తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’-3(చివరి భాగం )
బాపు ముఖ్య శిష్యుడు ,ప్రముఖ చిత్రకారుడు శ్రీ మోహన్ ‘’బాపు గారుతెన్నేటి సూరి నవల చెంగిజ్ ఖాన్ కు వేసిన అట్టమీది బొమ్మ గుర్రం మీద వీరావేశం తో ఖాన్ మంగోలియన్ కళ్ళూ ,,మీసాలు వెనక మంగోలియన్ డిజైన్ కళ్ళు తిరిగే రంగులు ,,మబ్బుల్లోకి ఎగిరిపోయే గుర్రం వెన్ను మీంచి తోక దాకా సర్ర్రున దూసిన గీత ‘’పరమాద్భుతం అన్నాడు .ఇది నచ్చని విశాలాంధ్ర బాస్ జోషి మంగోలియన్ వాతావరణం రాలేదని బాపు తో చెబితే మళ్ళీ వేస్తానన్న నిగర్వి .చెట్టంత ఆర్టిస్ట్ అయి ఉండీ మళ్ళీ వేస్తాను అంటం ఏమిటి అని మోహన్ ఆశ్చర్య పోయాడు .బాపు ను బొమ్మలు వేస్తుండగా చూస్తె ‘’బొమ్మలు గీసే మనిషిలా కనిపించడు.వాటి ఘోస్ట్ పెన్ మెన్ ‘’లా అనిపిస్తాడు .బాపు బొమ్మల ప్రభావం గురించి చెబుతూ మోహన్ ‘’ఆంద్ర పత్రికా ,ప్రభలు మోసుకొచ్చిన బొమ్మలు మా చెంపలు వాయించాయి .చాచి మరీనూ –మీరు చాతకాని వేర్రినాగమ్మలు అంటూ చాలెంజ్ చేశాయ్.నాతొ బాటు బోల్డు మంది ఆర్టిస్ట్ లకు మూడు దశాబ్దాలపాటు ఈ బాపూ భూతం మాకు౦చె ల్ని వెంటాడి ,వేధించి నానా రొస్టూపెట్టాయి .ఆయనలాగా వేయాలని మా ఆరాటం ,ఆయనలాగా వేయకుండా ఉండటానికి పోరాటం .మేము మా లాగా గీయాలని తపన .ఆయన్ను దాటిపోవాలని అత్యాశ .బాపు పార్టీలో చేరి సభ్యత్వ రుసుం చెల్లించి ‘’హోలీ టైమర్లు’’గా పని చేశాం .ఇలా ఆర్ట్ పార్టీ పెట్టిన సంగతి బాపుకు తెలీదు .ముప్ఫై ఏళ్ళు గడిచాక బాపు ఒపీనియన్ చేంజ్ చేసి పార్టీ ఫిరాయించి గ్లామరస్ సినీ పార్టీలో చేరిపోయారు .మేమంతా పత్రికల న్యూస్ ప్రింటుకి బల్లుల్లా అతుక్కు పోయి బతుకు తున్నాం .మాలో అరడజను మంది ఆయన్ను ఓవర్ టేక్ చేసి ఉండాల్సింది .50లలో ఆయన తెచ్చిన విప్లవాన్ని 80లలో మేము తెచ్చి ఉండాల్సింది .మాముందు పెద్ద’’గీతాదర్శాన్ని’’పెట్టి మాలో ఎవర్నీ ఆయనకంటే ముందుకు విసరలేక పోయాడు .’’అంటూ మోహన్ ఈ విషయం లో బాపు ‘’మిజరబుల్ ఫ్లాప్ ‘’అంటాడు కొంటెగా .
పశ్చిమ దేశ చిత్రకారుల చిత్రాలపై బాపుకున్న అధ్యయనం గొప్పది .నలభై ఏళ్ళ ఆయన అనుభవం తో చిత్రకారుల్ని తూర్పు దేశాలపై తిరిగి చూడమన్నాడు .అందుకే మోహన్ ‘’తూర్పు తిరిగి దణ్ణం పెడదాం ‘’అంటాడు సరదాగా .
మరో ఆర్టిస్ట్ శ్రీ చంద్ర ‘’చిత్రకారుల వంశం రాను రాను గీత తప్పి పోయిందని ,బాపు గీతావాక్యాలు మళ్ళీ వినిపించి బుద్ధి చెప్పాలని , .ఆయన తెలియ బరిస్తే తప్ప తెలుసుకోలేం ‘’అన్నాడు .మరో చిత్రకారుడు శ్రీ సురేంద్ర ‘’సాక్షాత్తు బాపుగారే మహానుభావుడు అనే ఆర్టిస్ట్ లు చాలామంది ఉన్నారు .మనకున్నది ఒకే ఒక బాపు ఆయన మనకే కావాలి ‘’అని నిర్ద్వందంగా అన్నాడు .
