ఇది విన్నారా ,కన్నారా !-3
35-సంగీత శాస్త్రీయతా పరిరక్షకులైన విద్వన్మణి శ్రీ శ్రీపాద పినాక పాణి గారి అన్నగారు శ్రీపాద గోపాల కృష్ణ మూర్తి తెలుగు సాహిత్య విమర్శకులుగా బహు ప్రఖ్యాతులు .
36-పాణి గారు ద్వారం వారి శిష్యులు .పినాక గారు మద్రాస్ వెళ్ళేటప్పుడు అక్కడి నాదస్వర వాద్యాలూ ,శ్రీ అరియక్కూడి రామానుజయ్యర్ గారి కచేరీలు వింటూ ఉండమని హితవు చెప్పారు .దీన్ని గౌరవిస్తూ శ్రీ పాణి వర్ణం కృతి రాగం ,నేరవు స్వర కల్పనా లను పరిశుద్ధ స్వరం తోతంజావూరు బాణీలో ప్రతిభా వంతంగా పాడే అరియక్కూడి రామానుజయ్యర్ గారి ఒక్కరి సంగీతమే విని ,ఇతర బాణీలకు వశమై పోవద్దు అని నాయుడుగారి సలహా గా భావించి ఔదల దాల్చారు .
37-‘’కర్నాటక సంగీతమే ఒక బాణీ .దీన్ని కల్తీ చేయకూడదు ‘’అని పాణిగారి నిశ్చితాభిప్రాయం .
38-చిన్నప్పటి నుంచి ఎవరి గానం విన్నా వాటిలోవిశేష సంగతులు సంచారాలను నోటు పుస్తకంలో రాసుకోనేవారు .అందుకే వారి దగ్గర ఉన్న సంగీత పాఠం మరెవ్వరి దగ్గరా లభించదు .దీని సాయం తోనే నాలుగు సంపుటాల ‘’సంగీత సౌరభం ‘’రాశారు .
39-1947లో శ్రీ రామానుజ అయ్యంగార్ ‘’కృతి మణి మాల ‘’గ్రంధాన్ని5సంపుటాలుగా తమిళం లో వేడ్డామనుకొంటే,శ్రీ పినాక పాణి గారి స్నేహం, సలహాతో తెలుగులోనూ ప్రచురిస్తూ పాణిని గారితో సాహిత్యాన్ని రాయించారు .
40-తన స్వర పాఠంకన్నా ,ఏగాయకుడి పాఠమైనాబాగా ఉంటె దానినే సాధన చేయాలని శిష్యులకు చెప్పే సౌజన్యం పాణిని గారిది .
41-మనో ధర్మ సంగీతాన్ని సాధన చేసి చూపించినవారు పాణి గారు .ఆయనది కల్తీ లేని శుద్ధ సంగీతం .వారు సంగీత కులపతి.
42-పల్లవి గాన సుధ ,మనోధర్మ సంగీతం అనే రెండు విశిష్ట రచనలు చేసి మార్గ దర్శకులయ్యారు పాణి గారు
43-1100కు పైగా కీర్తనలను స్వర పరచి రచించారు .ఇంత భారీగా సంగీత సేవ చేసిన వారు అరుదు .
44-దక్షిణాది సంగీతానికి సంరక్షకులుగా నిలిచిన అభేద్య దుర్గం డా .శ్రీపాద పినాక పాణి .
45-‘’సంగీత మహా మహోపాధ్యాయ ,సంగీత విద్వన్మణి ,నాద నిధి ,రాగ హృదయజ్న ,నాద సుధార్ణవ ,సంగీత సార్వ భౌమ ,సంగీత క్షీర సాగర ,గానకళా గంధర్వ ,లక్ష్య లక్షణ మార్తాండ ,సంగీత సుధాకర ,అన్నమాచార్య విద్వన్మణి’’వంటి అనేక బిరుదులు అందుకొన్నవారు శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు .
46-250 రాగాల లక్షణాలను వివరంగా తెలుపుతూ ఉదాహరణలతో సహా ‘’రాగ లక్షణ సంగ్రహం ‘’గ్రంధాన్ని రచించిన విద్వాద్వరేణ్యులు నూకల వారు .
