గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -19

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -19

కాంట్ జ్ఞాన తత్వ మీమాంస

అనుభవానికి ముందు జ్ఞానం సాధ్యమా ?ఒక వేళ సాధ్యమైతే ఎలా సాధ్యం ?అనే రెండు ప్రశ్నలను వేసుకొని సమాధానం చెప్పాడు .ఆలోచించటం మనసు లక్షణం .ఆలోచించటం అంటే తాను కానిదాన్ని గురించి అంటే బయటి ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తోందని అర్ధం .మనసుకు బయట ఒక బాహ్య ప్రపంచం ఉంది అని తెలుసుకోవాలి ..బాహ్య ప్రపంచం రెండు రకాలుగా ఉంటుంది అన్నాడు కాంట్ .ఇక్కడ లాక్ తత్వ జ్ఞాని తో ఏకీభ వించాడు .ఒకటి విషయ జగత్తు (ఫినామినల్ వరల్డ్ )అంటే ఇంద్రియాల ద్వారా మనకు తెలిసే ప్రపంచం అంటే రంగు రుచి ,వాసన ,ధ్వని ,స్పర్శ ,బరువు ,ఆకారం మొదలైన గుణాలతో ఉన్న వస్తు ప్రపంచమన్నమాట .ఇవన్నీ ఇంద్రియాలకు తెలిసే గుణాలే తప్ప ,నిజం గా వస్తువు లో అవి లేవు .వీటినే ‘’ఆభాసిక గుణాలు ‘’అన్నాడు కాంట్ .ఈ విషయ జగత్తే కాక ,వాస్తవ జగత్తు ఒకటి ఉంది .రంగు రుచి మొదలైన గుణాలు మనకు తెలుస్తుంటే ,వాటికి ఆధారం గా ,వాటికి ప్రేరకం గా ఏదో వస్తువులు ఉండాలి .అలాంటి వస్తువులు లేకుండా ,ఆభాసిక గుణాలు వాటం తకి అవి  మన ఇంద్రియాలకు కనీ పించవు .అంటే గుణాలకు వెనుక ప్రేరకాలైన వస్తువులు తప్పక ఉండి  ఉండాలి అంటాడు కాంట్ .ఆ వస్తువులనే కాంట్ ‘’న్యుమినన్  ‘ ‘’అనే కొత్త పేరు పెట్టాడు .ఇది బహువచన పదం .దీనికి సరైన ఇంగ్లీష్ పదం లేదు .సుమారుగా ‘’thing in itself ‘అని అర్ధం చెప్పాడు కాంట్ .తెలుగులోనూ స్పష్టమైన పదం లేదన్నారు విశ్వ దర్శన కారులు నండూరి .’’,తనలో తానూ ఉండే వస్తువు ‘’అని సరి పెట్టుకోవచ్చు అన్నారు నండూరి .ఇది అతీత వస్తువు .ఇంద్రియానుభవానికి అందని వస్తువు .యదార్ద వస్తువు ..అంటే గుణాలకు కారణ మైన నిజమైన అసలు వస్తువు అన్న మాట .

ఈ యదార్ధ వస్తువు (న్యూమినన్ )ఇంద్రియాలకు ,మనసుకు ,అవగాహనకు అందడు .ఇది విషయ జగత్తుకు వెనక ఉండే ‘’అవాజ్మానస గోచర వస్తువు‘’.భారతీయ వేదాంతులు చెప్పే ‘’బ్రహ్మ పదార్ధం ‘’లాంటిది .’’దేనిని వాక్కూ ,మనసు పొంద లేక వెనక్కి తిరిగి వస్తాయో అది ‘’.ఇది కాంట్ గారి న్యూమినన్ నిర్వచనానికి సరి పోతుంది .’’నేతి –నేతి ‘’అంటూ ఆలోచించు కొంటూ పోతే ,మిగిలే చివరిది అని అర్ధం .అది మనకు అజ్ఞాతం అజ్నేయం కూడా అంటే కనీ పించాడు తెలుసుకో నూ లేము .అందుకే కాంట్ ను ‘’ఆజ్ఞేయ వాది’’(ఆగ్నోస్టిక్ )అన్నారు .

కనీ పించే జగత్తు గురించిన జ్ఞానం ఇంద్రియానుభవం వలనా ,బుద్ధి లేదా అవగాహన వలన లభిస్తుంది .ఈ రకమైన జ్ఞానం కూడా రెండు రకాలు .ఇంద్రియానుభవం వల్ల  లభించే జ్ఞానం ,(ఏమ్పెరికల్ నాలెడ్జి )రెండోది అనుభవానికి ముందు లభించే జ్ఞానం (ఏ ప్రయరినాలెడ్జ్ ).ఇంద్రియానుభవం తో  వచ్చే జ్ఞానం కు నిస్చితత్వం (సర్టెన్ టి ) ఉండదు .ఆవశ్యకతా ఉండదు .అనుభవానికి ముందే లభించే జ్ఞానం లో నిస్చితత్వం ఆవశ్యకతా ఉంటాయి .అనుభావాత్పూర్వ జ్ఞానమే నిజమైన జ్ఞానం అంటే ‘’ఎరుక ‘’.అయితే ఇది ఎలా లభిస్తుంది ?

