సిద్ధ యోగి పుంగవులు -25
కృష్ణ బ్రహ్మ తంత్ర –పరకాల స్వామి .
స్వామి వారి పూర్వాశ్రమ నామం హోస దుర్గం కృష్ణ మా చార్యులు వీరు వికారి నామ సంవత్సర జ్యేష్ట శుక్ల పంచమి నాడు జన్మించారు .తండ్రి గారు శ్రీని వాస తాతా చార్యుల వారు గొప్ప ప్రఖ్యాతి చెందినపండితకవులు .తండ్రి గారి కీర్తి ఆంద్ర దేశమంతటా వ్యాపించింది .ఆచార్యుల వారు కర్నూలు మండలి లో పేపలి లో విద్యాభ్యాసం మొదలు పెట్టారు .వీరి ప్రధమ గురువులు వ్యాకరణ శాస్త్రం లో దిట్ట అని పించుకొన్న అయోధ్య కొండమాచార్యుల వారు .అఖండ పాండితీ గరిమతో ,స్వామి వారు అందరి మన్ననలు అందుకొన్నారు .
కృష్ణ మాచార్యుల కుమారులు శ్రీనివాస రాఘవా చార్య ,దేశికా చారర్యులు ఇద్దరు పండిత కవులు గా సుప్రసిద్ధులు .అంటే వీరి కుటుంబమే పండిత కవి వంశం అని తెలుస్తోంది .అనంత పాండిత్య ప్రకీర్శ తో స్వామి వారు వనపర్తి ,గద్వాల ,ఆత్మ కూరు సంస్థానాలను సందర్శించి ,తమ కవితా ,పాండిత్య ధార తో మెప్పించి సత్కారాలను ,సన్మానాలను అందుకొన్న శేముషీ దురంధరులు .వనపర్తి ఆస్థానం లో ధర్మాధి కారి గా కొంతకాలం పని చేశారు .అప్పుడే ఆ రాజు గారి పై ‘’రామేశ్వర విజయ చంపు ‘’అనే ప్రబంధాన్ని రచించారు .అలాగే ఆత్మకూరు సంస్థానం లో ఉన్న శ్రీని వాస స్వామి వారిపై ‘’శ్రీని వాస విలాస చంపువు ‘’అనే విశిష్ట ప్రబంధాన్ని పండిత జన రంజకం గా నిర్మించారు ..వీరు రాసిన ‘’హంస సందేశ వ్యాఖ్య ‘’పండిత ప్రశంశలను పొందింది . .హయగ్రీవ ఉపాసకు లైన స్వామి వారు శాతా లంకార లక్ష్య లక్షణ సమన్వయము గా హయగ్రీవ స్వామిని లక్ష్యం గా ఉంచుకొని ‘’అలంకార మణి హారం ‘’అనే శాస్త్ర గ్రంధాన్ని రచించి అలంకార శాస్త్రం లో తమ ప్రావీణ్యాన్ని నిరూపించుకొన్నారు .
కార్తీక మాసం లో గద్వాల లో జరిగే ఉత్స వాలను వర్ణిస్తూ’’ కార్తికోత్సవ దీపిక ‘’అనే గ్రంధాన్ని రాశారు .లక్ష్మీ సహస్ర వ్యాఖ్య ,నృసింహ విలాస చంపువు వీరి అముద్రిత గ్రంధాలు .కృష్ణ మాచార్యులు 40వ ఏట ఆశ్రమ స్వీకారం చేశారు .మైసూర్ లోని పరకాల మథాధి పతు లైన శ్రీ రంగనాధ స్వామి వారు ఆచార్యుల వారి పాండిత్యం ,నీతి నియమాలకు ముగ్ధులై తమ తర్వాత పీథాది పతులు గా నియమించారు .అప్పుడే వీరికి కృష్ణ పర తంత్ర స్వామి గా నామకరణం జరిగింది .పరకాల పీథాది పతులు గా స్వామి వారు 30సంవత్స రాలు సేవ లదించి పీథం ఉన్నతికి అన్ని విధాలా కృషి చేసి అందరి దృష్టిని ఆకర్షింప జేశారు .ఆశ్రమాధి పతి గా వీరు విజ్ఞాన బీజాలను దేశ మంతటా వెద జల్లి ,వేద విహిత ధర్మ వ్యాప్తికి ఇతోధికం గా తోడ్పడ్డారు .
