నా దారి తీరు -36
హెడ్ మాస్టారికి చెక్
మంచి వారే కాని మా హెడ్ మాస్టారు ,ఒక చిన్న దుర్గుణం ఆయనకు ఇబ్బంది కలిగించింది .. ఆయన కనీ పించాగానే నమస్కారం చేయాలి .లెక పోతే గుర్తు పెట్టుకొని ,పెట్టని వాడిని అదో రకం గా ద్వేషం తో చూస్తారు . సాధారణం గా హెడ్ మాస్తా రు మంచి వాడైనా కాకపోయినా ”ఆ సీటు ”కు విలువ నిచ్చి ప్రతి వారు నమస్కరించటం అనూచానం గా వస్తున్నా సత్ సంప్రదాయం . దీన్ని ఎవరూ కాదనలేదు ,కాదనరు కూడా హెడ్ చూడగానే మన చేతులు ఆటోమాటిక్ గా నమస్కారం పోజు పెట్టేస్తాయి ఇది అందరికి అనుభవైక విషయమే . ఒకటి రెండు స్దార్లు సరాసరి క్లాస్ లోకి వెళ్ళడం ,ఆయన్ను ఆఫీసులో కలిసే అవకాశం లేక పోవటం ఎవరికైనా ఉండచ్చు . అప్పుడు నమస్కారం చెయ్యక పొతే ,అది జ్ఞాపకం ఉండక పోవచ్చు ఱొటీ న్ లో అదొక భాగం ముఖ్యమ్ కాదు .ఇలా కొందరు మేస్తర్లకు ఆయనతో ఇబ్బంది ఏర్పడింది . ఒకటి రెండు సార్లు ఆయనే ”నాకు ఇవాళ మీరు విష్ చెయ్య లేదు ”అని చెప్పిన సందర్భాలు వచ్చాయి . స్టాఫ్ రూం లో ఈ విషయాలు మా తో ఆ టీచర్లు చెప్పే వారు . అలా విష్ చేయని వారి పై ఆయనకు ఒక రకమైన కోపం సూటి పోటి మాటలనటం మాకు అందరికి బాధ కలిగించాయి కొంతకాలం మాస్టర్లు వీటిని బయటకు చెప్పుకో లేదు . కాని నన్ను ,జగన్ మోహన రావు ను చూసిన వారు మాత్రం మాతో బాధగా చెప్పారు . ఏం చేయాలో మాకూ అర్ధం కాలేదు ఈ ఒక్క విషయం తప్ప ఆయన లో మిగిలినవన్నీ అందరూ మెచ్చుకోనేవే .
మురళీధర రావు అనే తెలుగు పండిట్ కు ,డ్రాయింగ్ మాస్టారు భాద్రాచారి కి వెంట ప్పయ్యకూ ఈ బాధ తప్పలేదు . ఇక ఉపేక్షించి ఊరుకుంటే రేపు మిగిలిన వారి గతీ ఇంతే కదా అనుకొన్నాం . అప్పుడు నేను ,జగన్మోహన రావు ,ఒక రోజున ఆలోచించి హెడ్ మాస్టారు ఆఫీసులో ఖాళీ గా ఉన్న సమయం లో వెళ్లి ఆయన దగ్గర కూర్చున్నాం .వష యమ్ ఏమిటని ఆయన అడిగారు. అప్పుడు నేనే ”మాస్టారూ !మీరంటే మా అందరికి పరమ గౌరవం ఉంది . మేము స్కూల్ కు రాగానే మీ ఆఫీసుకు వచ్చి మీకు విష్ చేయటం మా ధర్మము , బాధ్యత .మి మ్మల్ని గౌరవించటం మా విధి కా ని ఏదైనా పని తొందర్లోనో అర్జెంట్ గా క్లాస్ కు వెల్ల వలసి వచ్చినప్పుడో మీ రూం లోకి వచ్చి విష్ చేయటం కుదరక పోవచ్చు . అంత మాత్రాన మిమ్మల్ని అగౌరవ పరచాలని కాదు . అ లా జరిగిన సందర్భ్జం లో మీరు కూడా పెద్ద మనసు తో అర్ధం చేసుకోవాలి ఽదొక నేరం అని భావించరాదు ంఆ సహచర ఉపాధ్యాయులు ఈ విషయమై చాలా ఆందోళన చెందుతున్నారు . హెడ్ మాస్టార్ని చూదాం గానే ఎవరికైనా చేతులు జోడింప బుద్ధి వేస్తుంది ఆస్తనాం విలువ అది . అలా చేయలేని వారిపై వేరే భావం తో మీరు ఉంటున్నట్లు వారు మాకు చెప్పుకొన్నారు వారందరి తరఫున మేమిద్దరం వచ్చాం . నమస్కారం అడిగితే పెట్టేది కాదు ఽఅతొమాతిక్ గా జరిగే వ్యవహారం కనుక ఇక నుంచి అలాంటివి మా తరఫున జరగవని హామీ ఇస్తూ మీరు కూడా ఉదారం గా ఉన్నతం గా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ విషయాన్ని ఇంతటి తో మర్చి పోదాం ”అన్నాను .