నష్టం వచ్చినా, కష్టం వచ్చినా తాను అనుకున్నది తెరకెక్కించాలనే తాపత్రయం ఉన్న నటుడు కమల్‌హాసన్. ‘విశ్వరూపం‘ నుంచి ‘ఉత్తమ విలన్‘ వరకు సినిమాల విడుదలలో ఎన్నో అవరోధాలు. ఆర్థికంగా మరెన్నో అడ్డంకులు. అయినా నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటాను అంటారాయన. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ చేసిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో తన కెరీర్, ఫ్యామిలీ గురించి మరెన్నో వివరాలు పంచుకున్నారు.
ఆర్కే: వెల్‌కం టు ఓపెన్ హార్ట్
నమస్కారం కమల్‌హాసన్ గారు
ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దట్ ఐయామ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యు.
కమల్‌హాసన్: నేను కూడా అడ్మైరర్‌నే తర్వాత చెప్తాను.
ఆర్కే: జాతీయస్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ నటుడిగా అవార్డులు తీసుకున్నారు, ఇప్పుడు ‘ఉత్తమ విలన్’గా జనం ముందుకు వస్తున్నారు. ఎందుకనిపించింది అలా ‘ఉత్తమ విలన్’గా రావాలని?
కమల్: అందరిలో ఒక విలన్, ఒక నాయకుడు ఇద్దరూ ఉంటారు. అప్పుడప్పుడు విలన్‌ని తొక్కిపెట్టడమే జీవితం. అందరి జీవితాల్లో ఇది ఉంటుంది. మైథాలజీనే తీసుకుంటే ఒక్కొక్కప్పుడు కృష్ణుడు విలన్‌గా కనిపిస్తాడు. కౌరవులు, పాండవులకే కాకుండా వారి కథ చదివేవాళ్లకి కూడా విలన్‌లాగానే కనిపిస్తాడు. అదే మనుషుల ప్రత్యేకత.
ఆర్కే: అయితే విలన్ ముందు ఉత్తమ ఎందుకు?
కమల్: ఉత్తముడవడం వల్ల. ప్రతి విలన్‌కి ఉత్తముడిగా మారిపోవడం అనే దశ ఉంటుంది.
ఆర్కే: అయితే మీరు బాగా స్టడీ చేస్తారా పర్సనాలిటీస్‌ని?
కమల్: అవునండీ పనేమీ లేదు కదా. ఎలాగూ స్కూల్‌కి వెళ్లలేదు ఏమైనా స్టడీ చేయాలి కదా.
ఆర్కే: చాలామంది ఒప్పుకోరు. ప్రతి మనిషిలో ఒక నెగెటివ్ షేడ్ ఉంటుందని.
కమల్: వైట్ కాన్వా్‌సలో వేరే రంగు వేస్తేనే కనిపిస్తుంది. అంతేకాని అన్నీ వైట్ అయితే ఖాళీ కాన్వాసే.
ఆర్కే: ఇందాక చదువు లేదు అన్నారు? ఎంతవరకు చదువుకున్నారు?
కమల్: ఎయిత్ స్టాండర్డ్ డ్రాపవుట్.
ఆర్కే: ఇక అప్పటి నుంచి సినిమాల్లోనే…
కమల్: దానికి ముందే.. థర్డ్‌ఇయర్‌లోనే వచ్చాను. అంటే 1959లో వచ్చాను. ఆ తరువాత కళ్లు తెరిచి చూసింది సినిమాలోనే..
ఆర్కే: 55 ఏళ్ల నుంచి సినిమాల్లో చేస్తున్నారు కదా! బోర్ కొట్టడం కాని ఇక చాల్లే అని కాని అనిపించడం లేదా?
