భమిడి పాటి వారు మేష్ట రీ చేశారు కనుక స్కూళ్ళ ఇన్స్పెక్షన్ బాగోతం చాలా బాగా చూపించారు ‘’పల్లె టూరు స్కూలు తణికీ తంతు ‘’కధ లో .ఆ పల్లె టూరి మేస్టారి నిర్వాకం ,పరీక్షాది కారుల చపలత్వం ,భేషజం తిండి మీద ఉన్న ఆసక్తి ,కళ్ళకు కట్టిస్తారు .
వెంకటాయి గారు గడ్డి పాలెం లో’’ ఉదర నిమిత్తం’’బడి పంతులు .స్తిరాస్తి భార్య ,చరాస్తి తనూ.ఆయనకు నమ్మకం గా వచ్చే ‘’సాలాదాయం ‘’ఒక ఆడ శిశువు .కొండొకచో కవలలు .దసరా పేరుతో ,అక్షరాభ్యాసం హడా విడి తో పదీ ,పరకా ‘’గతుకు తాడు ‘’.ఓ దస్తా వేజు గీకి పెట్టో ,ఓ సంబంధం ముడి పెట్టించో,ఓ సాక్ష్యానికి తగలడో ,,ఓ బ్రాహ్మ ణార్దానికి ఏడిసో ,దిష్టి కొట్టకుండా ఇంతో అంతో ‘’కతుకు తాడు ‘’.తణికీ దారుకి ‘’మనుగుడుపులు ‘’మేపి గ్రాంటు కొట్టేస్తాడు .కిందటేడు మాత్రం ‘’ఏదో ఒకా నొక సప్లయి సంతృప్తి గా జరక్క ‘’గ్రాంటు సరిగ్గా ‘’పారే యించ లేదు‘’.బంధువులు ,పక్కాలు వచ్చీ పోయే ఇల్లు ..చాకిరితో బాటు డబ్బు ఊడటం –ఇదీ పల్లె టూరి బడి పంతులు పరి స్థితి .’’వెంకటాయి గారు సంసారం విషయం లో వీల్లేక చదువు చెప్పటం విషయం లో మాత్రం’’ కుమ్మరి పురుగు’’ లా ఉంటూ,ఆర్జనకు అన్య మార్గాలు అన్వేషించాడు .’’ఎక్కడైనా ‘’కుండ తడిపినా’’,’’తూతూ బాకా విని పించినా ‘’అదే ఆఃహ్వానం గా భావించి హాజరయ్యే వాడు .
ప్రస్తుతం కొడుకు ఈయన దగ్గరే ఉన్నాడు .పెళ్ళాం పురిటికి వెళ్ళింది .ఎవర్నో ముసలమ్మను వంటకు‘’ఫిరాయించాడు ‘’.ఆవిడకు ‘’పుట్ల చెముడు ‘’..సొదఎక్కువ. ఎవడైనా భోజనానికి వస్తే ‘’ఓ టాప్పడవెడు ‘’బూతులు దిమ్మ రించేది .లేక పోతే కుర్రాణ్ణి పిల్చి ‘’రుంజ వాయించి నట్లు వాయించేది ‘’.దాంతో వచ్చిన వాడు పరారు .ఒక రోజు పక్క ఊళ్ళో పెళ్ళి. .కొడుకుతో అక్కడికి హాజరయ్యాడు వెంకటాయి .ఆయన ఖర్మ కాలి ,ఆ రోజునే ఇద్దరు ఊళ్లోకి ప్రవేశించారు .ఒకడి చేతిలో కాగితాలు ,గొడుగు ,రెండో వాడి నెత్తిన తలపాగా .ఊళ్ళో వాళ్ళు ఇనస్పెక్టర్ గా భావించి ,పక్క ఊర్లో ఉన్న పంతులు గారికి కబు రెట్టారు .’’ఓరి నీ ఇనుం కాల్చా .వచ్చింది ‘’మాసికం గారా ?’’’’కాళ్ళు కడగడం గారా ?’’పెళ్ళాం పిల్లలు కూడానా ?’’అని కనుక్కున్నాడు .పెళ్ళి పందిట్లో ఈ అప్రాచ్యపు మాట లేమిటనిఅంతా కేక లేశారు అర్ధం తెలీక .పెద్ద ఇనస్పెక్టర్ ని’’తద్దినం ‘’అనీ ,ఆయన కింది వాడిని ‘’మాసికంఅనీ , ‘ ,మైనర్ తనికీ గాడిని’’కాళ్ళు కడగటం ‘’అనీ తన పరి భాష చెప్పి బయట పడ్డాడు .’’వారే మాకు పితృ ,పితామహ ,ప్రపితామహులు ‘’’’అన్నాడు .
