కదా గంధం -4(చివరి భాగం )
ప్రభుత్వ ఉద్యోగికి దేశం ముఖ్యం .ప్రజలు ,ప్రజావసరాలు ముఖ్యం అని ఉద్యోగ జీవితం అంటూ ఉద్యోగం ప్రారంభించిన నాడు స్వాతంత్ర సమార యోధు డైన తండ్రి ,జమ దగ్నికి బోధించిన ఆదర్శాన్ని ఉద్యోగం లో ఆచరించి కష్టాల పాలైన నిజాయితీ ఆఫీసర్ కధే ‘’మరపు ‘’.భర్త తనను గుర్తించాలని ,మనసు తెలుసు కోవాలని ప్రతి భార్య కోరుకొంటుంది .అది తీరితే తృప్తి లేకుంటే క్షోభ .ఉదాసీను డైన భర్త మనసుని మార్పించిన ‘’డాక్టర్ శ్యామల ‘’కదా ముచ్చట గా ఉంది .అందం ,ఆకర్షణ ,శరీరానికి కాదు ఆత్మకు ఉంటేనే పరమార్ధం .పై పైన కనీ పించే వాటి మొహాలకు భ్రమ పడవద్దని చెబుతూ స్నేహం ,ప్రేమ ,ఆత్మీయ మైనవి గా భావించాలని తెలియ జెప్పే ‘’అనూరాధ కధే ‘’మామ్మ’’మామ్మ అని అందరు వెక్కి రించినా నేను అమ్మనే ,ఆమె భావానికి ప్రతి రూపాన్ని అని చెప్పిన అనూరాధ వ్యక్తిత్వం గొప్ప గా ,ఆమె కు కళ్ళు లేక పోయినా ,లోకం ఆమె ను అర్ధం చేసుకో లేని కబోది గా ఉందని చాటే కమ్మని కద .
ఈ కదా లన్నిటిలో శ్రీ శర్మ గారి చేయి తిరిగిన నైపుణ్యం స్పష్ట మౌతుంది .ఎక్కడా అస్పష్టత ఉండదు .స్వచ్చ స్పటికం గా ఉంటాయి కధలన్నీ .ఆరంభ శూరత్వం,ముగింపు వైభోగం ఉండవు..పువ్వు మెల్లగా రేకులు విచ్చు కొన్నట్లు కద నెమ్మది గా మెత్తగా .గమ్మత్తు గా సాగుతుంది .ఇదే వీరి శిల్ప విన్నానం.’’మధురాంతకం రాజారాం‘’ లా అంతా ఆయనే చెప్పేస్తారు పాఠ.కుడి ఆలోచనకేమీ మిగల్చారు .ప్రతి సన్నివేశాన్ని రక్తి కట్టిస్తారు .ఎవరి మీదా కోపం ద్వేషం ఉండవు .ఉద్రేకం ఉగ్రాలసలు కనీ పించవు .ఇదీ జీవితం –మీ ముందుంచు తున్నాను .ఇందులో తీపి ఆస్వాదించండి .అన్నట్లు గా ఉంటాయి కధలు .సంభాషణలు అవసరం మేర కే ఉంటాయి .అవీ అర్ధ గౌరవం తో కాంతు లీను తాయి .అచ్చమైన తెలుగుదనం ఉంటుంది
వ్యధా భరిత సమాజం లో ఉంటున్నాం మనం .అన్యాయం ,ఆక్రందనలు మన చుట్టూ ఉన్నాయి .చూస్తూ ఊరుకొంటే కౌరవ సభలోని భీష్మ ద్రోనాదుల్లాగా మనమూ అను భావించాల్సిందే .బాధిత తాడిత పీడిత వ్యదార్తులకు సహృదయం తో స్నేహ హస్తం చాచాలి అవి ప్రేమ దయ ,కరుణ ,వాత్సల్యం అనురాగం ,ఆత్మీయత లతో అందిస్తే ‘’అమృత హస్తాలు అయి ఊరట కల్గిస్తాయి .శాంతి ,సహనం ,సహవేదన అహింస మన మూలాలు ,పునాదులు .పునాదులు లేని సౌందర్య భవనం కూడా కూలి పోతుంది .తస్మాత జాగ్రత జాగ్రత .నిశిత లోక పరిశీలనా ,ఆవ గాహన ,చాతురీ విలసిత రచనా విధానం శ్రీ గంధం వెంకా స్వామి శర్మ గారివి .దీనికి మించి శర్మ గారిది ‘’అమృత హృదయం ‘’అందుకే అన్ని కధలు అమృత గుళికలు .’’గంధం ‘’వారి ఇంటి పేరు .దాని సుగంధం వ్యాపిస్తూనే ఉంటుంది .వీరి తమ్ముడే ప్రఖ్యాత కధకు లు శ్రీ గంధం యాజ్ఞ వల్క్య శరం గారు వీరి కధలూ అపురూపాలే .ఆ పాదు లోని వారే కనుక శర్మ గారి కద లన్నీ సుగంధ బంధురాలు .
శ్రీ శర్మ గారితో నాకు పరిచయం 2002 లో మాత్రమె జరిగింది . ఆ తర్వాతా రెండేళ్లలో రెండే సార్లు సాహిత్య సభల్లో కలుసు కొన్నాము .నామీద వారికి ఎంతో ఆదరణ .ఈ కధలకు నన్ను ‘’’అభిప్రాయం ‘’రాయమని జిరాక్స్ కాపీ పంపారు .నా కున్న అర్హత లేమిటో నాకు తెలీదు .కానీ పెద్దలు వారి మాట శిరసా వహించా .వారి ఆత్మీయతే నన్ను ఇంత రాయించింది .నా అభిప్రాయాల కు అర్హత కన్నా ,ఆత్మీయ వచనం గా భావించి రాశాను .వారి అమృత హస్తాలకు ,అమృత హృదయానికి క్రుతజ్ఞాతాంజలి ఘటిస్తున్నాను .
ఇది రాసింది 22-6-2004 న .దీన్ని అమృత హస్తాలు పుస్తకం లో చేర్చారు .ఆ తర్వాత ఎన్నో సార్లు కలుసుకొన్నాం .మా దంపతులంటే వారికి వల్ల మాలిన అభిమానం శ్రీ శర్మ గారు ‘’సరస భారతి ‘’కార్య క్రమాలలో ఉత్సాహం గా పాల్గొనే వారు ప్రసంగాలు చేశారు కవితలు రాసి మా కవి సమ్మేళనాలలోపాల్గొన్నారు .వారు అకస్మాత్తు గా 20012 ఏప్రిల్ లో మరణించారు .గొప్ప ఆత్మీయుడిని కోల్పోయానని అని పిస్తుంది
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –6-2-13-ఉయ్యూరు

