ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -62
27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -3
సౌండ్ రికార్డింగ్ అండ్ రీప్రోడ్యూసింగ్ యంత్రం- ఫోనోగ్రాఫ్
ఎడిసన్ చెవుడు మాట దేవుడెరుగు కాని మనిషి మాట్లాడిన మాటను రికార్డ్ చేయటం పై దృష్టిసారించాడు ముప్ఫై ఏళ్ళ వయసు లోపలే .టెలిఫోన్ ట్రాన్స్ మీటర్ కనిపెట్టిన తర్వాతఒక రోజు అకస్మాత్తుగ గాలితరంగాలను రికార్డ్ చేయచ్చునని వాటిని మళ్ళీ వినిపించవచ్చునని ఐడియా వచ్చింది .ఒక ఎలక్ట్రో మేగ్నెటిక్ పికప్ ను రివాల్వింగ్ టేబుల్ కు అమర్చి దానిద్వారా పారఫిన్ మైనం రాసిన ఒక సన్నని కాగితాన్ని దూర్చాడు .అద్భుతం అని పించి ‘’వాఃవాః’’అని అరిచాడు ఆశ్చర్యంగా .అ పేపర్ను వెనక్కి నడిపి చూశాడు తాను అరచిన శబ్దం ఏ మాత్రం తేడా లేకుండా తిరిగి వినిపించింది .ఈ విషయాన్ని డైరీలో 18-7-1877తేదీతో సమీప భవిష్యత్తు లో ఏదోఒక రోజు తాను మానవ శబ్దాలను రికార్డ్ చేసి మళ్ళీస్పష్టంగా వినిపించగలను అనే నమ్మకం కలిగింది అని రాసుకొన్నాడు .ఆ రోజు వెంటనే వచ్చేసింది .
ఒక నెల తర్వాత మెకానిక్ జాన్ క్రేసు నిపిలిచి 18 డాలర్ల పని అప్పగిస్తున్నాను చేయమన్నాడు .ఒక సాధారణ బొమ్మ మోడల్ గీసి దానిప్రకారం ఒక పరికరం తయారు చేయమన్నాడు .ఒక టిన్ ఫాయిల్ తీసుకొనిఒక సిలిండర్ చుట్టూ మిఠాయి పొట్లం లాగా చుట్టి దానికి ఒక పిన్ను అమర్చాడు ‘క్రాంక్ వీల్ ఆధారం గా సిలిండర్ ను తిప్పాడు .చిన్నప్పటి నర్సరీ రైం లను మౌత్ పీస్ లో పాడాడు . పాట అవగానే పిన్నును రి ప్రోడ్యూసింగ్ డయాఫ్రం కు ఆనేట్లు సరిచేశాడు .సిలిండర్ ను మళ్ళీ తిప్పగానే అతను చెప్పిన ‘’మేరీ హాడ్ ఏ లిటిల్ లాంబ్ –ఇట్స్ ఫ్లీస్ వజ్ వైట్ యాజ్ స్నో’’అని స్పష్టంగా వినిపించింది .ఎడిసన్ అనుభూతిని అణచుకొన్నాడు కాని మెకానిక్ క్రేసు ‘’గాడ్ ఇన్ హెవెన్ ‘’అని బోల్డు ఆశ్చర్యపడ్డాడు .ఇలా ధ్వని రికార్డింగ్ అండ్ రిప్రోడ్యూసింగ్ చేశాడు .ఇదే ఫోనోగ్రాఫ్ . .
