వాస్తు యోగి –వడ్డేపాటి నిరంజన శాస్త్రి
వడ్డే పాటి నిరంజన శాస్త్రి గారు 1877 లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దుగ్గిరాల గ్రామం లో జన్మించారు తండ్రి కోటయ్య గారు తల్లి గారు భద్రమ్మ .చిన్న నాడే ఉపనయనం జరిగింది .వెంటనే వేదాధ్యయనం ప్రారంభించారు .వేదం ,ఉపనిషత్తులను అభ్య శించారు .సంస్కృతం లోను తెలుగు లోను విశేష పాండిత్యాన్ని సంపాదించుకొన్నారు .
వీరు శిల్పర్షి పంచకం లో సానగ రుషి గోత్రానికి చెందిన వారు .రుగ్వేద అధ్యయనులు ..విశ్వ బ్రాహ్మణులు .వంశ వ్రుత్తి అయిన ఇనుప పని, కమ్మర పని లో తండ్రి గారి కర్మా గారం లో సరదా గా పని చేస్తూ మెలకువలన్నీ నేర్చారు ..వీరి దృష్టి శిల్పం మీదకు ,వస్తు శాస్త్రం మీదకు మళ్ళింది .వాటిని క్షున్నం గా నేర్చి ప్రవీణులయ్యారు ..జ్యోతిషం ఆతరువాత అభిమాన విషయ మైంది .దీని లోతు పాతులను తరచి నిష్ణాతు లని పించుకొన్నారు .ఇవి ఇలా కోన సాగిస్తూనే వేద, ఆగమ దర్శన శాస్త్రాలలో విశేష ప్రతిభను చాటుకొన్నారు ..అందులో ప్రవేశమే కాదు పాండిత్యాన్ని ,గడించి వాదనలో సాటి లేరని నిరూపించుకొన్నారు .ఉన్నత విద్యాలయం లో పండిత పదవి వీరిని వరించి వీరి ప్రతిభకు తగిన వరం అయింది
శాస్త్రి గారు ,18 వ ఏట నే వీర బ్రహ్మేంద్ర చరిత్రను ,’’కల్యంధ కౌముది ‘’అనే పేరు తోశ్రవ్య కావ్యం గా రాశారు .కుమారాస్వామి తారకాసుర వదను ‘’కుమారాభ్యుదయం ‘’నాటకం గా రాశారు .రెండు మహా ప్రౌఢ ప్రబంధాలను కూడా రాసి ,పూర్వకవుల సామర్ధ్యం తనకూ ఉన్నదని నిరూపించారు .అవి భీష్మోదయం ,ధర్మ పాల చరిత్రం .మాఘ మహాత్మ్యాన్ని ఆంధ్రీకరించారు సూర్య శతకం ,సుబ్బరాయ తారావళి ,తో బాటు బ్రహ్మానంద లీలలు అనే నాటకాన్ని కూడా రాశారు .వీరి భాషా పాండిత్య వేద విజ్ఞాన శాస్త్ర ఆగమ దర్శన సిద్ధాంతాల కు నికషోపలం గా నిలిచేది వీరు రచించిన ‘’విశ్వ కర్మ బ్రాహ్మణ వంశాగమ ము ‘’అనే మహా గ్రంధం .
వాస్తు శాస్త్రపు గుట్టు మట్టులన్ని ఆకళింపు చేసుకొని యోగ దృష్టి తో దానిని ఆచరణ లో ఉంచుకొని ఎందరికో మార్గ దర్శులై నిలిచారు .వీరు నిర్మాణాలను చేసి ,పర్య వెక్షిస్తూ దోష రహితం గా ,శాస్త్ర బద్ధం గా వాస్తు బద్ధం గా నిర్మాణపు పనులకు మంచి సహేతుకమైన సూచనలిచ్చే వారు శాస్త్రి గారు గొప్ప సంఘ సేవకులు .,సంఘ సంస్కర్తలు .మచిలీ పట్నం వాస్తవ్యులు కొండి పర్తి వీర భద్రా చార్యులు గారితో కలిసి వీరు 1908 లో కృష్ణా ,గుంటూరు మండల విశ్వ బ్రాహ్మణ మహా సభ లను నిర్వహించారు .’’ప్రబోధిని ‘’అనేపత్రిక ను స్థాపించి నీతి ,మత ,భాషా ,శిల్ప ,సాంఘిక విషయాల ఉద్ధరణ కోసం తీవ్రం గా కృషి చేసి కృత క్రుత్యులయారు .శిల్ప శాస్త్ర్రం లో ఉన్న అభి రుచి వల్ల తమిళ నాడు ,ఆంద్ర ,మహారాష్ట్ర లలో పర్య టించి ,శిల్ప రహస్యాలను గ్రహించారు .అమూల్య విషయాలను సేకరించి శిల్ప శాస్త్ర పురోగతికి ఏంతోసేవ చేశారు .
నిరంజన శాస్త్రి గారు అనేక యజ్ఞాలను తానే యాజకులు గా ఉండి నిర్వహించారు .ఆంద్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో వీరు అనేక చోట్ల నిర్వహించిన ‘’అహింసా యజ్ఞం ‘’ఎందరినో ప్రభావితులను చేసి ప్రేరణ నిచ్చింది .దీని వల్ల వేలాది మంది వైదిక ధర్మ పరాయణులు గా మారారు ..ఇంతకంటే సాధించాల్సిన్దేమి ఉంది ?బ్రాహ్మణ ,విశ్వ బ్రాహ్మణ వివాదాలలో వాదాలలో గుంటూరు, మద్రాస్, గోకర్ణ క్షేత్రాలలో బ్రాహ్మణ ,విశ్వ బ్రాహ్మణ ఆధిక్యాన్ని గూర్చి జరిగిన వాదోప వాదాలలో శాస్త్రి గారు సమర్ధ వంత మైన తమ వాదనను విని పించి దిగ్దంతులైన పండితులనే ఆశ్చర్య పరిచారు ఎందరికో స్వయం వెళ్లి పండిత సాక్ష్యాలను ఇచ్చి గెలుపొందేట్లు చేసిన వాదనా నిపుణులు .వారి కి అరవై ఏళ్ళు వచ్చేసరికి1937 లో నూరేళ్ళు నిండి పోయాయి .ఒక గొప్ప సామాజిక సేవకుడిని ఆంద్ర దేశం కోల్పోయింది
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-11-12-ఉయ్యూరు
Gabbita Durga Prasad
Rtd. head Master
Sivalayam Street

