ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -44

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -44

18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -3

ప్రేమ వ్యామోహం

దీనికి రెండేళ్ళ ముందే జోలా గాఢం గా ప్రేమలో పడ్డాడు 1864లో ఎడమ గట్టు మీద కొత్త లాడ్జింగ్ వెతుక్కొని వెళ్ళిపోయాడు . అప్పటి నుంచి అలేక్సాండ్రిన్ మేస్లీ తో పిచ్చి మొహం లో పడ్డాడు .ఆమె తలిదంద్రులు అద్దెకిచ్చిన గదిలోనే ఉన్నాడు .ఆమె ఒక మెడికల్ స్టూడెంట్ కు కొత్తభార్య ఆమెను వేసవికి ఇంటిదగ్గర వదిలి భర్త వెళ్లి పోయి మళ్ళీ తిరిగి రాలేదు .ఆమె జోలాను ముగ్గులో దించినా ఓపిక పట్టి ఆమె భర్త తిరిగి వస్తే జరిగే  పరిణామాలను గురించి ఆలోచించాడు .ఒక వేళ ఆమె ప్రియుడు తిరిగి వస్తే అలేక్సాండ్రిన్ పై అతనికే మొదటి హక్కు ఉంటుంది కదా అనుకొన్నాడు .ఈ స్థితిలో సుఖం గా గడపాల్సిన రాత్రులన్నీ ఈ సంక్షోభం తో కరిగిపోయాయి జోలాకు  అతనే తిరిగి వస్తే తనకు ఆమె మొదటి ప్రేమికుడికి మధ్య ద్వంద్వయుద్ధం  జరుగుతుందేమో ననుకొన్నాడు .అనుకోన్నట్లే కొన్ని నెలల తర్వాతా ఆ మెడికల్ స్టూడెంట్ తిరిగి రానే వచ్చాడు . వీరిద్దరి ప్రేమ గ్రహించిన ఆ మెడికో జోలాకు అలేక్సాండ్రిన్ ను స్వయం గా అప్పగించేశాడు .కొత్త దంపతులు విశాలమైన ఇంటికి కాపురం మార్చారు .అప్పుడు జోలా తల్లి వచ్చి కొడుకు కోడలుతో ఉంది. హాయిగా ఆనందంగా జీవితం గడిపారు ముగ్గురూ ..ఆరేళ్ళ తర్వాత ఆమెను చట్ట బద్ధం గా జోలా పెళ్లి చేసుకొన్నాడు .

ఇంప్రెష నిస్ట్

రెండేళ్ళ తర్వాతా తన సాహిత్య క్షేత్రాన్ని జోలా విస్తరించాడు .సెన్సేషనల్ గా వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక గొప్ప నవల రాయటానికి తీవ్రం గా ప్లాన్ తయారు చేసుకొన్నాడు .అప్పటికే ‘’మై హేట్స్’’(-my hates ) అనే వ్యాస సంపుటిని ప్రచురించాడు చివరి సారిగా తాను రోమా౦టి జం ను త్యజిస్తున్నానని ప్రకటించాడు .యువ చిత్రకారుల భుజం తట్టి వారి  ఇంప్రెష నిజానికి  మద్దతు పలికాడు సిజానే తో కలిసి .సెలూన్ జూరీ దీనికి అనుమతించలేదు .’’పిక్నిక్ ఆన్ ది గ్రాస్ ‘’అనే చిత్రాన్ని గీసిన మానేట్ ను అభినందించాడు . దాన్ని ‘’పోకిరి ‘’చిత్రం అని విమర్శకులు దాడి చేస్తే జోలా ‘’A work of art is a corner of creation ,seen through a temperament ‘’అని జవాబు చెప్పాడు. ‘’తెరేసి రాక్విన్ ‘’ప్రచురించేటప్పటికి జోలా వయసు 27.ఈ నవలలో తాను సెక్స్  ,హత్య , పశ్చాత్తాపం మొదలైన వాటిని చర్చించానని జోలా చెప్పాడు. అశ్లీలం గా జంతు ప్రేమకు పరాకాష్టగా  ఉందని విమర్శకులు అన్నా, రెండవ ముద్రణ పొందింది .

25 ఏళ్ళ పరిశోధనా కృషి ఫలితమే రోగాన్ –మాక్వార్ట్

నిశ్చయత్వం లో పూర్తిగా మునిగి  పరిసరాలు ,హీరేడిటిల ప్రభావాలను చర్చించాడు . వాటి ప్రభావాన్ని గణితం  చెప్పినంత కరెక్ట్ గా చెప్పగలిగాడు .ఫిక్షన్ రచనలలోని వ్యక్తుల ప్రవర్తనను వారి జీవిత నేపధ్యం దృష్టిలో రాశాడు .ఇందులో పెంపకం, రక్తం ,ఏయే  ప్రభావాలు కలగ జేస్తాయో క్లినికల్ లేబరేటరీ లో పరీక్ష చస్తే వచ్చే ఫలితాలు ఎంత స్పష్టంగా ఉంటాయో అంత స్పష్టంగా చెప్పగలిగాడు బాల్జాక్ రాసిన ‘’కామెడీ హ్యూమనే ‘’ఆధారం గా మరో గొప్ప నవల కు ప్లాన్ తయారు చేసుకొన్నాడు .లైబ్రరీలలో కూర్చుని మోనోగ్రాఫులు ,కేస్ హిస్టరీలు ,మానసిక అధ్యయనం ,వ్యవహార పత్రాల పరిశీలన ను అతి జాగ్రత్తగా అధ్యయనం చేసి వాటిని తనకున్న మనోభావాలతో  విశ్లేషించి వివరించాడు .సమాజం పై తనకున్న భావాలు వ్యక్తుల ప్రవర్తన ,వారి మానసిక శారీరక స్తితి లపై చేసిన ఈ పరిశోధన 25  భాగాల ‘’రోగాన్ –మాక్వార్ట్ ‘’నవలలకు  సరిపడ సామగ్రి గా లభించింది . ఈ బృహత్తర గ్రంధ రచనకు 25 ఏళ్ళు పట్టింది ఇవన్నీ 90 రాత ప్రతులలో భద్రం చేశాడు .రోగాన్ –మక్వార్ట్ కుటుంబాలకు చెందిన 32 మంది  వ్యక్తుల  సమగ్ర రిపోర్ట్ ఇది దీనికోసం ఎందరో వ్యక్తుల మహళ్లకు ,మురికి కూపాలకు అడ్డాలకు అనేక సార్లు వెళ్లి వచ్చేవాడు .పోలీసు రికార్డ్ లు పరిశీలించాడు   తన రచన చాలా నిర్దుష్టంగా సంపూర్ణం గా దోష రహితంగా ఉండాలన్న తపనే ఇదంతా .

ప్రతి పుస్తకాన్ని వేరుగా ఒక యూనిట్ గా ఉంచాడు .ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణానికి రాళ్ళు ఎలా అవసరమో ఇవి ఆయన బృహత్తర నవలకు మూలాదారాలయ్యాయి .దీనిపై హెన్రి బార్బాస్ స్పందిస్తూ ‘’  in the entire history of intellectual creation there is scarcely another example of a man seeing so far in advance with such precision the concrete contours of a multi form work ‘’అని గొప్పగా విశ్లేషించి చెప్పాడు ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-15-ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.