గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
-తిరుపతి వెంకన్న గంట అవతారమే -వేదాంత దేశికులు
వెంకట నాధుడే పూర్ణ ప్రజ్ఞ సంపాదించి వేదాంత దేశికులైనారు .ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గంట అవతారం గా భావిస్తారు .1268కాలం .నూటపాతిక దాకా గ్రంధాలు రాశారు .శ్రీ వైష్ణవం లో వడిగల శాఖ సంస్థాపకులు వేదాంత దేశికులు .దక్షిణ భారత వైష్ణవాలయాలలో దేశికుల విగ్రహం తప్పని సరిగా ఉంటుంది .వీరిని గూర్చి మనం మొదటి భాగం లో విపులంగా తెలుసుకొన్నాం .
186-సాకల్య మల్ల కవి
మల్లయార్య ,కవిమల్ల అని పిలువ బడే సాకల్య మల్లకవి మాధవుని కుమారుడు .అద్వైతమతానికి చెందిన వాడు. సంగ భూపాలుని ఆస్థానం లో వేదాన్తదేశికుని శిష్యుడు నాయనా చార్య చేతిలో వాదం లో ఓడిపోయాడు .సింగభూపాలుడు 1330లోరాచ కొండ రాజు .సాకల్యుడు వైష్ణ ఆచార్యుని పై భేతాలుడు అనే పిశాచిని బ్రాహ్మణ శిష్యుని వేషం లో పంపాడని అయన పల్లకిలో గ్రామాంతరం వెడుతూ శిష్యుడిని పల్లకి మోయ మన్నాడని ,వాడు పల్లకి కిందపడేసి ఆయన్ని చంపే ప్రయత్నం చేశాడని ఈ విషయం గ్రహించి వైష్ణవ స్వామి దానికి విరుగుడుగా మంత్రం వేశాడని దానికి లొంగిపోయి అతి భక్తిగా భేతాళ శిష్యుడితో చచ్చినట్లు పల్లకి మోయిచెట్లు చేశాడని ఒక కద ప్రచారం లో ఉంది . ఈ కవికి శ్రీరాముడు కలలో కనిపించి కావ్యం రాయమని కోరితే ‘’ఉదార రాఘవం ‘’రాశాడు .ఇది పద్దెనిమిది కాండలకావ్యం .కాని మనకు మిగిలింది ఏడు కాండలే .రామాయణ కధను రఘు వంశం ఆధారం గా రాశాడు .సరళమైన కవిత్వం .మాయి సూరి కొడుకు చావుండి దీఇకి వ్యాఖ్య రాశాడుకాని అసంపూర్తిగా దొరకినది .రాంపల్లి గోపీ నాధుడు కూడా వ్యాఖ్య రాశాడు .
ఇప్పటివరకు మనకు తెలిసింది ఏమిటంటే అనేకార్ధ కావ్యాలు బాగా విజ్రుమ్భించి సాహిత్యాన్ని సర్కస్ ఫీట్ల కింద మార్చాయని జైన కవులూ ఈ ప్రభావం లో పడి పోయారని వారూ దాని అంతు చూశారని తర్వాత నెమ్మదిగా ధోరణి మారి వంశ చరిత్రలు బాగా వ్యాప్తి లోకి వచ్చాయని అందులో చాలా భాగం చరిత్ర ఉన్నదని అలంకార గ్రంధాలు నిఘంటువులు కూడా కవులు రాసి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని తెలిసింది .ఈ కవులు ఎక్కువ భాగం గుజరాత్ ,కాశ్మీర రాజుల ఆస్థానకవులు .ఎక్కువ మంది సూరి బిరుదున్నవారు. అనేక శాస్త్రాలలో నిష్ణాతులు .జైన మతాచార్యులుగా లబ్ధ ప్రతిస్టూలు .రాజులను ఆ మతం లోకి మార్చిన వారు .విభవ ప్రాభవాలు అందుకొన్నవారు .వీరి తర్వాతకవులు దక్షిణా పదానికే ఎక్కువగా చెందిన వారు వచ్చారు .విజయ నగర సామ్రాజ్యం ఏర్పడటం తో వచ్చిన మార్పు ఇది .ఆ సామ్రాజ్య నిర్మాత శ్రీ విద్యారన్యులవారు. వారినే మాధవ విద్యా రన్యులు అంటారు .ఇక నుంచి కద విజయ నగరానికి చేరుతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-15 –ఉయ్యూరు

