సాహితీ బంధువులజు రేపు 13-10-15 మంగలవారంనుండి ప్రారంభమయ్యే శరన్నవ రాత్రి శుభాకాంక్షలు .
నిరుడు నవరాత్రులకు డా .శ్రీ ఇలపావులూరి పాండురంగా రావు గారు రాసిన” శ్రీ సహస్రిక ”అనే శ్రీ లలితా త్రిపురసుందరీ నామాల విశిష్టతను ధారావాహికం గా మీకు అందించాను . ఈ సారి కూడా ఒక స్పెషల్ ను అందజేయాలనుకొంటున్నాను .
సాధారణం గా మనమందరం కలలు కంటూ ఉంటాం మరి జితేంద్రియు లైన యోగులకు కూడా కలలు వస్తాయా?వస్తే ఎలా ఉంటాయి ?దీన్ని తెలుసుకోవటం కోసం గుంటూరు జిల్లా చందవోలు లో అనునిత్యం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఉపాసనతొ తరించి ఎందరెందరికో గురుమూర్తులై దీక్షనిచ్చి, ”నడయాడే దైవం ”అని పించుకొన్న శ్రీ కంచి పరమాచార్యులు మరియు ,శ్రీ శృంగేరి పీఠాదిపతులు స్వయం గా చందవోలు వచ్చి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద భిక్ష స్వీకరించారంటే శాస్త్రి గారి యోగ వైశిష్ట్యం ఎంతటిదో తెలుస్తుంది. అలాంటి సిద్ధ యోగిపు౦గవులు శ్రీ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు అయిన శ్రీ శాస్త్రి గారికి ఒక కల వచ్చింది .దానిని సంస్కృత శ్లోకాలలో ”మత్స్వప్నః”(నా కల )గా రాశారు అందులో అమ్మవారు ప్రత్యక్షమై వారికి ఏమి తెలియ జెప్పారో వీరేమి అడిగారో ఆ వివరాలన్నీ రేపు 13-10-15 మంగళవారం నుండి అమ్మవారి అనుగ్రహం తో ధారావాహికం గా అందజేస్తాను .. మరొక సారి నవ రాత్రి శుభా కాంక్షలతో -దుర్గా ప్రసాద్

