ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -60 27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -60

27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్

ఇన్వెంటర్ బిజినేస్మన్

తనకాలపు మేదావులకన్నా గొప్పవాడు కాకపోయినా కాలంతో చక్కగా శ్రుతికలిపిన శాస్త్రవేత్త ,పరిశోధకుడు ,పక్కా వ్యాపారి థామస్ ఆల్వా ఎడిసన్ .అతని పరిశోధనా ఫలాలు నూతన పారిశ్రామికాభివృద్ధికి అనేక క్షేత్రాలలో ప్రతిఫలించాయి .కాంతికే వెలుగునిచ్చి ఎలక్ట్రిక్ బల్బ్ ను కనుక్కొని ధ్వని రికార్డింగ్ యంత్రాన్ని తయారు చేసి కొత్త పుంతలు తొక్కాడు .ఫలితాలను స్వర్గం లో ఉండిచూసుకోకుండా భూమిపై జీవించి ఉండగానే చూసుకొని ఆనందించిన అరుదైన శాస్త్రజ్ఞుడు .చనిపోయే నాటికి అయన కనిపెట్టిన అనేకానేక పరిశోధనల వలన పొందిన దనం లెక్క వేస్తె కళ్ళు మిరుమిట్లు గొలిపే 25.683,544.343డాలర్లు అని తెలిస్తే గుండె ఆగిపోతుంది .సైన్స్ తో  అంత గొప్పగా వ్యాపారం చేయగల సమర్ధుడు అని ఆశ్చర్య పోతాం .ఎడిసన్ మెదడు సాధించిన చారిత్రాత్మక ఘన ధన విజయం ఇది .అనితర సాధ్యం చేశాడు .

కుటుంబ నేపధ్యం

ఎడిసన్ కుటుంబం వారు అమెరికన్ రివల్యూషన్ ముందు నుంచే అమెరికాలో ఉన్నారు .సామ్యుల్ ఎడిసన్ డచ్ వాడు ,అతని పూర్వీకులు కాలనీ రాష్ట్రాలకు చెందిన హాలండ్ దేశీయులు .ముందుగా కెనడా చేరారు .ఈరీ సరస్సు ఉత్తరభాగం లోని వియన్నా లో సామ్యుల్ ఉండేవాడు .అప్పుడే స్కాటిష్ జాతికి చెందిన నాన్సీ ఇలియట్ ను పెళ్లి చేసుకొని హోటల్ కీపర్ గా ఉన్నాడు .ప్రజా సంబంధాలు బాగా ఉన్న వ్యక్తీ .కనుక రాజకీయాలలోకి లాక్కు రాబడ్డాడు .తీవ్రవాది అవటం వలన రాడికల్ రిఫార్మ్ కోసం ప్రయత్నించాడు .ఇది కెనడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది .తీవ్రవాదులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుండగా నెమ్మదిగా ఎవరికీ తెలియ కుండా సరిహద్దు  దాటి 1842లోఅమెరికాలోని  ఒహాయోలోని మిలన్  సిటీలో స్తిరపడ్డాడు .చిన్నా చితకా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి కెనడాలో  ఉన్న  భార్యకు పంపేవాడు .

ఎడిసన్ బాల్యం

ఎడిసన్ కుటుంబం లో చివరివాడుగా ఆల్వా ఎడిసన్ మిలన్ లో 11-2-1847జన్మించాడు .రివల్యూషనరీ వార్ లో పని చేసిన ముత్తాత పేరైన థామస్ ను ఇతనికి పెట్టారు .అతని తల్లిని కెనడా నుంచి ఒహాయో చేర్చిన కెప్టెన్ ఆల్వా బ్రాడ్లీ  కి కృతజ్ఞతగా ఆల్వా పేరునూ చేర్చారు .ఎడిసన్ పుట్టేనాటికి తండ్రికి నలభై మూడు తల్లికిముప్ఫై ఏడు వయసు ఉంది .మంచి కుటుంబ వాతావరణం లో పెరిగాడు తల్లి ఈ చిన్ని కొడుకు అవసరాలు బాగా తీర్చేది .ఇతని ఏడవ ఏట కుటుంబం మిచిగాన్ లోని పోర్ట్ హర్టన్ చేరింది .అక్కడ లంబర్ బిజినెస్ బాగా కలిసి వచ్చింది .కొత్త విశాలమైన భవంతి తీసుకొని ఉన్నారు .కొడుకును స్కూల్ కు పంపారు .అందరికంటే కొడుకు బాగా చదివి వృద్ధిలోకి రావాలని ఆశించారు తల్లి తండ్రి .స్కూల్ లో మనవాడు ‘’కలల బేహారి ‘’గా కనిపిస్తే చదువు మీద శ్రద్ధ లేదనుకొన్నాడు టీచర్ .

