లోతైన శాంతి వేదాంతం వైపుకు -2
41 పి హెచ్ కాలం లో ఉంటున్న వారికి విశ్వా౦త రాళ ,వ్యక్తిగత స్థాయిలలో ఒకే విధమైన సమస్యలు ఎదురౌతున్నాయి .మనం ఉన్న సంస్క్రుతికాలం ప్రపంచం లేకుండా సమాప్తమవుతుందా ?అనేది అందరిని వేధించే ప్రశ్న .సత్యాన్ని విస్మరించి బతుకుతున్నామా అనేదీ ఒక ప్రశ్నగా మిగిలింది .దీనికి రెండు రకాల సమాధానాలు కనిపిస్తున్నాయి .అందులో ఒకటి ‘’అటామిస్ట్ సెపరేటిస్ట్’’అయితే రెండవది ‘ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ ‘’.స్తూలంగా ఆలోచిస్తే మనం మెటా ఫిజికల్ అపార్ధీ,కి లోబడి మిగిలిన ప్రపంచం టో సంబంధం లేకుండా గడపటం లేక మనం మనమున్న పరిసరాల లో ఒకరుగా బతకటం అంటే ఒక చెట్టుగానో డాల్ఫిన్ గానో ఒక పర్వతంగానో ఉండిపోవటం .
మనం ఆధునిక వ్యక్తిగత సమాజం లో ఉంటున్నాం కనుక కాలం గురించిన అవగాహన అందరిదీ ఒకటిగానే ఉంటుంది .సభ్య సమాజ సభ్యులమే మంనమంతా. ఆనుభావాలు అందరివీ దాదాపు ఒకటిగానే ఉంటాయి .గాఢమైన ప్రాపంచిక విషయాలు కాలం తోఅంటే ‘’అంతా అయిపొయింది –చివరిదశకు చేరుకోబోతున్నాం అనేదానితో ముడిపడి ఉంటాయి .’’ఇప్పుడు ‘’అనే మాటకు అర్ధమే మారిపోయింది .ఈకాలం లో ఇప్పుడు అంటే ‘’అటామిక్ రిడక్షనిస్ట్ ‘’భావం కనిపిస్తుంది .విస్తృతమైన ‘’ఇప్పుడు ‘’జేనేసిస్ ‘అపోకలిప్టిక్ టైం లైన్ ‘’ ’తోబంధం ఏర్పడి కనిపించదు .మనకు కనిపించేది మనం అనుభవించేదానికి మొదలు ,తుది లేనిది .డాక్టర్లు మొదలైనవారి పరిశోధనలలో ఈ ప్రపంచ విలువ లెక్కకు మించి పెరిగింది .శత్రువు అనే భావం నశించి ,మనమే అంతా అనేది ఏర్పడింది .
ప్రపంచ అగ్రగామి వేదాంతి జిడ్డుకృష్ణ మూర్తి ఎప్పుదూకూడా ప్రజలు ‘’కాల సమాప్తి ‘’ని అనుభవించాలి అని బోధించేవాడు .అంటే పరంపరాగతమైన కాలం ఆలోచన నుండి విముక్తి చెందాలని ఆయన భావం .ఆయన బోధించిన రెండు సిద్ధాంతాలు ఈ నాటి కాలానికి సరిగ్గా వర్తిస్తాయి .మొదటిది ’’ప్రేమ ,శాంతి అనేవి కారణాలేవీ లేకుండానే కలిగేవి ‘’రెండవది ‘’వ్యక్తీ అంటేనే ప్రపంచం .’’
