ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -56

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -56

23-19వ శతాబ్దపు వాస్తవిక సాహిత్య సృస్తికర్తలలో ఒకడు –హెన్రి జేమ్స్

హెన్రి జేమ్స్ తరువాత ఏ ఆధునిక రచయితా అంతకు మించి గొప్ప ఫిక్షన్ ను సృష్టించలేదు .అతని పోర్ట్రైట్ ఆఫ్ ఎ లేడి ,ది వింగ్స్ ఆఫ్ ది డవ్,ది ఎమ్బాసడర్స్,దిగోల్డెన్ బౌల్  కు మించిన నవలలు లేవు .ఐర్లాండ్ నుంచి వలసవచ్చిన తాత మూడుమహా గొప్ప ఐశ్వర్యాలను ఇచ్చాడు .తండ్రి బిజినెస్ లో  దెబ్బతిని మిస్టిక్ అయ్యాడు .స్వీడెన్ బర్గ్ శిష్యుడై నాడు .తాత నుండి  సంపదపై అభిమానాన్ని ,తండ్రినుండి దానిపై ఏవ గింపు ను  పొందాడు హెన్రి జేమ్స్ .

15-4-1843 లో అమెరికా న్యూయార్క్ లోతండ్రి కి రెండవ వాడుగా పుట్టాడు ఇతనికన్న ఏడాదిదపెద్ద విలియం జేమ్స్ ఫిలాసఫర్ సైకాలజిస్ట్ అయ్యాడు ;అమెరికా ,యూర పు దేశాల్లో దేన్నీ ఎంచుకోవాలో తెలియక సందిగ్ధం లో కొన్నాల్లున్నాడు .ఏడాదివయసులోనే తండ్రితో అనేక దేశాలు తిరిగాడు.అన్నతోబాటు పారిస్ ,లండన్ జేనీవాలలో చదివాడు . కాస్మాపాలిటన్ జీవితం లో పెరిగాడు .ఏదేదో అవుదామనుకొంటే తండ్రి వ్యాపారం లో కుదేలయ్యాడు .ప్రిస్టేజ్ దెబ్బ తిన్నది .

చిన్నతనం నుంచే రాయటం అలవాటైంది .పద్నాలుగో ఏటనే కొడుకు రచనలు చూసి తండ్రి తల్లితో అద్భుత నవలలు రాస్తున్నాడు మనవాడు అని చెప్పి మురిసిపోయాడు .పద్దేనిమిదో ఏట ఒక అగ్నిప్రమాదాన్ని ఆపుతూ గాయ పడ్డాడు అది జీవితాంతం బాధించింది .పందోమ్మిదో యేట అందగాడుగా ఉండేవాడు.మాసాచూసేట్స్లోని జేమ్స్ రసెల్ లోవెల్ అనే మహా రచయిత ను చూసి తానూ అంతవాడిని కావాలనుకొన్నాడు .ఇరవై ఒకటవ ఏడాది నార్త్ అమెరికన్ రివ్యూలో ఒకపుస్తకాన్ని సమీక్షించాడు .రాసిన మొదటికద అట్లాంటిక్ మంత్లి లో  వచ్చింది .యవ్వన దశలో అనేక ప్రాంతాలు తిరిగాడు .యూరప్  బాగా ఆకర్షించింది .అక్కడే ఉండి రచనలో పేరు తెచ్చుకోవాలనుకొన్నాడు .

రెండేళ్ళ తర్వాత కేంబ్రిడ్జ్ తిరిగి వచ్చాడు .మళ్ళీ యూరప్ వెళ్లి తర్జనేవ్ జోలా ,ఫ్లాబర్ట్ లను కలిశాడు వారంతా హెన్రి కధల్ని మెచ్చుకొన్నారు .లండన్ లో పుట్టి ఉంటే బాగుండేది   అనుకొన్నాడు .పారిస్ మోహం పెంచింది వదల్లేక పోయాడు .ఇంగ్లాండ్ తనిల్లు కావాలని కలకన్నాడు నేర వేర్చుకొన్నాడు .లండన్ లో స్తిరపడి అంతర్జాతీయ పరిస్తితులపై నవలలు రాశాడు.పాత ,కొత్తతరానికి వారధి కావాలనుకొన్నాడు ‘అంతర్జాతీయ రచయిత అనిపించు కోవాలని ఉండేది .మొదటి నవల  వచ్చిన పదేళ్లకు ‘’రోడరిక్ హడ్సన్ ‘’అనే నవల రాశాడు .అతని రచనలలో మూడు దశలున్నాయి .మొదటిజేమ్స్ రెండవ జేమ్స్ ,పాతకాలపు నటజేమ్స్ .

జీవిత మధ్యకాలం లో రాసిన పోర్ట్రైట్ ఆఫ్ ఏ లేడి  కొత్తదనం తో మిరుమిట్లు గోలిపింది .ఇంగ్లీష్ ఫిక్షన్ కు కొత్త వొరవడి దిద్దింది .తరువాత వచ్చిన వింగ్స్ ,గోల్డెన్ బౌల్ నవలలు క్లిష్టమైనవి .కాని గొప్ప కళా ఖండాలని పించాయి .వాటి నిర్మాణం ఆశ్చర్యపరిచింది .ముప్ఫయారేళ్ళ వయసులో ‘’డైసీమిల్లర్’’రాసి పేరు తెచ్చుకొన్నాడు .1882లో తల్లీ తండ్రిచనిపోగానే అమెరికా తిరిగి వచ్చాడు .కొద్దికాలం లోనే మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు .మళ్ళీ 21 ఏళ్ళదాకా అమెరికా వెళ్ళలేదు. ప్రముఖ డ్రమటిస్ట్ అవాలని అనుకొన్నాడు .కాని రాసిన నాటకాలు ఫలించలేదు .జ్ఞానోదయం అయి నాటకానుభవం తో నవలను తీర్చిదిద్దాడు .

