ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -169
64-మహా మేధావి ,సాపేక్ష సిద్ధాంత కర్త –ఆల్బర్ట్ ఐన్ స్టీన్-3
అంతర్జాతీయ బృందం ఏర్పాటు చేసిన సభలో అతని విజయాలను ప్రస్తుతి౦చాక ఐన్ స్టీన్ చాలా పొడి హాస్యపు మాటలతో జవాబు చెప్పాడు .సాపేక్ష సిద్ధాంతానికి మరో తమాషా నిరూపణగా ’’ఇవాళ జర్మనీలోనన్ను జర్మనీ దేశపు సైంటిస్ట్ గా గౌరవిస్తున్నారు ఇంగ్లాండ్ లో ఇతర దేశీయ జ్యూగా గుర్తిస్తున్నారు .కాని నా సిద్ధాంతాన్ని నిరాకరిస్తే జర్మన్లు నన్ను విదేశీ జ్యూ అని ఇంగ్లిష్ వాళ్ళు నన్ను జర్మనీ వాడుకాదు అని దూషిస్తారు ‘’అన్నాడు .జర్మనీలోని ప్రేగ్ యూని వర్సిటీ లో దీరిటికల్ ఫిజిక్స్ లో ప్రొఫెసర్ గా ఉన్న ఐన్ స్టీన్ ,ప్రష్యన్ అకాడెమి సభ్యుడై బెర్లిన్ కు వెళ్లి ఉన్నాడు .ఇద్దరు సంతానం తర్వాత భార్యకు విడాకులిచ్చాడు .1917లో తన మొదటి కజిన్ ఎల్సా ఐన్ స్టీన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె 1936లో చనిపోయేదాకా ఆయనకు చాలా అనుకూల వతిగా ఉన్నది .40వ ఏట ప్రపంచ యాత్రికుడయ్యాడు .ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అమెరిక ,చైనా ,జపాన్ ,పాలస్తీనాలు సందర్శించాడు .
రాజకీయం లో ఎప్పుడూ లేడుకాని ఐన్ స్టీన్ హింస ప్రజ్వలిస్తే మాత్రం తప్పక దానికి వ్యతిరేక శిబిరం లో ఉంటాడు .శాంతి ప్రేమికుడు బీదజన సంక్షేమాభిలాషి . తనకు వచ్చిన నోబుల్ ప్రైజ్ మనీ ని తన దేశం అనుసరిస్తున్న అతితీవ్ర వాదవిధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారికి చారిటీ ద్వారా అందించాడు .నాజీలు ఆయన్ను ద్వేషించారు .హిట్లర్ అధికారం లోకి రాగానే ఐన్ స్టీన్ ను జాతి శత్రువుగా ప్రకటించాడు .1933లోబలాత్కారం గా అకాడెమీ నుంచి తొలగించగానే ఐన్ స్టీన్ అమెరికా చేరాడు .అక్కడ న్యూ జెర్సీ లోని ప్రిన్ స్టన్ లోఉన్న అడ్వాన్సేడ్ స్టడీలో ఆయన ఆ జీవిత ఆచార్యుడుగా (లైఫ్ టైం ప్రొఫెసర్ )నియమించ బడ్డాడు .1940కి అమెరికా పౌరసత్వం పొందాడు .ఆయన లోని స్వాతంత్రేచ్చను అనేక పేపర్లలో రాసి తెలియ జేశాడు .ఇవన్నీ ‘’ది వరల్డ్ యాజ్ ఐ సీ ఇట్ ‘’మరియు ‘’అవుట్ ఆఫ్ మై లేటర్ లైఫ్ ‘’పుస్తకాలలో వచ్చాయి .నీతి పతనం ,టుడే మొదలైన వ్యాసాలలో తన భావాలను విస్పష్టంగా చెప్పాడు .’’ఈరోజు నాగరక మానవ అస్తిత్వ పునాదులు కదిలి పోయి స్థిరంగా లేవు .ఒకప్పటి మహా సామ్రాజ్యాలు ఇప్పుడు’’మాకు సేవ చేసేదే సరైనది ‘’అని ప్రకటించే దౌర్జన్యకారులకు తల వంచుతున్నాయి .భావ ప్రకటన మత స్వేచ్చ లు కబళింపబడ్డాయి. సామాన్య మానవుని జీవితం తో ఆడుకొంటున్నారు .వీటివలన ఆటవికత ప్రబలి పోయింది .కనుక మనం విలువల విషయం లో రాజీ పద వద్దు .హక్కు ,మానవ గౌరవాలకు భంగం కలిగే యే చర్యనైనా కలిసి కట్టుగా ఎదిరించాల్సిందే .ఈఆలోచనే పసిఫిస్ట్ అయిన ఐన్ స్టీన్ ను మానవ సేవకు యుద్ధ వీరునిగా మార్చింది .
