ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -46
18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -5(చివరిభాగం )
జోలాను కుట్ర తో చంపారు
ఎమిలీ జోలా మరణం పై అనేక అనుమానాలున్నాయి ఆయన ప్రత్యర్ధుల కుట్రవల్లనే కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయి౦దని అంతకు ముందు రెండు మూడు సార్లు వారు హత్యాప్రయత్నం చేశారని అన్నారు .కాని ఇది రుజువుకాలేదు ఒట్టి అపోహ మాత్రమె నని తేలింది .కొన్ని దశాబ్దాల తర్వాత పారిసాన్ రూఫర్ మరణ శయ్యపై ఉండి తానె రాజకీయ కారణాలవలన జోలా ఉన్న ఇంటి చిమ్నీ మూసేశానని చెప్పాడు .జోలాను మొదట పారిస్ లోని క్లేమేటోరి డీ మాంట్ మెట్రి శ్మశాన వాటికలో ఖనం చేశారు .నాలుగేళ్ల తర్వాతా అలేక్సాండర్ డ్యూమాస్ విక్టర్ హ్యూగో ల ను ఖననం చేసిన పా౦ధియన్ లో అవశేషాలను భద్ర పరచారు .1953 లో ఒక విచారణ సంఘం పూర్తీ విచారణ చేసి ఎమిలీ జోలా ది హత్య మాత్రమె నని ,ప్రమాద వశాత్తు జరిగిన మరణం కాదని తేల్చింది .చిమ్నీ స్వీపర్ హెన్రి బూరోన్ ఫెస్స్ తానె రాజకీయ వాదుల కోరిక పై చిమ్నీ ని మూసేశానని ఒప్పుకొన్నాడు .కనుక ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని తేలింది .
రెండు కుటుంబాల కద
జోలా రాసిన 20 భాగాల రోగాన్ మాక్వార్ట్ నవల సెకండ్ ఫ్రెంచ్ ఎంపైర్ కు చెందిన విషయ౦ అని ముందే చెప్పుకొన్నాం .1851-71 మధ్య ఉన్న ఇరవై ఏళ్ళలో జరిగిన ఒక కుటుంబ గాధ అది .ఇందులో మూడొందల అధ్యాయాలున్నాయి .ఇది రోగాన్ మరియు మాక్వార్ట్ అనే రెండు కుటుంబాల కద .దీనికి జోలా పెట్టిన ఫ్రెంచ్ పేరుకు ఇంగ్లీష్ పేరు ‘’the natural and social history of a family ,under the second empire ‘’దీన్ని ఫ్రెంచ్ మూడవ రిపబ్లిక్ కాలం లో రాశాడు .మూడవ నెపోలియన్ కాలం లో ఫ్రెంచ్ సైన్యం దారుణంగా ఓడిపోవటమే ఇందులోని విషయం .నానా నవలలో కూడా దీని గురించి రాశాడు .
శాస్త్రీయ పరిశోధనా నవల కు ఆద్యుడు జోలా
‘’లి రోమన్ ఎక్స్ పెరిమెంటల్ ‘’నవలలో నేచరలిస్ట్ నవల ధోరణి ప్రారంభమై ,సైంటిఫిక్ పరిశోధనానవలగా పేరు తెచ్చుకొన్నది .క్లినికల్ ఫిజియాలజికి దారి తీసింది .జోలా దృష్టిలో ‘’no character should appear larger than life ‘’ Although Zola would not accept that it was either scientifically or artistically justifiable to create larger-than-life characters, his work does present a number of larger-than-life symbols which, like the mine Le Voreux in Germinal, take on the nature of a surrogate human life. The mine, the still in L’Assommoir and the locomotive La Lison in La Bête humaine impress the reader with the vivid reality of human beings. The great natural processes of seedtime and harvest
జోలా ఒక రచయిత ,కవి సైంటిస్ట్ మాత్రమె కాక ఆశావాది .’’పాజిటివిజం ‘’అంటే మక్కువ .మానవాభ్యున్నతిపై అచంచల విశ్వాసం ఉన్నవాడు జోలా .ఆయన జీవితం పై సినిమా కూడా తీశారు . “I wish to explain how a family, a small group of human beings, conducts itself in a given social system after blossoming forth and giving birth to ten or twenty members, who, though they may appear, at the first glance, profoundly dissimilar one from the other, are, as analysis demonstrates, most closely linked together from the point of view of affinity. Heredity, like gravity, has its laws’’
అని తన సీరియల్స్ కు ముందుమాట రాశాడు జోలా .సంఘం లో ఉన్న పరిసరాల పరిస్థితులు ,హింస ,తాగుడు వ్యభిచారం ఏవిదం గా ప్రజలను ‘’సెకండ్ వేవ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ‘’కాలం లో ప్రభావితం చేశాయో వివరించాడు .బ్రెజిల్ ఫ్రాన్స్ దేశాల రచయితలపై జోలా ప్రభావం అధిక౦ .అయిదుగురు నేచరలిస్ట్ రచయితలకు జోలా ఆదర్శనీయుడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-15- ఉయ్యూరు

