‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-19
రామయ్యాగారి దృష్టిలో ‘’అలెక్సీ మిఖైలోవిచ్ ‘’
తాను చాలా లావుగా ఉంటె అలెక్సీ భారీ మనిషి అన్నారు రామయ్య .ఒక రకంగా పెద్ద రాక్షసావతారం .కళ్ళు నీలిరంగుతో మిరుమిట్లు గొలుపుతాయి .పెద్ద నవ్వు ఆయన ఆభరణం .ఎందుకోకాని ఆయన మంచు లోంచి వచ్చినట్లు అనిపించేవాడు .చలికి ఎర్రబడ్డట్టు ఉండేవాడు .నెత్తిమీద ,ఒళ్ళంతా పడిన స్నో ను దులుపుకొంటూ రావటం అయన ప్రత్యేకత .సరాసరి హాల్ లోకొచ్చి కూర్చునేవాడు .ఆయన కూర్చోటానికి చాలా స్థలమే పట్టేది.అయితే ఆయన వస్తే ఎవరికీ చికాకు అనిపించేదేకాడు .క్రిస్మస్ నాడు శాంతాక్రజ్ వచ్చిసంచీలోంచి బహుమతులు తీసి పంచి పెడుతున్నంత ఆనందంగా ఉండేది .రామయ్యగారమ్మాయిలు స్వీట్ల కోసం ఎదురు చూసేవారు .గడ్డం అదీ ఉండేదికాదు కాని అదే అనుభూతిని పంచేవాడు .ఆతని ఆకృతి మనసుపొరల్లో ముద్ర పడి స్థిరంగా ఉండిపోయింది .
అలెక్సీ ది గ్రేట్
అలెక్సీ తో ఎన్నో విషయాలు చర్చించేవారు .ఆయనకు తెలియని విషయం లేదంటే ఆశ్చర్యం లేదు .అన్ని విషయాలు తెలుసు అన్నీ ఆయనకు కావాల్సినవే .ఒక రకం గా ‘’సమాచార సేకరణ సాధనం ‘’అలెక్సీ .అయన బయో డేటా కూడా ఈ విషయాలనే రుజువు చేస్తాయి .ఆయన ఒక డాక్టర్ కాని ప్రాక్టీస్ వదిలేశాడు .చరిత్ర అధ్యయనం చేశాడు .దాని తర్వాత మానవ వంశ శాస్త్రం (ఎత్నోగ్రఫీ ) ని భాషా శాస్త్రం (లింగ్విస్టిక్స్ )చదివాడు . అందరూ ప్రయాణించే మార్గం లోకాక వేరే మార్గాలను ఎన్నుకొని ఏంతో దూరం వెళ్ళాడు. కజాన్ మెడికల్ కాలేజి నుండి గ్రాడ్యుయేట్ అయి పామీర్ పీఠభూమికి వెళ్లి జబ్బు పడ్డ వాళ్లకు చికిత్స చేశాడు .ఆ దేశం ఆయన్ను అత్మీయునిగా చూసింది ఎత్తైన పర్వత శిఖరాలమీద ,పీఠ భూముల మీద పాద చారియై సంచరించాడు .కనిపించిన ఆసియా ,యూరోపియన్ ల నందరితో మిత్రత్వం పెంచుకొన్నాడు .అందులో మాసిడోనియాకు లో అలేక్సాండర్ వంశానికి చెందిన బాక్త్రియన్లున్నారు .ఈ కలయికలో ఆయనకు ఎన్నోశతాబ్దాల జాతుల వలస వాసుల లక్షణాలు గమనించాడు .పామీర్ ఖాళీ అయి చాలా మోసపుచ్చింది అనిపించింది .అందుకని మానవ వంశ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు ఆయన ఊహించకుండానే అనేక విషయాలు కనిపెట్టాడు .సుదూరంగా ఉన్న ఇండియా చాలా దగ్గరగా ఉండేదని పించింది .ఎత్తైన పర్వతాలు అడ్డంగా ఉన్నప్పటికీ పురాతన బంధాలు ఉండేవని అవి చాలా దృఢంగా ఉండేవని కనుగొన్నాడు .మధ్య ఆసియా తో మరీ దగ్గర సంబంధం ఇండియాకు ఉండేది .
