మురళీ కృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -1

మురళీ కృష్ణ హారర్ కధల్లో  కొత్తదనపు కస్తూరి గుబాళింపు -1

కస్తూరి మురళీకృష్ణ

   కస్తూరి మురళీ కృష్ణ ప్రముఖ కధా ,నవలా ,చారిత్రిక ,ట్రావెలోగ్ రచయిత .గొప్ప విమర్శకులు .ఏది రాసినా స్వంత వాణి ,బాణీ ఉన్న రచయిత .రైల్వేలో ఆఫీసర్ ఉద్యోగం లో క్షణం తీరిక లేక  పోయినా,ఆయన కలం అను నిత్యం నర్తి స్తూనే ఉంది .తెలుగులో ఇప్పటి వరకు భయానక అంటే హారర్ కధలు రాలేదని ఆయన భావించి తానే దానికి నడుం కట్టి ,రాసి, మొదటి ‘’భయానక సంపుటి ‘’’’ఆ అరగంట చాలు ‘’అనే శీర్షిక తో ఇటీవలే వెలువరించి ,ఈ నేల ఏడవ తేదీ హైదరా బాద్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి  ఆయన వచ్చి కలిసి ,నాకు ఆయన ఆ పుస్తకాన్ని న అంద జేషి దాని పై సరస భారతి ఉయ్యూరు లో క పరిచయ కార్య క్రమం ఏర్పాటు చేయమని కోరారు .ఆయన ఫిబ్రవరి చివరలో మార్చిలో  బిజీ అని ఆయన అంటే ,మాకు జనవరి లో అవకాశం లేదని నేను చెప్పాను .ఎప్పుడు వీలైతే అప్పుడు ఏర్పాటు చేయమని ,తాను వచ్చి పాల్గొంటానని అన్నారు .మన సరస భారతి ప్రచురణలు ‘’శ్రీ హనుమాన్ కధా నిది ‘’,’’ఆదిత్య హృదయం ‘’ఆయనకు నేను అంద జేశాను .ఇప్పుడు సాహితీ బంధువులకు ఆ భయానక కదల వివరాలను ,అందులో మురళీ కృష్ణ వెలి బుచ్చిన అభి ప్రాయాలను తెలియ జేస్తూ నాలుగైదు హారర్ కధలను మీకు పరిచయం చేస్తాను ఇది సమీక్ష మాత్రం కాదని ,పరిచయమే నని తెలుపు కొంటున్నాను .

 

 

         ముందుగా ‘’ఆ అర గంట చాలు ‘’అనే పది హేను భ యానక కధా సంపుటిలో రచయిత  శ్రీ కస్తూరి మురళీ కృష్ణ ‘’మనవి ‘’మాటల్లో తన భావాలను పంచుకొన్నారు .తాను విభిన్న మైన కధలను సృష్టించానని ,తెలుగులోచారిత్రాత్మక కాల్పనిక కధలు’’కల్హణ కాశ్మీర రాజ తరంగిణి కధలు ‘’ రాశానని ,వీటిలో అవసర మైన కల్పనలు చేశానని చెప్పారు .జ్యోతిశ్శాస్త్రం పై ఉన్న అపోహలను తొలగిస్తూ జ్యోతిషా న్ని వ్యక్తిత్వ వికాసానికి ,ధనాత్మక ఆలోచనా సరళికి ఎలా వాడ వచ్చో పద మూడు కధలను ‘’జీవితం –జాతకం ‘’లో రాశానని చెప్పారు  వాటిలో తాను సృష్టించిన జ్యోతిష్కుడు ‘’శ్రీ నాద్.’’బాగా ప్రాచుర్యం పొందారని అన్నారు .వాస్తవ ‘’వి జయ  గాధ’’లను’’రియల్ స్టోరి ‘’గా రాశారు .వైజ్ఞానిక శాస్త్ర పరి శోధనఆధారం  గా ‘’హార్డ్ కోర్ సైన్సు ఫిక్షన్ ‘’ రచించారు .ఇలా వి భిన్న కధ లను మురళీ కృష్ణ రాసి వాటికి  కస్తూరి పరిమళాలను అద్దారు .ఆయన రాసిన వన్నీ వివిధ పత్రికలలో ప్రచురితాలు .వ్యంగ్య కధలు కూడా రాశారు .అవి ‘’వ్యంగ్యాస్త్రం ‘’పేర పాఠకాదరణ పొందాయి .

