ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -65
28-మానవత్వాన్ని మాత్రమే చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh-2
ఇరవై అయిదేళ్ళ వయసు లో విన్సెంట్ జీవితం లో తాను విఫలమయ్యానని అనుకొన్నాడు .ఆర్ట్ డీలర్ గా ,టీచర్ గా ,మత బోధకుడుగా ఫైల్యూర్ .దేనిలో చెయ్యి పెట్ట్టినా మసే .ఉద్యోగం లేకుండా ఉండటమే అలవాటు చేసుకొన్నాడు .చివరికి ఆర్టిస్ట్ అవాలనే భావం నిశ్చయమైంది .తన ధైర్యాన్ని ఒక మీడియం లో అందునా చిత్ర లేఖనం లో చూపించాలనుకొన్నాడు .తన జీవితానికి కృతజ్ఞత కూడా చూపించాలనుకొన్నాడు .వెంటనే పెయింటింగ్ ప్రారంభించలేదు .సంగీతం ఇచ్చే మానసికోల్లాసం లాగా పెయింటింగ్ కూడాఇవ్వాలి అనుకొన్నాడు .అసలే శూన్యం ఆవహించిన ప్రపంచం లో ఏదో దైవ విభూతిని దర్శింప జేయాలనుకొన్నాడు .చివరికి ఏదో ఒకటి గీసేవాడు అవి ఆకర్షణగా ఉండేవికావు .చిన్నపిల్లల పిచ్చి గీతల్లా అనిపించాయి .’’మాన్యూల్ ఆఫ్ డిజైన్ ‘’అనే గ్రంధం చదివాడు .’’సైన్స్ ఆఫ్ అనాటమీ’’చదివి వ్యాపార దృష్టిని వదిలి చిత్రాలు వేశాడు .మిల్లెట్ చిత్రాలను చాలా కాపీలు చేశాడు .అతని సోఎర్ ,మాన్ విత్ ది హో ,గ్లీనర్స్ మొదలైన రైతు కుటుంబ సంబంధ చిత్రాలను కాపీ చేశాడు .
విన్సెంట్ తాను గొప్ప చిత్రకారుడు అనిపించు కోవాలనే ఆలోచనలో లేడు.కష్టజీవుల ముఖ కవళికలు చిత్రించాలన్న ఆరాటమే ఆయనది .వారిలో తానూ ఒకడినే అనే భావనలో ఎప్పుడూ ఉండేవాడు .చాలాకాలం తర్వాత చలికాలం లో తలిదండ్రుల్ని చూడటానికి వెళ్ళాడు.అప్పుడే ఒక బంధువులమ్మాయి వారింటికి వచ్చింది విన్సెంట్ కంటే పెద్ద పిల్ల .ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పేశాడు .ఆమె నిరుత్సాహ పరచింది .ఆమెను అనుసరించి ఆమ్ స్టర్ డాం కు వెళ్ళాడు .ఆమె తలిదండ్రులు మరీ మొండిగా ఇతన్ని ఆమెతోమట్లాడటానికే ఒప్పుకోలేదు ఆయిల్ లాంప్ మీద చెయ్యిపెట్టి విన్సెంట్ కనీసం ఒక్కసారైనా ఆమెను చూడాలని కోరాడు .చెయ్యి కాలిపోయింది కాని ప్రయత్నం ఫలించలేదు .ఈ రకం గా రెండవ సారికూడా ప్రేమ విఫలమైంది .తనకుటుంబం వారి సానుభూతి కూడా పొందలేక పోయాడు .తమ్ముడు థియో మాత్రమే అన్నకు విశ్వాసం గా ఉన్నాడు .
హేగ్ కు వెళ్లి మావే అనే బంధువు దగ్గర పెయింటింగ్ నేర్చుకొన్నాడు .అతడు లాండ్ స్కేప్ పెయింటింగ్ లో సిద్ధ హస్తుడు .మావే విన్సెంట్ తో బ్రష్ పట్టించి ఆయిల్ పెయింటింగ్ నేర్పించాడు .స్టిల్ లైఫ్ చిత్రాలు గీయటం నేర్పాడు .ఇంటిలోని వస్తువులను చిత్రించటం అలవాటు చేశాడు .తమ్ముడు డబ్బు పంపి సాయం చేస్తున్నాడు .ఒక మోడల్ ను డబ్బుతో కుదుర్చుకొని పెయింటింగ్ సాగించాడు .అడుక్కునే వాళ్ళను వేశ్యల్ని కూలీలను మోడల్స్ గా చేసి చిత్రాలు వేశాడు .
