మురళీ క్రిస్హ్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -3

మురళీ క్రిస్హ్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -3

    కస్తూరి మురళీ కృష్ణ రాసిన హారర్ కధల్లో రెండో కధ ‘’ఫాంటం లింబ్ ‘’.ఈ పదం ఒక విచిత్ర మానసిక స్థితి ని తెలియ జేస్తుంది శరీరం హఠాత్తు గా ఏదో ఒక అంగాన్ని ఉదాహరణకు ఒక కాలు కోల్పోయినప్పుడు ,అది తొలగింప బడిన విషయం మెదడుగ్రహించటానికి కాస్త సమయం పడుతుంది .మన మెదడు లో ప్రతి అవయవానికి ,అంగానికి దాని పని తీరును నిర్దేశించే నిర్దిష్ట మైన భాగం ఉంటుంది .తీసేసిన కాలు కు సంబంధించిన సమాచారం మెదడుకు చేరి ,మెదడు దాన్ని గ్రహించి ,ఆ విషయాన్ని జీర్ణించు కోవటానికి కొంత సమయం పడుతుంది .మెదడు ఈ నిజాన్ని గ్రహించే వరకు శరీరం లో ఆ తీసేసిన అంగం ఇంకా ఒక  భాగంగానే ఉన్నట్లు ప్రవర్తిస్తుంది .ఈ విధం గా నిజం గా అంగం లేక పోయినా ఉన్నట్లు కలిగే భావననే ‘’ఫాంటం లింబ్ ‘’అంటారు వైద్య పరిభాష లో . దీని మీద ఆధార పడి రాసిన కధే ఇది

          లియాన్ అనే ఆర్మీ డాక్టర్ తాను ‘’తిక్రిత్ ‘’లో పని చేసినప్పుడు ఇలాంటి కేసు ను ట్రీట్ చేసి నట్లు రచయితకు చెప్పాడు .ఒక రోజుతీవ్ర వాదుల దాడిలో దేబ్బతిన్నానని ఒకతను వచ్చాడు .చూస్తుంటే ఆరోగ్యం గానే ఉన్నాడు సమస్య ఏమిటి అంటే ‘’నా చెయ్యి ‘’అన్నాడు .అతని చెయ్యి లేదని గమనించాడు లియాన్ .నెల క్రితం జరిగిన తీవ్ర వాదుల దాడిలో తన చెయ్యి పోయిందని చెప్పాడు దాన్ని డాక్టర్లు తొలగించారని ,అయినా ఆ చెయ్యి దురద పెడుతోందని చెప్పాడు .గోక్కోవటం ఎలాగో చేతి మీద పాకే వాటిని తొలగించటం ఎట్లాగో అర్ధం కావటం లేదన్నాడు .కొన్ని రోజుల్లో మెదడు నిజం గ్రహిస్తుందని అప్పడీ బాధ ఉండదని చెప్పి పంపించేశాడు డాక్టర్ లియాన్ .మళ్ళీ రెండు రోజుల తర్వాతా దురద పెరిగిందని వచ్చి కంప్లైంట్ చేశాడు ఇంతకీ తన చెయ్యి ఎక్కడుందో చెప్పమన్నాడు

               తన చెయ్యికి పెద్దగా గాయం కాలేదని కాని భుజం నుంచి దాన్ని తీసే శారని ఫిర్యాదు చేశాడు .సాను భూతితో లియాన్ చెయ్యి పాతి పెట్టిన స్థలం వెదికి చెయ్యి తీయించాడు .భూమిలోని పురుగులు కొంత భాగం తినేశాయి .మిగిలిన సగం పై పురుగులు పాకుతున్నాయి .దాన్ని బయటికి తీసి కాల్చేశారు .అయినా సమస్య తీర లేదు .ఈ కధను చెబుతుండగా ‘’జీన్ పాజేట్ ‘’అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయద్దని సౌజ్న చేశాడు అతని ప్రవర్తన వింతగా అని పించింది కధకుడికి .కూచున్నాడు జీన్ .కాని ఒంటి పై యేవో పాకుతున్నట్లు దులుపు కుంటున్నట్లు కని పించాడు ..జీన్ అంటే లియాన్ ను రిలీవ్ చేయటానికి వచ్చిన వాడు ఇంతలో బయట తుపాకి కాల్పులు విని పించాయి .అందరు బయటకు పరిగెత్తి చూశారు .బయట ‘’గ్రీన్ జొన్ ‘’నుంచి వచ్చిన వాహనం ఉంది .ఆ వాహనం లో రావాల్సిన జీన్ ముందే ఎలా వచ్చాడా అని అందరు ఆశ్చర్య పోతున్నారు .జీప్ లోంచి ఒక శవాన్ని దింపారు .అది జీన్ శవమే . దాని మీద ఈగలు ముసురుతున్నాయి .జీన్ ను చూద్దామని రచయిత ముందుకు వెళ్లాడు .’’తీవ్ర వాదులు దాడిచేస్తున్నారు ‘’అన్న అరుపు విన్పించింది .తుపాకుల మోత హోరెత్తింది .రచయిత మెదడు లోంచి గుండె లోంచి గుళ్ళు దూసుకు పోయాయి .ఊపిరి ఆగి పోయి, కింద పడి పోయాడు .ఇప్పుడీ కధను ఎలా చెప్తున్నాడని మనకు సందేహం వస్తుంది .దానికి ‘’చూసే కన్నూ రాసే చెయ్యీ ఖాళీగా ఉండవు .రాయటం  అలవాటైన తాను ఎలా ఊర్కొంటాడు ?అందుకే ‘’ఫాంటం చెయ్యి ‘’తో రాస్తున్నానని’’ ఓ ఝలక్ ఇస్తాడు రచయిత .

               సశేషమీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –20-1-13-ఉయ్యూరు 

 
 
 
 
 
 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to మురళీ క్రిస్హ్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -3

  1. thank u sir
    with regards
    advocatemmmohan

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.