కమల్: దానికి మంచి కారణాలున్నాయి. ఇది నా ప్రొఫెషన్ అయితే కనుక… ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేవాడ్ని. కాని ఇది నా ప్రొఫెషన్ కాదు పాషన్. నన్ను చాలామంది ఎప్పుడు హాలిడే తీసుకుంటారు అని అడుగుతుంటారు. అసలు నేను పనిచేస్తే కదా హాలిడే తీసుకునేది. నాకు ప్రతిరోజూ హాలిడేనే.
ఆర్కే: యు ఎంజాయ్ ఇట్. అందుకే హాలిడే అయిపోతుంది అది.
కమల్: అందులో ఏమీ కష్టంలేదు. హాలిడేకి వెళ్లేవాళ్లు స్కైడైవింగ్ చేస్తారు, రాక్ క్లయింబింగ్ చేస్తారు. ఆఫీసులో మాత్రం ఒకచోట కూర్చున్నా అలసి పోతారు. హాలిడేకి ఎంత ఎనర్జీ అయిపోయినా ఫీలవ్వం. అందులోనూ నాకు డబ్బు కూడా ఇస్తున్నారు. ఇటీజ్ డబుల్ బోనస్ ఫర్ మి.
ఆర్కే: మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత?
కమల్: టూ థౌజెండ్ రుపీస్. చాలా పెద్ద రెమ్యునరేషన్. అందులో మెయిన్ క్యారెక్టర్. హీరోలకు ఫిఫ్టీథౌజెండ్ వచ్చేవి. కొత్తగా వచ్చిన ఐదేళ్ల అబ్బాయికి టు థౌజెండ్ అంటే బిగ్ ఎమౌంట్.
ఆర్కే: ఆ డబ్బులు ఏం చేశారు?
కమల్: ఐడోన్డ్ రిమెంబర్. స్టూడియోకి వెళ్లడం. ఆడుకోవడం. ఉడెన్ స్వోర్డ్స్ చేసిస్తారు కార్పెంటరీకి వెళ్తే. లాబొరేటరీరికి వెళ్తే అక్కడ బాపిన్స్ ఉంటాయి. రోలర్ స్కేట్ చేసుకుని, మరో దగ్గరికి వెళ్తే తెలుగు, హిందీ సినిమాలు చూపిస్తారు. మరో చోట రికార్డింగ్ జరుగుతుంటుంది. పేరు తెలియని హిందీ సింగర్ పాట పాడుతుంటారు. ఆయనెవరు అని అడిగితే మహమ్మద్ రఫీ అని చెప్తే ఓహో మహమ్మద్ రఫీయా అని అనుకుంటూ చిన్న చిన్న పిల్లలందరం పెద్ద మనుషుల్లా తిరిగేవాళ్లం.
ఆర్కే: ఈ రంగంలోకి ఎలా వచ్చారు?
కమల్: మా ఫ్యామిలీ అంతా లాయర్స్. ఫాదర్, గ్రాండ్‌ఫాదర్, సన్ ఇన్‌లాస్.. ఇలా ఒన్ డజన్ లాయర్స్ ఉన్నారు. పాత అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా పరాశరన్ మై బ్రదరిల్లా. అలా ఫ్యామిలీలో చదువుకున్న వాళ్లు ఎక్కువ. కాని నేను మాత్రం డ్రాపవుట్. మా ఫ్యామిలీ మొత్తం మీద నేనొక్కడినే ఇలాగున్నాను. ఈవెన్ విమెన్ ఇన్ మై ఫ్యామిలీ మోర్ ఎడ్యుకేటెడ్. ఇక్కడ కరణాలంటారే అలాంటి కుటుంబం మాది. ఆ రోజుల్లో గాంధీజీ చెప్పగానే ఆస్తులు ఇచ్చేశారు. మా ఫాదర్ సాలిడ్ కాంగ్రెస్ మ్యాన్. నా ఎల్డెస్ట్ బ్రదర్ డిఎంకెలో చేరాడు. పార్టీ డిఫరెన్స్ కూడా ఉంది. మై ఫాదర్ ఈజ్ నోమోర్. కాని ఫ్యామిలీలో రకరకాల ఐడియాలజీలు ఉన్నవాళ్లు ఉన్నారు. స్ర్టాంగ్ శ్రీవైష్ణవేట్స్, స్ర్టాంగ్ రేషనలిస్ట్స్, కమ్యూనిస్ట్స్ ఇలా..
