ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -45

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -45

18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -4

నిరుపేద సంపన్నుడయ్యాడు  –

ఈ సిరీస్ లో వచ్చిన నవలలు జోలాకు గౌరవాన్నికాని ఆర్ధిక లాభాలను   కాని తెచ్చి పెట్టలేదు .కాని ఏడవ భాగమైన ‘’ది ద్రాం షాప్ అండ్ ది బరూం ‘’చాలా సంచలం తెచ్చి అభియోగం మోపెంత దాకా తెచ్చింది . విమర్శల జడివనే కురిసింది .’’literary street cleaner ‘’,poet of the disgusting ‘’,purveyor of muck ‘’అంటూ విశేషణాలు తగిలించారు .కాని పుస్తకం రికార్డ్ స్థాయిలో అమ్మకం కొనసాగించి జోలా ఫ్రాన్స్ దేశం లో అందరి కి సుపరిచతమైన రచయిత అయి పోయాడు .పిచ్చికల్ని కాల్చుకు తిన్న దరిద్రం పోయి అధిక సంపన్నుడయ్యాడు .విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నాడు .అతని ఆకలిమాత్రం అదే స్థాయిలో పెరిగిపోయి౦ది .చాలాఖరీడైన ఆహారం తింటున్నాడు అరుదుగా లభించే వైన్ సంపాదించి తాగుతున్నాడు .పిట్టాలా ఉండే వాడి  పొట్టపెరిగి బలిసి చాలాలవుగా ,వైభవోపేతంగా దర్జాగా కనిపిస్తున్నాడు .డబ్బు తెచ్చిన మార్పులివి .సంభాషణలు  దైవ వాక్యాలుగా ,ప్రామాణికాలుగా  భారీగా ఉంటున్నాయి .రచన జిలేబీ చుట్టల్లా ఉండి,ముతక గా మారింది .

సాంఘిక సంస్కర్త జోలా

అయితేనేం విజయ పరంపరసిరీస్ లో  13వ డైన ‘’జేర్మినల్ ‘’వరకు  కోన సాగి జోలా సాంఘిక సంస్కర్త అవతారం ఎత్తాడు .బొగ్గు గని కార్మికుల జీవన స్థితి వారి సమ్మెలు హక్కుల పోరాటాలు ప్రోలిటరేనియన్  సంస్కృతీ అన్నీ అందులో ప్రతిఫలింప జేశాడు దీనితో రచయితల దృక్పధమే మారిపోయింది .ఇదే తర్వాతా ప్రోలిట రేనియన్ నవలకు నాంది పలికింది .రావి శాస్త్రి గారి నవలలకూ విషయమైంది .జేర్మినల్ నవల లో మార్క్స్ సిద్ధాంతాన్నీ జోడించాడు . దీన్ని గూర్చి సోషల్ సైన్సెస్ కు చెందిన విజ్ఞాన సర్వస్వం ‘’zola  implanted in its readers a faith in the revolution as an investable catastrophe which must precede the happier era when rival classes will be supplanted by a society of free individuals bound only by ties of cooperative labor  and love ‘’అని విశ్లేషించి రాసింది .

జోలా’’ నానా’’ నవల

ఈ సిరీస్ లో వచ్చిన నవల ‘’నానా ‘’ఉత్క్రుస్టం అని పించుకోలేదుకాని సెన్సేషనల్ నవలగా పేరొంది ఇప్పటికీ బాగా ప్రాచుర్యం లోనే ఉంది ..జోలా అంటే ‘’నానా ‘’నవలే గుర్తొస్తుంది .దీనితర్వత ‘’ రైతు జీవితం పై రాసిన’’లాటెర్రె’’కూడా ఆదరం పొందింది .దీని ఇంగ్లీష్ అనువాదం లో కార్మికుల పోరాటం వారందరూ భూమిలోకి చేరిపోవటం విషయం లో చాలా బలమైన మాటలు౦డటం తో ఇంగ్లీష్ వారికి నచ్చక దీన్ని నిషేధించారు .అనువాదకుడిని జైల్లో పెట్టారు .ఆ పుస్తకం ఆంగ్లానువాదం దాదాపు యాభై ఏళ్ళు ఇంగ్లీష్ చదివే వారికి అందుబాటులో లేకుండా చేశారు .ఒకప్పుడు రైతులంటే ఇష్టపడని జోల వారిపై సంచలనాత్మక నవల రాసి వారికీ చేరువైనాడు .’’లా డిబాకిల్ ‘’నవలలో సెకండ్ ఎంపైర్ అని పిలువబడే నిరాశ నిస్పృహలతో ఓడిపోయినా సైన్యానికి సంబంధించిన విషయాలు రాశాడు   .జోలా ధోరణీ మారింది .’’An artist must learn to be lavish and live at top pitch ‘’అన్నాడు .నీతి జాడ్యానికి చికిత్స చేసే వాడుగా జోలా కనిపిస్తున్నాడన్నారు .దీనికి సమాధానం గా తన రాతలు విద్య నేర్పించాటానికే కనుక నీతి తో ఉండటం సహజం అన్నాడు .’’సంఘ రాజకీయ శరీరానికి’’ తాను  డాక్టర్ ను అని చెప్పుకొన్నాడు ఆయన వెలువరించిన తీవ్ర విషయాలను ‘’కల్చరల్ అటాప్సీలు’’ ( సాంస్కృతిక స్వీయ వీక్షణలు )అన్నారు

