ఫిట్జెరాల్డ్ -2
రచనా విశేషాలు
1920నాటి అమెరికాను ”రోరింగ్ ట్వం టేస్ ” అంటారు అప్పుడు అమెరికా ”ఇకారస్ ”లా ఉందని చెబుతారు . అప్పుడు అమెరికా లో ”ప్రొహిబిషన్ ”అమలు లో ఉంది . అకాలాన్ని ”ది గ్రేట్ క్రాష్ ”అంటారు . రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలం అది . ఆ ఆర్ధిక వినాశనం కాలం లో జీవించిన వాడు ఫిట్జరాల్ద్ . ఆ పరిస్తితులను తన రచనల్లో చూపించాడు . అతని పరిశీలనం నిశితం గా ఉండి ,దాంతో చాలా సంక్షిప్తం గా ఆ నాడు అమెరికా ఎదుర్కొన్న పరిస్తితులను రచనల్లో వివరించాడు . తన దేశం లో మారుతున్న పరిస్తితులకు అద్దం పట్టే లా రోజు వారి వార్తా కధనాలు లాగా రాశాడు .
ఫిట్జెరాల్డ్ కు కధలు ,నవలలు అంటే మంచి వినోదం గ ఉండేవి . ఆ నాటి యువతలో దుర్భర పరిస్తితులను చూసి రక్తం ఉడికి పోయేది . ఇరవై నాటి పట్టించు కోని పరిస్తితుల గురించి చర్చించాడు . మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అనుభవించిన లోటు ఆర్ధిక పరిస్తితులను ,మద్య నిషేధం ఇంకా అమలు పరచటం పై రాశాడు . పద్దెనిమిదవ రాజ్యాంగ సవరణ విజయ వంతం గా అమలు కాక పోవటం కూడా ఒక విషమ పరిస్తితిని తెచ్చింది . ఈ నిషేధం 1919-1929వరకు కోన సాగించారు అమెరికా లో . 1929 october 23 న అమెరికా స్టాక్ మార్కెట్ కుదేలయింది . దీనినే ”గ్రేట్ డిప్రెషన్ ”అంటారు .దీనికె ఫిట్జెరాల్డ్ ”జాజ్ ఏజ్ ”అని పేరు పెట్టాడు .

స్కాట్ జీవితం ఒక గొప్ప కదాంశం అయింది ఆ కాలానికి అతని బతుకే ఆ నాటి పరిస్తితుల కద అందుకే అది ”లిజెండ్ ”అయింది . అందుకే అతని కద నేటివ్ కద ,అతను దానికి బాధితుడు అయాడు . అతని వృత్తులు కూడా దీనికి అద్దంపట్టాయి . అతని కధలకు ఇవే ముఖ్య కదా వస్తువయింది . ఆ నాటి అమెరికా యువకుడిని ” . a king of king of our American youth ”అన్నారు . అందువల్లనే ఆ నాటి యువత సాధికార నవలా రచయితా స్కాట్ ఫిట్జెరాల్డ్ అని అందరు అంటారు . ఆటను బాధా తప్త యువతకు ప్రతినిధి ,వారిమనో భావాలను వివరించే గొంతు కూడాఅతనే అయాడు . .
”the great gatsby ”నవలను ”a miniature of involvement and understanding reaches an extraordinary balance .”అని భావిస్తారు అది అది వాస్తవిక నవల అన్నారు . ”our finest most exemplary American parable of romantic trajic failure is Fitjarald ”అంటారు . ఆ నాటి కాలం ”పిచ్చ్చ పార్టీలతో తాగిన హాంగోవర్ ”ఉండటం ఒక లక్షణం . ఈ విధం గా 1920-30మధ్య కాలం లో ఉన్న అమెరికా ను తన కాళ్ళ తో ప్రత్యక్షం గా చూసి ,అందులో తానూ ఒకడిగా జీవించి ,ఆ జీవితాన్ని తన కలం తో ప్రత్యక్షం గా ప్రత్యక్షరం గా రాసిన వాడు ఫిత్జరల్ద్ . అంటే ఒక దశాబ్దపు అమెరికా జన జీవితాన్ని కళ్ళకు కట్టి నట్లు చూపాడు . అంధకారం నుండి ,కాంతి వైపు కు ప్రయాణం చేయాలనే తపనా బోదా ఆ రచనల్లో ఉన్నాయి .
11-9-2002 బుధవారం నాటినా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-7-13 –కాంప్–హైదరాబాద్
