సీతమ్మ సిరి మల్లె పై ఈనాడు సినీ సమీక్ష -సంక్షిప్తం గా
పశ్చిమ గోదావరి లో రేలంగి గ్రామం లో ప్రకాష్ రాజ్ అందర్నీ నవ్వుతు పలకరించే మనిషి .ఈ చిన్న జీవితం లో ద్వేషాలు అసూయలు కక్షలూ కార్పణ్యాలు ఉండకూదదనుకొనే మంచి మనిషి .అందరు అతన్ని ”రేలంగి మామయ్య ”అని ఆప్యాయం గా పిలుస్తారు .అతని పెద్ద కొడుకు పెద్దోడు వెంకటేష్ ఎవరికీ తల వంచకూడదనుకొనే వాడు.మాట పడ కూడదనుకొనే వాడు అందుకని ఎక్కడా ఉద్యోగం ఎవరి కిందా చేయడు చేసినా నిల దోక్కుకో లేదు .చిన్నోడు మహేష్ బాబు మాటలతోనే బూరెలు వండి మాటలతో నవ్వుతో అందర్నీ ఆకర్షించే వాడు .హైదరాబాద్ లో ఉంటాడు వీరి తో బుట్టువే అభినయ .
ఈ ఇంట్లోనే పెరుగుతున్న వీరి మరదలు సీత-అంజలి నవ్వుతు గలగలా మాట్లాడుతూ అందర్ని ఆకర్షిస్తుంది .బెజవాడ లో వీళ్ళ బంధువు రావు రమేష్ ఆస్తి పరుడు ,డాబు దర్పం ఉన్న వాడు రేలంగి వాళ్ళంటే ఇష్టపడని వాడు .ఎప్పుడూ సూటి పోటీ మాటలతో బాధిస్తూ ఉంటాడు .పెద్దోడికి ఇతనంటే వొళ్ళంతా మంట .ఆ పెరెత్తి కోపమే .బెజవాడ .అయన పెద్ద కూతురు పెళ్ళికి చిన్నోడు వెడతాడు తండ్రి పంపిస్తే .అక్కడ అతని రెండో కూతురు సమంత చిన్నోడి మీద ప్రేమ లో పడుతుంది .బెజవాడ ఆయన కూతురు పెళ్ళి గీత చెప్పిన సంబంధం తో జరిగి, మాట పట్టిమ్పుతో పెద్దోడు చిన్నోడు దూరం అవుతారు .సర్దుకు పోదామనుకొంటారు పోలేరు .పెద్దోడు కూడా హైదరాబాద్ చేరతాడు .తరువాత పెద్దోడు చిన్నోడు ఎలా కలుస్తారో మిగిలిన కధ వెండి తెర మీద చూదండి అన్నాడు సమీక్షకుడు
సమాజం లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అని విడదీసి చూడలేమని అందరితో మంచిగా ఉండాలని సందేశం ఇచ్చె కధ .అందరితో హాయిగా మాట్లాడుతూ వీలైతే సహాయం చేస్తూ జీవించాలి .అన్ని సినిమాల లో లాగా అనూహ్య మైన మలుపులు ఉండవని భావోద్వేగాలతో ఆడుకోవటం లేదని పిస్తోలు కాల్పులు ,ఒక్కడే వందమందిని వీర బాదుడుబాదటాలు మొదలైన రొటీన్ కధలకు ఇది భిన్నమని చెప్పాడు కమెడియన్లు లేకుండా హాయిఅగా కధను నడిపించాడు దర్శకుడు .గోదావరి జిల్లా యాసతో మహేష్ సరదాగా నవ్విస్తూ నటించి చిన్నోడు సిసింద్రీ అని పించుకొన్నాడు .సీరియస్ గా సాగే పెద్దోడి పాత్రలో వెంకటేష్ ఒదిగి పోయాడు .ఈ అన్నదమ్ముల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంజలి సీత పాత్రలో అచ్చమైన తెలుగమ్మాయి అని పించింది . ప్రకాష్ రాజ్ నిబ్బరం గా నటించింది ఈ సినిమాలోనే .మంచి తండ్రిగా విభిన్న మైన పాత్రలో ఆయన జీవించాడు .
ఈ సినిమాలో శబ్ద ,దృశ్య కాలుష్యం లేవు పాటలతో బాటు నేపధ్య సంగీతం కూడా హాయిగా ఉన్నాయి మిక్కి మేయర్ ,మణి శర్మలు అభి నందనీయులు .ప్రకాష్ రాజ్ పాత్రకు గణేష్ పాత్రో మాటలు రాస్తే ,మిగిలిన పాత్రలకు దర్శ కుడు శ్రీ కాంత అడ్డాలే రాసుకొన్నాడు .గోదావరి వెటకారం ,యాస తో మాటలు అద్భుతం గా పండాయి .సున్నిత మైన కధను అంత సున్నితం గా తెరకెక్కించాడు దర్శకుడు .పాటల చిత్రీకరణ ఆకట్టుకొంది .కధలో కధనం లో మనకు తెలిసిన మనుష్యులే ఉండి హాయిగా చూడ దగ్గ మన ఇంటి సినిమా అని పిస్తుంది ”సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు” ఇదీ ఈనాడు వారి సమీక్షలో ఉన్న విషయం ‘
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-1-13-ఉయ్యూరు