శ్రీ ఎన్నార్ ‘’కుంచెను కొంచెమే ఉపయోగించే ‘’కలాయుధుడు’’ బాపు .కలం అతనిహలం .తన అక్షరాలనే కోతులనే అతను ‘’ఫాషన్’’చేశాడు .కధలకు గేయాలకు బొమ్మవేస్తే రచయిత భావాన్ని యధాతధం గా రేఖల్లోకి అనువాదం చేయడు .రచయిత పాయింట్ కు కౌంటర్ పాయింట్ కోసం వేట సాగించి బ్రెయిన్ వేవ్ రాగానే అయిదు నిమిషాల్లో బొమ్మ పూర్తీ చేసే సత్తా బాపు ది.బాపు మార్క్సిస్ట్ అని చాలా మందికి తెలీదు .సర్రియలిజానికి దగ్గరగా వచ్చే ఫ్యాంటసీ తో అపూర్వ హాస్యాన్ని సృష్టించిన మార్క్స్ బ్రదర్స్ కామెడీలు ఆయనకు కంఠోపాఠం.ఇంటలెక్చువల్ చలన చిత్రాలు ఇస్టపడతాడు.పాప్యులారీటి ఒక నేరం కాకపొతే బాపు నిజమైన సృజనాత్మక చిత్రకారుడు ‘’అన్నాడు ఎన్నార్ .
శ్రీ అన్వర్ ‘’పప్పీ వారి మైనం అగ్గి పెట్టె సైజు నుండి ఏ3న్నర కొలతలవరకు చిత్రాలు గీయగల సత్తా, సామర్ధ్యం బాపు కు ఒక్కడికే ఉంది .బాపు పుట్టిన గడ్డపై పుట్టటం మన జన్మ చేసుకొన్నా అదృష్టం .సుమారు నలభై ఏళ్ళక్రితం బాపు గారి ఒరిజినల్స్ తో చిత్ర ప్రదర్శన జరిగిందట .ఆ బొమ్మల్ని ఒళ్ళంతా కళ్ళైచూసిన ఓ చంద్రశేఖర్’’ ఆర్టిస్ట్ చంద్ర ‘’అయ్యాడు .అలాగే మిగిలిన వాళ్ళు కూడా .తెలుగు ఇలస్త్రేషన్ పుట్టి 80ఏళ్ళు కూడా కాలేదు కాని, చావటానికి సిద్ధంగా ఉంది .సినిమా వాళ్లకు రాజకీయనాయకులకేనా వారసులు కళల కు వద్దా ?అని చక్కని ప్రశ్న వేశాడు.ఆలోచించాల్సిన ప్రశ్నకదాఇది ?క్రోక్విల్, బ్రష్ ,చార్కోల్ ,పేస్టల్ఏదీ అంటరానిది కాదన్నాడు బాపు .దొరికిన దానితో గీస్తూ పోతూ ఉంటె ఏదో ఒక రోజు మనం తలుపు దగ్గరికి వెళ్లి ఎవరూ ?అని అడిగితె ‘’నేనోయ్ బాపు బొమ్మను వచ్చాను .తలుపు తీయ్’’అంటుందట .బాపుగా పుట్టటం సులువు .’’బాపిస్ట్ ‘’గా బతకటం కష్టం ‘’అని బాప్టిస్ట్ (బాప్ –ఇస్ట్)భాషలో చెప్పాడు అన్వర్ .అన్వర్ధమైన మాట .ఒకసారి ఒక కవరు చేతిలో పెట్టి బాపు ‘’పెద్దవాడిని ఇస్తున్నాను కాదనవద్దు ‘’అనిఆ తర్వాత ఫోన్ చేసి ‘’నాకో సహాయంక్ చేయాలండీ !విజయవాడ గంధం ప్రసాద్ గారు నా బొమ్మలన్నీ కలిపి బుక్ తెస్తున్నారు దానికి మీరు ముందుమాట రాయాలి ‘’అని అన్వర్ ను కోరారట’’ బాపు దిగ్రేట్ ‘’
శ్రీ శివాజీ ‘’తెల్లకాగితపు స్పేస్ ను ఎలావాడాలో చైనా ఆర్టిస్ట్ కి బాపుకి మాత్రమె తెలుసు .ఆధునిక కళా ద్రుష్టి ఇచ్చిన అతి కొద్దిమందిలో బాపు ఒకడు .కుంచె పుచ్చుకొంటే మత్తు వచ్చేట్లు చేయగల మహత్తు ఆయనది .బుడుగును భాగవతాన్ని యానిమేషన్ చిత్రంగా తీయాలి .బాపు ఒరిజినల్ చిత్రాలు తమ దగ్గరున్న పెద్ద మనుషులు’’ పెద్దమనసు’’తో కలిసి పెద్ద చిత్ర కళా ప్రదర్శన పెట్టి దేశం యావత్తూ తిప్పాలి .35ఏం ఏం లో ఆయన వేసిన బొమ్మలన్నీ ఫిలిం తీసి భద్ర పరచాలి ‘’అనిగొప్ప సూచనలు చేసి ‘’ఇన్నివిదాల మనం గొప్ప పనులు చేయచ్చు ‘’అని మెత్తగా వాయించాడు .లాటిన్ అమెరికా రచన ,ఇరానీ సినిమా లాగా బాపు బొమ్మలు వసుధైక మైనవి .
చివరగా శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారి మంగళాశాసనం తో ముగిస్తున్నాను –
‘’అల వోకగ గీచిన గీ-తలు మురువులు –చిత్ర లక్ష్మి తలమానికముల్
పలుకులు ,కులుకులు కవితా-లలితములై చెలగు’’ బాపు రమణీయమ్ముల్ ‘’
తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’సంపూర్ణం .
బాపు నవ్వు బొమ్మ జత చేశాను చూడండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-15-ఉయ్యూరు

