కధాగంధం -1
సుమారు అర్ధ శతాబ్ది గా కదా ప్రస్తానం చేస్తూ ,తాను రచించి ,ప్రచురణ ,ప్రసారణ పొందిన ముచ్చటైన 28కధలను ”అమృత హస్తాలు ”అనే కదా సంపుటి గా చదువరుల అమృత హస్తాలను అలంకరింప జేశారు స్వర్గీయ గంధం వేం కా స్వామి శర్మ గారు .వీరికి ”చైతన్య ”అని కలం పేరుంది .అందుకే ప్రతి కధలో చైతన్యం ఉన్న రచన కని పిస్తుంది .వస్తు వైవిధ్యమూ ఉ న్నది .జీవితం లో తాను చూసిన ,విన్నా ,ప్రేరణ పొందిన యదార్ధ ఘటనలకు తన దై న శైలి లో అద్భుతం గా కదా గానం చేశారు .ఆ విషయాలను ఆయా కధల చివరలో తెలియ జెప్పి ,ప్రేరణకు కారకు లైన తన బంధువులకు ,మిత్ర ,సహచరులకు కృతజ్ఞతలు తెలుపు కొన్నారు .జీవితం నుంచే ఈ కధలు పుట్టాయి కనుక సహజ సుందరం గా ఉన్నాయి .అవసర మైన చోట్ల చలువ పందిళ్ళు అల్లారు .రేడియో ఇంజినీర్ ఉద్యోగిత్వం వల్ల సహస్రాధిక మహాను భావులతో పరిచయం ,అందులోను రచయితల కళా కారుల తీరు తేన్నుల్ని పరిశీలించే నేర్పు అవకాశము కలిగాయి అందుకే నే ల విడిచి సాము చేయని రీతిలో కధలు రాశారు. రాసి మెప్పించారు .సహజ సుందర మైన హృదయం ఆర్ద్రత నిండిన మనసు ,పరోప కార పారాయణ త్వం ,అమృత తుల్యమైన మాట .విద్యుక్త ధర్మం లో తృప్తీ ఉన్న వారు కనుక శ్రీ శర్మ గారు కధలన్నీ నిండుగా ,అమృత పానం గా ,ఆనంద మయం గా ఉన్నాయి .ఈ కధలన్నీ సుగంధాన్ని వేద జల్లేవి కనుక నేను ఈ సమీక్షను గంధం వారి పేరు కూడా కలిసి వచ్చేట్లు ”కదా గంధం ”అనితొమ్మిదేళ్ళ క్రితం రాశాను .ఇందులో కొంత భాగాన్ని శర్మ గారు ఈ కదా సంపుటిలో చేర్చి ప్రచురించారు .
శ్రీ పు రి పండా అప్పల స్వామి గారు చిన్న కధను ”మిత్తవ ”అన్నారు .ఇందులో ఈ మిత్తవలు ఎక్కువగా , పెద్దకధలు కొద్దిగా ఉన్నాయి .”గురువింద నవ్వింది ”కద తో ప్రారంభించి ”జీవితం ”కద తో ముగించారు శర్మ గారు సంపుటిని .గురువింద కద లోకం పోకడకు అద్దం పట్టింది .తనకున్నది కొద్ది పాటి కళం కమే .కాని తాను చూస్తున్న మనుష్యులు వారి ప్రవర్తన అంతా కారు నలుపు, చీకటి, అజ్ఞానం .చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదు .కపటం ,భ్రష్టత నర నరాల్లో జీర్ణించుకొన్న మానవుల కంటే ,తాను చాలా నయం అను కొంటుంది గురి వింద .వారి కళంకం తో పోల్చుకొంటే తనది లెక్క లోకి రాదు అని ఆత్మ సంతృప్తి చెందింది తన ను ఆడి పోసుకొనే హక్కు ఈ సమాజానికి లేదన్నది .జీవితం లోని నలుపు తెలుపు లను చూపించే మంచి చిన్న కద ఇది .చివరి కద జీవితం లో భార్య సత్య వతి కదా రచయిత అయిన భర్తకధకు మలుపు రాస్తుంది .భార్యను వదిలి ఇంకో ఆమె ను చేసుకొన్నట్లుగా రాసిన ”మలుపు ”అది .భర్త ఆశ్చర్య పోతాడు .ఆమె అతడిని పిల్లాడిగా లాలిస్తూ అంటుంది ”ప్రతి స్త్రీ తన భర్త ఓ మహా మనీషి అన్న నమ్మకం తోనే సంసార జీవితం గడుపుతుంది .అయినా అతడి దృష్టిలో తానూ ఒక ఒక గొప్ప వ్యక్తీ గా చలామణీ కావాలనే కుతూహలం అంతర్గతం గా అనవతరం అంటి పెట్టు కొని ఉంటుంది .దాన్ని నిరూపించుకోవాలనే తపన ఆమెను అనుక్షణం ఆవ హించు కొని ఉంటుంది .తన ఆధిక్యతను తెలివి తేటలను నిరూపించు కోవాలన్నది ఆమె చిత్త జాడ్యం .బ్రహ్మ రాతలను సరస్వతీ దేవి చదివి ఇలా సాగించారేమిటి /అలా రాస్తే బాగుండు కదా అని అన్నా బ్రహ్మ రాత మాత్రం మారదు . అది జీవితం గా సాగి పోతుంది .సరస్వతి దేవి చెప్పింది కద గానే మిగిలి పోతుంది .ఇదండీ కధకు జీవితానికి ఉన్న సంబంధం ”అంది భార్య సత్య వతి భర్త అయిన కధకుడి తో మార్పు ను సమర్ధిస్తూ .కద చివర శర్మ గారు ”సత్య వతి రాసిన కదా కద గా మిగాలలేదు .అదే జీవిత గాధ అయింది .మరి ఆవిడ సత్య వతి కదా .విధి రాత నే రాసి ఉంటుంది .”అంటూ ముగిస్తారు . .ప్రఖ్యాత కధకులు స్వర్గీయ వాకాటి పాండు రంగా రావు గారు మెచ్చి ,ప్రచురించిన కదఇది.పసందుగా ఉండకేం చేస్తుంది ?చిన్న కధకు చక్క్కని అర్ధ వంత మైన ముగింపు నగిషీ .జీవితాన్ని చక్కగా అధ్యయనం చేసిన శర్మ గారు చిన్న చిన్న మాటలతో గొప్పగా రాసిన కద ఇది .ఆ ధునిక తెలుగు కధకు వందేళ్ళు వచ్చిన సందర్భం గా విశాఖ పట్నం వారు ఎంపిక చేసి ఉత్తమ కధలు గా ప్రచురించిన 100కధల సంకలనం లో శ్రీ శర్మ గారి కధకు చోటు దక్కటం ఆయన రచనా పాట వానికి నిదర్శనం .
అంతే కాదు శర్మ గారి అమృత హస్తాలపై ఒక అంధ విద్యార్ధి పరిశోధన చేసి పుస్తకం గా వెలువరించాడు . సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –3-2-13 -ఉయ్యూరు

