చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -2
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
బాలకాండ-ఆ నాడు సాంప్రదాయానికి విరుద్ధం గా యాగాలను నిర్వహించేవారు .తర్వాత బ్రహ్మ రాక్షసులై ,యాగ విధ్వంసం చేశారు .రాక్షసులు ఎక్కడి నుండో ఊడి పడరు .మనలోని అవ్యక్త శక్తులే ఆరూపం గా వ్యక్త మౌతాయి .అశ్వమేధం లో యజమాని భార్య ,కోన ఊపిరితో ఉన్న అశ్వాన్ని ,మూడు బంగారు సూదులతో గుచ్చగానే అది చని పోయేది అన్న వివరణ అవసరమైనదే. యాగం పై ఉన్న అపోహను పోగొట్టేది .జాంబ వంతుడు బ్రహ్మ దేవుడు ఆవలించిన ముఖం లో నుంచి జన్మించటం తెలియ దగిన విషయం .అందుకె ఆయన వానర సేనకు గొప్ప సలహా దారు ,పెద్ద దిక్కు అవగాలిగాడు .మన్మధుడు కాలి బూడిద అయిన దేశం అంగ దేశం అయింది అన్న విషయం తెలియ దగింది .విశ్వా మిత్ర మహర్షి శ్రీ రామునికి ఇచ్చిన ‘’గాంధర్వ మానవాస్త్రం ‘’విచిత్ర మైనదే .కావాలని రామునికి దీన్ని అనుగ్రహించాడు మహర్షి .ఇచ్చిన వాటికి కృతజ్ఞత తెలుపుతూ ,స్మరించి నప్పుడు మాత్రమె వచ్చి సహాయం చేయమని అంత వరకు మనస్సులో మెదులుతుతు ఉండమని కోరటం ‘’రాముని బుద్ధి మంత తనం ‘’వామన జన్మ ద్వాదశి నాడు శ్రవణా నక్షత్త్ర ములో చంద్రుడు ఉన్న అభిజిథ్ నక్షత్రం అని అదే వామన జయంతి అని అందరికి తెలియని విషయాన్ని ఎరుక పరచారు .
పార్వతీ పరమేశ్వరుల రహస్య క్రీడను అడ్డు కొన్న దేవతలకు సంతానం కలగదని అమ్మ వారి శాపం ,భూదేవి కూడా తనకు సంతానం కలుగ కుండా చేసి నందుకు ఆమెకు బహు భత్రు త్వాన్ని ,పుత్ర సంతానలేమి కల్గించటం లో ,ఎంత మహిమాన్వితు లైనా ,తమకు కలిగిన బాధను తట్టుకో లేరని ,ఎదుటి వారికీ అలంటి బాధలు రావాలని కోరుకోవటం ఒక వింత నైజం గా కన్పిస్తుంది .ఇక్కడే పార్వతీ దేవి కూడా దీనికి ఏమీ అతీతం కాదని అని పిస్తుంది .భూ భారాన్ని మోసే ‘’విరూపాక్ష దిగ్గజం ‘’,అలసట కలిగి నప్పుడు తలను కదిలిస్తే ,భూ కంపాలు కలుగుతాయని అనటం లో భూ కాలుష్యం ప్రమాదం అనే హెచ్చరికి ఉంది .క్షీర సాగర మధనం లో జన్మించిన 60కోట్ల మంది అప్సరసలను దేవ ,దానవులేవరూ వివాహం చేసుకోవటానికి ముందుకు రాక పోవటం వాళ్ళ వారంతా వేశ్యలైనారని చెప్పటం లో ఇన్ డైరెక్ట్ గా వివాహ వ్యవస్థ అవసరాన్ని చెప్పకనే చెప్పి నట్లయింది ఒక రకం గా వారు సమాజం లో డ్రైనేజి వ్యవస్థ గా ఉండిపోవాల్సి వచ్చిందన్న సత్యం కని పిస్తుంది .
ఇంద్రునికి మేష వృషణాల ను అమర్చటం వల్ల ,ఆ నాటి నుండి పితృ దేవతలు వృషణాలు లేని గోర్రేలనే భుజించారు .ఇదులో అవయవాల ట్రాన్స్ ప్లాంటేషన్ శాస్త్రం ఆనాడే అమల్లో ఉందని అర్ధమవుతుంది .ఈ రోజుల్లో మాంసం తినే వారికి గొర్రె వృషణాలు మహా ప్రీతీ పాత్రం అని వింటున్నాం .విశ్వా మిత్రుడు తన కుమారుల్ని యాగ పశువులు గా ప్రాణ త్యాగం చేయమని కోరితే ,వారందరూ తిరస్కరించగా ,వారిని అధమ జాతి మానవులు గా పుట్టమని శపిస్తాడు .ఆ జాతుల్లో ‘’అంధక ,ముష్టిక ‘’జాతులున్నాయి .అంధ జాతే ఆంద్ర జాతి అనే కధనం ఉంది .ఇది అంత సవ్యం గా లేదనుకొని వెంకటేశ్వర్లు గారు దాన్ని వదిలేశారు .గరళం తో కలిసి పుట్టిన వాడు సాగరుడు అవటం ,శాప జలం చేత కల్మషుడు అయిన వాడు కల్మష పాదుడు అవటం వ్యుత్పత్తి వ్యక్తీకరణాలు .భగుడు ఉత్తరా నక్షత్రం తో కూడిన రోజు వివాహానికి మంచి రోజు అని ,భగుడు సంతాన ప్రదాత అన్న మహర్షి జ్యోతిశ్శాస్త్ర పాండిత్యాన్ని వెలికి తీసి చూపారు .శ్రీ రాముని చేతిలో గర్వం ఖర్వం అయిన పరశు రాముడు రాత్రి పూట తాను భూమి పై ఉండ రాదనీ ,తన గమనానికి సహకరించే పాదాలపై బాణ ప్రయోగం చేయ వద్దని దశరధ రాముడైన కళ్యాణ రాముడిని కోరుకోవటం మనకు కొత్త విషయం గాస అని పిస్తుంది .
