త్యాగయ్య- బాల(మురళి)య్య దర్సనం
ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర
శ్రీ శివ ప్రసాద్ గారికి నమస్తే -మేమిద్దరం ఈ నెల ఎనిమిది రాత్రి మద్రాస్ వెళ్లి, తొమ్మిది రాత్రికి తిరుచి బయల్దేరి వెళ్లి ,పది ఉదయం చేరి, కుంభకోణం తంజావూర్ ,తిరువయ్యార్ లను దర్శించాం .పద కొండు న పళని శ్రీ సుబ్రహ్మన్యే శ్వర స్వామి ని దర్శించాం .పన్నెండు న శ్రీ రంగం లో శ్రీ రంగనాధ స్వామిని సందర్శించాం .ఆ రాత్రి కి చెన్నై బయల్దేరి పద మూడు ఉదయం మా మేన కోడలి గారింటికి చేరాం .పద్నాలుగు న మా మేన కోడలి కుమారుని ఉపనయమ చేయించాం.
పద్నాలుగు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ముందు గా నే పొందిన అనుమతి తో గురువరేన్యులు శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారిని సందర్శించి పులకిన్చాం .వారు సాదరం గా ఆహ్వానించి ,ఆప్యాయతను వర్షించారు .ఎంతో చనువు గా మాట్లాడి మమ్మల్ని పరవశింప జేశారు .ఆత్మీయతా ధారా తో మమ్మల్ని తడిపేశారు .ఎంతో ఆనందాన్ని ,అనుభూతిని పొందాం .ఏ భేష జమూ లేని ”ఆ మనీషిని”,సంగీత సరస్వతిని అపర త్యాగ రాజ స్వామినిచూసి ఆనందం పట్టలేక పోయాం .అవి మా జీవితం లో మధురాతి మధుర క్షణాలు .కలకాలం జ్ఞాపకం ఉండే దివ్య స్మృతులు .”సంగీత పెన్నిధి సన్నిధి” లో అర గంట కాలం యిట్టె గడిచి పోయింది .వారు ”నేనూ మీ లాంటి వాడినే .మీ కెంత తెలుసో నాకూ అంతే తెలుసు .అధికుడిని కాను కాని వేదిక ఎక్కి పాడటం ప్రారంభిస్తే నేను నేను కాదు .ఒక అపూర్వ శక్తి నన్ను ఆవహించి నాతో పలికిస్తుంది .అప్పుడు నాకేమీ గుర్తుకు రాదు .కార్యక్రమం అయి పోయి వేదిక దిగ గానే నేను మళ్ళీ మామూలు మీ లాంటి వాడిని .డెబ్భై ఏళ్ళుగా పాడుతూనే ఉన్నాను .చిన్న నాట నే సంగీత సరస్వతి కరుణించి నాకు సంగీత భిక్ష పెట్టింది .నాకు విజయ వడ లో ఉండగా శ్రీ ఆంజనేయ స్వామి సాక్షాత్కరించారు .సంగీతానికి ఆద్యులు హనుమయే .నాకోసం ఎవరైనా, ఎప్పుడైనా రావచ్చు అయితే ముందు గా ఫోన్ చేసి వస్తే చాలు ”అని చెప్పారు .ఆయన ఇంటి పేరు” మారుతి ”అయితే ,మేము మారుతి సేవకులం అని ఉయ్యూరు లో మాకు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నద ని, నేను వంశ పారం పర్య ధర్మ కర్త నని చెప్పి నేను రాసిన” శ్రీ హనుమద్ కధా నిధి” పుస్తకాన్ని ,శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి పై తెచ్చిన ”ఆదిత్య హృదయం ”పుస్తకాన్ని వారికి సభక్తికం గా అందించాను .చూసి సంతోషించారు .
