గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -3
కోలీజియం అనేది ‘’పీటిష్ ‘’వాళ్ళ స్కూలు .ఆధ్యాత్మిక అవినీతిని అంతం చేయటం సరైన నీతి ధర్మాలతో కూడిన క్రైస్తవాన్ని ఆచరించటం దీని ప్రత్యేకత .ప్రపంచ పరి రక్షణ ,సుహ్రుద్భావాన్ని నెలకొల్పటమే వీరి లక్ష్యం .జీవితం లోను ,చర్చి లోను ఉన్నత శ్రేణి నాయకులను తయారు చేసే సంస్థ .చాలా మంది విద్యార్ధులు దీనిలోనే ఉండి చదువు కొనే వారు .కొద్ది మందికి బయట నుండి వచ్చి చదువుకొనే అనుమతినిచ్చే వారు .కాంట్ ఇంటి నుండే వచ్చి ఇక్కడ చదివాడు ఇక్కడ చదువు అంతా ఒక నిర్ణీత ఛట్రం లో బిగించి నట్లు నడిచేది .ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బడి వేళలు.. ఉదయం 11నుండి ఒంటి గంట వరకు మధ్యాహ్న భోజన విరామ సమయం .వారానికి ఆరు రోజులు స్కూల్ ఉండేది .సెలవులు చాలా తక్కువ .ఈస్తర్ పండుగకు కొద్ది రోజులు సెలవులున్దేవి .అలాగే పెంతే కోస్ట్ ,క్రిస్మస్ సెలవులు ఉండేవి .
గంటకు ఒక సబ్జెక్ట్ బోధించే వారు .ఉదయంఏడు నుంచి ఎనిమిది గంటల వరకు వేదాంతం లో అయిదు క్లాసులు .ఎనిమిది నుండి పది గంటల వరకు లాటిన్ క్లాసులు .పది గంటల నుండి పదకొండు వరకు గ్రీక్ భాష లో పెద్ద క్లాసులు జరిగేవి .ఎక్కువ మంది విద్యార్ధులు లాటిన్ చదివే వారు .పద కొండు నుండి పన్నెండు వరకు కేటా ఇంచిన గదిలో భోజనం చేసే వారు .ఆ సమయం లోనే ఉపాధ్యాయులు కొందరు విద్యార్ధులకు ఉప యోగ పడే వి ఏవైనా చదివి విని పించే వారు .మధ్యాహ్నం పన్నెండు నుండి రెండు వరకు లాజిక్ ,హిస్టరీ ,ఫిలాసఫీ జాగ్రఫీ ,చర్చి చరిత్ర ,దస్తూరి మొదలైన ఎవరికిష్టం అయిన ది వారు నేర్చుకొనే వారు .మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు వరకు హీబ్రూ భాష ,లెక్కల క్లాసులు ఉండేవి బుధ ,శని వారాలలో కావాలను కొనే వారు లెక్కలు నేర్చు కోవచ్చు .మధ్యాహ్నం రెండు గంటల కాలం లో ఎవరికైనా ఇష్టమైతే గాత్ర సంగీతం నేర్చు కోవచ్చు .ఇదీ బిజీ షెడ్యూల్ .నేటి మన కాన్వెంట్ చదువుల్లాగా .
