గొల్లపూడి కదా మారుతం –4 మూడవ కధ –తాజ్ మహల్

 గొల్లపూడి కదా మారుతం –4

                                                                                         మూడవ కధ –తాజ్ మహల్

  ప్రేమకు డబ్బు తో పని లేదు .పవిత్ర ప్రేమ అంతస్తులను ఎరుగదు .యెద గూటిలో పదిలపరచిన భార్యకు తన కంటే ముందుగా చని పోతే స్మృతి చిహ్నం నిర్మించటం అనాదిగా వస్తున్న ఆచారం .షా జహాన్ ముంతాజ్ తాజ బేగం కోసం తాజ్ మహల్ నే కట్టించాడు .ఇది ప్రపంచ అద్భుతాలలో ఒకటి గా నిలిచి పోయింది .ఎంత చెట్టుకు అంత గాలి .కూలి వాడైనా తన భార్యకు తాను ఓపి నంతగా స్మృతి చిహ్నం కట్టు కొంటాడు .అది అతని తృప్తి .మొదటిది ప్రపంచానికంతటికి యాత్రా స్థలం అయతే రెండోది ఆ ఇద్దరికీ మాత్రమె ప్రత్యేకం .లేక –ఆత్మీయులేవరైనా సహృదయత తో చూసి నాల్గు బాష్ప కణాలు రాల్చ వచ్చు .ఇదేమీ  నిబంధనా కాదు చూడాలన్న ఉబలాటమూ కాదు .అయితే దాని కెంత విలువో హృదయం తో సహృదయం తో చూస్తె దీనికీ అంతటి విలువే .అది చలువ రాతి కట్టడా మైనా ,ఇది రాతి గోరీ అయినా విలువలో సమానం .అదీ ప్రేమ చిహ్నానికి ఉండే పవిత్రతా విలువా,ఆరాధనా .ఈ సత్యాన్ని ‘’తాజ్ మహల్ ‘’కధ లో మారుతీ రావు ఆద్యంతం మనసుని ఆర్ద్రత చెందించేలా ,గొప్పగా రాశాడు .

           కధ మొదలు పెడుతూనే ‘’తెల్లటి స్వచ్చ మైన రెండు మనసులకు అభిజ్ఞా ,అపూర్వ ప్రేమాను రాగాలకు అమూల్య ప్రతీక .,చరిత్ర చెక్కిలి పై ఘనీభవించిన అందమైన కన్నీటి చుక్క ,ముంతాజ్ షాజహా నుల అమర ప్రేమ చిహ్నం అయిన తాజ్ మహల్ గురంచి కాదు నేనిప్పుడు చెప్పదలచుకొన్నది ‘’అంటాడు .అంటే ఇంత కంటే దివ్య మైన సుందర మైన పవిత్ర కట్టడాన్ని చూడ బోతున్నామని అని పిస్తుంది .ఆ ఉత్కంఠ  అలా ఉంది.ఏం గొప్ప చిత్రం చూపిస్తాడో గొల్ల పూడి అని .ఆకర్షితులం అవుతాం .మనసుని అదుపు లో ఉంచుకొని ,ఆలోచనలను చెదర నీక ఎంతో శ్రద్ధాసక్తులతో విన టానికి ఉన్ముఖీక్రుతుల మవుతాం .అలా మనల్ని తయారు చేసి కదప్రారంభించటం –గొల్ల పూడి మార్కు .కధనం లో నవ్యత కధలో కూడా .

               ఆగ్రా అంటే తాజ్ మహల్ గుర్తుకు రాదట రచయితకు ‘’ఓ చిన్ని పూరి గుడిసె ,యెర్ర కోట మలుపు లో ఓ మురికి పేటకు వంద గజాల దూరం లో ఉన్న దట్టం గా పెరిగిన చెట్లూ ,నందాలాల్ ,వాడి పొట్టి భార్యా ,ఓ కుంటి గుర్రం,ఓ పాత గుర్రబ్బగ్గీ ‘’ఇవీ గుర్తుకోస్తాయట .అయితే దానికి కారణాలన్నీ అద్భుతం గా ఏకరువు పెడ తాడు మారుతీ రావు .’’ప్రపంచ అద్భుతాన్ని నవాబుల కళాభి రుచులతో ధనం తో ముడి పెట్టక ,మనస్సు విశాలత్వం తో,ప్రేమ ఔన్నత్యం తో కొలిస్తే నేను చూసిన తాజ్ మహల్ ప్రపంచ అద్భుతాలలో ఎనిమిదవది అయి తీరుతుంది ‘’అంటాడు .నిజ మైన కొలమానం అదే అయితే ,అవకేం చేస్తుంది ?మనం కూడా శ్రుతి కలపాల్సి వస్తుంది .ఆ వింత చూసి అబ్బుర పడాల్సిందే .భావ సౌందర్యం అందరిదీ .అక్కడ అంతస్తులు లేవు .అభి రుచులు తప్ప .ఇక కద లోకి తిన్నగా ప్రవేశిస్తూ ,మనల్నీ తన తో పాటు లాక్కు పోతాడు

