ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -54
22—ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ –విలియం జేమ్స్
అమెరికా వేదాంతి ,సైకాలజిస్ట్, డాక్టర్ అయిన విలియం జేమ్స్ అమెరికాలో మొట్టట మొదటి సారిగా సైకాలజీ కోర్సును ప్రవేశ పెట్టిన ఘనుడు .19వశతాబ్దపు మేధావులలో ఒకరుగా గుర్తింపు పొందాడు .అమెరికాలో ప్రసిద్ధ వేదా౦తు లలోఅప్పటి వరకు అంతటి గొప్ప వేదాంతి జన్మించలేదని అంటారు ..ఆ నాటి ప్రముఖ వేదా౦తు లైన విలియం సాండర్స్ పియర్స్,జాన్ డ్యూయీ సరసన నిలిచిన మహా వేదాంతి .వీరి సిద్ధాంతం ‘’ప్రాగ్మాటిజం ‘’అంటే పరిస్తితులను బట్టి సమస్యలను గురించి ఆలోచించి పరిష్కారం కలిగించే విధానం .దీనితో ‘’ ఫంక్షనల్ సైకాలజీ ‘’నిర్మాతలలో ప్రసిద్ధుడైనాడు .ఇరవై వ శతాబ్దపు సైకాలజిస్ట్ లలో పద్నాలుగవ శ్రేణిలో నిలిచాడు .అందుకే విలియం జేమ్స్ ను ’’’ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ ‘’అని పిలుచుకొన్నారు .
మేధావుల కుటుంబం
జేమ్స్ కుటుంబం అంతా మేధావి వర్గమే .దియాలజి ,ఫిలాసఫీ ,సాహిత్యాలలో హెన్రి జేమ్స్,సీనియర్ విలియం జేమ్స్ హెన్రి జేమ్స్ జూనియర్ అగ్ర శ్రేణి లో ఉన్నారు .అందరూ బహు స౦పన్నులే .వీరి తాత వ్యాపార్ ఫైనాన్షియర్ కూడా .మూడు వేల మిలియన్ డాలర్ల ఎస్టేట్ ను అప్పగించాడు .వీరిలో సీనియర్ హెన్రి ఆకుటుంబం లో చాలా తమాషా మనిషి స్వీడెన్ బర్గ్ అనుచరుడు ,జీవితాంతం మత గ్రందాలు చదువుతూ ,మతపరమైన సమస్యలకు పరిష్కారాలు చెబుతూ ,ముఖ్యం గా సృష్టికి సంబంధించిన మెటా ఫిజిక్స్ పై ద్రుష్టి పెట్టి జీవించాడు అన్నాడు బెర్నార్డ్ షా .తన తండ్రి నిజం గా దియలాజికల్ కాలం లో పుట్టి ఉంటే ,ఆయన దేవునికి మానవునికి ఉన్న సంబంధం ,దైవ సృష్టి ,అందులోని మిస్టరి లను వెలికి తీసి ,ఉంటే ప్రపంచానికి మార్గ దర్శనం చేసిన మహానుభావులలో ఒకడై తీర్చి దిద్దే వాడై ఉండేవాడు ‘’అన్నాడు విలియం జేమ్స్ .తండ్రి ఒక మత ప్రవక్త అని ,మహా మేధావి అని అన్నాడు .
సాగని చదవు
సీనియర్ హెన్రి జేమ్స్ ,భార్య మేరీ రాబర్ట్ సన్లకు నలుగురు కుమారులు ,ఒక కూతురు .విలియం జేమ్స్ న్యూ యార్క్ సిటీలో 11-1-1842 జన్మించి న పెద్ద కొడుకు .అక్కడే ప్రైవేట్ స్కూల్ లో చదివి ఇక్కడి స్కూలు చదువులు నచ్చక తండ్రి కుటుంబాన్ని యూరప్ కు మార్చేశాడు .లండన్ ,పారిస్ ,బోలాన్ స్విట్జర్లాండ్ ,జెర్మని లలో ప్రైవేట్ మాస్టర్లు ,గవర్నసేస్ లు చదువు చెప్పారు మధ్య మధ్యలో మార్పులు కనుక పిల్లల చదువు వరుస క్ర్రమం లో సాగలేదు .విలియమ్స్ కు జర్మన్ ,లాటిన్ ఇటాలియన్ భాషలలో గొప్ప పాండిత్యం అలవడింది .
అస్థిర నిర్ణయాలు
పద్ద్దేనిమిదేళ్ళ వయసులో విలియం జేమ్స్ అమెరికా కు వచ్చాడు .యూరప్ అతడిని మృదు స్వభావిని చేయ లేక పోయింది .అక్కడ తిట్లు శాపనార్ధాలే నేర్చుకోన్నానని తండ్రితో చెప్పాడు .17వయసులో పెయింటర్ అవుదామనుకొన్నాడు .ఒక కొడుకు ఆర్టిస్ట్ మరొకడు నావలిస్ట్ అవాలని తండ్రి భావించాడు .అయిన కొడుకులకు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చాడు .విలియమ్స్ పారిస్ చేరి న్యు పోర్ట్ ఐలాండ్ లో ఒక ఇంట్లో ఉండి అభిమాన చిత్రకారుడు విలియం హంట్ బృందం తో ఉన్నాడు .
మళ్ళీ మెడిసిన్
ఒక ఏడాదికే చిత్ర లేఖనం మొహం మొత్తింది.ఆర్ట్ వదిలేసిహార్వర్డ్ లో లారెన్స్ సైంటిఫిక్ స్కూల్ లో చేరాడు .మూడేళ్ళ తర్వాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో చేరాడు ..ఏడాదికే తాను సిద్ధాంత కర్తనే కాని ప్రాక్టికల్ మనిషిని కాదని గ్రహించాడు .లూయీ అగస్సి అతని గురువయ్యాడు ఆ స్కూల్ లో .అగస్సి బ్రెజిల్ కు ఒక అన్వేషణ లో బయల్దేరితే ,విలియం అనుసరించాడు .అక్కడ మొక్కలు వగైరా సేకరించటంవర్గీకరించటం బోరు కొట్టి మళ్ళీ మెడిసిన్ చదవటం మొదలు పెట్టాడు .ఈ మార్పు మానసిక సంఘర్షణ కలిగించింది .అప్పుడప్పుడు నరాల జబ్బు వచ్చి బాధ పడేవాడు .ఈ నరాల వ్యాధి నుంచి తానను తానూ కాపాడుకోవాలని నిర్ణ యించుకొన్నాడు .ఆరోగ్యం కోసం జర్మని వెళ్ళాడు .మెడిసిన్ పాసై మంచి ఉద్యోగం వస్తేచేరాలనుకొన్నాడు .
![]()
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-15-ఉయ్యూరు