ఆర్కే: అయితే మీరు దేంట్లోకి వస్తారు?
కమల్: ఐ వుడ్ కం అండర్ రేషనలిస్ట్. నా చుట్టూ ఉన్న వాతావరణం ఇందుకు కారణం. నాకు అన్యాయం అనిపించిన దానికి ఎదురుగా నిలబడాలనిపిస్తుంది. కొన్నిసార్లు చిన్న వయసులో అలా తెలియక చేశాం అనిపిస్తుంది. మరొకొన్నిసార్లు అంత చిన్న వయసులోనే మాకు మంచి బుద్ధి వచ్చిందే అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అలానే రేషనలి్‌స్టగా ఉండిపోతున్నాను. అంటే మీకు దైవం మీద విశ్వాసం లేదా అని అడగొచ్చు. నాకు మనుషుల మీద విశ్వాసం ఉంది.
ఆర్కే: ఆదిశంకరాచార్యుడు చెప్పింది కూడా మనుషులే దైవమని. మమ అని…
కమల్: మమ… గురు రుద్రేష, మనీష, మమ. ఐ ట్రస్ట్ విత్ ఆల్ దెయిర్ బ్యాడ్‌నెస్. హిట్లర్ అయినా, గాంధీ గారయినా ఎవరైనా సరే వాళ్లలో ఐ థింక్ దేర్ ఈజ్ ఎ స్పార్క్ దట్ కెన్ బి యూజ్‌ఫుల్ టు సొసైటీ. ‘ఉత్తమ విలన్’ కూడా అలానే చెబుతుంది.
ఆర్కే: ఎవరు పిక్ చేశారు మిమ్మల్ని?
కమల్: ఎ వి యం చెట్టియార్ గారు. దానికి ముందు డేసి రాణీ గారు. అప్పట్లో ఆమె టాప్ స్టార్. అప్పుడు టెన్ థౌజెండ్ రూపీస్ బుక్ చేసి ఫ్లయిట్ టికెట్ కూడా కొన్నారు. అప్పుడు నన్ను చూసి బాగున్నాడే అన్నారు. ఫస్ట్ లైట్ వేసింది మా నాన్న గారే. బెడ్రూమ్ లైట్ అలా తిప్పి చూశారు మమ్మల్ని. ఆ తరువాత ‘సినిమాలో నటిస్తావా’ అని అడిగితే.. ‘ఎంతిస్తారు?’ అన్నాను. ఆయనకి నచ్చిపోయింది. దెన్ హి సెడ్ క్యాన్సిల్ చేయండి.. డేసిరాణి గారు వద్దు అన్నారు. అయ్యో అడ్వాన్స్ ఇచ్చేశాం అన్నారు. ఆ తరువాత ఇంకో పిక్చర్ చూసుకుందాం. నాకు ఈ అబ్బాయి చాలా నచ్చాడు. వీడ్ని పెట్టి తీయండి అన్నారు. ఫస్ట్‌టైం ఎందుకు తీసుకెళ్తున్నారు ఏమిటి ఏమీ అర్థం కాలేదు. ఎవిఎం స్టూడియోకి వెళ్లాను. అక్కడ సావిత్రి గారు, జెమిని మామ ఉన్నారు. అప్పుడు చేతులతో ఎత్తుకుని చివరి వరకు వదలలేదు.
ఆర్కే: చైల్డ్‌హుడ్‌లో కొన్ని సిల్లీ థింగ్స్ చేస్తుంటాం. అలాంటివి మీకేమైనా ఉన్నాయా?
