ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -63గ
27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -4(చివరిభాగం)
ఎలెక్ట్రిక్ రైల్వే రూపకల్పన
ఎడిసన్ అంటే ఎలక్రిక్ బల్బ్ కు పర్యాయ పదం అయింది .ఆ బల్బును మరింత మెరుగు పరచాలని ఆలోచించాడు .మంచి ఫిలమెంట్ కోసం ప్రయోగాలు చేస్తున్నాడు .వెదురు ఫిలమెంట్ ను ప్రయత్నించాడు .ఇందులో ఏ రకమైన వెదురు శ్రేస్టమో అని ప్రయోగాలు చేసి లక్ష డాలర్లు ఖర్చు చేశాడు .యారు వేల స్పెసిమెన్ లు పొందాడు .అందులో మూడు మాత్రమె కరెక్ట్ రిజల్ట్ ఇస్తాయని భావించాడు .కొత్త డైనమో ,కొత్త పరికరాలు తయారు చేశాడు .కొత్త సంస్థను నెలకొల్పాడు .అదే తర్వాత కన్సాలిడేటెడ్ ఎలెక్ట్రిక్ కంపెనీ అయింది .ఎలెక్ట్రిక్ లైట్ ఒక్కటి మాత్రమె అతని ఆశయం కాదు .మాగ్నెటిక్ ఖనిజం ను వేరు చేసే యంత్రం సాధించాడు .ఎలెక్ట్రిక్ రైల్వే రూపకల్పన చేశాడు దీనినే తర్వాత న్యూయార్క్ సిటీ సబ్ వే లో ఉపయోగించారు .
భార్య మరణం
ముప్ఫై ఏడవఏట ఎడిసన్ ఒంటరి వాడయ్యాడు .1884లోటైఫాయిడ్ తో చనిపోయింది .ముగ్గురు పిల్లలు అమ్మమ్మగారింటికి వెళ్ళారు .ఎడిసన్ ఎక్కువ కాలం న్యూయార్క్ ఆఫీస్ లో గడిపాడు .పెద్ద ఉత్పత్తి కేంద్రం యూనియన్ కాలేజి నుంచి ప్రారంభించాడు .
కొత్త భార్య
భార్య చనిపోయిన ఎడాదిన్నరకు వ్యవసాయం లో సృజనాత్మక పరిశోధన చేసిన లూయిస్ మిల్లర్ కుమార్తె తో పరిచయమై ఆమెకు మోర్స్ కోడ్ నేర్పి ప్రేమ మెసేజ్ పంపితే ఆమె ఒప్పుకున్నట్లు తిరుగు టపా మేసేజ్ పంపింది .వివాహమైన తర్వాత పిల్లలతో సహా న్యు జెర్సీ లోని ఆరంజ్ మౌన్టేన్స్ లో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొని కాపురం పెట్టాడు .నలభైలలో అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది .
మోషన్ పిక్చర్ కెమెరా
ఫోనోగ్రాఫ్ ,ఎలెక్ట్రిక్ లైట్ లతో ప్రసిద్ధి చెందిన ఎడిసన్ వాటిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాడు .ఇప్పుడు దృష్టిని మోషన్ పిక్చర్ కేమేరాపై పెట్టి కృషి చేసి సాధించాడు .ఈ మూడు ఎడిసన్ చేసిన వందలాది సృజనలను మరపించేట్లు చేశాయి .