‘’ అఫనాసి నికిటిన్ ‘’ అనే యాత్రికుడు సముద్ర మార్గం ద్వారా ఇండియా సందర్శించాడు .అలాగే ఇండియన్లు సుదూర ఉత్తర ప్రాంతాలకు చేరుకొన్నారు అని అభిప్రాయ పడ్డాడు .అంతే కాదు ఇండియన్స్ ఇక్కడికి వచ్చి ఉజ్బెకిస్తాన్ లో ‘’ఉలుబెక్’’ వేధ శాల ‘’(అబ్సర్వేటరి .)నిర్మించారని తెలియజేశాడు .పామీర్ల కళ్ళు ఇతర దేశీయుల కళ్ళ కంటే తేడాగా ఉండటం గమనించాడు .అక్కడ మానవులు జీవించారు అని కూడా అలెక్సీ కనుగొని లోకానికి చాటి చెప్పాడు .ఉన్నత పర్వతాగ్రాలు ,పీఠ భూములు గత చరిత్రను నినదిస్తూనే ఉంటుంది అన్నాడు .దక్షిణాన ఉన్న దూర పర్వత శ్రేణి గొప్ప వింతైన ,ప్రేరణ కలిగించే భావోద్రేకాలను కలిగిస్తుంది అన్నాడు .ఇది చూస్తే ఇండియా తన అనంత బాహువులను తన వైపు సాచి ఆహ్వానిస్తున్నట్లుగా ఉందని పించింది అలెక్సీ మికిలోవిచ్ కి .
బహుభాషా వేత్త –రష్యాలో తెలుగు నేర్చిన మొట్ట మొదటి వ్యక్తీ
అతి స్వల్ప కాలం లో డయకోవ్ అలెక్సీ ఉర్దూ భాష నేర్చుకొన్నాడు .ఆ తర్వాత హిందీ మొదలైన భారతీయ భాషలను అధ్యయనం చేశాడు .అయన ఒక బహుభాషా వేత్త (పోలీగ్లాట్ )అయ్యాడు .ఇండాలజిస్ట్ గా(చరిత్ర సంస్కృతీ భాషల అధ్యయనం ) ,ఇండియాకు సంబంధించిన సర్వ విషయాలపై స్పెషలిస్ట్ గా పేరు పొందాడు .అంతేకాదు ఆంద్ర రాష్ట్రాన్ని కనుగొన్నాడు .సోవియట్ యూనియన్ లో ఉన్న వారిలో ‘’తన భాష తెలుగు’’ నేర్చుకున్న మొట్ట మొదటి వాడు ‘’అలెక్సీ మిఖైలోవిచ్ డయకోవ్ అని రామయ్య గారు గర్వ ఒపడ్డారు ‘’ అందుకే రామయ్యగారికి ఆతను అంటే మహాభిమానం .అలెక్సీ ‘’Nationalities question in India ‘’అనే గ్రంధం రాసి ప్రచురించాడు .దీనితో సోవియెట్ యూనియన్ లో ఉన్న చదువరులకు భారత దేశం ,అందులో హిందీ తో బాటు ఉన్న పన్నెండు ప్రధాన భాషల గురించి తెలిసింది .ఇందులో ప్రతి భాషనూ కనీసం పది మిలియన్ల మంది మాట్లాడుతున్నారని తెలుసుకోగలిగారు .
అలేక్సీకు రామయ్యగారిని పరిచయం చేసిన రాదా కృష్ణన్
రష్యా రాయబారి సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు రామయ్య గారిని అలెక్సీ కి పరిచయం చేశారు .ఆయన రామయ్య తో ‘’మీ దేశం లో ఇండియా పై ఒక గొప్ప ‘’ఎక్స్ పర్ట్ ‘’డయకోవ్అనే ఆయన ఉన్నారు తెలుసా?ఇప్పటిదాకా అలాంటి గొప్ప వ్యక్తిని మీరు కలుసుకోక పోవటం ఆశ్చర్యం గా ఉందే?’’అన్నారు రాదా కృష్ణ .ఆయన ‘’మీ దేశం లో ‘’అని అన్నమాట ‘’రష్యా దేశం ‘’ అని అర్ధమయింది రామయ్యగారికి .సర్వేపల్లి తనను రష్యావాడినని పోరబడ్డారని అనుకొన్నారు .అప్పుడు డయకోవ్ కు రామయ్యను పరిచయం చేశారు .మన రాయ బారి మహా ఘటికుడు .అనిపించింది .ఇంతకాలం అలేక్సీని కలుసుకోక పోవటం చిన్నతనం అనిపించింది .
