పద్మ పురస్కారాలు
రాత వెతలను బాపు
గీత చింతలను బాపు
లిపి చరిత్రనే బాపు
చిత్రం చింతలు బాపు
రామ కధ తీస్తే అఘాలనే బాపు
అంతటా రాముడినే చూపి వేదన బాపు
ఒంకర మాటలతో అలసట బాపు
గీతల్లో గీతార్ధాన్ని ముందు నిలుపు
అంతటా రమ్యత చూపు
ఆ లోకమే ,అవలోకమే కొత్త చూపు
ఏదైనా మాట్లాడకుండా చేసి చూపు
రమణుడు లేని ఒంటరి తనాన్ని సౌజన్యం తో బాపు
ఇన్నాళ్ళకు గుర్తించిన ప్రభుత తెరచిన కను చూపు
పారేసిం దయ్యా ఓ చిన్న పద్మం ఓ బాపూ !
అర్హులను సమయానికి గుర్తించని వీరి చూపు
ఎప్పుడు సరిగ్గామారుతుందో తెలుపు ఓ బాపూ! ఓ మహర్షీ
ఇప్పటికైనా భారత ప్రభుత్వం బాపూ గారికి పద్మ శ్రీ నిచ్చి గౌరవించి నందుకు ఆనందిస్తూ ,అభినందిస్తూ –దుర్గా ప్రసాద్
తెలుగు పాటల కోయిలమ్మ జానకమ్మ కు పద్మ భూషణ్ ఇచ్చి నందుకు ,వచ్చి నందుకు మహదానందం గా ఉన్నా ,ఆమె తిరస్కరించినందుకు బాధగా ఉంది .భారత రత్న జానకమ్మకు అత్యాసేనేమో నని సంకోచిస్తున్నాను . .మీ దుర్గా ప్రసాద్


ఖచ్చితంగా అత్యాశేనండి. యేసుదాస్ గారికే రాలేదు..
LikeLike