ప్రధమ గురువు తల్లి

వెంటనే స్కూల్ మాన్పించేసింది తల్లి .కొడుకును దగ్గరే పెట్టుకొని అతనికి కావలసిన చదువు తానె నేర్పింది ఇష్టపడి అతనూ నేర్చుకొన్నాడు ఆమె నేర్పిన దాని ప్రభావం వల్ల టాం పన్నెండో ఏటికే గిబ్బన్ రాసిన ‘’డిక్లైన్ అండ్  ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్ ‘’,బర్టన్ రచన’ ’అనాటమీ ఆఫ్ మేలాన్కలి ‘’చదివి జీర్ణం చేసుకొన్నాడు .’’డిక్షనరీ ఆఫ్ సైన్సెస్ ‘’చదివి ప్రయోగాలు చేసేవాడు .బాగానేకాకుండా వేగంగా చదవటం ఆల్వా అలవాటు చేసుకొన్నాడు .సాధారనాంగా అందరూ ఒక లైన్ చదివి అర్ధం చేసుకొంటే అదే సమయం లో పేజీలోని పదార్ధ సారాన్ని జీర్ణించుకొన్న మేధావి .చదివింది ఏదీ మర్చిపోయే వాడుకాదు .ఎప్పుడు ఏది కావాలన్నా వెంటనే  స్పురణకు తెచ్చుకోగల అపూర్వ జ్ఞాపక శక్తి ఎడిసన్ కు అలవడింది .

సేల్లారే పరిశోధన శాల  –మోడల్ యంగ్ హీరో

చదువుతో బాటు ప్రయోగాలూ సాగించి  వాటి ఫలితాలూ వెంటనే పొందేవాడు .ఒకసారి స్నేహితుడికి గాలిలో ఎగరటం కోసం అధిక డోసులో ‘’సీడ్లిత్జ్ పౌడర్ ‘’ఇచ్చాడు .అది గాస్ ను సృష్టించి గాలిలో ఎగరటానికి తోడ్పడుతుందని నమ్మాడు .టీన్ ఏజ్ లోనే సెల్లార్ లో షెల్ఫ్ లో గ్లాసులు ,సీసాలు,డబ్బాలు వగైరా  పెట్టి అదే తన లాబ్ అని చెప్పేవాడు .అక్కడే ప్రయోగాలు పరీక్షలు చేసేవాడు పరిశోధన అని చెప్పేవాడు .ఇదే తర్వాత ఊహించని శాస్త్ర బిజినెస్ కు రాచ బాట వేసింది .ఇంకా బోలెడు పుస్తకాలు ,సామాన్లు అవసరమని పించాయి .దీనికి డబ్బుకావాలి కనుక తాను  బిజినెస్ ప్రారంభిస్తున్నానని  తలి దండ్రులకు చెప్పాడు .వాళ్ళు ఇచ్చిన డబ్బుతో డబ్బు రా బట్టే పనులు ప్రారంభించాడు .పదమూడవ ఏట పేపర్లు వేసే కుర్రాడిగా ,కాండీ బుచర్ గాపని చేశాడు  ,పోర్ట్ హర్ట న్ నుంచి  డెట్రాయిట్ దాకా  రైల్లో పిప్పరమెంట్లు అమ్మాడు .సెకండ్ హాండ్  ప్రింటింగ్ ప్రెస్ కొని వార్తలు సేకరించి అచ్చువేసి అమ్మాడు .పోర్ట్ హర్టన్ లో ట్రక్  గార్డెన్ పెట్టి తనకింద కొంత మంది కుర్రాళ్ళను నియమించుకొని బిజినెస్ చేశాడు .ఇప్పటికే అతడు ‘’విజేత ‘’అనిపించుకొన్నాడు .హొరాషియో ఆల్గేర్ కు ఎడిసన్ ‘’మోడల్ యంగ్ హీరో ‘’గా అనిపించాడు .