మోటార్ ఆయిల్ పై ప్రయోగాలు ,విఫల పరీక్షలు ,జరుగుతున్న సమయం లో ఒక రోజు అలెక్సీ ఎన్నో కొత్త వార్తలు మోసుకొచ్చాడు .హిట్టిటైట్ రాష్ట్రం చరిత్ర ఇండియా తో సంబంధం కలిగి ఉండనే వార్త చెప్పి అప్పుడు రామయ్య గారు పడుతున్న టెన్షన్ ను తగ్గించి వాతావరణాన్ని తేలిక చేశాడు .ఆ తర్వాత ఒక యువ సోవియట్ రిసేర్చర్ ‘’మాయాస్’’ వారి స్క్రిప్ట్ ను డీకోడ్ చేసి అందులోని విషయాలను తెలియజేశాడు . ‘’పక్షి ప్రేమికుడు’’ అయిన అలెక్సీ చివరికి తనకు అభిమానమైన పక్షుల గురించి ఎన్నో విషయాలు చెప్పి అందరి మనసులను ఉల్లాస భరితం చేశాడు ..చాలా విషాద సమయాలు గడుపుతున్నప్పుడు రామయ్య గారి దగ్గరకొచ్చి బాధకు మంచిమాటలతో ఉపశమనం చేకూర్చేవాడు .విజయమూ సాధించేవాడు .ఈ విషయం లో .పని అయిన తర్వాత ఎక్కడికేక్కడికో తితిరిగే అలవాటు మార్చుకొని అలెక్సీ తో కలిసి వెళ్ళటానికి ఇష్టపడేవారు రామయ్య .
రష్యాలో నైటింగేల్ ,టాం-టిట్,పిచ్చుక ,సాధారణంగా కనిపించే పక్షులు .ఈ పక్షులంటే అలేక్సీకి ప్రాణం .అవి ఆయనకోసం పాటలు పాడేవి .రామయ్య గారు అలెక్సీ ఫ్లాట్ కు వెళ్ళినప్పుడు స్వంత ఇంట్లో ఉన్న ఆనందం పొందేవారు . ఆయన ఎదుట అతి భారీ మనిషి , తన చుట్టూ చిన్ని చిన్ని పక్షులు .ఇది చూడటానికి వింతగానే ఉండేది .అలెక్సీ ‘’ప్రతిదీ ఎలా జరగాలని ఉంటె అలాగే జరుగుతుంది .ఈ పక్షులు ఇక్కడ .ఇదిగో ‘’మాయా రాత ప్రతి’’.ఇక్కడే మీరు నేను .మనం సంస్కృతం లో మాట్లాడుకోగలం రష్యన్ ,తెలుగు లలో కూడా సంభాషించు కోగల౦ మనమ్. మనం ఎన్నో విషయాలపై పోట్లాడుకొనే వాళ్ళం కాని మనం ఎన్నో విషయాలపై బతకాలి .అంతమాత్రాన నిరాశ వద్దు .జరగాల్సింది జరుగుతుంది ‘’అనేవాడు .అతను చెప్పింది నిజమే .ప్రతిదీ జరగాల్సిన విధం గా జరగాల్సిన సమయం లో జరుగుతుంది.వారి నిత్య జీవిత విధానం అదే అయిపొయింది .
రామయ్య గారికి తాను చాలా అదృష్ట వంతుడిని అనుకొన్నారు .తాను అనుకొన్నది ప్రతిదీ చేయ లేకపోతున్నారనుకొన్నారు . .కొందరి దృష్టిలో రామయ్య వింతమనిషి ,అపజయాల వ్యక్తీ .దీనికి కారణం ఇంత గొప్ప పరిశోధన చేసినా ఆయన ఉద్యోగ స్థాయి పెరగలేదు .అయినా అదృష్ట వంతుడినే అనుకొనేవారు .ఎందరో మహాను భావులను చూశానని ,మరెందరో గొప్ప మిత్రులను పొందానని పొంగిపోయే వారు …
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-15 –ఉయ్యూరు
–