కమల్: సిల్లీ కాదు సిల్లీ కన్నా డేంజరస్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ నన్ను హోలీఏంజిల్స్ అనే అమ్మాయిల స్కూల్లో వేశారు. అక్కడ కిండర్ గార్డెన్ వరకు బోత్ జెండర్స్‌ను అలౌ చేస్తారన్నమాట. ఆ స్కూల్ బోర్ కొట్టింది. యుకెజిలో ఉండగా స్కూల్ బయటకు వచ్చి ట్యాక్సీ పట్టుకుని ఇంటికి వెళ్లాను. అప్పుడు మొదలైంది డ్రాపవుట్ అవ్వడం. ఆ తరువాత మూడు స్కూల్స్ మారాను. ఇండు హైస్కూల్స్ నుంచి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తరువాత ఒకసారి థర్డ్ స్టోర్ నుంచి పడ్డాను. బెట్ కోసం దూకాను. ఇవన్నీ చూసి ఈ అబ్బాయి వద్దు ఎప్పుడైనా చచ్చిపోతాడు. మా మీద కేస్ పెట్టడం ఖాయం అని పంపించేశారు. బట్ ఈవెన్ దట్ థింగ్ హెల్ప్‌మి. నేనెవరు అనేది తెలిసింది. ఎవడు వీడు నటుడట… సినిమాల్లో చేస్తాడట పిలవండి అంటే.. వెళ్లాను. అక్కడ చిల్డ్రన్స్ ప్లే చేస్తున్నారు. అందులో మంచి పాత్ర వేశాను. అలా మై డ్రామా లైఫ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఏడెమినిదేళ్ల వయసు నాకు.
ఆర్కే: ఇప్పుడు మీకేమనిపిస్తుంది. ఈ విషయాలన్నీ మీ పిల్లలకు చెబుతుంటారా?
కమల్: ఐ ఫెల్ట్ మై ఫాదర్ వజ్ వెరీ కైండ్. రేషనలిజం విషయంలో తన్ని అలా మాట్లాడకూడదు అని చెప్తే విని ఉండేవాడ్నేమో… కాని లెట్ హిమ్ థింక్ అని వదిలేశారు. నటిస్తానంటున్నాడు, భరతనాట్యం నేర్చుకోవాలట. కాని అదెవరూ మగవాళ్లు నేర్చుకోలేదు. చూసేవాళ్లకు బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. అదికాదు వాడికి ఏది ఇష్టమో అది చేయనీయమని ఎంకరేజ్ చేశారు. ఆ తరువాత కథక్ నేర్చుకోవాలనుంది అంటే దానికి కూడా ఏర్పాట్లు చేసి, సంగీతం నేర్పించి గో హెడ్ అన్నారు. భరతనాట్యం నేర్చుకున్నప్పుడు ఉదయ్‌శంకర్‌గారిలా అవ్వాలని చెప్పేవాళ్లు. సినిమాకి వెళ్తాననే ఆలోచన కాని నమ్మకం కాని నాకు లేవు అప్పుడు. ఆ తరువాత డ్యాన్స్ అసిస్టెంట్‌గా వచ్చాను. ఇంత చిన్న వయసులో డ్యాన్స్ నేర్చుకున్న వాళ్లు లేరని తంగప్ప మాస్టారు గారు నన్ను తీసుకున్నారు. అప్పట్లో తంగప్ప గారు ఎక్కువగా తెలుగు సినిమాలే చేసేవారు. మై ఫస్ట్ ట్రిప్ టు హైదరాబాద్ వజ్ ఎ టెక్నీషియన్. ఏఎన్నార్ గారి ‘శ్రీమంతుడు’ సినిమా కోసం వచ్చాను. ఫర్‌మి ఇట్స్‌ఎ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఏఎన్నార్ గారు వజ్ వెరీ కైండ్. ఎందుకంటే ఐ వజ్ 16, 17 ఇయర్స్. ఆయన నన్ను పిలిచి ‘వాటీజ్ యువర్ ఫీలింగ్’ అని అడిగారు. ‘ఐ యామ్ రేషనలిస్’అన్నాను. ‘ఎందుకలా అనుకున్నావు’ అన్నారు. ‘ముహూర్తం షాట్‌కి కొబ్బరికాయ కొడతారు కదా. దాన్నసలు ముట్టుకోలేదు నేను’ అన్నాను. ‘ఎందుకు ముట్టుకోలేదు. నువ్వు ముస్లిం కదా దానివల్లనా’ అన్నారాయన. ‘కాదండీ నేను రేషనలిస్ట్ అన్నాను మళ్లీ’. ‘ఆహా.. నాలుగేళ్ల తరువాత కూడా నువ్వు ఇదే చెబుతావా చూద్దాం’ అన్నారాయన. ‘మీరు చూడండి ఇలాగే ఉంటాను’ అన్నాను. ఆ తరువాత నేను యాక్టర్ అయిపోయాను.