అయోధ్యకాండ –కోరికలతో కూడిన వ్యసనాలను ,క్రోధం తో వచ్చే వ్యసనాలకు హెచ్చరిక గా మంచి వివరణ నిచ్చారు రచయిత .శ్రీ రామ పట్టాభి షెక ముహూర్తాన్ని సభలో ప్రకటించిన దశరధ మహా రాజు కీడు ను శంకిస్తాడు .ఇది ఆయన మనో వ్యాకులతకు అద్దం పట్టు తుంది .రాబోయే అనర్దానికి సూచన కూడా .అలాగే రాముడు లక్ష్మణునితో తాను రాజ్యాభి షెకానికి అంగీకరించటం ,లక్ష్మణుడి కోసమే నని ,భోగాలు ,రాజ్య ఫలం లక్ష్మణుడు అనుభవించాలని తన మనో భావం అని తెలియ జేయటం లో రామునికి ఉన్న భ్రాత్రు ప్రేమ కు నిదర్శనం గా ఉంది మంధర ను ‘’యతో జాతా‘’అని వాల్మీకి సంబోదిన్చాడని ,అంటే –‘’అడ్రెస్ లేనిది ‘’అని చక్కని వివరణ నిచ్చారు వెంకటేశ్వర్లు గారు .’’అలర్కుడు‘’అనే రాజు తనను యాచించిన ఒక గుడ్డి బ్రాహ్మణుడికి నేత్ర దానం చేశాడు .కనుక రామాయణ కాలం లోనే ‘’నేత్ర దాన ప్రక్రియ ‘’ఉంది అని గ్రహించాలి .రాముడు పూసుకొన్న చందనం ‘’వరాహ రక్తం ‘’లా గా సుగంధాన్ని వేద జల్లుతోంది అన్న కొత్త విషయం తెలిపారు .అంటే వరాహ రక్తం అంత పరిమళ భరితం గా ఉంటుందని మనకు తెలియని విషయాన్ని రచయిత తెలియ జేశారు .
వన వాసానికి వెళ్ళే ముందు రాముడు దాన ధర్మాలను విపరీతం గా చేశాడు .’’క ఠ.కలాప శాఖ ‘’కు చెందినబ్రాహ్మణులు ‘తీపి పదార్ధాలు బాగా తింటారని ,వారికి వేదాధ్యయనం తప్ప వేరొక పని చేత కాదని కనుక వారికి కావలసిన సమస్తము సమ కూర్చమని తమ్ముడు లక్ష్మణుడిని రాముడు ఆదేశిస్తాడు .నిరంతర వేదాధ్యయ నం జరగాలి అని శ్రీ రామ చంద్రుని కోరిక అని ,వైదిక ధర్మ రక్షణ అందరి కర్తవ్యమని ఇందులోని సారాంశం .అసమన్జసుడి దురాగతాన్ని ప్రజలు రాజైన సగరునికివిన్న వీస్తే ,ప్రజా క్షేమం కోసం తన కుమారుడిని ,వాడి భార్యా పిల్లల్ని దేశం నుంచి కట్టు బట్టలతో బహిష్క రించి ప్రజా క్షేమం రాజు తక్షణ కర్తవ్యమ్ గా చేశాడు .ఆదర్శ ప్రాయు డైనాడు .ఇదీ ప్రజా భీష్టాన్ని నేర వేర్చటం అంటే .ఇవాళ మన నాయకులు వాళ్ళ కొడుకులు ,అల్లుళ్ళు ,బామ్మర్దులు ,వందిమాగధులు బంధు గణం అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయని దుష్క్రుత్యం లేదు .,ప్రజా పీడనా లేదు .ప్రజలు ఎంత మొత్తుకొన్నా వారికి చీమ కుట్టి నట్లుకూడా ఉండదు .ఇదీ మన ప్రజాస్వామ్యం .వారిని వెనకేసుకొచ్చి ఇంకా నెత్తికి ఎత్తు కొంటూ ‘’బె బె‘’అని మనల్నే ఎక్కి రిస్తున్నారు .వీటికి కోర్టులే శరణ్యం అయ్యాయి అందులోంచి ఫలితం తేలటా నికి ఏళ్ళూ ,పూళ్ళూ పడుతుంది .రాజ రిక వ్యవస్థ లో తక్షణ న్యాయం జరిగేది అని అని పిస్తుంది మనకు .వ్యవస్థ ఎంత పతనమైనదోఅర్ధమవుతుంది .ఆదర్శం అటకెక్కింది .అన్యాయం చంక నేక్కింది .ఇలాంటి ఎన్నో విషయాలు శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు మనకు తెలియ జేసి మార్గ దర్శనం చేశారు .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –4-1-13-కాంప్ –హైదరా బాద్