ఎంత లేదన్నా తెలివి గల పిండం కనుక ఆపసోపాలతో కొంపకు. చేరాడు ,దారిలో బొట్టు గిల్లుకొని ,,జుట్టు రక్కు కొని ,ముసలావిడతో ‘’గార్లోండి వంట కానివ్వ మ్మోయ్‘’అని చెప్పి ,స్కూలుకు చేరి బోజ్జాయన కాళ్ళ మీద పడి పోయాడు తెలివిగా .ఎండ దెబ్బ తగిలిందనుకొని సాను భూతి చూపించాడాయన .’’తమకు వేళ దాటింది .ఒళ్ళు తడుపు కొని మడి క ట్టు కొండి’’అన్నాడు .ఆయన పాపం సాను భూతి తో ‘’నా కోసం విశేషం ప్రయత్నించద్దు .గోకారం లో నాకు పెట్టిన భోజనం ఏం భోజనం అండీ .నాలుగు కూరలు ,నాలుగు పచ్చళ్ళు ,క్షీరాన్నం ,మాష చక్రాలు ,అబ్భ అబ్భ ,అంతా యధా విధే .నేను జఠరాజ్ఞి ,జీర్ణ పుష్టీ ఉన్న ఘటాన్ని గనక సరి పోయింది .’’అన్నాడు .వెంకటాయ గారు ‘’చిత్తం .పచ్చడి మెతుకులే నండీ .నాకే ముంది .బీద కుటుంబీ కుడిని.’’అని తన ఇంటికి తీసి కెళ్ళాడు .వంటాలస్యం ఉంది.అని ఒక తవ్వెడు పాలు ఇచ్చి ,పుచ్చు కొమన్నాడు .’’తమరికేమైనా మతి చలించిందా ఏం ?’’అంటు అతి సిగ్గుగా ,అయిష్టం గా విషం పుచ్చు కుంటున్నట్లు నటిస్తూ ,నిమిషం లో గిన్నె లో తడి అయినా మిగలకుండా ఊడి చేసి ,ఆయాసం నటించాడు .ఇందులో ఆ పాత్ర పోషణా ఆ నాడూ అంతే ఈనాడూ అంతే .తేడా ఏమీ లేదు .కాలం మారినా పద్ధతులవే .అదే మేపు ,అదే చేపు .
అయ్యగారికి అభ్యంగన స్నానం చెయ్యాలనే కోర్కె అదీ ఆవు నెయ్యితో .తప్పించుకోవాలని చూసినా ,కొడుకు తొందర మాటలతో ఇంట్లోని ఆవు నెయ్యి తో ,భజంత్రీ వాడిసాయం తో ‘’తధికిణ ధోం’’అయిందని పించాడు .వడ్డన చేసి ,రమ్మని పిలిచాడు .విస్తట్లో ‘’బకాసురిడికి తోడి నట్లు కుంభం మటుకు తోడి ఉంది.’’దాని అగ్ర మందు ‘’సార్వా గడ్డి కొంప మీద కొండ ముచ్చు మొహం లా ‘’వెక్కిరిస్తూ ,’’ఉస్తికాయంత ఉసిరి పచ్చడి ఉంది’’ .అధికారి అంతటి మనిషీ కూడా‘’చలిమిడి ‘’అయి పోయి ,ఆముదం మొగం పెట్టాడు .’’కూచోండిపొద్దు పోయింది కావలసినవి అడిగి వడ్డించు కొండి’’అని‘’చేణికాడు ‘’పంతులు .అధికారి కన్నీళ్ళతో పరిశేచనం చేసి ‘’ఎల్లా నేనిది ఏడవటం ?’’అన్నాడు .తక్షణమే వెంకటాయి తనకు నిరుడు గ్రాంటు వచ్చిన కాగితం చూపాడు .’’నె నేనెలా ఏడవడం ఇదీ ?’’అంటు ఒక్కొక్క అక్షరం ఒత్తి,ఒత్తిపలికాడు.సమయానికి తగూ అన్నట్లు ఠపీ
మని ,ఎత్తుఎత్తాడు . పారింది పాచిక .’’నేను గ్రాంటు కురిపిస్తా .అన్నం మీద ఒట్టు ‘’అన్నాడు అధికారి .ఉబ్బి పోయిన వెంకటాయి ముసలమ్మకు సౌజ్న చేశాడు . ఆవిడ ఈ విస్తరి పట్టుకొని వెళ్ళి తాజా విస్తరి పెట్టింది .అధికారి ముఖం వికశించి ‘’దంత పరిశ్రమ ‘’తో రంగ ప్రవేశం చేశాడు .’’గారెల పర్వం ‘’లోకి వచ్చాడు .’’ఏమిటో అనుకుంటాం .కాని’’భోజనం చేయటం కూడా కష్టమే సుమండీ ‘’.. అన్నాడు బొజ్జ నిమురు కంటూ .,గారెల పర్వతాన్ని ఊదేస్తూ .వేసిన కొద్దీ ఊదేస్తున్నాడు .విసుగెత్తింది ముసల్దానికి .పళ్ళెం లోనీ వన్నీ ,విస్తట్లోకి గిరాటేసి ,పళ్ళాన్ని వెంకటాయ నెత్తిన కొట్టింది .’’సత్రం బొక్కు జంతు వుల్ని తీసుకు రావద్దని ఎన్నో మాట్లుచెప్పినా సిగ్గు లేదు .మర్యాదా లేదు .తెచ్చి ,తెచ్చి ఎవడినో,’’సర్వ భక్ష కుడిని ‘’తెచ్చావు .కుర్రాడికి ఒక్క టైనా మిగల్చలేదు . వాడి కోసం మళ్ళీ వండి తగలడాలి ‘’అని తుర్రు మంది .అధికారి మింగా లేక,కక్కా లేక కాసేపు ఇదై ,తేరుకొని ,వెంకటాయ తో లౌక్యం గా ‘’నేను గనక సరి పోయింది .మరోళ్ళుఅయితే,లేచి పోయే వారు ‘’అని మళ్ళీ ‘’దంతాలను విసరటం ‘’ప్రారంభించాడు .’’గార్లె తర్వాత పెరుగైనా చేదే‘’అని మజ్జిగ కూడా లేకుండా లేచాడు .ఇన్స్పెక్షన్ కోసం స్కూల్ చేరాడు .ఆయాసం తో తెగ ఇదై పోయాడు .’’బొర్ర జారేశాడు’’ . రాత్రికి గార్లని పెరుగు లో నానవేయించమని ఫర్మానా జారీ చేశాడు .
సంక్రాంతి శుభా కాంక్ష లతో –
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-1-13- ఉయ్యూరు .