మొదటి ఏడాది మత శిక్షణ లో ‘’లూధర్ గారి ప్రశ్నోత్తరాలు ‘’బట్టీ పట్టాలి .బైబిల్ కధలు చెబుతారు .రెండో ఏడు ప్రశ్నోత్తరాల తో బాటు ‘’సుదీర్ఘ సంభాషణలు ‘’నేర్వాలి .మరిన్ని బైబిల్ కధలు రావాలి .మూడవ ఏడాది కూడా ఇలానే కోన సాగుతుంది .నాల్గవ ఏడు ‘’cris toph starke –‘’order in tabular form ‘’ఉంటుంది .అయిదు ,ఆరు క్లాసులకు ‘’న్యు టెస్ట మెంట్ ‘’ను క్షుణ్ణం గా నేర్పిస్తారు . –
కాంట్ కు ‘’ధియాలజీ’’ బుర్రకు ఎక్కనే లేదు .మూడవ ఏడాది గ్రీక్ ,లాటిన్ లను బాగానే నేర్చాడు .ఆయనకు ఇష్టం ఉన్నా లేక పోయినా దియాలజి లో మంచి ఫౌండేషన్ ఏర్పడింది .అదే జీవితాంతం జ్ఞాపకం ఉండి పోయింది . కోలీజియం చదువులకు వెన్నెముక లాటిన్ భాష .కాంట్ కు లాటిన్ బాగా వచ్చేసేది .1739-40 లలో కాంట్ కు ఫిలాసఫీ మీద ఎక్కువ అభిమాన మేర్పడింది .క్లాసిక్స్ ఎందుకో రుచించ లేదు .ఆయనకు ఇష్టమైన టీచర్ లాటిన్ బాగా బోధించే ‘’Heyden reich ‘’ గారు .హిస్టరీ జాగ్రఫీ క్లాసులూ ఉండేవి అయితే అంత ప్రాధాన్య మైనవి కావు .ఫ్రెంచ్ భాష నేర్వాల్సిన అవసరం ఉండేది కాదు .అది కావాలను కొన్న వారు బుధ ,శని వారాల్లో నేర్చుకోవచ్చు
పీటిష్ విద్యా విధానం లో పిల్లల్ని కొట్టటం అనేది ఉండేది కాదు అదే క్రమ శిక్షణ కు మంచిది అని భావించే వారు .స్వయం క్రమ శిక్షనే ధ్యేయం అయినా అది పెద్ద గా ఫలితాన్నివ్వలేదు స్కూలు చదువు పూర్తీ అవటానికి మూడేళ్ళ ముందే కాంట్ తల్లి చని పోయిందని ముందే చెప్పుకొన్నాం .
కాంట్ పుట్టి పెరిగిన కొనిగ్స్ బర్గ్ చుట్టూ ప్రక్కల ఉన్న రాజకీయ పరిస్తితులు
ఆ నాటి ఫ్రెడరిక్ రాజు పాలన ను ‘’the age of enlightenment ‘’ అన్నాడు కాంట్ .కొనిగ్స్ బర్గ్ను ‘’ఏకాంత బాక్ వాటర్ టౌన్ ‘’అని 18 వ శతాబ్దం లో పిలిచే వారు .ప్రష్యాకు . ‘’సరి హద్దు నగరం ‘’అనే వారు .నిజం గా ఇది ప్రష్యా దేశానికి ఈశాన్యం గా ,రష్యా దేశానికి దగ్గరలో ఉంది .ప్రష్యా కంటే పోలాండ్ కు దగ్గర .గొప్ప ప్రాముఖ్యం ఉన్న నగరం కూడా .1706 లో కొనిగ్స్ బర్గ్ జనాభా 40 వేలు .1786 కు ఇది 56 వేలకు పెరిగింది .ప్రష్యా దేశం లోని ముఖ్య నగరాలలో కొనిగ్స్ బర్గ్ ఒకటి .ప్రష్యా రాజ్యం అప్పటికి బలహీనం గా నే ఉండేది .ప్రష్యా జనం తమను ప్రష్యన్లు అని అను కొనే వారు కాదు .పైగా జర్మన్లు గానే భావించు కొంటారు .ప్రష్యన్లు అని అని పించుకొనే అర్హత కొనిగ్స్ బర్గ్ ,ఆ పరిసర వాసులకే ఉంది .ప్రష్యా రాజు బెర్లిన్ లో ఉంటాడు కొనిగ్స్ బర్గ్ కు బెర్లిన్ నగరం తో సాన్నిహిత్య సంబంధం ఉంది
18 శతాబ్దం లో సైనికులు ప్రష్యా సైనిక స్తావరాలలో ఉండే వారు కాదు .సిటీ లోని పౌర స్తావరాలలోనే ఉండే వారు .దీని వల్ల ఘర్షణలు ఎక్కువ గా జరిగేవి .కొత్త వారిని సైనికులు గా తీసుకోవాల్సి వస్తే పౌరులను నిర్బంధం గా చేర్చుకొనే వారు .అందుకని కాంట్ కు సైనికులపై సదభిపాయం ఏర్పడలేదు .కాంట్ యువకుడు గా ఎదిగే వరకు అక్కడ స్వేచ్చ .పరిణతి ఉండేవి ప్రభుత్వం చాలా క్రూరంగా ఉండేది .ఫ్రెడరిక్ మొదటి విలియం రాజు కాలం లో కొనిగ్స్ బర్గ్ ‘’అంతర్జాతీయ నౌకాశ్రయం ‘’గా రూపు దిద్దు కొంది.వ్యాపార లావాదేవీలు ఎక్కువే .అధికారులతో వ్యాపారస్తులతో కొనిగ్స్ బర్గ్ కళ కళ లాడేది ..కనుక ‘’బాక్ వాటర్ సిటి ‘’అన్న మాట నిజం కాదు .