ఆర్కే: ఎవరు సజెస్ట్ చేశారు మిమ్మల్ని యాక్టర్‌కమ్మని?
కమల్: నాకు ఇంట్రెస్ట్ లేదు. బాలచందర్ గారే. ఆర్‌సి శక్తి అని నా ఫ్రెండ్ ఉన్నాడు. హీ ఈజ్ నో మోర్ నౌ. యు మస్ట్ రైట్ అని చెప్పాడు. హైస్కూల్ డ్రాపవుట్‌ని నాలో రైటర్ ఎలా ఉంటాడని నేనంటే ‘ఉన్నాడు. నాకు తెలిసింది’ అన్నాడు. నన్ను స్ర్కీన్‌ప్లే రాయమని ఎంకరేజ్ చేసింది ఆయనే. అప్పటికే నేను టెక్నీషియన్ అయిపోయాను కాబట్టి టెక్నీషియనే సూపర్ అనే ఫీలింగ్‌లో ఉండేవాడ్ని. ఆ తరువాత బాలచందర్ గారు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. అసిస్టెంట్ డైరెక్టర్ సెలక్షన్ అని అమ్మకి చెప్పి బయల్దేరితే ‘నీ ఫోటో తీసుకెళ్లురా’ అంది. అసిస్టెంట్ డైరెక్టర్‌కి ఫోటో అక్కర్లేదు టాలెంట్ చాలన్నాను. వెళ్లగానే ఫోటో ఉందా అని అడిగారు. అరే అమ్మకి ఎలా తెలిసింది అని మనసులో అనుకున్నాను. ఫోటో చూపించాను. ఆయన ‘ఓకే మంచి క్యారెక్టర్ ఉంది. చేయాలి’ అన్నారు. సార్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిలేదా అంటే ‘నో నో యుకమ్’ అన్నారు. ఆ పిక్చర్ అయిన తరువాత ‘పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. నీలో ఉన్న యాక్టర్ ఎంత పెద్ద యాక్టర్ అవుతాడో నాకు తెలుసు. ఎప్పుడైనా డైరెక్టర్ కావొచ్చు. ఇది మాత్రం మళ్లీ మళ్లీ రాదు’ అని చెప్పారు. ‘ఆటోలో వస్తావా, కార్లో వస్తావా స్టూడియోకి’ అని అడిగారు. కార్లో అన్నాను. ‘అయితే యాక్టర్ అవ్వు. తరువాత చేసుకుందాం డైరెక్షన్’ అని నన్ను దార్లో పెట్టింది బాలచందర్ గారే. మై లైఫ్ వజ్ డైరెక్టెడ్ బై హిమ్.
ఆర్కే: మీరు ఆయనతో కలిసి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు?
కమల్: నా పదహారేళ్ల వయసు నుంచి ఇప్పుడు ఉత్తమ విలన్ వరకు. గురువుగారు అని మొదలైన రిలేషన్ షిప్ ఆ తరువాత ఎన్ని డిఫరెంట్ ఒపినియన్స్ వచ్చినా విడిపోకుండా వాళ్ల కుటుంబంలో ఒక మెంబర్‌లా ఉన్నాను. ఆయన నాకు ఫాదర్.
