లోతైన శాంతి వేదాంతం వైపుకు

లోతైన శాంతి వేదాంతం వైపుకు

‘’ఇక నుండి  పురాతన ,మధ్యయుగ, ఆధునిక యుగ చరిత్ర అనే పేరుండదు .ఇప్పటినుండి పూర్వ అణుకాలం ,అణుకాలం అనే పిలవాల్సి ఉంటుంది .కొత్త చారిత్రిక కాలాన్ని ఆవిష్కరించుకోవాలి ‘’అన్నాడు 19 49 లో హీరోషీమా ఉదంతం జరిగిన నాలుగేళ్ళతర్వాత మొట్ట మొదట సారిగా ప్రచురించిన ‘’ఫిలాసఫీ ఆఫ్ పీస్’’ పుస్తకం లో జాన్ సోమేర్ విల్లీ .మన ప్రస్తుత కాలెండర్ మన ద్రుష్టిని 6-8-19 45మరల్చి మానవ చరిత్రలో ఒక విభజనను ఏర్పరచి ,యేసు క్రీస్తు పుట్టినకాలం కంటే అత్యధిక సంచలనమే సృష్టించింది ..కనుక ఈ సంవత్సరాన్ని,1986A.D అనటం  కంటే   41 పోస్ట్ హెచ్ (41post  H)అని పిలవాలి  .ఇది ఒక మానసిక వ్యాయాయమే .ఇది  మన దృక్పధం  అంతా మార్చేస్తుంది .ఇదేమీ కొత్తకాదు .ఆర్ధర్ కెప్లర్ సుమారు వందయేళ్ళ కిందటే ఇలాంటి కేలండర్ ను వాడమని సూచించాడు .కాని అయన ఆలోచనలను ఎవరూ పట్టించుకోలేదు .

1945ఆగస్ట్ 6 కు ముందున్న శతాబ్దం కు సంబంధించిన కాలం ఇంకా కాలగర్భం లో సుప్తంగానే చీకటిలో ఉండిపోయింది .ఇది అటామిక్ కార్డ్ ను పూర్వకాలానికి కలిపేదే .హీరోషీమా అటామిక్ బాంబ్ ఉదంతం తర్వాత బతికి ఉన్న వారిని అధ్యయనం చేస్తూ రాబర్ట్ లిఫ్టన్ ‘’హిబా కుష ‘’ తమకు ఇంతకంటే శక్తి వంతమైనదేదీ  తామున్న పరిస్తితులలో సాయం చేయగలిగినది కనిపించలేదని  పదే పదే చెప్పినట్లు గుర్తు చేసు కున్నాడు .

ఇంతకీ హిబా కుష అంటే ‘’చావులో మునిగిపోయిన ‘’లేక’’ విస్ఫోటన బారిన’’ పడిన అని అర్ధం .ఆది భౌతిక (మెటాఫిజికల్ ), మానసిక (సైకలాజికల్),భావాత్మక (ఎమోషనల్)ముగా మనమందరం విస్ఫోటన బాధితులమే .లోతుగా ఆలోచిస్తే మనమందరం( ‘’హిబా కుష )లమే .

క్లాడ్ లాంజ్ మాన్ అనే ఆయన ఆమధ్యనే తొమ్మిది గంటల సినిమాను ఈ హోలోకాస్ట్ గురించి తీశాడు . ఆ ఉదంత ప్రభావం క్రానాలజిపై మొదట పడి దాన్ని విచ్చిన్నం చేస్స్తుందని తెలిపాడు .ఈ మారణ హోమం జ్యూయిష్ హోలోకాస్ట్ కు వర్తిస్తుంది .అంతే  కాక ఒక మిలియన్ హీరోషీమా వాసులు అంతరించిపోవటానికి కారణమైంది కూడా .ఇంత భారీ అనంత మానవ హనననం  పశ్చిమ దేశాల ఆలోచనననే మార్చేసింది .