స్వామి వారి విద్వత్తు ,పాండిత్యం నిర్డుష్టమైనవి .శ్రీ వారికి ‘’విద్వత్ కవి సార్వ భౌమ ‘’,’’కవి గండ భేరుండ‘’మొదలైన బిరుదులు లభించాయి .వీరి అపూర్వ గ్రంధాలు కొన్ని ముద్రణ కు నోచుకో లేదు అందులో శ్రీ పరకాల గురు విజయం ,రఘు నాద విజయం ,రంగ రాజ విలాసం ,నృశింహ విలాసం ,కేశవోత్సవ మాలిక ,శ్రీ లక్ష్మీ సహస్రం ,రాసాస్వాదిని ,ఆచార్య వేద పాద స్తవ వ్యాఖ్యానం ,నవ రత్న హార స్తవ ,వ్యాఖ్యానం ,కావ్యోత్కార్శరక్షా ,సరస్వతీ మూలధనం ,శ్రీ కృష్ణ జయంతీ పౌర్వా పర్య నిర్ణయం ,శిష్ట సిద్ధాంత పద్ధతి ,శూద్రాశీర్నిర్ణయం ,కర్త్రుక్రమ నిర్ణయం ,స్వయం వ్యక్త ప్రతిష్టా నిర్ణయం ,అధిక మాసోత్సవ నిర్ణయం ,సోదర కన్యా ద్వయ వివాహ నిర్ణయం ,అతి క్రాంత శ్రాద్ద కాల నిర్ణయం, వివాహ కాల నిర్ణయం ,ప్రసన్నాభరణం ,వ్రుత్తి ముక్తాహార స్తుతి వ్యాఖ్యానం ,సుభద్రా పరిణయం ,విశ్రాంత రాఘవం ,ఉన్మత్త పాండవం మొదలైన అనేక ఆధ్యాత్మిక ,ఆగమ ,సిద్ధాంత ,కావ్య ,వ్యాఖ్య అలంకార గ్రంధాలను అలవోక గా రచించిన మహాను భావులు .వీరి స్తోత్రాలకు విశేష ప్రాచుర్యం ఉంది .
ఆహ్నిక రత్నం ,మేఘ మాల ,సమయామ్రుతం ,సూర్యోప రాగ దర్పణం ,రాజ వంశ రత్నావళి ,కళ్యాణ గీత మంజరి ,ఉత్తర రంగ మహాత్మ్యం ,శ్రీ రామాయణ వైభవం ,శంభు రహస్యం ,శ్రీ శరదంబుజ మాల ,శ్రీ రామ చంద్ర మంగళ మాలిక ,శ్రీ సర్వర్తు కుసుమ మాలా ,మొదలైనవి శ్రీ వారి వేద వేదాంగ,శాస్త్ర,విషయ పరిజ్ఞానానికి మహా శేముషీ వైభవానికి నిదర్శన గ్రంధాలు .ఇంత సాహిత్య సంపదను జాతికి అందించిన పూర్ణ ప్రజ్ఞా చాతుర్యం శ్రీ పరకాల స్వామి వారిది .మథాధి పత్యాన్ని సాధికారికం గా,సాంగం గా,సర్వ సమర్ధ వంతం గా , నిర్వహించి బహుజన హితం కోసం జీవితాన్ని పరి పూర్ణం చేసుకొన్నా కృష్ణ పర తంత్ర –పరకాల స్వామి యతీంద్రులు ఆనంద నామ సంవత్సర కార్తీక బహుళ పంచమి నాడు సిద్ధి పొందారు ..
స శేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –17-11-12-ఉయ్యురు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

