విశ్వనాధ రాయాలనుకొని రాయని రచనలు
‘’మా అన్న గారు వ్రాసినాన్ని కావ్యాలు రాసి ,వ్రాసినాన్ని కావ్యాలు రాయకుండా వదిలేశాడు ‘’అని విశ్వనాధవారి తమ్ముడు శ్రీ వెంకటేశ్వర్లు గారు రాశారు .దీన్ని బట్టి విశ్వనాధ మనసులో ఎన్నో రచనలు గర్భస్తంగా నే ఉండిపోయాయని పురుడు పోసుకోలేదని తెలుస్తోంది .కొన్నిటికి పేర్లు కూడా పెట్టి ప్లాట్ తయారు చేసు కొని ,ప్రణాలికను కూడా మనసులో రచించుకొని , ,కారణాంతరాల వలన రాయలేక పోయారు .దీనివల్ల ‘’విశ్వ నాద భారతి ‘’కి సంపూర్ణ ఠాసాహిత్యాభారణాలు సమకూరక కొంత లోటు గా కనిపిస్తుంది ఆ విషయాలనే తెలుసుకో బోతున్నాం .
మొట్ట మొదటి సారిగా కిన్నెర సాని పాటలు రాసేటప్పుడే ‘’రధంతరి ‘’అనే పాటకూడా రాయాలని విశ్వనాధ సంకల్పించారు .’’రధ0తరీ! రద0తరీ!నాట్యమాడవే రధంతరీ’’అనే మకుటం టో ఒక పాట రాస్తానన్నాడు .అది వ్రాయనేలేదు ‘’అన్నారు వెంకటేశ్వర్లు .అలాగే’’ మా స్వామి ‘’చివరలో ఒకపద్యం లో ‘’ఈ కిన్చిత్క్రుతి ఎట్టులైన మరి ఏమీ లేదు లేవయ్యా ,వే-దా !కాపర్దశిఖాదునీ !స్వనిత గాదా !విశ్వనాధా !భవవి -శ్రీ కంఠాభరణంబు చెప్పెదను రాజీవంబు లో తేనియల్ ‘’ మొదలైన పద్యాలలో ‘’శ్రీ కంఠా భరణం ‘’అనే కావ్యం రాయాలని విశ్వనాధ అనుకొన్నట్లు తెలుస్తోంది .’’షష్టిపూర్తికి ముందో ,తరువాతో నేను ఆయన్ను శ్రీ కంఠాభరణం రాయకూడదా అని అడిగాను .రాయాలిరా 1 అది సామాన్యమైన పనికాదు .జైమినీ భారతం లో సురధుని పాలనాన్ని కుమార స్వామి సంపాదించి ,శివ కపాల మాలలో సంఘటింప చేసిన కదఉన్నది .దానితో బాటు నూట ఎనిమిది కధలను కల్పించి శివ కపాల మాల ను పూర్తీ చేయ వలసి ఉన్నది .నాన్న కధను కూడా అందులో నొక దానిని చేసి ఆయన కపాలాన్ని కూడా అందులో గ్రుచ్చి నట్లుగా వ్రాయాలని ఉన్నది ‘’అని అన్నాడని వెంకటేశ్వర్లుగారు రాశారు . ‘’నేనాయన భావనా పార మేష్ట్యమునకు అబ్బుర పడి ఊరుకొంటిని .మేధ పరాశక్తి యొక్క వివర్త స్వరూపము .ఆవిడ వాక్య రూపము పొందటానికి మహనీయమైన సుకృత ఫలము కావలసి ఉంటుంది ‘’అని రాయలేక పోయిన కారణానికి ఆధ్యాత్మికతను జోడించి చెప్పారు తమ్ముడుగారు . .ఎంత గొప్ప ప్రణాళిక ను విశ్వనాధ రచించుకోన్నాదోమనసులో అని పిస్తుంది ఇది తెలిస్తే .ఆ కంఠాభరణం భారతీశ్రీ కి అలంకారం కాకుండా పోయినందుకు బాధ గానే అనిపిస్తుంది మనకు .
గుంటూరులో విశ్వనాధ ఉన్నప్పుడు ‘’శ్రీ మంతా చార్యుల’’ వారి వద్ద ‘’చాన్దోగ్యోపనిషత్ ‘’చదువుకొన్నారు. తరువాత ‘’చందోగులు ‘’అనే పేరుతో ఒక నవల రాస్తానని తమ్ముడితో విశ్వనాధ చెప్పాడు .కాని కార్య రూపం దాల్చలేదు .అలాగే ‘’ఊచ యుద్ధం ‘’అనే కృతి అయన రచనలో దొరకటం లేదన్నారు .దానిపై స్పందిస్తూ ‘’అది వ్రాసిన కదా దొరకటానికి ! ఊచ యుద్ధం పల్నాటి వీరులైన అలరాజు ,ప్రోల రాజు ల యుద్ధం .వివరాల గోడిగ’’ను గూర్చిన పద్యాలలో అది కొంతవరకే వర్ణింప బడింది.దాన్ని వేరే కావ్యంగా రాద్దామనుకొన్నాడు .అది జరుగలేదు ‘’అని నిర్వేదం వెలిబుచ్చారు వెంకటేశ్వర్లుగారు .ఇలా మహత్తర రచనలకు మనసులోనే శ్రీకారం చుట్టారు కాని వాటిని రాసి వెలువరి౦చలేక పోయారు విశ్వనాధ .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