కుర్ర బిజినెస్ మాన్ – సాహసమే ఊపిరి

ఎడిసన్ ‘’డబ్బు ను మంచి జాగ్రత్త అయిన ఆలోచన చేసి సంపాదించవచ్చు ‘’అని చెప్పాడు అమెరికన్ సివిల్ వార్ లో వార్తాపతికల హాట్ హాట్ కధనాలకు గిరాకీ పెరిగింది. డెట్రాయిట్ ఫ్రీప్రేస్ ‘’కు వెళ్లి తనకు వెయ్యికాపీలు కావాలని కోరాడు .వాళ్ళు ముక్కున వేలేసుకొన్నారు ..ఒప్పుకొని ఇచ్చ్చారు .తన టెలిగ్రాఫ్ మిత్రులకు ముందే సందేశాలు పంపి రైల్వే స్టేషన్ లలో నోటీసులు  అంటించ మన్నాడు .యుద్ధం మొదటి రోజు వార్తలను కవర్ చేసిన పేపర్లను ట్రెయిన్ లో  తెచ్చి అన్ని స్టేషన్ల లోను జనాలకు అందజేశాడు .జనం విరగబడి స్టేషన్లకు చేరారు .ఒక నికెల్ ఉన్న రేటును పది సెంట్లు చేసి పేపర్లు అమ్మాడు .డిమాండ్ ను బట్టి పదిహేను సెంట్లు తర్వాత పాతిక సెంట్లకు అమ్మాడు .చివరికి ముప్ఫై అయిదు సెంట్లకు అమ్మాడు .ఒక్కరోజులోనే వందడాలర్ల లాభం సాధించాడుపదిహేనేళ్ళ కుర్ర బిజినేస్ మాన్  ఎడిసన్ .

రైలు పెట్టే ప్రయోగ శాల

టెలిగ్రఫీ నేర్చినందుకు ఈ బిజినెస్ గొప్పగా చేయగలిగానని చెప్పాడు ఎడిసన్ .ఇతని సాహస గాధలు కధలు కధలుగా చెప్పుకొన్నారు .ఒకసారి మౌంట్ క్లిమేన్స్ స్త్రేషన్  లో ఉండి స్టేషన్ మాస్టర్ తోనూ టెలిగ్రాఫర్ తోను మాట్లాడుతున్నాడు ఎడిసన్ .ఇంతలో టెలిగ్రాఫర్ మెకంజీ కొడుకు ట్రాక్ కు అడ్డంపడి వస్తున్నాడు అప్పుడే ఒక బాక్స్ కార్ వస్తోంది ట్రాక్ మీద .అకస్మాత్తుగా ప్లాట్ ఫాం నుంచి కిందికి దూకి ఆ కుర్రాడిని ఎత్తుకొని పరిగెత్తుకొచ్చి ప్లాట్ ఫాంపైకి చేర్చాడు .కాని ఆ కారు  ఎడిసన్ బుజాలు ఒరుసుకుకుంటూ పోయింది మెకంజీ కృతజ్ఞత చెప్పి తనకు టెలిగ్రాఫ్ ఆపరేషన్ పూర్తిగా రాదనీ ఒప్పుకొని నేర్పమని బ్రతిమిలాడాడు. దీనికి ముందు మరో సంఘటన జరిగింది .రోజూ జర్నీ చేసి ట్రెయిన్ లో రాత్రికిపోర్ట్ హర్ట న్ లోని  ఇంటికిచేరుకోనేవాడు .ట్రెయిన్ అతని రెండవ ఇల్లు అయింది .ఒక సంచిలో ప్రయోగ సామగ్రి పెట్టుకొని ట్రెయిన్ ఎక్కేవాడు .ఎక్కడ ఒక అరగంట ఖాళీ దొరికితే అక్కడే టెస్ట్ ట్యూ బులతో  ప్రయోగాలు చేసేవాడు .ఒకసారి ఆసిడ్స్ తో ప్రయోగం చేస్తే మ౦టవచ్చి ప్రయాణించే కార్ తగలబడింది  కండక్టర్ తంటాలుపడి నిప్పునార్పి చెవులు పిండి బుద్ధి చెప్పాడు .ఇదే మొదటి చెవి గాయం జీవితం లో .ఇంకోసారికూడా రైల్ ప్రయాణం లోనే జరిగింది .ఒకసారి ఒక స్టేషన్ లో దిగి పేపర్లు అమ్ముతుండగా రైలు బయల్దేరే  విజిల్ వేశారు .బండి కదిలింది  పరిగెత్తి ఎక్కబోయాడు .ఒక బాగర్ కార్  అటెం డెంట్ ఎడిసన్ చెవులు పట్టుకొని రైలు ఎక్కించాడు .చెవులకు పెద్దాగయమే అయింది .నయమైనా వినికిడి తగ్గినట్లని పించింది క్రమంగా చెవిటి వాడయ్యాడు

.Inline image 1  .Image result for thomas alva edison

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-15 –ఉయ్యూరు   .


Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.