ద్వంద్వంగా,వేరువేరుగా కనిపించే రెండురకాల టైం వరల్డ్స్ అనేవి మనసంస్కృతీ పరంపరలో ,మత భావనలలోనే గర్భస్తమై ఉన్నాయి .అత్యున్నతమైన సంస్కృతీ అనేక శతాబ్దాలుగావిలువలను వెదజల్లి ,ప్రస్తుత కాల ప్రపంచానికి దూరంగా మరో అందని ప్రపంచానికి దారి చూపిస్తున్నాయి .వీటన్నిటి ఫలితంగా ఉన్నత కాలాతీత విలువలు మానవ మస్తిష్కం లోనే ప్రభవించి ఈ ప్రపంచానికి సంబంది౦చి నవిగానే అనిపించి ‘’దేవుడు లేడు’’అన్నభావనకు తప్పుగా సంకేతాలిస్తున్నాయి .ఇవి మతానికి వ్యతిరేకం అని కూడా అనిపిస్తుంది .ఇదే ప్రముఖ వేదాంతులు స్పినోజా ,ఫ్యూయర్ బాచ్ విషయం లో జరిగింది .నిజానికి వారిద్దరూ ఈ ప్రపంచం లో ఆధ్యాత్మిక భావనలు నెలకొల్పినవారే .
స్థూల జగత్తుకు సూక్ష్మ జగత్తుకు మధ్య అతి సన్నిహిత సంబంధం ఉన్నదని అందరికి తెలిసిన విషయమే .ఇది అనాదిగా విస్తరిల్లిన భావమే .’’టావోయిస్ట్’’వేదాంతం లోను ,పశ్చిమ దేశ వేదాంతం లోను చెప్పబడినదే .పదహారవ శతాబ్ది వైద్య శాస్త్రవేత్త,దార్శనికుడు ‘’పెరాక్లియాస్ ‘’కూడా ఈ భావాన్ని వ్యాప్తి చేశాడు .ఎవరేమి చెప్పనా ప్రతి వ్యక్తీ ఒక సూక్ష్మ ప్రపంచమే .అన్నికాలాల్లో అందరు మానవుల కు ప్రతినిదియే అనేది సార్వకాలిక సత్యం .
ఈ స్థూల సూక్ష్మ భావన భౌతిక ప్రపంచం లో ఏ కాలం లో జరిగే సంఘటన అయినా మనిషి వ్యక్తిగత మనసుపై ప్రతిఫలిస్తుంది .ఫిలాసఫర్ ‘’జంగ్ ‘’పైదానినే ప్రతి దిన సంఘటనలో కూడా జరుగుతుందని చెప్పాడు .ఆయన ‘’సింక్ర నాసిటి’’అనేకొత్త శబ్దాన్ని దీనికోసంవాడాడు .దీనిపై సమగ్రంగా చర్చించి ‘’An Acausal connecting principle ‘’గా రాశాడు .కోట్లాది ప్రజల విషయం లో ఈ సింక్రనిష్టిక్ అనుభవం వారి జీవితాలలో ఒక భాగమై ఉంటుంది .దీనివలన ఆంతరంగిక శాంతి ,సానుభూతి సహవేదన ఏర్పడి అనంతమైన సంతోషం ఆనందాలను పొండుతాడువ్యక్తి .ఇది గుర్తించటానికి వీలులేనంతగా ఉంటుంది. అవి అసాధారణమై ఉంటాయి .ఏ గణాంకాలు సర్వేలు వీటిని గుర్తించలేవు .ఈ రకమైన భావాత్మక అనుభవాలు పశ్చిమ దేశాలలోకంటే ప్రాక్ దేశాలలో ఎక్కువగా కనిపించటం విశేషం .
ఈ శతాబ్దపు చివరలో విలియం జేమ్స్ ఒక క్రమ పద్ధతిలో ఈ అనుభవాలపై మతాతీత౦గా విశాల దృక్పధం తో పరిశోధింఛి రికార్డ్ చేశాడు .దీనితో కాలానికి సంబంధించిన కొత్త పదజాలం ఏర్పడింది .రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ,ధనాత్మక ఆలోచనాభివ్రుద్ధితో ఇంకా పరిశోధన1969 లో సాగింది .దీనికోసం మెరైన్ బయాలజిస్ట్ ఆలిస్టార్ హార్డీ ఆక్స్ ఫర్డ్ లో ఒక రిసెర్చ్ సెంటర్ ను ఏర్పరచాడు .దీనిని ఇప్పుడు ;;’’ఆలిస్టార్ హార్డీ రిసెర్చ్ సెంటర్ ‘’గా పిలుస్తున్నారు .