47-త్యాగ రాజ స్వామి వారి పంచ రత్న కీర్తనలలో ఉన్న సంగీత సాహిత్య విశేషాలను తెలియ జేస్తూ ఇంగ్లీష్ లో నూకలవారు ‘’Monograph of Tyagaraja;s Pancha Ratna krutis ‘’ అనే వ్యాఖ్యాన గ్రంధం రాశారు .
48-శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి ప్రసిద్ధ ‘’నవావరణ కీర్తనలకు ,నవ గ్రహ కీర్తనలకు స్వరం సాహిత్యార్ధం తోవిశేష గ్రంధం రాశారు .
49-‘’సంగీత సుధ’’అనే పాఠ్య గ్రంధం తోపాటు ,త్యాగరాజ క్రుతులన్నిటి పైనా వ్యాఖ్యాన రచన చేశారు .
50-అంతర్జాల విప్లవాన్ని గ్రహించి ,సంగీత విద్యకు దాన్ని అన్వయిస్తూ ‘’Listen and Learn ‘’పేరుతొ 40ఆడియో కేసెట్లు తయారు చేశారు .
51-శ్రీ బాలమురళి తో కలిసి నూకలవారు ఒక ఏడాది జంట గాన కచేరీ చేశారు .ఇద్దరూ కలిసి కాంభోజి ,కానడ రాగాలలో పాడిన వాటిని 45R.P.M.రికార్డ్ గా విడుదల చేశారు .
52-నూకలవారు గానం తో పాటు వయోలిన్ ,వయోలా వాయిద్యాలలోనూ నిష్ణాతులే .
53-పవిత్ర హృదయాలు సినిమాలో నూకల .బాలమురళి జంట ‘’నారాయణ రెడ్డి గారి ‘’కరుణామయి శారద ‘’పాట పాడారు.
54-శ్రీ సత్య సాయిబాబా స్థాపించిన సంగీత కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ను అధ్యాపకులను నూకలవారి తోనే సెలెక్ట్ చేయించారు బాబా .
55-నూకల వారిగాననికి మెచ్చి సత్య సాయిబాబా ఒక ఎమరాల్డ్ ఉంగరం సృష్టించి బహూకరించి ఆశీర్వదించారు .
56-శ్రీ కంచి పరమాచార్యులు ‘’నూకలవారిది దివ్య సంగీతం ‘’అని మెచ్చారు .
57-షట్కాలపల్లవి పాడే శ్రీమతి మండా సుధారాణి ని నూకలవారు బహుదా మెచ్చుకొంటారు .
58- గాయత్రి,పంచాక్షరి ,వెంకటేశ్వరోపాసన ,లక్ష్మీ గణపతి ,సరస్వతీ మంత్రాలను నిత్యానుస్టానంగా పాటిస్తారు .
59-‘’ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవత్యైః-వీం వీణాయైః మమ సంగీత విద్యాం ప్రయచ్చ స్వాహా ‘’అనే’’ వీణా౦బ జపం నిత్యం ‘’చేస్తారు .
60-‘’సంగీత క్షేత్రం లో ఎవరెస్ట్ శిఖరం శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు ‘’అన్న ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారి పలుకు అతిశయోక్తి కాదు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-16-ఉయ్యూరు


శ్రీ పినాకపాణి, నూకల వారి గురించి చాలా గౌరవించవలసిన వివరాలు తెలియ చేసారు.
57, 58, 59 పేరాలచివరలో వాడిన పదాలు మెచ్చుకునేవారు, పాటించేవారు, చేసేవారు
అని పుస్తక ప్రచురణ సమయంలో మార్చితే?
అంత విషయసేకరణ చేసి, యింత వివరంగా, యిన్ని విభిన్న విషయాలపై యీవయస్సులో ,
తెలుగు లో కంప్యూటర్ లో టైపు చేయగలగుతున్నారా అని ఆశ్చర్యపడుతుంటా.
అభినందనలు, కోటీశ్వర రావు
LikeLike
నమస్తే కోటేశ్వర రావు గారు -మీ సూచన తప్పక పాటిస్తాను -ధన్యవాదాలు -దుర్గా
ప్రసాద్
2016-06-06 7:08 GMT+05:30 సరసభారతి ఉయ్యూరు :
>
LikeLike