కథా గంధం –3
సేవా భావానికి మారు పేరు గా నిలిచిన నర్సు అమరేశ్వరి ‘’అమృతమ్మ ‘’గా అందరికి మాన్యమైంది .నేటి వికృత రాజ కీయానికీ ,ఆ విష సంస్కృతికి బలి అయి పోయిన ఒక అబలకన్నీటి వ్యధా భరిత కథే ‘’సింహావలోకనం ‘’అధికార బలం ,అంగబలం అర్ధబలం ఉన్న సీతా రామయ్య –అబలా ,అసహాయ ,సాదు శీలా అయిన సుశీల జీవితం తో చేల గాటమాడి క్రూరం గా పట్టి బంధించి ,అనుభవించి, చివరికి విధి వక్రించి ప్రమాదం లో కాలు పోగొట్టుకొని ఆస్పత్రి పాలై తన గతాన్ని ఓ సారి తలచుకొని సుశీల ఎదటే ప్రాణం విడుస్తాడు .ఈ జీవితం లో చేసిన పాపం ఇక్కడే అనుభ వించాలి అన్నదానికి ఉదాహరణ గా రాసినదిది .
నీటి వాగుల్లో ‘’బుడుగు ‘’లుంటాయి .జాగ్రత్త లేక పోతే ప్రమాదమే ప్రాణ నష్టం కూడా .వీటికి హెచ్చరిక బోర్డులుంటాయి కాని నిత్య జీవితం లో మనతోనే ఉంటూ ,అగాధానికి త్రోసే బుడుగు లను ఎలా తెలుసుకోగలం ?అదిగో అలాంటి వాడే ‘’మన్మధ రావు ‘’వాడి కథే ‘’బుడుగు లుం టాయ్ జాగ్రత్త ‘’’’మన్మధుని భార్య విద్యా వతి .ఆమె పేరుతో పరిశ్రమ స్తాపించి ,ఆమె ను డాక్టరేట్ చేయిస్తున్నాడు .విలాసం పెరిగి ‘’సుహాసిని ‘’ని మెట్టుగా వాడుకొని వ్యాపారం సాగిస్తూ ,అప్పుల పాలై ‘’గౌతమి ‘’తో జత కలిపినా నష్టాల ఊబిలో దిగి పోయాడు .డాక్టరేట్ పొందిన విద్యా వతి తన పరిశ్రమ ను చక్క దిద్ద టానికి పూను కొంది ..కోర్టు లో కేసు కు మృతు రాలి గా హాజరై తను రాసుకొన్న విజ్ఞాపనను కోర్టు కు వ్రాత పూర్వకం గా తెలిపింది .’’భార్యా భర్తల మధ్య ప్రేమ ,అనురాగం ఆత్మీయత ఉండాలి .డబ్బు కు దాసు డైన ఈ నాటి భర్తలకు భార్య అక్కర్లేదు..అవసరాలు ,కామం తీర్చే బానిస కావాలి అని కోరు కుంటారు అన్నది .ఆడ వాళ్ళ పేరిట వ్యాపారాలు పెట్టిన్చవద్దు .విశ్వాస ఘాతకుల్ని పెంచ వద్దు అని యువకులను హెచ్చ రించింది .కుక్కను పెంచితే అది స్నేహితుని లా ,అంగ రక్షకుని లా ఉంటుంది ,ఆనందాన్నీ ఇస్తుంది ‘’అని హితవు చెప్పింది .భార్యల్ని సోపానాలుగా వాడుకొని త్రోసి వేసే ఆధునిక భర్తలకు కను విప్పు కల్గించే కథబుడుగు .