ఎడిసన్ పధ్ధతి చాలా నిదానం గా పెర్ఫెక్ట్ గా ఉంటుంది .అవసరం లేనివాటిని తొలగించి బాగా ఉపయోగపదేవాటినే ఉంచి ఎన్నో ప్రయోగాలు చేసి విజయం సాధించాడు .ఫోనోగ్రాఫ్ నిర్మాణం తో ఎడిసన్ కీర్తి దేశ విదేశాలలో మారు మోగింది .ఎడిసన్ బయాగ్రాఫర్ ఫ్రాన్సిస్ ట్రవలేన్ మిల్లర్ ‘’నేను ఏది వచ్చినా బెదిరలేదు వెనక్కి తగ్గలేదు .ప్రయోగం మొదటిసారే విజయవంతమైతే భయమేసేది .’’అని ఎడిసన్ డైరీలో రాసుకోన్నాడని తెలియ జేశాడు .తన సృజనలలో ఫోనోగ్రాఫ్ అద్భుత విజయం గా భావించాడు ..తనకున్న చెవుడు నష్టం కలిగించక పోగా పైపెచ్చు లాభమే కలిగించిందన్నాడు .దానివలన కేంద్రీకరణ పెరిగి అందరికి వినిపించని ధ్వనులు ఆయనకు వినిపించేవి ‘’.స్టెనో గ్రాఫర్ సహాయం లేకుండా లెటర్ రైటింగ్ ‘’పేరుతొ పేటెంట్ పొందాడు .గుడ్డివారి కోసం ‘’ఫోనోగ్రాఫ్ బుక్స్ ‘’రాశాడు .అవి వారిపాలిటి కల్పతరువులే అయ్యాయి .వారి ప్రయత్నం లేకుండానే గుడ్డివారి తో అవి మాట్లాడి జ్ఞాన వంతుల్ని చేశాయి .దీన్ని స్పెక్టాక్యులర్ వండర్ అన్నారు . వక్త్రుత్వాన్ని నేర్పేవిగా,సంగీతాన్ని పునః సృష్టి చేసేవానిగా ఫోనోగ్రాఫ్ నాలుగు రకాల సేవలు అందించింది .
ఎలెక్ట్రిక్ బల్బ్ నిర్మాత –మెన్లో పార్క్ మాంత్రికుడు
ఫోనోగ్రాఫ్ పని పూర్తీ అయ్యాక ఎలెక్ట్రిక్ లైట్ పని మీద ఉన్నాడు .అప్పటిదాకా విద్యుత్తు వలన కాంతి వస్తుందని ఎవరికీ తెలియదు .కాంతి గురించి అనేక పుస్తకాలు చదివి అర్ధం చేసుకొన్నాడు ఎడిసన్ .రెండు వందల పెద్ద పెద్ద బైండ్ పుస్తకాలలో తాను చదివిన వాటి సారాంశాన్నినలభై వేల పేజీలలో రాసుకొన్నాడు .అవసరమైన చిత్రాలు కూడా గీశాడు .కరెంట్ కు నిరోధాన్ని తగ్గించటానికి బదులు నిరోధం పెంచుతూ ప్రయోగాలు చేశాడు .ఫిలమెంట్ కోసం అనేక పదార్ధాలను ఉపయోగించి చివరికివాక్యూం బల్బ్ లో కార్బన్ ఫిలమెంట్ వాడి కావాల్సిన ఫలితం సాధించాడు . 1879డిసెంబర్ 31అంటే కొత్త సంవత్సరానికి ముందురోజు సాయంత్రం వందలాది జనం సమక్షం లో ఎలెక్ట్రిక్ బల్బ్ వెలగటాన్నిప్రదర్శించి చూపి అప్రతిభులను చేశాడు .ఇదే ప్రజాసమక్షం లో నిర్వహించిన తొలి ప్రయోగం .గ్రాండ్ సక్సెస్ .బల్బ్ కాంతి తగ్గకుండా చాలాసేపు వెలిగింది .దీనితో ఎడిసన్ ను ‘’మెన్లోపార్క్ మాంత్రికుడు ‘’అన్నారు సరదాగా .ముప్ఫై రెండేళ్లకే జాతీయ గౌరవం ,గుర్తింపు అందుకొన్నాడు ఎలక్ట్రిక్ బల్బ్ నిర్మాత ధామస్ ఆల్వా ఎడిసన్ .అప్పటి నుంచి ఎడిసన్ అంటే ఎలక్ట్రిక్ బల్బ్ అనే పేరు వచ్చింది .
సశేషం
గోదారి మహా పుష్కర శుభా కాంక్షలతో
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -14-7-15 –ఉయ్యూరు