ఈ రకమైన భావనలు పరిశోధనలు మనసమాజాన్ని మళ్ళీఅనంత మనవ సంబంధాలకోసం అర్రులు చాచేట్లు చేస్తున్నాయి . .ఇది విశ్వవ్యాప్తమై కాలానికి తగినదిగా విస్తరించింది .ముఖ్యంగా హీరోషీ మా ఉదంతం తరవాత వచ్చిన గొప్ప గుణాత్మక మార్పు ఇది .ప్రముఖ రచయిత ఆల్డస్ హక్స్లీ ‘’రాజకీయ సిద్ధాంతాలు సార్వకాలికమైన వేదాంత మూలాలనుండే వస్తాయి .అవి సహిష్ణుతను ,అహింసను బోధిస్తాయి ‘’అన్నాడు .ఈ వేదాంత భావనలు సూటిగా మెటాఫిజికల్ విముక్తి అనుభవాల ఆధారంగా ఏర్పడ్డవే ఈ ఉత్తమ అనుభవ దృష్టాం తాల నుండి వచ్చిన రాజకీయ నిర్ణయాలు ఇంకొంచెం లోతుగా అధ్యయన వేదికలవ్వాలి . సూటి అనుభవాలనుండి వచ్చిన ఈ కాలాతీత విలువలు సహజ ,సాధారణ జీవిత0 లో మమేకమై ,రాకకీయాలలో చేరి చివరకు మెటా ఫిజికల్ విముక్తి కారణాలౌతాయి .
పశ్చిమ దేశ వేదా౦తు లలో అగ్రగణ్యు డైన ‘’స్పినోజా ‘’ఈ ప్రపంచాన్ని అనంతమైనదిగా భావించాడు .శాంతిని నిర్వచించాడు .అందులో ‘’శాంతి అంటే యుద్ధం లేక పోవటం కాదు. శాంతిమనిషి హృదయపు శక్తి లో నుంచి జన్మించిన ఒక నైతిక ధార్మిక ప్రవరరతనా గుణం ‘’అన్నాడు (peace is not the absence of war –it is a virtue born out of the strength of the heart ‘’’-ex animi i fortitudine)అన్నాడు .ఈ ప్రపంచం అనంతమైనది కనుక పవిత్రమైనదిఅనుకొన్నవాడు ఈ భూమికి తగిన వారసుడే .అలాంటి వాడి మనసులో మైక్రో సెకండ్ కాలం లోకూడా ప్రపంచ వినాశనాన్ని తలపెట్టడు .అది వాడి సంస్కారం అవుతుంది .
కనుక ఏతా వాతా తెలి౦దేమిటి అంటే శాంతి అంటే ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొని గుణాత్మక శాంతి వేదాంతం అనంత కాలాతీత విలువల ఆధారంగా ఉండాలిఅని . .పశ్చిమ దేశావాసులుకూడా భారతీయమైన ‘’అహింస ‘’ను అవలంబించాలి .నాన్ వయోలెన్స్ అంటే వ్యతిరేకార్ధం వచ్చే భావన దూరమవ్వాలి .మొదలు చివర అనేవాటికి వాటి ఉపయోగాలు వాటికి ఉన్నాయి .ఫ్యూర్ బాచ్ చెప్పినది అందరికీ ఆలోచనానుసరణం కావాలి ఆయనమాటల్లో చెబితేనే దాని ఎఫెక్ట్, అందం –‘’it was granted only to a few to ‘’see the end of the present ,to be raised beyond its boundaries and to feel through the hard skin and crust of the currently secure maxims and principles to the eternally bubbling spring of eve lasting life –to press into the depths and perceive the pulsebeat of the creative new time ‘’
ఇప్పుడు కొద్దిమందే ఉండవచ్చు .క్రమంగా బాగా పెరగాలి సంఖ్య.ఫ్యూర్ బాచ్ ‘’History teaches us that when something stands at the very verge of its total destruction ,it once again raises itself with all its force ,as if it wished to begin anew its already finished course of life ‘’’
ఈ వ్యాసానికి ఆధారం –‘’దర్శన ఇంటర్నేషనల్’’ -1986 జనవరి లో ‘’జాన్ ఫ్రాన్సిస్ ఫిప్ప్ ‘’రాసిన ‘’Towards a deeper philosophy of peace ‘’వ్యాసం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-15- కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