ఆర్కే: ఇందులో రెండున్నాయి. ఒకటి మనీ రిస్క్ చేస్తారు. యాక్షన్ కోసం శరీరాన్ని కూడా హింసించుకుంటారు. ఈ కాంబినేషన్ రేర్ కదా…
కమల్: అది గురుదత్ గారి వల్ల వచ్చింది. రాజ్‌కపూర్, శాంతారామ్ గారు అందరూ పాషన్ కోసం చేసిన వాళ్లే. సత్యజిత్‌రేగారి పేరు ఎందుకు చెప్పలేదంటే. అందులో ఒక రుషిత్వం ఉంది. అలా కాకుండా సంసారిగా ఉండి ఇలా చేయడం అనేది చాలా కష్టం.
ఆర్కే: వాళ్లు చేశారు. కొన్నిసార్లు దెబ్బతిన్నారు. మీరు కూడా లాంగ్ కెరీర్ కదా. యు మస్ట్ బి వర్త్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. కాని పరిస్థితి అలా లేదు కదా.
కమల్: అది డబ్బుగా లేదు. ఐ యామ్ వర్త్ మిలియన్స్ ఆఫ్ క్రోర్స్. ప్రేక్షకుల లెక్కలో నేను చూసుకుంటాను. పొగరుతో కాదు సవినయంగా చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ నాకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. మనీలెండర్ నా ప్రాపర్టీ తీసేసుకోవాలనుకున్నాడు. అప్పుడు టీవీలో నా బాధని, కోపాన్ని వ్యక్తం చేశాను. అది చూసి తమిళనాడుకు చెందిన వ్యవసాయ కుటుంబం నాకు వాళ్ల ఇంటి డాక్యుమెంట్స్ పంపించారు. ప్రతి వాళ్లు తమ చేతిలో ఉన్న డబ్బు మనీ ఆర్డర్ చేశారు. నాకు ఇల్లు ఇచ్చిన వాళ్లకు ఒకే ఇల్లు ఉంది. వాళ్లని వెళ్లి కలిసి నమస్కరించి నాకో కొత్త బంధువు దొరికాడని చెప్పాను. నాకప్పుడు 20 డాక్యుమెంట్ల వరకు వచ్చాయి. కాని వాళ్లందరికీ వేరే ఇళ్లు ఉన్నాయి. వీళ్లకి ఉన్నది ఒకటే ఇల్లు అదీ నాకు పంపించారు.
ఆర్కే: ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. ఎందుకొచ్చింది ఆపేద్దాం అని అనిపించడంలేదా మీకు?
కమల్: ఇప్పుడు కిసాన్‌ని తీసుకుంటే అతను తన పెట్టుబడిని భూమిమీదే పెడతాడు. అలానే నేను కూడా ఇందులోనే పెడతాను. నేను కూడా కిసాన్ లాగానే. శ్రీమంతుడు సినిమాకోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నాలుగురోజుల పనికి 250 రూపాయల జీతం వచ్చింది. దటీజ్ మై వాల్యూ. అది హండ్రెడ్ టైమ్స్ అయినా చాలు అనుకున్న రోజులున్నాయి. ఇప్పుడది కోట్లకి వెళ్లిపోయింది.నేను మా నాన్న ప్రాపర్టీ కోసం చూడలేదు ఉపయోగించలేదు. అలాగే మా అమ్మాయి శ్రుతిని కూడా సొంతంగా సంపాదించుకునేలా ట్రైన్ చేశాను. చిన్న హట్ అయినా సొంతంగా సంపాదించుకుంటే చాలు. ఐ యామ్ నాట్ మేకింగ్ మనీ ఫర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. ఇట్స్ ఫర్ మి. నా తరువాత నా ఆస్తుల్ని ప్రజలకి అందివ్వమని నా కూతురికి చెప్తాను. బికాజ్ దే గేవ్ అజ్ మనీ. ఊరికే చెప్పడంలేదు. ఐ బిలీవ్ ఇట్. డబ్బు అనేది టూల్ మాత్రమే. నేనదే నమ్ముతాను. గురువుగారు కూడా అదే నేర్పారు. గ్యారెంటీలు అడుగుతూ ప్రతి అడుగు వేస్తే ముందుకు వెళ్లలేం.
