నెహ్రూ అబద్ధమాడారు
Added At : Thu, 06/25/2015 – 07:45
ఆంధ్రప్రభ నేషనల్ స్టోరీ
న్యూఢిల్లీ: దేశ ప్రథమ ప్రధాని జవ హర్‌లాల్ నెహ్రూపై తాజాగా ఒక వివాదాస్పద పుస్తకం వెలువ డింది. ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆ పదవిని ఆధిష్ట్టించకుండా అడ్డుకునేందుకు ఒక సందర్భంలో నెహ్రూ అబద్దమాడారని తాజాగా విడుదలైన పుస్తకం పేర్కొంటోంది. ఇంటెెలిజెన్స్ శాఖ మాజీ అధికారి ఆర్ ఎన్‌పీ సింగ్ ‘నెహ్రూ : ఏ ట్రబుల్డ్ లెగసీ’ అనే పుస్తకంలో ఈ విషయం వెల్లడించారు. దానిలో మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్ లేఖలు, వాటిలోని అంశాలను సింగ్ ప్రచురించారు.
ఆ పుస్తకం ప్రకారం 1949 సెప్టెంబర్ 10న రాజేం ద్ర ప్రసాద్‌కు నెహ్ర్రూ ఒక లేఖ రాశారు. దానిలో రాజ గోపాలాచారిని ప్రథమ రాష్ట్రపతి చేయడమే క్షేమకర మైన, ఉత్తమమైన మార్గమని తాను (నెహ్రూ), పటేల్ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. (ఇందుకు అధికారిక రికార్డులను సింగ్ తమ పుస్త కంలో ఉటంకించారు). ఆ త ర్వాత సర్దార్ పటేల్, రాజ్యాం గ అసెంబ్లీ సభ్యుల అభి ప్రాయాలకు ఇది భిన్నంగా ఉండడంతో నె హ్రూ తనకు అబద్ధం చెప్పారని రాజేంద్ర ప్రసాద్ తీవ్ర వ్యధకు గుర య్యారు. ఆయన తనకు నెహ్రూ రాసిన లేఖ ప్రతిని ఆ సమయంలో బొంబాయిలో ఉన్న పటేల్‌కు పంపారు. తాము చర్చించని విషయం గురించి నెహ్రూ పేర్కొ నడం చూసి పటేల్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ తన విషయంలో నెహ్రూ వ్యవహరిం చిన తీరుకు నిరస నగా సెప్టెంబర్ 11న నెహ్రూకు లేఖ రాశారు. పార్టీలో తనకున్న హోదా మేరకు తనకు మెరుగైన స్థానం ఇవ్వడంలో తప్పు లేదని రాజేంద్ర ప్రసాద్ ఆ లేఖలో నెహ్రూకు స్పష్టపరిచారు. ఆ లేఖ అం దుకున్న నెహ్రూ తన అబద్ధం బయటపడిందని తాను చేసిన తప్పును ఒప్పుకున్నారని సింగ్ పేర్కొన్నారు. అయితే ఆయన నేరుగా ఆ విషయాన్ని వ్యక్తం చేయ కుండా, ప్రసాద్ తనను, పటేల్‌ను తప్పుగా అర్థం చేసు కున్నారని ఒక లేఖ రాశారు. అలాగే పటేల్ కు తాను మొదటి లేఖలో రాసిన అంశాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. పటేల్‌తో సంప్రతించకుండానే తాను రాజగోపాలపాచారిని ఎంపిక చేయాలన్న అభిప్రా యాన్ని వ్యక్తం చేసానని అంగీకరించారు. అయితే ప్రసాద్ తనకు రాసిన లేఖలోని అంశాల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తెలివిగా ఈ అంశాన్ని పటేల్ వైపు నెట్టా రు. ఈ అంశాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మీదేనని ఆయన పటేల్‌కు రాశారని సింగ్ పుస్తకంలో రాశారు.
–
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