              తెలుగు లో డిటెక్టివ్ కధలు చాలానే వచ్చాయని కాని భయానక కధలు రాలేదని భావించి తాను హారర్ కధలను ప్రత్యెక దృష్టి తో ధారావాహికం గా రాసి  రాసి తెలుగు సాహత్య చరిత్రలో మదటి ‘’భయానక కధా సంపుటి ‘’ఆ ఆర గంట చాలు ‘’ని ప్రచురించానని దీనికీ చదువరుల ఆదరణ విశేషం గా ఉందని తెలిపారు మురళీ కృష్ణ .వీటిని ఆదరించిన ‘’నవ్య ‘’వార పత్రిక సంపాదకులు జగన్నాధ శర్మకు ,విపుల, చతుర మాజీ సంపాదకు రాలు శ్రీ మతి కే.బి.లక్ష్మి గార్ల కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు .

           తన హారర్ కధల్లో ప్రతి కధ లో ఒక చమత్కారం ,ఒక జలద రింపు ,,ఒక ఆలోచనా కలిగేట్టుమురళీ కృష్ణ  కధలను రచించారు .ఈ కధలు పూర్తిగా చదివిన తర్వాత అవి భయానక కదల కన్నా ,’’సస్పెన్సు ‘’కధలు అని పిస్తాయని ఆయనే చెప్పుకొన్నారు .కధ అయి పోయి ,కళ్ళు మూసుకొనిసంఘటనలను    ఊహిస్తే ఒక జలద రింపు కల్గుతుందని హామీ ఇస్తున్నారు . ఇందులో కొన్ని కధలు నిజంగా ,కొన్ని స్నేహితుల అనుభవాలని ,కొన్ని సైన్సు ఫిక్షన్ ,సైన్సు ఫాంటసి ల సరి హద్దుల్లో ఉన్నాయని ,ద్రుశ్యాత్మకమైనవి ,సంఘటనాత్మక మైన వీ ఉన్నాయని ,తాను భయానక వాతా వరణాన్ని సృష్టించానని ,పాత్ర అనుభ విస్తున్న భావాలను ‘’నేను ‘’అంటుఉత్తమ పురుష లో  చెప్పటం వల్ల అనుభవాలు సూటిగా పాఠకులకు చేరి ,ఆ అనుభవం సాకార మవుతుందని చెప్పుకొన్నారు .కొన్ని కధల్లో పాఠకులను తప్పు దారి పట్టించి ,షాక్ కలిగించే టెక్నిక్ ను ప్రయోగాత్మకం గా చేశానని ,ఎలాంటి అపోహలు , ,రంగు టద్దాలు లేకుండా చదవమని కోరారు ఆంగ్ల సాహిత్యం లో అగాథా క్రిస్టీ ,ఎడ్గార్ ఎల్లెన్ పో ,సీఫెన్ కింగ్ ,జామ్ స్టో కర్ ,మేరీ షెల్లీ ,ధా పెద్యు మారియర్  ఇలాంటి కదలని  రాసి ప్రాచుర్యం తెచ్చారని తెలిపారు .తన కధలు మూఢ నమ్మకాలను ప్రోత్స హించేవికావని ,చమత్కారం ,మూడ్ లను  కలిగిస్తాయని ,ఇవి దెయ్యాలు భూతాల కధలు కావని వివరణ ఇచ్చు కొన్నారు .

.చివర గా మురళీ కృష్ణ ‘’వందేళ్ళ తెలుగు కధా సాహిత్య చరిత్రలో భయానక కదల తోలి సంపుటి మీ ముందుంది .చదవండి .మీ అభిప్రాయాలను నిర్మోహమాటం గా తెలియ జేయండి ‘’అని  కోరారు . ఈ కధల్లో నూతనత్వం గుబాళించింది .అందుకే నేను ‘’మురళీ కృష్ణ హారర్ కధల్లోనూత నత్వపు కస్తూరి గుబాళింపు ‘’అనే పేరు తో మీకు పరిచయం చేస్తున్నాను .

              సశేషం

               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-1-13-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in కవితలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.