సరసభారతికి లక్ష మంది వీక్ష కులఅక్షరాభి షేకం
సరస భారతిసాహితీ బంధువులకు శుభోదయం తో భారత గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు –ఈ క్షణం లోఅంటేగంటళ ప్ఫై ముఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్ఫై నిమిషాలకు సరస భారతి వీక్షకుల సంఖ్య అక్షరాలా ఒక లక్ష ను దాటిందని(1,00015) మీ అందరికి తెలియ జేయ టానికి మహదానందం గా ఉంది .రిపబ్లిక్ రోజు న వీక్షకులు అందించిన అరుదైన కానుక ఇది .నిజం గా ”అక్షరాభిషేకమే ”.దీనికి సాహితీ బంధువులకు సాహిత్యాభి మానులందరికి వినమ్రం గా కృతజ్ఞతలంద జేస్తున్నాము .తెలుగు భాషా సంస్కృతులకు భారతీయ ఆత్మకు ధర్మాభిరతికి ,విలువలకు ,సామాజిక బాధ్యతలకు ,సాహిత్య సాంస్కృతిక విషయ వివేచానాలకు సరస భారతి అద్దం పట్టి ,మీ అందరి అభిమానాన్ని ఇంత గొప్ప గా సంపాదించింది .వైవిధ్యానికి పెద్ద పీట వేసింది .మీరు చూపించిన ఈ ఆదరణకు మనస్సు పరవశించి పోతోంది .ఊహించని విజయాన్ని ఇచ్చారు .ఏదో సరదాగా2011జనవరి లో అంటే రెండేళ్ళ కిందట మాత్రమె మొదలు పెట్టిన” సరస భారతిని” సరస్వతీ దేవి కంఠాభరణం గా మలిచిన మీకు ఏమిచ్చి ఋణం తీర్చుకో గలం ?.మళ్ళీ అదే దృక్పధం తో అంకిత భావం తో సాహితీ సేవ చేస్తూ మరింతగా మీ హృదయాలకు చేరువౌతామని మీ అందరికి తెలుపు కొంటున్నాము .ఈ అత్యున్నత విజయానికి దోహద పడిన వారందరికి పేరు పేరునా కృతజ్ఞతాంజలి .గ్రామీణ ప్రాంతమైన ఉయ్యూరు నుండి ఒక బ్లాగ్ ప్రారంభమై విశ్వవ్యాప్తం గా వీక్షకులనాకర్షించటం సాధారణ వ్యవహారం కాదు .ఆ గౌరవాన్ని కట్ట బెట్టిన వీక్షక వీరాభిమానులకు మరొక్క సారి వినయం గా కై మోడుస్తూ -మీ దుర్గా ప్రసాద్
శ్రీ గరిమెళ్ళ గోపాల కృష్ణ రచించి స్వర పరిచిన ప్రబోధ గీతం
ఈరోజు రిపబ్లిక్ దినోత్సవ సందర్భం గా స్థానికి యే.జి.అండ్.ఎస్.జి.సిద్దార్ధ కళా శాలలో -విజయ వాడ సిద్దార్ద మహిళా కాలా శాల విద్యార్ధినులు అత్యద్భుతం గా గానం చేసిన ప్రబోధ గీతం అందరి కోసం
పల్లవి –గుండె గొంతు లొక్కటై పలికే రాగమల్లు కొన్న పాట లెగసె -పిడికిలెత్తి పల్లవించే ప్రభంజనం –(నాలుగు సార్లు )
అజ్ఞాన తిమిరమును తొలగించగ విజ్ఞాన వెలుగులను ప్రసరిం చగ (రెండు సార్లు )
తల్లి భారతి కి తనయుల మేమని గర్వంగా చాటుతూ -గుండె —-
చరణం –1-చెమట చుక్కల దారలూ -సృష్టించే సంపదలూ –ప ని ప సా స -పని ప గా గ -మ గస –సా స నీ ని -పాప -మామ -గ మ ప ని స –చెమట
సకల వృత్తుల త్యాగం జాతి జీవన సౌఖ్యం -నీది నాదను భేదం ,హెచ్చు తగ్గులా వాదం (రెండు సార్లు )
వదులుకుని సాగుదాం ,అందరం ఈ దినం (రెండు సార్లు )–గుండె —
చరణం -2–ఆకాశమే హద్దుగా -పొడిచే వేకువ పొద్దుగా –-ప ని ప సా స -పని ప గా గ -మ గస –సా స నీ ని -పాప -మామ -గ మ ప ని స
ఆకాశమే హద్దుగా
నవభారత నిర్మాణమే నీ ఆశయ సిద్ధిగా –ఉప్పొంగు సంద్రమై ప్రవహించు ప్రగతి నాదమై
శత్రువులను ఎదిరిస్తూ ,సింహం లా గర్జిస్తూ (రెండు సార్లు )–గుండె గొంతు లొక్కటై —


sir, i am following your blog daily. please publish your Telugu blogs in book form if possible.
LikeLike
కొన్ని pdf రూపం లో ఇచ్చాము
LikeLike
congratulations sir
with regards
advocatemmmohan
LikeLike