మీరు అమెరికా లో నార్త్ కరోలిన రాష్ట్రం లో షార్లెట్ నగరం లో మా అమ్మాయి విజలక్ష్మి అల్లుడు అవధాని దంపతుల ఇంటికి రావటం మీతో ”టో రి ”రేడియో లో ఇంటర్వ్యు చేయటం మీరు మీ గురువు గారి ప్రేమను, ఆప్యాయతను, వాత్సల్యాన్ని గుర్తు చేసుకొన్న విషయాలను, మీ గురు పత్ని అన్న పూర్ణ లాగా వ్యవ హరించిన తీరు ను వారితో మీ మాటలుగా చెప్పాము నేనూ మా శ్రీమతి .అన్నిటికి చిరు నవ్వే సమాధానం .అయితే ఆమె ను చూడాలని అనుకొన్నా వారితో ఆ మాట అనే సాహసం చేయ లేక పోయాం .అడిగితే ఎమయే దో తెలియదు .ఇంతే దక్కింది అనుకొన్నాం .
శ్రీ బాల మురళి గారిని చూడటం మీ సహృదయత వల్లనే సాధ్యం అయింది .మీరు వారి చిరునామా ,ఫోన్ నంబర్ నాకు నెట్ లో మెయిల్ పంపించి చూడ టానికి దారి చూపించారు .ఈ మేలు మరవలేము .బాల మురళి గారిని చూసి వచ్చామని మేము చెబుతుంటే అందరు నోళ్ళు వెళ్ళ బెడుతున్నారు .ఎలా సాధ్యం? అని విస్తు పోతున్నారు .అప్పుడు మీ సంగతి చెప్పి శివప్రసాద్ గారి వల్లనే సాధ్య మయిందని తెలియ జేస్తున్నాము .జనవరి మొదటి తేదీన మీరు శ్రీ బాల మురళి గారు ”యుగళ్ బందీ ”ని హైదరాబాద్ రవీంద్ర భారతి లో నిర్వహించినప్పుడు నాకు ఆహ్వానం పంపిన సంగతి కూడా గురువు గారికి చెప్పాము .అమెరికా లో మీ ”ఈల లీలా యాత్ర్స ”ను జ్ఞాపకం చేసుకొని చెప్పాను .”ఏం చెప్పాడు శివ నా గురించి ?మంచే చెప్పాడా ?”అన్నారు నవ్వుతు .”మంచి గా చెప్ప బట్టే మీ దర్శనం కోసం వచ్చామండీ .లేక పోతే వచ్చే వాళ్ళం కాదు ”అన్నాను .నవ్వేశారు . షార్లెట్ లో,గాంధి మందిరం లో జరిగిన మీ ”ఈల కచేరి” తర్వాత అందరి సమక్షం లో నేనిచ్చిన ”ఈల లీలా లోల ”,”గళ వంశీ ”బిరుదులూ ఒక సారి జ్ఞాపకం చేసుకోన్నాము .ఆ రోజు మీరు నాకు చూపిన కృతజ్ఞతా భావం, పెద్దరికం మరచి పోలేము .మా అమ్మాయి గారింట్లో భోజనం ,కచేరి ,అలవోక గా మీరు పాడే తీరు మాకు మధురాతి మధుర మైన జ్ఞాపకాలు .ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ వ్యక్తిత్వానికి ముగ్దులమయ్యాం .గురువు పట్ల మీ కున్నా ఆరాధనా భావానికి మురిసి పోయాం
మాకు బాల మురళి గారి దర్శనం ”యదు మురళి దర్శనం ”అని పించింది . ఆ ”సంగీత పెన్నిధి సన్నిధిలో” మేము పొందిన అను భూతి జన్మ జన్మ ల పుణ్య ఫలమే అని పించింది గురు దర్శనం మాతో చేయించిన మీ సహృదయతకు, వారి సౌజన్యానికి మరొక్క మారు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .
మీరు విజయవాడ వ్సైపు వచ్చి నప్పుడు ఉయ్యూరు లో మా ఇంటికి వచ్చి, మా ఆతిధ్యాన్ని స్వీకరించి, మాకు ఆనందాన్ని కల్గించ మని ప్రార్ధిస్తూ -సెలవ్ -మీ –దుర్గా ప్రసాద్ .ఉయ్యూరు -16-2-13-