ఒక వేశ్యను మోడల్ గా చేసుకొని చిత్రాలు గీస్తూ ప్రేమలో పడ్డాడు మూడోసారి .ఆమె కాదన లేదు .ఆమెకు అప్పటికే ఒకకొడుకు ,మళ్ళీ గర్భిణీ .ఆమె చాలా ముతక ,రోగిష్టి ,వికారి చుట్టలు తాగేది .ముప్ఫై ఏళ్ళ మనవాడు ఆమెను పెళ్లి చేసుకొంటానని చెప్పి మురికి కూపం లాంటి ఆవాసం లోంచి మార్పించి తెచ్చుకొన్నాడు. కొన్నిరోజులు సంతోషంగానే గడిపారు .నెమ్మదిగా ఆమెతో మాట్లాడటం మానేశాడు .వారిద్దరికీ విషాదకర జేవితం తప్ప ఏమీ పోలికలు లేవు .నిరక్షర కుక్షి ఆమె .విన్సెంట్ స్నేహితులు అతనితో గడపటానికి వస్తే తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకొనేది .ఆమె తల్లి పరిస్తితిని మరీ దారుణంగా మార్చింది .ఈ ఒంటరి జీవితం కంటే మురికి వాడలో బ్రోతేల్ హౌస్ జీవితమే మేలు అని నూరిపోసేది తల్లి .క్రమంగా మనవాడి నుంచి జారుకొని పాత జీవితం లో ప్రవేశించింది .మళ్ళీ విన్సెంట్ వాన్ గో ఒంటరివాడయ్యాడు .
షేక్స్పియర్ ‘’రైపెంస్ ఈజ్ ఆల్ ‘’అనే కవితకు ‘’ఎమోషన్ ఈజ్ ఎవిరి థింగ్ ‘’అన్నది కలిపాడు .ప్రతి వస్తువులోను ఎమోషన్ నే చూశాడు .తారసపడిన ప్రతివాడిలోనూ ,ముట్టుకున్న ప్రతిదాంట్లోను ఎమోషన్ నే దర్శించాడు .పైకికనిపించేదికాకుండా అంతరాన్తరాల్లోకి చొచ్చుకుపోయి ,జీవి.త పరమార్ధాన్ని గ్రహించాడు .గురువు మావే చూడని దాన్ని శిష్యుడు విన్సెంట్ చూసి గురువుకే కళ్ళు తిరిగేట్లు చేశాడు .కాని ఇంకా రంగులలోని మిస్టరీని చేదించలేక పోయాడు .వాటిలోని రహస్యాలను గ్రహించాడు .ఆకురాలుకాలం లోని సూర్యాస్తమయాన్ని చిత్రించి తమ్ముడికి విషయం తెలియ జేస్తూ ‘’the main thing is to get the depth of color,the enormous source and solidly of the ground .,I did not realize until I came to paint how much light even in the dark parts .I had to catch the light yet convey the depths of solid ;;అని తెలియ జేశాడు .చెట్లను వాటి వ్రేళ్ళను ట్యూబ్ లద్వారా సారాన్ని లాగి ,బ్రష్ తో మోడల్స్ గా చిత్రించాడు .అతని చిన్నారి చెట్లు నిటారుగా వ్రేళ్ళవలన స్తిరంగా నిలబడి ఉండేవి .
విన్సెంట్ తలిదండ్రులు న్యునేన్ లోని బాబంట్ గ్రామానికి మారారు .ఆ ఇంట్లో వాషింగ్ రూమ్ లోనైనా తనకు చోటు కలిపిస్తే ,చిత్రాలు వేసి బతుకుతానని బతిమాలాడు .మట్టిమనిషిగా ఉందామనుకొన్నాడు .చోటిచ్చారు .దున్నిన పొలాలను ,మట్టికోట్టుకొని పోయిన పూరి గుడిసేలని ,మగా ఆడ చేసే త్రావ్వకాన్ని ,నేత నేస్తున్న కార్మికుడిని ,సాయంకాలం అన్నం తింటున్న శ్రామిక జనాలను చిత్రించాడు ఈ మట్టిమనుషులు మట్టి రంగులో ,సంసార పక్షంగా ,తాము తినే మట్టిలోని బంగాళాదుంప ల్లాగా ఉన్నట్లు చిత్రించాడు .వాళ్ళ దుస్తులలో హావ భావాలలో ఒరిజినాలిటి తెచ్చాడు .ఇదంతా శ్రామిక జన కళ్యాణ దీక్ష .తనలాగే తిరస్కృత అయిన తన కన్నా పెద్దదైన ఒకావిడ తో స్నేహం చేసి తన బాగోగులు చూడటానికి ఏర్పాటు చేసుకొన్నాడు .సోమరి అని భావించి దమ్మిడీసంపాదన లేని వాన్ తో ఉండటం ఇష్టం లేక ఒకసారి చంపే ప్రయత్నమూ చేసింది .మళ్ళీ స్త్రీ చేత దగాపడినవాడై చీకట్లో కూరుకు పోయాడు ;తమ్ముడు కూడా ఏమీ సహాయం చేయలేక పోయాడు .సాయం చేయటానికి తనదగ్గర ఏమీ లేదన్నాడు .కాని థియో నే గతి .అనిపించింది .పారిస్ లోఉన్న తమ్ముడిదగ్గరకు విన్సెంట్ 1886ఫిబ్రవరి లో చేరాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-15 –ఉయ్యూరు ‘
.