నడి వయసులో ఘాటు ప్రేమ

.1888లో తన సీరియళ్ళ సీరియస్ ప్రచురణలో ఉండి అమాంతం’’ జినీ రోజెరాట్ ‘’అనే తన ఎస్టేట్ సర్వెంట్ తో ప్రేమలో  పడ్డాడు మనోడికి నలభై యదు ఆమెకు ఇరవై లోపు వయసు .’’జోలా అండ్ హిస్ టైం ‘’లో మాథ్యూ జోసేప్ఫ్సన్ రాస్తూ ఆమె చాలా అరుదైన సౌనదర్యం కలిగి ఉండేదని రాశాడు. పల్లెటూరి ప్రాంతం నుంచి వచ్చిన పిల్ల .ఇప్పుడిప్పుడే ఇంటి పనులు చేయటం నేర్చుకొన్నది .మన రచయితలో ఇప్పటిదాకా ఆనకట్ట వేయబడిన శృంగారం గేట్లు తెంచుకొని ఉరక లెత్తి అడ్డూ ఆపూ లేకుండా .పారింది . ఈ శృంగారం ఫలించి జోలాకు ఇద్దరు పిల్లని కన్నది .ఈ వ్యవహారాన్నిజోలా భార్య అలేక్సాండ్రిన్  మొదటవ్యతిరేకించినా చివరికి రాజీ పడి ఆమోదించింది. జోలా చనిపోయిన తర్వాత అతని భార్య చేత అనుమతి పొంది ఈ పిల్లలకు జోలా పేరు పెట్టుకొన్నది కొత్త పెళ్ళాం .వారే జోలా వారసులయ్యారు .

డ్రేఫస్ అఫైర్ –దోషి అని ముద్రపడిన కెప్టెన్  డ్రేఫస్ ను  నిర్దోషిగా నిరూపించిన జోలా

జోలాకు యాభై వ ఏడు వచ్చేసరికి ఫ్రాన్స్ దేశం లో కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రీ ఫేస్ దేశానికి ద్రోహం చేశాడని నేరం ఆరోపి౦ప బడి , శిక్ష అనుభవించటానికి ‘’డెవిల్స్  ఐలాండ్ ‘’ కు పంపారు .ఈ కేసునే ‘’డ్రీఫాస్ అఫైర్ ‘’అంటారు ఫ్రాన్స్ దేశపు అవినీతి ,రాజకీయ కుళ్ళు దీనితో అందరికి తెలిసింది .తర్వాత ఈ కేసును అందరూ మర్చే పోయారు .చివరికి రెండేళ్ళ తర్వాతా ఎమిలీ జోలా తన వద్ద ఉన్న పూర్తీ ఆధారాలతో డ్రీఫాస్ నిరపరాధి అని నిరూపించాడు .సైన్యం లోని కొందరు పెద్దలు జర్మనీకి రహస్య విషయాలను చేరవేశారని వారే అసలైన నిందితులని చెప్పాడు .అప్పటి వరకూ జనసామాన్యానికి ద్డ్రీఫాస్ పై సాను భూతి లేదు . ఏది ఏమైనా తన పట్టు విడువకుండా స్తైర్యం గా డ్రీప్ఫెస్ వైపు నిలబడ్డాడు జోలా . ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫెలిక్స్ ఫారె కు జోలా ఒక బహిరంగ లేఖ రాయటం తో కద క్లైమాక్స్ కు చేరింది .తన దగ్గర ఉన్న డాక్యు మెంట్ల ద్వారా ఒక్కో అధికారి గుట్టు బయట పెట్టి ముచ్చెమటలు పట్టించాడు .తాను ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలియ బర్చాడు .మానవత్ర్వం కోసం మానవ హక్కుల పరి రక్షణ కోసమే నని చెప్పాడు .దీనిపై క్రోధం పూనిన సైన్యం అధికారులు సైన్యాన్ని అవమాన పరచాడనే అభియోగం మోపి జలులో పెట్టారు .నేరం రుజువైందని చెప్పి మూడు వేల ఫ్రాన్కుల జరిమానా  ఒక ఏడాది జైలు శిక్ష విధించారు .ప్రజా బలం జోలా వైపే ఉంది అయినా సైన్యానికున్న సర్వాధికారాలు ఉపయోగించి ,పత్రికల నోళ్ళు మూయించారు .ప్రజల దృష్టిలో జోలా అమర వీరుడయ్యాడు .సైన్యానికి వ్యతిరేకం గా ప్రజలు ఆగ్రహ జ్వాలలు కురిపించారు. కాని ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది

కేసును పునర్విచారించారు .జోలాకు దేశ బహిష్కార శిక్ష విధించారు 1898జులై లో రహస్యం గా లండన్ చేరి ఒక ఏడాది మారు పేరుతొ ప్రవాస జీవితం గడిపాడు .జోలా నిరంతర పోరాట ప్రయత్నం వలన మళ్ళీ కేసు విచారణకు వచ్చి కెప్టెన్ ద్రేఫాస్ పై నేరాన్ని ఉపసంహరించి అతనికి క్షమా భిక్ష పెట్టింది ప్రభుత్వం .అప్పుడు జోలా పారిస్ కు తిరిగి వచ్చాడు .ఆయన హీరో గానూ లేక గాయపడిన వాడుగానూ ఉండలేదు .పగ ద్వేషం అనే అగ్ని నుండి బయటపడ్డాడు. శుద్ధ మనస్కుడు అని నిపించాడు   .ఈ సందర్భం గా ‘’truth having been vanquished ,justice reigning at last I am re born and take my place again upon French soil ‘’అన్నాడు .ఇలా ఏ విషయమైనా అంత లోతుగా అధ్యయనం చేసే సామర్ధ్యం ఉన్నవాడు ఎమిలీ జోలా .జోలా అంటే చాంపియన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ .

అసంపూర్తి నవల –విషాదంగా సంపూర్ణమైన జీవితం

ఇంగ్లాండ్ లో ఉండగా జోలా’’ ది ఫోర్ గాస్పెల్స్ ‘’అనే కొత్త సీరియల్ రాయటం ప్రారంభించాడు .ఈ నవల గురించి చెబుతూ ‘’about a humanity enlarged for the needs of tomorrow –‘’దీన్ని a Utopia of social harmony a dramatization of the Dreyfus case ,and justice ,’’అన్నారు .విమర్శకులు . కాని దీన్ని పూర్తీ చేయలేక పోయాడు .ఒక ఆటం రోజు రాత్రి జోలా చలికి తట్టుకోవటం కోసం  సేవకులు అసాధారణమైన మంట వేశారు నెగడులో .కాని ఫైర్  లో గాలి వెళ్ళే మార్గం లో ఏదో లోపం ఉంది ఎవరూ గమనించలేదు .అందుకని రాత్రి వేళ చిమ్నీ లోంచి గాలి అసలు బయటికి పోలేదు లోపలే ఉండిపోయింది. కనుక జోలా ఆ రాత్రి అంతా గదిలో ఉండిపోయిన  కోల్ గాస్ తో నిండిన విషపు  గాలినే అంటే కార్బన్ మోనాక్సైడ్ నే  పీల్చాడు పాపం . తెల్లారి  సేవకులు వచ్చి తలుపులు పగల కొట్టి చూసేసరికి జోలా  చని పోయి ఉన్నాడు .అప్పటికి ఆయన వయస్సు 62.మరణించిన తేది 19-9-1902.

అంతిమ యాత్ర

ఎమిలీ జోలా అంత్య క్రియలకు రికార్డ్ స్థాయిలో ముప్ఫై వేలమంది జనం హాజరయ్యారు.’’మినిస్టరూ , ప్రెసిడెంట్ ఆఫ్ ది సోఅసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ లెటర్స్’’  జోలాపై గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు మిగిలిన పెద్దలూ ఉపన్యసించారు .జోలా సహచర ప్రముఖ రచయిత అనటోల్ ఫ్రాంక్ చివరగా నివాళులర్పిస్తూ ‘’Zola was a fighter for justice as well as an author .He has honored his country and the world with an immense work a magnificent action .Envy him his destiny and his heart ,which made his lot that of the greatest .He was a moment’s embodiment of humanity ‘s conscience ‘’అని ప్రశంసించాడు .

Inline image 1 Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-15 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.