ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -184-
70-న్యు డీల్ ,అమెరికన్ లిబరలిజం తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
‘’మంచి పోరాటం కంటే నాకిస్ట మైంది ఏదీ లేదు ‘’అనే అమెరిక ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ,నాలుగు సార్లు ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి గెలిచి రికార్డ్ సృష్టించిన వ్యక్తీ ..అమెరికన్లు ఆయను ఆరాధించారు ,అలక్ష్యమూ చేశారు .అంకిత భావమున్న క్రుసేడర్ గా అభిమానించారు .వినాశకర నియంతగా తిట్టీ పోశారు .శాశ్వత అంగ వైకల్యం తో విపరీతమైన ఆర్ధిక మాంద్యం ,చరిత్రలోనే భయంకర యుద్ధ సమయం లో ధైర్య స్తైర్యాలతో నిలబడి ‘’the only thing we have to fear is fear itself ‘’అని జాతికి చాటి చెప్పి సంక్షోభం నుండి గట్టేక్కి౦చినవాడు .
30-1-1882న రెండవ జేమ్స్ రూజ్వెల్ట్ కు ఆయన రెండవ భార్యసారా డేలనో కు ఏకైక సంతానంగా అమెరికా లో న్యూయార్క్ లోని హైడ్ పార్క్ లో ఫ్రాంక్లిన్ డేలనో రూజ్ వెల్ట్ జన్మించాడు .ఇరువైపుల వారు పూర్తిగా అమెరికా జీవులే .రూజ్ వెల్ట్ లకు కొత్త ప్రపంచం అయిన అమెరికా లో రెండు విధాల అంటే సీనియర్ ,జూనియర్ లైన్ లు గ పేరు ప్రతిష్ట లున్నాయి .దియోదర్ రూజ్ వెల్ట్ డచ్ జాతి వాడు .వీరిలో మొదటి రూజ్ వెల్ట్ న్యు ఆమ్ స్టర్ డాం కు 1644లోనే వచ్చాడు .జూనియర్ లైన్ లో వచ్చిన ఫ్రాంక్లిన్ డేలనో డచ్ ,ఇంగ్లిష్ ,ఫ్రాన్స్ ,జర్మన్ కొంత స్వీడిష్ మిశ్రమం .అతని తల్లి వంశం-ఫ్రెంచ్ సముద్ర నావికుడు ఫ్రెంచ్ తలిదండ్రులకు లేదేన్ లో పుట్టినవాడు ,అమెరికాలోని మాసా చూసేట్స్ రాష్ట్రం న్యు బెడ్ ఫోర్డ్ లో 1624లో పుట్టిన ఫిలిప్పి డీ లా నాయ్ కు చెందింది. దీనినే డేలనో అన్నారు .ఇంత ఘన చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రూజ్ వెల్ట్ అమెరికా 32వ ప్రెసిడెంట్ అయ్యాడు .అందుకే ఆయనకు ఓడలన్నా సముద్ర యానమన్నా విపరీతమైన ఇష్టం .
రూజ్ వెల్ట్ లంటే ఏదో ఒక కుటుంబం కాదు .అదొక రాజ వంశం (డైనాస్టి ).ముఖ్యంగా వాళ్ళు వాణిజ్య వేత్తలు .ఐజాక్ రూజ్ వెల్ట్ సంపన్ను డైన బాంకర్ వ్యాపార వేత్త ,సెనేటర్, రివల్యూషనరి యుద్ధం లో సైనికుడు .ఈయన ముత్తాత తండ్రికి ఫ్రాంక్లిన్ అనే గౌరవనామం ఇచ్చారు అప్పటి నుంచి ఆ వంశం వారందరికీ అది పారంపర్యంగా వస్తోంది .ఈయన మనవడు మొదటి జేమ్స్ రూజ్ వెల్ట్ రిటైర్ అయి ,హడ్సన్ రివర్ తీరం లో డాచేస్ కౌంటి లో హైడ్ పార్క్ లో చాలా ఖరీదైన విశాలమైన ఎస్టేట్ కొన్నాడు .డేలనో లు కూడా సరి సమానంగా భాగ్యవంతులే .ఫ్రాంక్లిన్ తల్లి అందంతో పాటు పెత్తనం ,సంఘ గౌరవ స్పృహ ఉన్నావిడ .తనపై తనకు అత్యంత నమ్మకం ,స్వీయ అభయం ఉదాత్త గుణం తో పాటు ,సర్వ సమర్ధత ఉన్న మహిళ.తల్లి కున్న ఈ లక్షణాలన్నీ వారసత్వంగా రూజ్ వెల్ట్ కు సంక్రమించాయి .ఇతడిని డాబు దర్పం తో పెంచారు .నౌకాయానం అతనికి పరమ ప్రీతికరమైన వ్రుత్తి .కెనడా ,,మైమ్ మధ్య ఉన్న పస్సామా ఖాతం లో ఒంటరిగా స్వంత బోటు ను నడిపేవాడు .15ఏళ్ళు నిండకముందే యూరప్ కు 10సార్లు తీసుకు వెళ్ళారు .జర్మనీలో నాఔహెల్మ్ లో జర్మన్ భాష నేర్చాడు .అప్పటికే కాస్మోపాలిటన్ యువకుడయ్యాడు .14వ ఏట కాలేజి లో చేరే నిమిత్తం అప్పర్ క్లాస్ గ్రోటాన్ కు తప్పనిసరిగా పంపబడే ప్రయత్నం లో ఉన్నారు .