దీనితో మనం ఉన్న సాధారణ కాలమానాలు ,వాటిపై ఇప్పటికి ఉన్న అభిప్రాయాలు మార్చుకోక తప్పదనిపిస్తోంది .ఆకాలం మనల్ని అణగ తోక్కిపడేసింది ,పెత్తనం చేసింది . లేవకుండా చేసింది .తప్పించుకొని పారిపోకుండా ,చావు నుండి తప్పించుకోకు0డాకూడా చేసింది . ఇంకే విధమైన సంస్కృతీ ఇంతటి ‘’చావు కాలాన్ని ‘’(కిల్లింగ్ టైం )ఆలోచించి ఉండలేదు .దీనితో క్షీణత,వినాశనం, చావు లపై ద్రుష్టి ఎక్కువై సృజన ,నివారణ కాలం గురించి ఆలోచించలేదు .ఒడిలో పసిపాపను౦చు కొన్న బాలింత యువతీ కాలాన్నిగూర్చి ఆలోచించలేదు .కాని ఈ తర్వాతి కాలం-‘’ చావు-కాలాల ‘’   మధ్య దానితో సంబంధం కలిగి ఉన్నదికదా .

ఈ నాటి ఆధునిక సమాజం సమస్య ఏమిటి అంటే మనం కొత్త పురాణ కధలు ,భావ చిత్రాల గురించి మంచిగా ఆలోచించ లేక పోతున్నాం .మనది ‘’మైతో పొయేటికల్ పెర్సే ప్షన్ ఫైల్యూర్ ‘’అన్నాడు రసెల్ హోబాన్ .కనుక ఇది ఎక్కడో ఒక చోట  మొదలవ్వాలి .అందుకని ఆటం బాంబ్ తో మొదలు పెడదాం .అది యదార్ధమేకాక మనందరి శత్రువుకూడా .

ఇప్పుడు మనం ఒక ప్రత్యేక  సంస్కృతీ అంచున ఉన్నాం .నిజంగా చెప్పాలంటే హీరో షీమా ఉదంతం తర్వాత ఆ అంచును కూడా దాటేశాం .దీన్ని అంటిపెట్టుకు వచ్చిన కాలం ,చరిత్రలను అంటిపెట్టుకొని ఉంది .అందుకే కాలం లో మిలియన్ సెకండ్ లలో భిన్నంగా అంటే ‘’నానో సెకండ్ ‘’గా మార్చే ప్రయత్నం జరిగింది

ఈ ఉదంతం తో ఒక సంస్కృతీ మిగిలిన వాటిపై విజయం సాధించినట్లు అనిపిస్తుంది .ఇదే సంపూర్తిగా ‘’టోటలిటేరియనిజం’’ (నియంతృత్వం)గా  మారింది .ఇప్పటిదాకా ‘’హీబా కుష’’అంటే క్రిస్టియన్ బాంబ్ అనే పేరు సార్ధకమైపోయింది .

హీరోషీమ బాంబ్ బ్లాస్ట్ తర్వాత దానికి దగ్గరలో ఉన్న ఒక కేధలిక్ ప్రీస్ట్ బాంబు విస్ఫోటన సమయం లో తన ‘’గోడ గడియారం ఆగిపోయినట్లు’’ గుర్తించాడు. ఆ మూగ కదలలేని గడియారం జరిగిన మానవ మారణ కాండకు సాక్షిగా నిలిచింది .హిబా కుష లకు మాత్రం పాత ప్రపంచకాలం ఆగిపోయిందని  మనకుకూడా టైం వరల్డ్ కూడా6-8-1945కు  సమాప్తమై పోయిందని  అనిపిస్తుంది .హీరో షీమ ఒక ‘’పార హిస్టారిక్ ఈవెంట్ ‘’ను సూచిస్తు0దని అన్నారు .దీనితో మనమంతా మామూలు పడమటి చారిత్రిక విధానం నుంచి దాటి జీవిస్తున్నాం .ఇప్పుడు మనం వాస్తవంగా ప్రపంచ వినాశనానికి ముందుకాలం దాటివచ్చి  ‘’ ప్రపంచ వినాశన’ఆన0 తర కాలం ‘’లో జీవిస్తున్నాం .

ఆధారం ‘’దర్శన ఇంటర్ నేషనల్ -1986 జనవరి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-15 –ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.