మరిన్ని సృజనలు
చనిపోయే దాకా కొత్త ఆవిష్కణలకోసం తాపత్రయ పడుతూనే ఉన్నాడు .మొట్టమొదట వచ్చిన టైప్ రైటర్ ను మెరుగు పరచాడు .కొత్త రకమైన మిమియోగ్రాఫ్ మెషీన్ తయారు చేశాడు .పోర్ట్ లాండ్ సిమెంట్ తయారీలో పెద్ద బట్టీని తయారు చేశాడు నిర్దుష్టమైన.ఆల్కలిన్ బాటరీనితయారు చేశాడు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో కార్బాలిక్ యాసిడ్ కొరత ఏర్పడితే జర్మనీ నుంచి దిగుమతి చేసుకొనేవారు .దీనికి ప్రత్యామ్నాయ సింథటిక్ యాసిడ్ తయారు చేయటం అసాధ్యం అని అమెరికన్ సైంటిస్టులు అన్నారు .దీన్ని చాలెంజి గా తీసుకొని ఎడిసన్ పద్దెనిమిది రోజుల్లో సింథటిక్ యాసిడ్ తయారు చేసి చూపించాడు .రబ్బర్ కు మూలకం ఏమిటో తెలుసుకోవాలను కొన్నాడు .జీవిత చరమాంకం లో రబ్బర్ ను వల్కనైజింగ్ ను బంగారు కడ్డీ ఆధారం గా చేశాడు .
ఎడిసన్ హాబీ- ‘’పని ‘’
ఎడిసన్ హాబీ ఏమిటి అంటే’’ వర్క్ ‘’మాత్రమె .’’work heals and ennobles ‘’అన్నాడు ఎడిసన్ తన డెబ్బై ఏడవ .పుట్టిన రోజు నాడు .అతని జీవిత ఫిలాసఫీ ఏమిటి అని అడిగితె ‘’work brings out the secrets of nature and applies them for the happiness of men ‘’అని తన ఫిలాసఫీ గురించి చెప్పాడు .
గౌరవ పురస్కారాలు
1928లో ‘’కాంగ్రెషనల్ మెడల్ ఆఫ్ ఆనర్ ‘’అంద జేసింది అమెరికా ప్రభుత్వం .ఏడాది తర్వాత అతని ముఖ్య స్నేహితుడు హెన్రి ఫోర్డ్ ఎలెక్ట్రిక్ బల్బ్ ఆవిష్కరణ యాభై వ వార్షి కొత్సవ౦ మిచిగాన్ లోని డియర్ బారన్ లో . జరిపించాడు . మెన్లో పార్క్ లోని లాబ్ ను ఇక్కడ పునర్ వ్యవస్తీకరించాడు ఫోర్డ్ .చివరిదాకా హుషారుగా ఉత్సాహంగా పని చేస్తూ ధామస్ ఆల్వా ఎడిసన్ 18-10-1931లో ఎనభై నాలుగేళ్ళకు చనిపోయాడు .ప్రపంచానికి ఎలక్ట్రిక్ కాంతి నందించిన ఎడిసన్ జీవిత కాంతి ఆరిపోయింది .చనిపోవటానికి ముందు అమెరికా ప్రభుత్వ పేటెంట్ ఆఫీస్ 1098విడి విడి పేటెంట్ లను ఎడిసన్ కు పంపించింది .
మానవ సంక్షేమం కోసం ఎడిసన్ తాపత్రయ పడ్డాడు .కనిపెట్టినడానికి ఆర్ధిక సౌష్టవం కలిపించటమే తన ధ్యేయం అన్నాడు .అంతమాత్రం చేత డబ్బు సంపాదించే మెషీన్ అను కొంటె పెద్ద పొరబాటే .షేక్స్పియర్ ను టాం పైన్ ను ఇష్టపడి చదివేవాడు .విపరీతంగా పుస్తకాలు చదివేవాడు .వయోలిన్ అద్భుతంగా వాయించేవాడు .ఎడిసన్ ‘’కొత్తగా కనిపెట్టిందిఏదీ లేదు .ఉన్నదాన్ని బాగు చేశాడు ‘’అని అతన్ని విమర్శించారు దానికి సమాధానం గా ‘’through all the years of experimenting and research ,I never once made a discovery .I start where the last man left off .Al l my work is deductive and the results I achieved were those of invention pure as simple ‘’అని నిర్మొహమాటం గా చెప్పాడు .
మరోప్రముఖునితో కలుద్దాం
సశేషం
గోదావరి మహా పుష్కర శుభా కాంక్షలతో
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -14-7-15 ఉయ్యూరు
.

