గురు పూజోత్సవ ఆహ్వానం
సుమారు 70 సంవత్సరాల క్రితం ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేన్యులు కీ .శే.కోట సూర్య నారాయణ శాస్త్రి గారి చిత్ర పట ఆవిష్కరణ కార్య క్రమం వారి కుటుంబ సభ్యుల సమక్షం లోశ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ గారి జన్మ దినోత్సవమైన ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురుపూజోత్సవం గా 5-9-2015శనివారం ఉదయం 10 గం లకు సరసభారతి,మరియు పరిమికాయల రామస్వామి మెమోరియల్ నేషనల్ జూనియర్ కాలేజ్ ( పి ఆర్ ఎస్ ఎం ఎన్ జూనియర్ కాలేజ్ ) ఫ్లోరా స్కూల్ వద్ద, తోట్లవల్లూరు రోడ్ సంయుక్త ఆధ్వర్యం లో ఆ కళాశాల ఆవరణలో జరుగుతుంది ..ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ విచ్చేస్తారు .చిత్రకారుడు శ్రీ టి. వి .ఎస్. బి .శాస్త్రి (ఆనంద్),దంపతులు ,మా గురుపుత్రులు తమ కుటుంబాల తో పాల్గొని కార్యక్రమానికి వన్నె తెస్తారు .ప్రముఖ కూచి పూడి నాట్యాచార్యులు ,కేంద్ర నాటక అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ వేదాంతం రాధేశ్యాం గౌరవ అతిధిగా విచ్చేస్తారు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీమతి సింగరాజు కల్యాణి గారు ,శ్రీమతి కాళీ పట్నం ఉమ గారలు(మచిలీపట్నం )’’గాత్ర సంగీత కచేరీ ‘’ తో వీనుల విందు చేస్తారు . . శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ,గురు పుత్రుల కుటుంబాలవారికి , ,ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ దంపతులకు ,శ్రీ వేదాంతం రాధేశ్యాం ,శ్రీమతి సింగరాజు కల్యాణి శ్రీమతి కాళీపట్నం ఉమ గార్లకు కళాశాల అధ్యాపకులకు , సన్మాన కార్యక్రమం జరుగుతుంది . ప్రతిభ గల ఒక పేద విద్యార్దినికి,ఒక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసిన ‘’ శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి స్మారక’’ నగదు బహుమతులను సరసభారతి ద్వారా అందజేయ బడును .
పూర్తీ వివరాలతో ఆహ్వాన పత్రాన్ని ఒక వారం రోజులలో అందజేయగలము
ఉయ్యూరు -27-7-15 గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు,కార్యవర్గం
- పి.ఆర్. ఎస్. ఏం .జూనియర్ కళాశాల
విద్య నేర్పిన గురువులను సదా స్మరిద్దాం