జీవితాంతం హెన్రి పెళ్లి చేసుకోలేదు. కాని చాలామందిని వలచాడు. అరవైయేళ్ళు వచ్చేసరికి జీవిత ప్రవాహం చాలా దూరం ప్రవహించింది అనిపించింది .అపజయాలు బాధిస్తున్నాయి .తన జీవిత చరిత్రగా ‘’ది ఎ౦బాసడర్స్ ‘’రాశాడు . .’’live all you can It is a mistake not to .It does not so much matter what you do in particular ,as long as you have your life —live ‘’అనేది హెన్రి సిద్ధాంతం ముసలితనం మీద పడుతున్న కొద్దీ రచనలో పటుత్వం తగ్గింది .ఒకా అపరాధభావం ఏదో మనసులో మెదిలింది .

1907లో న్యూయార్క్ లో ‘’నావల్స్ అండ్ టేల్స్’’రావటం ప్రారంభమైంది .ఆ తర్వాతా ఇరవైఆరు పుస్తకాలు రెండేళ్లలో వెలువడ్డాయి . హెన్రి చనిపోయినతర్వాత ముప్ఫైఆరు పుస్తకాలుగా ఆయన రచనలు ప్రచురితమైనాయి .

మొదటి ప్రపంచ యుద్ధం హేన్రిని కలవర పరచింది .జర్మనీపై అసహ్యం ఇంగ్లాండ్ పై దేశభక్తికి కారణమైంది .బ్రిటిష్ పౌరునిగా ఇంగ్లాండ్ స్వీకరించింది 1916జనవరి ఒకటిన ‘’ఆర్డర్ ఆఫ్ మెరిట్ ‘’పతకం అందుకొన్నాడు .కాని ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవ లేదు .అన్నలాగానే హార్ట్ ఎటాక్ వచ్చింది దానిపై న్యుమోనియా సోకింది .డెబ్భై మూడేళ్ళు రాకముందే 8-2-1916 చనిపోయాడు హెన్రి జేమ్స్ .’చనిపోయిన  తర్వాత అతని రచనలు కొన్ని వెలుగు చూశాయి..వందదాకా కధలు చిన్న నవలలు రాశాడు .పెద్దనాటకాలు ఎనిమిది రాశాడు .ట్రావేలోగ్స్ రాశాడు .

హెన్రి అంటే ఇష్టం లేనివారు అతని శైలిని వస్తువును దూషించారు .వ్యంగ్య వైభవం కోసం కొన్ని మర్యాదలను కాదన్నాడు అన్నారు . ఇలియట్ ‘’his mastery over ,his baffling escape from ideas ,–a mind so fine that no idea could violate it’’అన్నాడు .అతని శైలిపై ఎక్కువ మంది విరుచుకు పడ్డారు .అతనిది ‘’warm manner saying nothing in infinite sentences ‘’అన్నాడు ధామస్ హార్డీ. ‘అతనిది రంగుల రాత అన్నారు .కాని ఆధునిక విమర్శకులు మాత్రం మొదటిరకం ఇంగ్లీష్ నవలా రచయిత అని మెచ్చారు రెండు స్థాయిలలో కధలు చెప్పాడు అన్నారు .’’hippopotamas rolling a pea’’లాగా అతని స్టైల్ ఉందన్నాడు హెచ్ జి వేల్స్’.ఇంగ్లాండ్ దేశం నైతిక పతన దశలో ఉన్నప్పుడు మళ్ళీ సవ్య మార్గం పై నడిపించినవాడు హెన్రి .

చనిపోయిన తర్వాతా హెన్రి జేమ్స్ ను మరల కనుగొన్నారు .’James was not only America;s  few great novelists ,but one of the very first to use a fine sensibility as a weapon against the blunt insensibilities of the age .’’

హెన్రి చివరికాలపు రచనలను ఇంప్రెషనిస్ట్ పెయింటింగ్ లతో పోలుస్తారు . అతని పాయింట్ ఆఫ్ వ్యూ ,ఇంటీరియర్ మోనోలోగ్ ,అన్ రేలియబుల్ నారేటర్స్ చాలా విలక్షణమైనవి .హెన్రి  సాహిత్య విమర్శ కు  ఎంతో సేవ చేశాడు .రచయితలకు ప్రపంచాన్ని గురించి చెప్పే విషయాలలో  స్వేచ్చ ఉండాలని హెన్రి జేమ్స్ అభిప్రాయం .మంచి నవలలు అంటే మంచిపనితో ఉండే జీవితం అంటాడు  “a work of art must lift up the hear’’అన్నది అతని సిద్ధాంతం.మూడు సార్లు నోబెల్ ప్రైజ్ కు నామినేట్ అయ్యాడుకాని లభించలేదు .

Henry James.jpgInline image 1

మరో ప్రముఖ దర్శనం లోకలుద్ద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-15-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.