అయ్యా, శ్రీ దుర్గాప్రసాద్ గారూ : ఆమాట కొస్తే మీరు “చేతలవారు” సార్, మీరన్నట్లు “మాటల వారు ” కాదు. పట్టువిడవని- రమణగారిని అడగండి చెబుతారు- డా :శర్మ గారి “ప్రశంసనీయ పద్య సుమములు ” చూశారుగదా! దానితో పోలిస్తే ఇది ఫీలింగ్ లో, శ్రమలో నామమాత్రమే నంటే ముమ్మాటికి నమ్మాలి మీరు. ఆరోగ్యకారణంగా అవస్తపడుతూ గుండెనొప్పితో బాధపడుతూకుడా ఆపద్యాన్ని ఎన్నిసార్లు revise చేశారో , చేయిoచారో , రమణ గారికీ , journalist శ్రీ ప్రకాష్ గారికీ , వారి సతీమణి సునీత గారికే తెలుసు . ఆరునూరైనా సరే , మీవ్యక్తిత్వం, వారి సీస, కంద పద్యాల్లో ప్రతిఫలించాలనే తపన ఇoతింతని చెప్పనలవికాదు . రోజుకి పదిసార్లు “ఫోనుల చెర్నాకోలు” తో తోలుకువచ్చారు మమ్మల్ని .
ఇంకా ఏదో లోపమున్నట్లే –100% న్యాయం చెయ్యలేకపోయానే–అనేభావంతో ఆఖరుకి ఇంకెన్నాళ్ళు బ్రతికుoటామో అని సమాధానపడ్డారు.
నాకుకూడా శ్రీ రమణగారు నిస్వార్ధంగా ఈ అవకాశమిచ్చి మీపుట్టినరోజున కలిగే ఆనoదానుభూతిలో పాలు పంచుకునే ఆవకాశo కలుగగలందుకు ఓర్పుతో నేర్పుతో తోడ్పడినందుకు , అoతా ఆ శ్రీరాములవారి అనుగ్రహంగా భావిస్తూ ఇంతటితో నాఈ మాటల “చాంతాడు ” ముగిస్తున్నాను (P. S .: ఎంతచెప్పినా , ఎంతచేసినా మిమ్మల్ని