ఆర్కే: పిల్లలకు స్వేచ్ఛ ఇస్తారా?
కమల్: తప్పకుండా. నాకు నటనలో 50 యేళ్ల ఎక్స్‌పిరియెన్స్ ఉందని వాళ్లకి ఆ విషయంలో సలహాలివ్వను. వాళ్లడిగితే సలహా ఇస్తాను. వాళ్ల టాలెంట్ పెరుగుదలకు నేను గైడ్‌లా ఉంటానంతే. నాకు వాళ్లను సైంటిస్టులు చేయాలని ఏవేవో ఆశలున్నాయి. కాని వాళ్లకి ఏమి నచ్చిందో అదే చేస్తున్నారు. స్పెషల్లీ శృతి పేరు వల్లనో ఏమో కాని తన ఏడో ఏట నుంచి మ్యూజిక్ నేర్చుకుంది. యుఎస్ వెళ్లి మ్యూజిక్‌లో డిగ్రీ చేసింది.
ఆర్కే: మీ గురించి మీరు డిఫైన్ చేసి చెప్పాలంటే ఎలా చెప్తారు?
కమల్: నేను పేరులేని, ముఖంలేని మనిషిని. నా గురించి ఆలోచించుకుంటే అదే గుర్తొస్తుంది, అంతేకాని పేరు, ముఖం గుర్తుకురావు. దటీజ్ మై ఫస్ట్ స్ర్టెంత్. ఆ మనిషిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను.
ఆర్కే: మీలో మీకు నచ్చని షేడ్ ఏమిటి?
కమల్: కోపం. ఒక్కొక్కప్పుడు నాకన్నా ఎవడున్నాడు అనే గర్వం అనేది వస్తుంది, అది నాసియా. అందరూ నా గురించి గొప్పగా అనుకోవాలని అనిపిస్తుంది. అదే మళ్లీ నాకు నచ్చదు. నన్ను పొగుడుకోవడం నచ్చదు.
ఆర్కే: మీ పిల్లలు వచ్చి ఎవరినైనా ప్రేమించాం అంటే యాక్సెప్ట్ చేస్తారా?
కమల్: అఫ్‌కోర్స్. ఇట్స్ హర్ లవ్. నాకు కాస్త చోటు ఉంది కదా అని అడుగుతాను. మా కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీ వాళ్లను ఎంపిక చేసుకుంటే మరింత సంతోషిస్తాను.
ఆర్కే: జనరల్‌గా పిల్లలు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు అనే భయం ఉంటుంది కదా?
కమల్: ఫాదర్స్ మాత్రం రైట్ డెసిషన్స్ తీసుకుంటారా. తండ్రి సరైన నిర్ణయం తీసుకుని పెళ్లి చేస్తే అమ్మాయిలు కాల్చుకుని ఎందుకు చనిపోతున్నారు. ప్రతి మనిషికి ఒకలానే జరగాలనేం లేదు. పిల్లల్ని మొక్కల్లా పెంచాలి.
ఆర్కే: భార్యాభర్తలు విడిపోయినప్పుడు పిల్లలు తల్లితో ఉండాలనుకుంటారు కదా. కాని మీ విషయంలో మీతో ఉండాలని అనుకోవడం కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది….
