కాశీ ఖండం –16 అంగారక ,గురు ,శని లోక వర్ణన

 కాశీ ఖండం –16

                                                                         అంగారక ,గురు ,శని లోక వర్ణన

  యెర్రని శరీరం గల లోకమే అంగారక లోకం .అన్గారకునిది యెర్రని శరీరం .అతడు భూమి కుమారుడు అందుకే కుజుడు అనే పేరు .దాక్షాయణీ వియోగం తో శివుడు ఘోర తపస్సు చేశాడు .ఆయన ఫాల భాగం నుండి ఒక చెమట బిందువు భూమి పై పడింది .దాని నుంచి లోహితాన్గుడు అనే కుమారుడు పుట్టాడు .అందుకే అతని తల్లిగా భూదేవి నిచెపుతారు .ఆమె పోషణ లో పెరిగి మహేయుడు అనే పేరు పొంది ఉగ్ర పురి లో ఉగ్రం గా తపస్సు చేశాడు .అక్కడి నుండి కాశి చేరి లింగ స్తాపన చేసి మహా తపస్సు చేశాడు .ఇది పంచ ముద్రా స్తానం లో కంబలాశ్వ తరువుకు ఉత్తరం గా ఉంది .అందుకే  అంగారకు డనే పేరొచ్చింది .శివుడు సంతోషించి గ్రహాధి పత్యాన్నిచ్చాడు .అన్గాకరేశ్వర లింగాన్ని పూజిస్తే గ్రహ పీడ తొలగి పోతుంది .అంగారక చతుర్ధి నాడు గణ నాధుడు జన్మించాడు

         అక్కడ నుండి గురు లోకం చేరాడు శివ శర్మ .పూర్వం బ్రహ్మ మూడు లోకాలను సృష్టించాలని సంకల్పించుకొని మొదటగా మానసము నుండి ఆయన తో సమాన మైన ఏడుగురు పుత్రులకు జన్మ నిచ్చాడు .వారే అంగిరసుడు ,మరీచి మొదలగు వారు .వీరంతా సృష్టి చేసే సమర్ధులు .అన్గిరసుడు బుద్ధికి దేవతల వంటి వాడు .శాంతుడు జితక్రోధి ,మెత్తని వాక్కు కలవాడు వేదార్ధ వేది .రూప శీలగుణ సంపన్నుడు .కాశీ లో శాంభవ లింగాన్ని స్తాపించి శివుని అర్చించారు .ఆ లింగం నుంచి ఒక తేజో రాశి ఏర్పడింది .దానికి నమస్కరించి స్తుతి చేశాడు . దానికి సంతృప్తి పడి ‘’నీ స్తోత్రం చాలా ఉదాత్తం గా ఉన్నది నువ్వు వాచస్పతి అనే పేరు పొందుతావు .బుద్ధికి నీ వంటి వాడు ఉండడు .’’అని చెప్పాడు బ్రహ్మ తో అతడిని వాచస్పతి ని  చేయమని ,దేవా చార్య పదవి నివ్వ మనిచెప్పగా అలానే చేశాడు అతనిచే స్తాపింప బడిన లింగం బృహస్పతీశ్వర లింగం గా లోకం ప్రసిద్ధ మైంది .ఈ లింగాన్ని అర్చిన్చితే పంచ మహా పాతకాలు నశిస్తాయి .

                   అక్కడి నుండి విష్ణు దూతలు శివ శర్మ ను శని లోకం చూపించారు .మరీచికి కశ్యపుని వలన సూర్యుడు ఉదయించాడు అతని భార్య త్వష్ట ప్రజా పతి కుమార్తె సంజ్ఞా దేవి .సూర్య తేజస్సును పొంది ఆమె కాంతి విహీన మయింది సూర్యునికి అప్పటి నుండి మార్తాండుడు అనే పేరు వచ్చింది .సూర్య తేజస్సును భరిస్తోంది సంజ్ఞవల్ల ముగ్గురు సంతానం కలిగారు .వైవశ్వతుడు మొదటి వాడు .యముడు రెందోకొడుకు .యమునా నది కన్యకా .ఇక సూర్యుని తేజస్సు భరించలేక సంజన తన చాయను ఏర్పరిచింది .ఛాయ తో ఆమె’’నేను నా తండ్రి దగ్గరకు వెడుతున్నాను .నువ్విక్కడ సుఖం గా ఉండు .నా కూతురు యమున ను జాగ్రత్తగా పోషించు ‘’అని అప్పగించి వెళ్లి పోయింది

                త్వష్ట ప్రజాపతి కూతురుని ఆహ్వానించలేదు .భర్త దగ్గరకే  పొమ్మన్నాడు .మళ్ళీ సూర్యుడి వద్దకు వెళ్లటం ఇష్టం లేక ఒక అరణ్యం చేరి బడబ అనే ఆడ గుర్రం గా మారి తపస్సు చేస్తూఉంది .ఛాయ సూర్యుని వల్ల ఎనిమిదవ మనువు అయిన సావర్నుని పుత్రుని గా కన్నది .యమునను సవతి తల్లి గా ఆరడి పెట్టింది .యముడు జాతి వైరాన్ని పూనాడు .సంజ్ఞా రూపం లో ఉన్న చాయను యముడు శపించాడు తన్నటానికి కాలు పైకెత్తాడు ఆ కాలు పడి పోవు గాక అని ఆమె శపించి నది .భర్త దగ్గరకు వెళ్లి ఏడ్చింది  .ఆమెకు బుద్ధి చెప్పాడు  .సంతానాన్ని సమాన ప్రేమ తో చూడాలని హితవు చెప్పాడు .యముడు తనను  క్షమించ మనితండ్రిని  కోరుకొన్నాడు .కానీ తల్లి శాపానికి తిరుగు లేదని పురుగులు అతని మాంసాన్ని తింటాయని భూలోకం లో పడటం తప్పదని చెప్పాడు .మళ్ళీ తన అనుగ్రహం వల్ల కాలు వస్తుందని అభయ మిచ్చాడు ..తన దగ్గర ఉన్నది సంజ్ఞా కాదని తెలుసుకొని సూర్యుడు ఆమెను వెతికి బడబ గా ఉండటం తెలుసుకొని తానూ గుర్రం వేషం  లో చేరి ఆమె తో సుఖించాడు .ఆమె పరపురుషుడేమో నని అనుమానించి శుక్రాన్ని తన ముక్కు రంద్రాలనుంచి బయటికి బయటికి పంపింది .ఆ శుక్రము నుంచి  అశ్వి నీ దేవతలు సూర్య తేజం తో జన్మించారు .సంజ్ఞ కు విషయం చెప్పాడు రవి .శని సూర్యుని అను మతి తో కాశీ వెళ్లి శివుని కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొంది గ్రహాది పత్యాన్ని పొందాడు .పోయిన కాలు వచ్చే సింది అందుకే శని మార్గం లో వక్రత ఉంటుంది .శనేశ్వర లింగం శుక్ర లింగానికి ఉత్తరం గా ఉంది .దీన్ని అర్చిస్తే ఉత్తమ లోక ప్రాప్తి, గ్రహ పీడా నివారణా జరుగు తాయి .

               సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –30-11-12-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.