ఆయన స్పెషల్ జనరల్ దీరీ ఆఫ్ రిలేటివిటి సైన్స్ లో విప్లవం తెచ్చి ఆందరి సైంటిస్ట్ లకన్నా ముందు నిలబెట్టినా ఐన్ స్టీన్ విశ్వ రహస్య విషయాలనూ మరింత నిర్దుష్టంగా చెప్పే కృషి చేస్తూనే ఉన్నాడు .1921లో ప్లాంక్ శాస్త్రజ్ఞుని క్వాంటం సిద్ధాంతానికి సంబంధించిన రెడిఎంట్ ఎనర్జీ విషయం పై మార్పులు తెచ్చాడు .దీని భావం ఏమిటి ? అంటే రెడిఎంట్ ఎనర్జీ క్వాంటా అనే చిన్న చిన్న విభాగాలుగా విడిపోయి వెలువడుతుంది .దీనికే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది .1906నుంచి 1920వరకు ఆయన చేసిన అరిశోధనా ఫలితంగా ‘’ఐన్ స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ లా’’ఏర్పడి ఫిజిక్స్ స్పెక్ట్రోగ్రఫీ లను సమూలంగా మార్చేసింది .తరువాత ఇదేటేలివిజన్ ఆవిష్కరణకు దారి చూపింది కూడా . దీని అనుబంధం 35ఏళ్ళ కృషి ,ఏకీకృత సిద్ధాంత పరిశోధన .ఆధునిక శాస్త్రవిజ్ఞానం అతి సాధారణ సిద్ధాంతం కోసం సైంటిస్ట్ ల మధ్య పోటీ గా మారింది .సమ్మేళన(కాన్గ్రోమేరేట్ )పదార్ధం 92మూలకాలకు కుదింప బడింది .ఈ మూలకాలు మరింత సూక్ష్మ పదార్ధాలుగా విభజింప బడ్డాయి .బాగా మారిపోయే ప్రక్రుతి శక్తులను కుదించి కొన్ని శక్తి క్షేత్రాలుగా అంటే కాంతి ఉష్ణం ,మొదలైనవికిరణ శక్తులన్నిటినీ కలిపి వేర్వేరు పొడవు ఫ్రీక్వెంసి ఉన్న విద్యుదయస్కాంత తరంగాలుగా వర్గీకరించారు .ఐన్ స్టీన్ పూర్వపు శోధన వీటిని మరింత తక్కువ చేసింది .. స్పేస్ అండ్ టైం లు నిరంతర ప్రవాహం లో కలిసిపోతాయనిఐన్ స్టీన్ చెప్పిన సిద్ధాంతాన్ని ఆయన జనరల్ దీరీ ఆధారంగా ప్రత్యక్షంగా అనుభవించి రుజువు చేశారు .దీనితో విశ్వం యొక్క వక్రత పై ఉన్న కీలక భావనలు ,నక్షత్రాల పుట్టుక ,గ్రహాలూ ,గెలాక్సీల స్థితి గతులపై వివరించే చెప్పే అవకాశమొచ్చింది . 20వేల టన్నుల టి .యెన్ టి ప్రేలినప్పుడోచ్చే శక్తి కంటే ఎక్కువ శక్తి, ఒక చిన్నపదార్ధం ఆటం బాంబ్ గా ప్రేలినప్పుడు విడుదలౌతుంది .అంటే పదార్ధం అంటే తనలో దాచుకొన్న అనంత శక్తి అని అర్ధం .కనుక ఒకే విశ్వ తత్త్వం (కాస్మిక్ ఎంటిటి )యొక్క రెండు విభిన్న అభివ్యక్తులే (మాని ఫెస్టే షన్స్ )పదార్ధం ,దాని శక్తి .
కాని ఐన్ స్టీన్ సంతృప్తి పడలేదు .ఆయన ఇంకా సాధ్యం కాని సాధారణ సూత్రం కోసమే ప్రయత్నిస్తున్నాడు .ఆ సూత్రం –భౌతిక ప్రపంచమంతా ఒక నిరంతర ,అనంత ప్రవాహ శీలతే .కాని ఆయన సహ సైంటిస్ట్ లందరూ విశ్వం అంతా ఆగిపోయిన అనంత అణుమాత్ర కణాలు ,అణువులె .అంటే క్వాంటా శక్తికణాలే .క్వాంటం శాస్త్ర వేత్తలు ప్రతిదీ తరంగాలు ,కణాలు కనుక విశ్వం ద్విగుణాత్మకమైనది అన్నారు .అది అంతు చిక్కని పదార్ధమని కనుక అది సంభావ్యత పైనే ఆధార పడి ఉందని అంటారు .దీనినే ‘’అనిశ్చిత సూత్రం ‘’(అన్ సర్టెన్ ప్రిన్సిపల్ )అంటారు .ప్రమాదం కాని నిశ్చయత్వం కాని (కాజువాలితటి ,డిటెర్మినిజం )విశ్వావిర్భానికి కారణం కాదని తేల్చారు .విలియం లారెన్స్ యూని ఫైడ్ దీరీ ని ‘’ది న్యూ యార్క్ టైం ‘’లో సమీక్ష చేస్తూ ‘’క్వాంటం దీరీకి ఒకే ఒక్కడు ఎదురు నిలిచాడు .అది విశ్వం లోని అనేక సమస్యల పరిష్కారం తో పాటు ,అణువు అంతర్నిర్మాణం,రేడియేషన్ ప్రభావంలను కూడా పరిష్కరించింది .విశ్వం సంభావ్యత నిశ్చయత్వం వలన ఏర్పడలేదు .అది ఒక అనంత ప్రవాహమే .’’అని రాశాడు .అంతకు ముందే ఐన్ స్టీన్ పూర్తీ తార్కిక విశ్వ రూపాన్ని గురించి చెప్పాడు .అందుకే ఆయన ‘’దేవుడు విశ్వం తో పాచికలు ఆడతాడు అని నేను నమ్మను ‘’అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-6-16-ఉయ్యూరు