కాంట్ స్నేహితులు కూడా కొనిగ్స్ బర్గ్ చుట్టూ ప్రక్కల ప్రాంతాల వాళ్ళే .స్వేచ్చా వాణిజ్యం ,నైపుణ్యం ఉన్న కుటుంబాల పిల్లలే ఆయన స్నేహితులు .అయితే చిన్న నాటి స్నేహితు లేవర్నీ ఆయన వృద్ధాప్యం లో గుర్తు ఉంచుకోలేక పోయాడు పాపం .కాంట్ పెరిగిన వాతా వరం ఇలాంటిది అని చెప్పటానికే ఇదంతా ఆ వాతావరణం అత్యంత ప్రమాద కరమైంది అన్నాడు కాంట్ .ఎన్నో అగ్ని ప్రమాదాలు ,వరదలు తుఫాన్ల భీభాత్సాలతో జన జీవితం ఎప్పుడూ అల్లకల్లోలం గా ఉండేది .కాంట్ జీవితకాలం లోనే లెక్క లేనన్ని అగ్ని ప్రమాదాలు జరిగాయి ఆయన పుట్టిన స్వంత ఇల్లే 1769 .లో అగ్నికి ఆహుతైంది ఆయన నివశించిన ప్రాంత మైన ‘’vorder vorsadt ‘’లో 76 ఇళ్ళు పరశురామ ప్రీతి చెందాయి .ఇంత ప్రమాద కర మైన నగరమైనా కొనిగ్స్ బర్గ్’’ మధ్య యుగపు జర్మన్ నగరం ‘’లా అందం గా ఉంటుంది .నగరం లో ఎన్నో వంతెనలు ఉండటం వల్ల ‘’ఉత్తర వేనీస్ ‘’నగరం అనే వారు
18 వ శతాబ్దపు కొనిగ్స్ బర్గ్ అనేక సంస్కృతులకు నిలయం గా ఉండేది .లిదూనియన్లు ,మిన్న నైట్లు,హుజినాట్లు మొదలైన వారంతా ఇక్కడికి వచ్చి చేరారు .ఫ్రెంచ్ భాష మాట్లాడే వారూ ఉన్నారు .వీరందరూ వ్యాపారస్తులే .పోలాండ్ ,రష్యా దేశస్తులు, యూదులు డచ్ ,ఇంగ్లాండ్ వర్తకులకు కొనిగ్స్ బర్గ్ నిలయమై పోయింది .ఎవరి ఆచార వ్యవహారాలను వారు స్వేచ్చగా పాటించే వారు .పరస్పర సంబంధాలు తక్కువ గానే ఉండేవి ..అంటే విభిన్న సంస్కృతీ విలసిత నగరం గా కొనిగ్స్ బర్గ్ ఉండేది ఈ భిన్న సంస్కృతులను అధ్యయనం చేయటానికి కాంట్ కు ఇతర దేశాలు తిరగాల్సిన అవసరమేర్పడ లేదు .అన్నీ ఇక్కడే ఉండటం తో అధ్యాయం సులభ మైంది ఇన్ని ఉన్నా స్కూల్ వేళ అయి పోయిన తర్వాత పిల్లలు ఆడుకోవ టానికి ఆటస్తలం కాని పార్కులు కాని ఉన్న దాఖలాలు లేవు .మొదటి విలియం మరణించి రెండవ విలియం రాజైన సంవత్సరం లోనే కాంట్ గారి స్కూల్ జీవితం పూర్తీ అయి పోయింది .రెండవ విలియం తండ్రి కంటే ఉదార వాదిగా ప్రవర్తించాడు .ఆయనకు సాహిత్యం వేదాంతాలలో మంచి అభినివేశం ఉండేది .విలియం రాజు ‘’ Halle ‘’అనే ఆయన స్థానంన లో ‘’wolff ‘’అనే అతన్ని ‘’లా ప్రొఫెసర్ ‘గా ’,యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా చేశాడు .అందువల్ల ప్రష్యాకు గౌరవ స్స్థానం కల్పించి ప్రష్యా వెలుగులు యూరప్ వెలుగు కావాలని భావించాడు రాజు ‘ .
కాంట్ యువ జీవితాన్ని గురించి తర్వాత తెలుసు కొందాం
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-13- ఉయ్యూరు