కమల్: వాళ్ల చాయిస్ అది. ఆ చాయిస్ అందరికీ ఉంది. నా ఎక్స్ వైఫ్స్‌తో కలిపి అందరికీ…
ఆర్కే: ఎక్స్ వైఫ్స్ అన్నారు. ఏమన్నా పించ్ అనిపిస్తుంటుందా ఎందుకు ఫెయిలైంది మ్యారేజి అని…
కమల్: నేను చూసిన దైవాలందరికీ ఇద్దరు భార్యలు ఉన్నారు. అది నాకు తప్పుగా అనిపించలేదు. కాకపోతే ఒకేసారి నాకు ఇద్దరు భార్యలు లేరంతే.
ఆర్కే: అది కాదండీ… డిఫరెన్సెస్ గురించి…
కమల్: ఆడవాళ్లకి కూడా ఈక్వల్ స్టేటస్ ఇస్తాను. వాళ్ల డెసిషన్స్ వాళ్లు తీసుకుంటారు.
ఆర్కే: ప్రతి సినిమాలో లిప్ కిస్ ఎందుకు పెడతారు?
కమల్: ప్రతి సినిమాలో కాదు. ఇటీజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ప్రతి సినిమాలో మర్డర్ ఉందని ఎవరూ అడగలేదు. మరి కిస్‌ని ఎందుకు అడుగుతారు. కిస్ అనేది చాలా బ్యూటీఫుల్ థింగ్. కిస్ అనేది ఇటీజ్ దేర్ ఇన్ ఖజరహో.
ఆర్కే: మిగిలిన కోరికలు ఏమి ఉన్నాయి?
కమల్: ప్రేక్షకుల మనసులో చిన్న చోటు కావాలి. అదికూడా శాశ్వతంగా ఉండాలనేదే ఆశ. దాని గురించి నేను పనిచేస్తున్నాను. వచ్చే తరానికి కూడా నేను గుర్తుండాలి.
ఆర్కే: పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదంటున్నారు ఎందుకు?
కమల్: ఐ ఫీల్ దట్ సోషల్ సర్వీస్ నీడ్ నాట్ బి డన్ ఓన్లీ బై పాలిటిక్స్. డాక్టర్‌గా, లాయర్‌గా ఉండి చేయొచ్చు. ఐ కెన్ డు ఇట్ యాజ్ ఎ యాక్టర్. నాకో ఐడియాలజీ ఉంది. దాని ప్రకారం బతుకుతున్నాను.
ఆర్కే: సినిమాల్లో నటించడం ఒక ఎత్తయితే… ఎక్స్‌పరిమెంట్స్ చేయాలనే ఆలోచన ఏంటి?
కమల్: అది ఇంటలెక్చువల్ డిఎన్‌ఎ. బాలచందర్ గారి దగ్గర్నించి వచ్చింది. నాన్నగారు కూడా అలాగే… ఆయన లాయర్ అయినప్పటికీ హిజ్ థాట్స్ వర్ వెరీ ఇంటర్నేషనల్.
ఆర్కే: కుటుంబమంతా ఎడ్యుకేటెడ్, డిసిప్లిన్ కదా. ఇంత అల్లరి పనులు ఎలా వచ్చాయి మీకు?
కమల్: నేను పుట్టినప్పుడు ఫాదర్‌కి 50 యేళ్లు. ఆల్‌మోస్ట్ ఒక గ్రాండ్‌సన్‌లాగా. అందర్నీ చదివించేశాం, ఇది ఒక ఎక్స్‌పరిమెంట్ చేసి చూద్దామని….
ఆర్కే: తెలుగు వాళ్లు కూడా మిమ్మల్ని బాగా ఓన్ చేసుకుంటారు ఎందుకని?
కమల్: యాక్చువల్లీ తెలుగులో స్ర్టెయిట్ ఫిల్మ్స్ తక్కువ. కానీ చేసిన అన్ని సినిమాల్లో మ్యాక్జిమమ్ హిట్స్ అయ్యాయి. ఆ రికార్డు తమిళంలో కూడా లేదు నాకు. నెక్ట్స్ పిక్చర్ తెలుగులో స్ర్టెయిట్ పిక్చర్ చేస్తున్నాను.