలో ముఖ్య మైనవి –గీతా భాష్యార్క ప్రకాశిక ,(శంకర భాష్య టీకా ),వేదాంత ముక్తావళి ,శంకరాశంకర భాష్య విమర్శ (అద్వైతం )సిద్ధాంత సింధువు (మధు సూదన సరస్వతి గ్రంధానికి వ్యాఖ్య )వేదాంత కౌస్తుభం ,అద్వైతాన్య మత ఖండం ,శరద్రాత్రి (కౌముదికి వ్యాఖ్య )చంపూ భాగవత వ్యాఖ్య ,మురారి రచించిన అనర్ఘ రాఘవ నాటక వ్యాఖ్యానం ,సముద్ర మధనం అనే చంపు కావ్యం ,కృష్ణ లీలా తరంగిణి అనే కావ్యం
రామ రాయ కవి గ్రంధ రచన ను ఒక మహా తపస్సు గా భావించి సాధించారు .కవిత్వం దారా శుద్ధి తో ,నిసర్గ రమణీయం గా ఉంటుంది .అంతర్ముఖు లైన ,సమా విష్టులు అయిన మహా యోగి బెల్లం కొండ రామ రాయ కవి .హయగ్రీవో పాసకులకు అసాధ్యమేదీ లేదని నిరూపించిన మహా తపస్సంపన్నులు .
సశేషం -మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –15-11-12 -ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