‘’సత్యమేవ జయతే ‘’వల్ల లాభమేమీ లేదు ‘’అసత్య మేవ జయతే ‘’అంటే అన్నిటా లాభాల పోగులే .పేరడీ గా,సరదా గా చెప్పిన కథ బాగుంది .కష్టపడి చదువులు చెప్పిస్తే కొడుకులు ఏ అమెరికా లోనో హాయిగా సంపాదించు కొంటు వీలైతే చుట్టపు చూపుగా వచ్చి వెళ్తూ వృద్ధాప్యం లో తలిదండ్రుల అతీ గతీ పట్టించు కొని పరిస్తితి ఈ నాడు దేశ మంతా ఉంది .వృద్ధాప్యం శాపమై పోయింది .అందుకే అలాంటి వారినాద రించి కన్నీరు తుడిచి సేవ చేయ టానికి వ్రుద్దాశ్రమాలేర్పడ్డాయి .సంపాదించింది కన్నపిల్లల పాల్జేసి ,ఆలనా పాలనా లేకుండా ఉండటం కంటే ‘’రిటైరీలు ‘’ఇలాంటి ఆశ్రమాలు స్తాపించి ,ఒకరి కొకరు సాయం చేసుకొంటూ ఊరట కల్గిస్తూ ,పొందుతూ తృప్తినీ ,జీవన మాధుర్యాన్ని ,ప్రశాంతిని పొంద టానికి సహకరించు కొంటున్నారు .ఈ నేపధ్యం గా రాసిన కథలే ‘’మధురాశ్రయం ‘’,’’సుభద్రా –‘’,’’స్వర్గ ధామం ‘’’’వృద్ధాప్యాన్ని ఆద రించాలి ‘’కధలు .
‘’ప్రమాదో ధీమాత మపి ‘’ఎంతటి వారి కైనా సహజం .అందులోను అందాల రాశి భార్య గా ఉంటె భర్తకు అను మాన పిశాచం ఆవ హిస్తుంది .అందానికి మారు పేరు ‘’అక్కమ్మ ‘’.సూరయ్యభార్య .అతని అనుమానం ఆమెను ఆమెను అతడిని వదిలేసి వెళ్ళేదాకా వెళ్ళింది .సూరయ్య మళ్ళీ పెళ్లి చేసుకొన్నా ఆవిడా దక్కలేదు .ఒక కొడుకు నిచ్చి చని పోయింది .పుష్కరాలలో సూరయ్యా అక్కమ్మా కలుసు కొంటారు .ఆమె అప్పటికే కాలు జారింది .తప్పునూ తెలుసు కొంది .పశ్చాత్తాప దగ్ధ అయి పునీత అయింది .అత్తారి ఊరు చేరి ,దేవాలయం లో ఉంటూ జీవితాన్ని భగవంతునికి అంకితం చేసుకొంటూ బతుకు తోంది .’’వృద్ధ నారీ పతివ్రత ‘’అని ఎక్కి రించారు ఆ ఊరి వాళ్ళు .పూజారి కూడా భ్రమ పడి ఆమెతో తప్పు చేయిద్దామని ప్రయత్నిస్తే ‘’అన్నయ్యా ‘’అనగానే ,అతని లోని చీకట్లు చెల్లా చేద రయి నాయి .జ్ఞానోదయమైంది .వైకుంఠఏకాదశి నాడు స్వామి సేవ చేస్తూ తనువు చాలించింది .ఆచార్లు ‘’మీ స్మరణ దలర్చు మానవులు సద్గతి చెందినా దెంత వింత ‘’అన్న దాశరధీ శతక పద్యాన్ని స్మరిస్తూ అక్క మహాదేవికి భక్త్యాంజలి ఘటించాడు . .’’దమ్మక్క ‘’ను ఆమె లో దర్శించాడు .తన సర్వస్వాన్నివేణుగోపాల స్వామి కి అంకిత మిచ్చి ఆయన లో ఐక్యమై జన్మ సాఫల్యం చేసుకోని ‘’నివేదిత ‘’అయింది అక్కమ్మ .మానవుని లోని అన్ని కోణాలను స్పృశించి రాసిన మా మంచి కథ ఇది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –5-2-13-ఉయ్యూరు

