క థా గంధం -2
ఈ రెండు కథల మధ్య లో ఉన్న వాటి గురించి ఇప్పుడు తెలుసు కొందాం .జీవితాంతం ప్రభుత్వ చాకిరీతో కండలరగదీసుకొని ,రిటైర్ అయిన నాటికి ఓ సొంత కొంప ఏర్పరచుకోవాలని కలలు గన్న సూపరింటెన్న్దేంట్ రామ క్రిష్నయ్య కు తన నీతి,నిజాయితీలు ఎందుకూ కొరగాకుండా పోయాయి .’’రెడ్ టేపిజం ‘’కు బలై అనారోగ్యం తో బల వంతపు ఉద్యోగ విరమణ చేయ వలసి వచ్చింది .ప్రావిడెంట్ ఫండ్ కోసం ఎదురు చూశాడు .కొంత డబ్బు వస్తే స్థలం కొన్నాడు .మిగతా డబ్బు కోసం కళ్ళలో వత్తులేసుకొని ఎదురు చూసి చూసి విసుగెత్తి పోయాడు .చివరికి భార్య ద్వారా బిల్లు వచ్చిందన్న మాట విని ‘’పునాది కి ఉపయోగిస్తుంది అను కొన్నది సమాధి కి ఉపయోగిస్తుంది అ ను కోలేదు‘’అంటూ ప్రాణం విడిచాడు .సక్సేషన్ సర్టిఫికేట్ లేనిది బిల్లు పాస్ అవదని ఆఫీసులో కొర్రి వేశారు వెర్రి వెధవలు .భర్త ఉత్తర క్రియలకు చేసిన అప్పు తీర్చలేక ఆయన త్ర్తవ్వించిన నూతికి అర్పణ మైంది భార్య .ఉద్యోగస్తుల దయ నీయ పరిస్తితి రెడ్ టేపిజం కు ఇదొక దర్పణం .దాని ప్రభావం ఎంత బలం గా ఉంటుందో చెప్పే కథ .కన్నీటిని చిలకరింప జేసే వ్యధ .ప్రత్యక్షర సత్యం కన్పించే జీవిత గాధ .
‘’అమృత హస్తాలు ‘’అనే కథపేరే ఈ కథా సంపుటికి నామ దేయం ..ప్రాణం ఎవరి కైనా తీపే .అందులో మానవ ప్రాణం మరీను .’’తన యందు అఖిల భూతముల ను జూచే మనస్తత్వం ‘’మనది .వేదోప నిషత్తుల సారమూ ఇదే .భాగవత ధర్మం ,భారతోపదేశం ,రామాయణ సారమూ ఇదే .తన ‘’ఎల్లావు ‘’తన కళ్ళ ముందే చని పోతే ఏమీ చేయ లేని దైన్య స్తితి లో ఉన్న కృష్ణ మూర్తి పశు వైద్యం నేర్చుకొని చుట్టు ప్రక్కల గ్రామాలలో పశు వైద్య సేవ చేస్తూ అందరికి క్రిష్ణయ్య గా ఆత్మీయుడైనాడు. .క్రిష్నయ్య జ్వరం లో ఉన్నాడోక సారి .ఆయన ఆరోగ్యం ఏమవుతుందో నాన్న భయం తో కొడుకు పొరుగూరి నుంచి పశు వైద్యానికి రమ్మని వచ్చిన వాళ్ళని విసుక్కోన్నాడు .లోపల ఉన్న క్రిష్నయ్య ఇది విని జ్వరం తో నే వారి వెంట బయల్దేరి వెళ్ళాడు .కొడుకూ వెంట వెళ్ళాడు .ఆ ఊరు వెళ్లి ఎల్లావుకు వైద్యం చేసి అయిదే అయిదు నిమిషాల్లో ‘’గురక జబ్బు ‘’నయం చేశాడు .అందరు క్రిష్ణయ్యది ‘’అమృత హస్తం ‘’అన్నారు .దీన్ని ప్రత్యక్షం గా చూసిన కొడుకు ‘’క్షణం తీరిక లేదు –దమ్మిడీ సంపాదన లేదు ‘’అని ఇప్పటి దాకా తండ్రిని కసురుకొన్న వాడు ,ఆ భావం నశించి తండ్రి ఆరాధ్య దైవం అను కొన్నాడు .’’