ఒక కమ్యూనిస్ట్ నాయకుడి కి ఈ విషయం మేము చెప్పాల్సి రావటం మాకు ఇబ్బంది గానే ఉంది కాని తప్పలేదు ఽఅయన నిస్చేస్తులయ్యారు . ఏమీ అనలేక ”సరే మాస్టారూ ! ఇక నుండి మనం అందరం స్నేహితులం గా నే ఉందాం .ఇతు వంటి చిన్న విషయాల్ని నేనూ దృష్టిలో పెట్టుకోను ”అన్నారు అందరం ఊపిరి పీల్చుకొన్నాం .ఈ విషయం అందరికి చెప్పాం . తీచార్లందరూ సంతోషించారు ఊరట లభించింది . ఇలా ఆయన కు చెక్ పెట్టాల్సి వచ్చింది తప్పలేదు ఽప్పతి నుంచి మళ్ళీ స్టాఫ్ కు హెడ్ కు పోర పోచ్చాలు రాలేదు . ఆయనా సరదాగానే ఉన్నారు .
పెనమ కూరు రు స్పెషల్ .
పెనమ కోరు లో నే” భోజ రాజీయం ” రాసిన అనంత మాత్య్డు దు జన్మించాడు . ఆయనే ”అనంతుని ఛం ధం ”రాశాడని మనకు తెలుసు .అంతేకాదు ప్రఖ్యాత పౌరాణిక నాటక నటుడు అబ్బూరి వరప్రసాద రావు పుట్టిన గ్రామం పుట్ట్టిన ఊరు పెనమకూరు .. కృష్ణ రాయా బారం లో శ్రీ కృష్ణుని పాత్ర న భూతో గా నటించాడు అబ్బూరి ఆయన పద్యం ఎత్తుకొంటే ఒడో లోకం లో విహరిస్తాము . ఆలాపనా ,గాంభీర్యం ,స్పష్త త ,శ్రావ్యత కు మారు పేరు గా నిలిచాడు . నేను వల్లూరు లో నా చిన్నప్పుడు అబ్బూరి నాటకం చూసిన అదృష్ట వన్తుడిని . ఈ రెండు విషయాలు అంటే ఈ ఇద్దరు ప్రముఖులు పెనమకూరు లో పుట్టారన్న సంగతి ఆ నగరామ ప్రజలకు ఎవరికీ తెలియదు . ఆ విషయాలను నేను వీలైనప్పుడల్లా విద్యార్ధులకు ,ఊరి వారికి తెలియ జేసి సంతృప్తి పొందే వాడిని . ఇంకో విషయం నేను పని చేస్తున్నప్పుడే అక్కడ మా స్కూల్ లో ప్రసాద రావు అనే ఎనిమిదవ తరగతి విద్యార్ధి ఉండేవాడు .దళితుడు అయినా ,అద్భుత గాత్ర సౌలభ్యం ఉన్న వాడు వాడిని ప్రోత్సహించి నాటక పద్యాలను ప్రాక్టీసు చేయించి స్కూల్ ఫంక్షన్స్ లో పాడించే వాడిని అబ్బూరి ని మరిపించే వాడు అందుకని వాడిని ”అపర అబ్బూరి ”అని పిలిచే వాళ్ళం . స్కూలు వార్షి కొత్సవానికి అతని తో పాడి స్తే ఊరి వారందరూ మెచ్చి ఎంతో డబ్బు ,బహుమతులు అతనికి అందజేశారు .
అలా ఒక గాయకుడిని అందులోను అబ్బూరి ని తలపించే గాయకుడి ని కానీ పెట్టి ,ప్రోత్సహించి నందుకు నాకు మహా ఆనందం గా ఉంది గర్వం గానూ ఉంది . అతడు ఉయ్యూరు కాలేజి లో కూడా చేరి తన గాన ప్రతిభ తో అందర్నీ మెప్పించి ఆదరాభిమానాలు పొందిన అదృష్ట వంతుడు .
సశేషం
మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-13 -ఉయ్యూరు

