రెండుముక్కలాట – తెలుగు రాష్ట్రం

రెండుముక్కలాట

తెలుగు రాష్ట్రం అడ్డంగా నిలువుగా రెండుముక్కలైంది వద్దన్నా కావాలన్నా జరిగిపోయింది .ఇప్పుడు మనుషుల మనోభావాలు ఎలా ఉంటాయో సరదాకి రాసిన దే ‘’రెండుముక్కలాట ‘’

సీన్ 1-‘’ఒరే అన్నయ్యా ! అమ్మ తెలంగాణా ఆడపడుచు .నాన్న సీమాంధ్రుడు ఇప్పటిదాకా ఎలాగో కలిసి బతికి చచ్చాం .ఇక నావల్లకాదు.నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అయ్యావు  నేను బెజవాడలో మండిపోతున్నాను .నీది బలిసిన రాష్ట్రం నాది బక్క రాష్ట్రం .అందరూ తలాచేయి విదిలిస్తే బతికి బట్టకడతాం .ఏడాది అయిందికాని హామీలేతప్ప ఆచరణే లేదు .నెలకి మూడు సార్లు బాబు మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ‘’చేపిందేమీ’’ లేదు బాబు ఉట్టికెగరలేకపోయినా స్వర్గానికి నిచ్చెనలు వేస్తున్నాడు .ఇదీ మా పరిస్తితి .అందుకని’’ తెలంగాణా అమ్మను’’ నువ్వు తీసుకొని హైదరాబాద్ లో జాగ్రత్తగా చూసుకో .అమ్మకి అన్నీ కావాలి .అన్నిటిమీదా కోరికలున్నాయి .మీరు బలిసిఉన్నారు . మా సొమ్మంతా నొక్కేసి కుక్కేసుకొన్నారు .కనుక అమ్మ నీది .నాన్న నోట్లో నాలుక లేనివాడు .ఉన్నా లేకున్నా సర్దుకు పోతాడు .నాన్న బరువు నాకేమీ కష్టం కాదు .ఎలాగోఅలా బాబు లాగా బండీ ఈడుస్తాను . మనుషులం వేరైపోతున్నా మనస్సులో ఒకటిగా బతుకుదామని ముక్కలయ్యేటప్పుడు  ముక్కలు చేసేటప్పుడు పెద్దలు చెప్పిన మాటల్ని పాటిద్దాం .బై అమ్మా –వెళ్లి హాయిగా అన్నయ్య దగ్గర బతుకు .ఇక్కడేముంది శివాలయం ?ఫోన్లూ గట్రా చేసుకొంటూ ఉందాం లే ‘’అన్నాడు తమ్ముడు .సరేనని అన్న అమ్మను తమ్ముడు నాన్నను పంచుకొని భరిస్తున్నారు .

సీన్ 2- ‘’ఒరే ! ఒద్దంటే ఆ తెలంగాణా పోరి వెంటబడి ప్రేమించి మా కొ౦పలమీదికి తెచ్చావ్ .ఎగేస్తే  బ్రహ్మ హత్యా దిగేస్తే గోహత్యా లాగా ఉంది మా పని ‘’ అన్నాడొక ఆంధ్రా పుత్ర రత్నం తండ్రి .’’నాన్నా !మనసులు కలవటానికి ఆంధ్రా తెలంగాణా ఏమిటి ?ఇద్దరం ప్రేమించుకోన్నాం .పెళ్లి చేసుకోవాలనుకోన్నాం వాళ్ళ నాన్నకు అమ్మకూ ఇష్టమే మీ అభిప్రాయం కోసమే ఆగాం .లేకపోతె ఏ కోటప్పకొండమీదో లోనో పెళ్లి చేసేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం .మీ మీద గౌరవం తో ఆ పని చేయలేదు .రేపు ఆ ఆమ్మాయి అమ్మానాన్నా వస్తారు. ఇద్దరూ కూర్చుని ఎలా చేయాలో ఆలోచించి మా పెళ్లి చేయండి ‘’అన్నాడు పుత్ర రత్నం .