దేశం కోసం ,చుట్టూ ఉన్న సమాజం కోసం ఉదారం గా శ్రమిస్తే భారత దేశం భూతల స్వర్గం అవుతుంది భూతాల నరకం నుండి విముక్త మవుతుంది ‘’అన్న స్వామి వివేకా నంద మాటలను ఆచరణ లో చూపించే కథ ఇది .దయా సానుభూతి సాహవేదన ,కరుణ ,ప్రేమ లేని జీవితం వ్యర్ధం .ఈ భావాలతో స్నేహ హస్తాలను సాచితే అవే అమృత హస్తాలై దుఖాశ్రువులను తొలగిస్తాయి మనో ధైర్యం నింపి మానవత ను వికశింప జేస్తాయి .మానవతా గంధం పరి మళాలను వ్యాప్తి చెందిన్చాలనే భావం తో స్పందించి ,.98 ఏళ్ళ వయసులో కూడా పశు వైద్యం చేస్తూ ‘’పశుపతి ‘’లా సేవ చేస్తున్న తమ పిన తండ్రి దిన చర్య నే కథ గా మలిచి ,ఆయనకే అంకితమిచ్చారు శర్మ గారు .కనుక కర్తవ్య బోధ చేసే ‘’అమృత హస్తాలు ‘’శీర్షిక కథకు ,సంపుటికి వన్నె తెచ్చి సార్ధక మయింది
‘’చెప్పేవి శ్రీ రంగ ఈతులు దూరేవి –‘’ఉదాహరణేనే రావూరి రంగయ్య కద .’’ఏ ఎండాకా గొడుగు పట్టే‘’తీరున్న వాడు .దీన్ని చాటి చెప్పేదే ‘’గాలి కోళ్ళు ‘కదా .కథనం చాలా బాగుంది .వ్యాసా రావు భార్య గృహిణి .భర్త కాలేజి కి వెళ్ళగానే ఆమె ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి ,సాయంత్రం భర్త ఇంటికి వచ్చే ముందు చేరుతుంది .ఇరుగు పొరుగు వారి మాటలు వాళ్ళ భార్యపై అతనికి అనుమానం వస్తుంది .ఒక రోజు స్త్రీ సమాజ ఉత్స వానికి ఆహ్వానం వస్తే వెళ్ళాడు .అక్కడ అ జరిగే అన్ని కార్య క్రమాలకు సహాయ సహకారాలన్దిస్తున్న ఓ స్త్రీ మూర్తిని అధ్యక్ష కార్య దర్శులు కృతజ్ఞత తో పొగిడి ,ఆమె ను సత్కరించ దలిచి సూర్యా రావు ను వేదిక పైకి ఆహ్వానిస్తారు ఎందుకో తెలీదు కాని ఎక్కాడు .ఆ స్త్రీ మూర్తి రాసిన జాబును కార్య దర్శి చదివింది .అందులో ఆమె తనకు చేయ దలచిన సత్కారాన్ని తన భర్త ద్వారా అందించ మని రాసి నట్లుంది .ఆయన ప్రోత్సాహమే తనకు ఆదర్శం అని చెప్పింది .వ్యాసా రావు ఆమె తన భార్య సరళ గా గుర్తించి ఉక్కిరి బిక్కిరి అయాడు .అవమానం ,పశ్చాత్తాపం ముంచెత్తాయి .అందరు అతన్ని పొగిడి ‘’ఆ అదర్శ మూర్తి ‘’ని తీర్చి దిద్దిన మహాను భావుడు అని పొగిడారు .ఏమీ పాలు పోక బహుమతిని అందుకొని ఇంటికి చేరాడు .’’అపార్ధం చేసుకొన్నాను క్షమించు ‘’అని ప్రాధేయ పడ్డాడు .ఆమె ‘’గాలి ఎటు నుంచి వస్తే అటు చూసే గాలి కోళ్ళు లను అతనికి చూపించింది .’’పురుషుల మనస్సుల్లాగానే అవి దిశను మారుస్తాయని మేళ మాడింది ‘’భార్యా భర్తల మధ్య మంచి అవగాహనా ,ఆత్మీయత ,నమ్మకం ఉంటేనే సంసారం స్వర్గం లేకుంటే నరకం ,మనో వ్యధ ‘’అని చెప్పే మంచి ఇతి వృత్తం తో రాసిన కథ .
సశేషం —మీ—గబ్బిట దుర్గా ప్రాసాద్ –4-1-13 –ఉయ్యూరు