జ్ఞానం అంతా వాక్యాలుగా ,ప్రతి పాదనలు (ప్రపోజిష న్స్ )రూపం లో లభిస్తుంది .మన ఆలోచనా విధానమూ అదే పద్ధతిలో ఉంటుంది .మనం అలానే తెలుసు కొంటాం కూడా .కేవలం ఒక ప్రత్యెక భావ శకలం (ఐడియా )పూర్తీ జ్ఞానం కాదు .భావ శకలాలను జోడించి ,సమన్వ యిస్తే జ్ఞానం లభిస్తుంది అంటాడు కాంట్ .జ్ఞానం అంతా  ప్రతి పాదనలరూపం లో ఉన్నా ,ప్రతి పాదన జ్ఞానానికి దారి చూపించదు .కారణం –ప్రతి పాదనలు రెండు రకాలుగా ఉండటమే .విశ్లేషనాత్మక ప్ర తిపాదన (ఎనలిటికల్ జడ్జ్ మెంట్ ),సంశ్లేశానత్మక ప్రతిపాదనా (సిన్తేటి క్ జడ్జ్ మెంట్ )

విశ్లేషనాత్మక ప్రతిపాదన అంటే –విడదీసి చూసే విధానం .సంశ్లేశానత్మక ప్రతిపాదన అంటే కలపటం అనే ప్రక్రియ .రెండు ఐడియాలను కలిపితే ,అంతకు ముందు తెలియని కొత్త విషయం తెలుస్తుంది .విశ్లేశానాత్మకం లో కొత్త విషయం ఏదీ తెలియదు .సంశ్లేషణలో కొత్త విషయం తెలుస్తుంది అంతే  కాక సార్వత్రిక ,నిశ్చిత ,ఆవశ్యక జ్ఞానం రాదు .కారణం ఇవన్నీ అనుభవం తర్వాతే లభించే జ్ఞానం కనుక .సార్వత్రికత ,నిస్చితత్వం మొదలైన గుణాలే లేని జ్ఞానం యదార్ధ జ్ఞానం కాదు .కాబోదు .కనుక ఇలాంటి సంశ్లేశానాత్మక జ్ఞానం శాస్త్రీయ జ్ఞానానికి దారి చూపించదు .కనుక సార్వత్రిక నిశ్చిత జ్ఞానం కావాలంటే సంశ్లేశానాత్మక అనుభవానికి ముందు ప్రతిపాదనలు (సిన్తేతిక్ ఏ ప్రయరి జడ్జ్ మెంట్స్ ) .ను మనం సాధించుకోవాలి .ఇదే శాస్త్రీయ జ్ఞానానికి పునాది అన్నాడు కాంట్ మహాశయుడు .ఇక్కడ సంశయానికి తావు ఉండదు .అనుభవం ద్వారా కాకుండా ,అనుభవానికి ముందే లభిస్తుంది కనుక అనుభవానికి తప్పని సరిగా వర్తిస్తుంది .మరి ఇలాంటి జడ్జ్ మెంట్లు ఉన్నా యా ? అని ప్రశ్నించుకొని ఉన్నాయి అనే కాంట్ ద్రుఢంగా ,స్పష్టం గా చెప్పాడు . .

ఇంద్రియాను భూతి రెండు అంచెలలో సిద్ధిస్తుంది .మొదటి దశలో ఇంద్రియ సంవేదన (సెన్సేషన్ )మాత్రమె కలుగు తుంది .రెండో దశ లోఅది  ఇంద్రియాను భూతి (పెర్సేప్షన్) గా మారుతుంది .సంవేదన అంటే –ఇంద్రియాలకు కలిగే మొదటి ప్రేరణ (స్ష్టిమ్యు లేషన్ ).మాత్రమె .ఇది అనుభూతికి ముడి పదార్దాన్ని మాత్రమె అందిస్తుంది .అంటే రంగు ,రుచి ,వాసన ,స్పర్శ మొదలైన ప్రేరణలను మాత్రమె ఇంద్రియాలకు అందుతాయి .వాటిని ఏక సూత్రం తో బంధించి ఏకత్వాన్ని (యూనిటి ఆఫ్ కాన్ షస్ నెస్)ఆపాదించి ,వస్తువు యొక్క అనుభవం గా మార్చగల శక్తి ఒక్క మనసుకు మాత్రమె ఉంది మనసు అనేదే లేక పొతే సంవేదనలు అనుభవం గా మారవు అని స్పస్టపరచాడు కాంట్ .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –25-8-13- ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.