గ్రోటాన్ లో స్టూడెంట్ గాకంటే ఇతర వ్యాపకాలపై మోజు పడ్డాడు .అక్కడి కోర్సులు పెద్దగా అభిరుచి కలిగించలేదు .టెన్నిస్ ఆడుతూ ,సముద్ర కధలు చదివాడు.కాని వారానికి మూడు సార్లు అమ్మ దగ్గరకు వెళ్ళేవాడు .ఇప్పడు అది దూరమయింది .16వ ఏట వివాదాస్పద విషయాలపై దృష్టిపడి ,డిబేట్ లలో లిబరల్ అయ్యాడు .ఫిలిప్పీన్ స్వాతంత్ర్యం గురించి ,ఇమ్మిగ్రేషన్ లపై నిబంధనల కు వ్యతిరేకంగా మాట్లాడేవాడు .17 వయసులో అసమ్మతి వాది అయ్యాడు .తన సహచర గ్రోటేనియన్ మిత్రుల తో విభేదించి అగ్రకుల భూ యజమాని విషయం లో వింత భావాలు ప్రకటించాడు .జాన్ గందర్ తన ‘’రూజ్ వెల్ట్ ఇన్ రెట్రాస్పెక్ట్ ‘’పుస్తకం లో ‘’ఆయనకు స్కూల్ లో చదివే జ్యూ విద్యార్ధి ఎవరూ లేకపోయినా జ్యూస్ అంటే అభిమానం పెరిగింది .దక్షిణ రాష్ట్రాలలో నీగ్రోల్ కు చదువు నేర్చుకొనే అవకాశాలు లేవని ,వారు విద్యా వంతులు కావాలని ఉపన్యాసాలిచ్చాడు .దక్షిణ ప్రాంతం లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే బోఎర్ల పై సానుభూతి చూపాడు .బోఎర్ల పక్షాన చేరి వారికి నిధులు సమకూర్చి అందజేశాడు .
రూజ్ వెల్ట్ కు నౌకాయానం పై యెంత పిచ్చి అంటే ,ఒక రోజు ఎవరికీ చెప్పకుండా గ్రోటాన్ నుంచి పారిపోయి నేవీ లో పేరు నమోదు చేయి౦చు కోవాలనుకొన్నాడు. కాని పొంగు జబ్బు సోకి ఆగిపోయాడు .కాని నావల్ అకాడెమి లోఅన్నా పోలిస్ లో గ్రాడ్యు ఏషన్ అయ్యాక చేరాలని నిర్ణయించుకొన్నాడు .కాని తండ్రికి కొడుకును తమ వంశంవారందరికి మాతృ విద్యాలయమైన హార్వర్డ్ లో చదివించాలని కోరిక .అలాగే 1900 లో హార్వర్డ్ యూని వర్సిటి లో చేరాడు.18వయసులో రేస్ట్ లెస్ అయి ఫుట్ బాల్ ఆటలో తన టీం కు సరైన శిక్షణ ఇవ్వలేక ,తెడ్డూ,పడవ పుచ్చుకొని దానికోసమే తానూ పుట్టాడేమో అన్నట్లు నీటి విహారం చేశాడు .అథ్లెటిక్స్ వదిలి జర్నలిజం లో చేరాడు .కాలేజి న్యూస్ మేగజైన్ ‘’క్రిమ్సన్ ‘’లోముఖ్య పదవి దొరికి మేగజైన్ ఎడిటర్ ,ప్రెసిడెంట్ కూడా అయ్యాడు .నాలుగేళ్ల హార్వర్డ్ చదువులోచిన్నప్పటి నుంచి పరిచయమున్న అన్నా ఎలినార్ రూజ్ వెల్ట్ తో ప్రేమాయణం సాగించి ,చివరి ఏడాదిలో ఎంగేజ్ మెంట్ దాకావచ్చి ,తల్లి అభ్యంతరం తో పెళ్లి 1905వరకు వాయిదా పడి ,ఆయనకు 23 ,ఆవిడకు 20 వయసులో పెళ్లి చేసుకొన్నారు .ప్రెసిడెంట్ దియోడర్ రూజ్ వెల్ట్ వాషింగ్ట న్ నుంచి ప్రత్యేకంగా తన ,దైవదత్త కుమార్తె ,అనాధ అయిన నీస్ వివాహానికి హాజరై వేడుక జరిపించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2 -7-16- ఉయ్యూరు