మర్నాడు ఇరువైపులా వియ్యాలవారూ కూర్చుని మాట్లాడుకొంటున్నారు ఆ వివారాలు –

పెళ్లి కూతురు తండ్రి –బావ గారు ! పెళ్లి ఎక్కడ ఎలా చేయమంటారు ?

పెళ్ళికొడుకు తండ్రి –మీ ఇష్టం బావాజీ ! ఏ సంప్రదాయం లో చేద్దాం ?

పెళ్లి కూతురి తల్లి –ఎలాగో రెండుముక్కలయ్యాం కదా అటూ ఇటూ రెండుద్ధతులూ పాటిద్దాం

పెళ్ళికొడుకు తల్లి –వొదిన గారు మా భేషుగ్గా చెప్పారు .తాంబూలాలు తెలంగాణలో పద్ధతిలో తీసుకొందాం

పె కూ త –అయిడియా బాగుంది వొదినా ! పెళ్లి ఆంధ్రా పద్ధతిలో లాగిద్దాం

పె కొ త –ఒకే వొదినా

పపె కూ త-అయితే కార్యం మాత్రం మా తెలంగాణా విధానం లో ధూమ్ ధాం గా జరగాలి వొదినా

పె కొ త –వెరీ గుడ్ –ఇక హనీమూన్ సంగతి ?

పె కొ తండ్రి –మీది బలిసిన రాష్ట్రం .మావన్నీ లాక్కుని మరీ బలిసిపోయారు .కనుక ఖర్చు అంతా మీరే పెట్టుకొని ఏ సింగపూర్ కో పంపండి .

పె కూ తండ్రి –దాందేముంది బావాజీ ! మొన్నటిదాకా మీరు మేశారు ఇప్పుడు మేము మేస్తున్నాం .తినేవాళ్ళం మారారుకాని  తినటం మారలేదు .అయినా పెళ్లి విషయాలలో ఈ దెప్పుల్లెందుకు లెండి .

పె కొ తం –బాగా చెప్పారు బావగారు .మా రాయల సీమ సరుకు దిమ్పుతాం పెళ్లి రోజున .కంగారు పడకండి .హాయి గా జాయ్ అండ్ ఎంజాయ్ .ఇదే సమన్యాయం అంటే .

సీన్ 3- కుర్రది -ఏరా! ఆన్ద్రోన్నని గీర్వనం సేయమాకు .పాపం ఎంటబడ్డావని ఒకే అనేస్తి .జర- జాగర్త  మీ అమ్మఆంధ్రోల్లంట నా మీదికి వస్తే తెలంగాణా శకుంతల మాదిరి లొల్లి సేస్తా .

కుర్రాడు  -ఎందే నీ మిడిసిపాటు .మా నాన్న తెలంగాణా బిడ్డ తోలు వోలుస్తాడు బిడ్డా ఒళ్ళు జాగ్రత్త .

కుర్రది –అరె అసలు మనకింకా పెళ్ళే కాలేదు అప్పుడే ఈ సోది ఏందిబే

కుర్రాడు –అందుకే నిదానించు .పెద్దోళ్ళు ఏం నిర్వాకం చేశారో మనకొద్దు .మనం మనసులు ఇచ్చిపుచ్చుకున్నాం .మనకు భేదాలు ఒద్దు .నువ్వూ నేనూ మనం .అంతే .వాళ్లకు మన నడకతో బుద్ధి సెప్పాల .ఆల్లు తప్పు సేశామని సెంపలేసుకోవాల .అదీ మనిద్దరి పధ్ధతి

కుర్రది –ఒకే రా .అంతే మనం ఒక్కటే .ఒక్కటిగా మనం .మనం మనకోసమేకాడు అందరికోసం

కు ,కుర్రాడు –ఒకే బాబా ఒకే .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-15- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.