             ‘’ఆ –రోజు –దురదృష్టం వరించిన లోభి హృదయం లాఆకాశం బ్రద్దలై దారా పాతం గా వర్షిస్తోంది .రచయితా భార్యా ఆగ్రా లో ఓ హోటల్లో దిగారు .అక్కడ ఆటోలు ఉన్నా ,హోటల్ యజమాని నందాలాల్ గుర్ర బ్బండీ లో తాజ్ కు వెళ్లండని సలహా ఇచ్చాడు అతని పై ఉన్న సాను భూతి తో .వాడు తాజ్ మహాల్ అంతపాత వాడు .’’అని మరీ చెప్పాడు .వంగి సలాములు చేశాడు నందాలాల్ .’’ఏదో మూల నుంచి అవాంచిత మైన జ్ఞాపకం లా వర్షం ,బండిలోకి తొంగి చూస్తోంది .ఆ వర్షం లో స్నానం చేస్తున్న నందలాల్ కీ ,వాడి భార్యకూ ఇదేమీ  పట్టలేదు .సాయంకాలం మేమిచ్చే డబ్బుతో రోజు గడుస్తుందన్న వేడి –ఆలోచనా ,ఆ చలిలో వాళ్ళిద్దర్నీ బతి కించి నట్టుంది ‘’ఇదీ నందాలాల్ జీవన స్తితి .రెక్కా ,గుర్రపు డేక్కా ఆడితేనే వాడి డోక్కాడేది .సందర్శకులలో దయా ,సాను భూతి ఉన్న వాళ్ళు తప్ప ఇలాంటి బండీ ఎవ రెక్కు తారు ?ఆ బాధ ఎందుకు భరిస్తారు ?ఏదో తెలీని మానవత్వం వాళ్ళనూ వీల్లనూ కలిపింది .బండి లో ప్రయాణం సాగింది .ఇరుకు సందులో బండి పోతోంది ‘’విజయోత్సవపు చిహ్నాలను మిగిల్చిన ఒక మహా సామ్రాజ్యపు మహా నగరం లో బతుకుతూ ,జీవితం మీద విజయం సాధించలేని ప్రజలు వీళ్ళు ‘’అంటాడు ఆగ్రా లో తాను చూసిన ఆ ప్రాంత ప్రజల్ని చూసి .వారి దైనందిన జీవితాన్ని చూసి ,దుర్భర పరిస్తితులను గమనించీ .’’అక్కడ రాజులూ రాజ్యాల్ని జయిస్తే వీళ్ళు జీవితతో పోరాడి వీగి పోయారు .బీదరికం లో సంఘీభావం పెరుగుతుంది గావుల్ను –అంతా కుంపట్ల చుట్టూ కూర్చుని ఆప్యాయం గా పలకరించు కొంటున్నారు .ముసలి వాళ్ళు మాత్రం పాదుషా ల అధికారం ,అజమాయిషీ లకింద నలిగి పోయి వంగి పోయిన పాత జ్ఞాపకాల్లా ఉన్నారు .నవ్వితే ఖరీదైన విస్కీ సీసా లో మిగిలిపోయిన చివరి ఘాటు వాసనలా ఎప్పుడో బతికిన రోజుల చాయలు వినిపిస్తాయి. ముఖాల్లో .పాత సంస్కృతికి చిహ్నాలుగా ఆ నగరం లోనీ శిధిలా సమాధుల వరుస లో చివరిది గా మిగిలి పోయిన గుర్తులు వాళ్ళు ‘’అందమైన కేన్వాస్ పై అత్యద్భుతం గా చిత్రించిన చిత్రం లా లేదూ ఆ వర్ణన ?మాటలతో చిత్రాలు రచించే నేర్పు ఆయనది .చేర గని ముద్ర పడే దృశ్యం .వారి జీవితాలపై సాను భూతీ కలిగే వర్ణన .వారి యదార్ధ జీవితా విష్కరణే ఇదంతా .

                ‘’జమునా నది యెర్ర నీళ్ళ తో కరుణా పూరిత మైన అంత రంగం లాగా ప్రశాంతం గా ఉంది‘’ట .ప్రాపంచిక చింతలను వెక్కి రించే స్తిత ప్రజ్నుడి చిరు నవ్వు లాగా మీది నుంచి కురిసే వర్షాన్ని జీర్నిన్చుకొంటు నిలిచిన ఎర్రటి నీరు .,ప్రవాహ గమనం ,అలసిన బాలింత రాలి నడక లాఉంది‘’ట .నందలాల్ భార్య గొంతు కూడా నిర్మలం గా ,నిండుగా ఉందంటాడు .యెర్ర కోట చేరారు .’’అరణ్య మంతా పరుగు దీసి ఇంకా కాలు కడప లేక ఆకలితో ,అలసట తో నిలిచినా ఖడ్గ మృగం శరీరం ‘’లాగా యెర్ర కోట ఉన్నదట .కవిత్వం లో పద ,భావ చిత్రాలు నిర్మిస్తారు కవులు .అంతటి సౌందర్య చాయా దీనిలో ఉంది .రచయిత భావనా పటిమకు జోహార్ అని పిస్తుంది .తాజ్ మహల్ మాత్రం ఆ మసక వెలుగులో‘’మరీ దూరానికీ ,వర్ష తాకిడికీ నలిగి పోయిన కాగితం పడవ ‘’లా గా కన్పించిందట రచయిత కు.చిక్కని భావ హర్మ్యాన్ని నిర్మిస్తాడు గొల్ల పూడి .

           తాజ్ మహల్ లోకి ప్రవేశం ఈ సారి

            సశేషం –మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –28-11-12-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.