ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -189
71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్ -2
ట్రిస్టేలో ఒంటరిగా ఉంటూ సున్నిత మైన బతుకు బతుకుతున్నానని చెప్పుకొన్నాడు.పెళ్ళాం ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్నాడు .స్కూల్ లో ఇంగ్లీష్ బోధిస్తూ ఏడాదికి వచ్చే ఎనభై పౌండ్ల జీతం తో బతుకు బండీ లాగిస్తున్నాడు .ఒక పుష్కరం ముందే’’ పోర్ట్రైట్ ‘’ నవల పూర్తీ చేశాడు .ఇది ఆయన మొదటి పాతికేళ్ళ జీవిత చిత్రణే..దీనికి మొదట్లో ‘’స్టీఫెన్ హీరో ‘’పేరు పెడదామనుకొన్నాడు .పేర్లలో ఉన్న రిదం బాగా తెలిసిన వాడు .ఇందులో ముఖ్యపాత్ర జాయిస్ ను పోలి ఉంటుంది .చివరి పేరును డేడాలస్ గా మార్చాడు .డేడాలస్ మనిషిని భూమి నుంచి పైకి తీసుకు పోవటానికి రెక్కలు సృష్టించుకొన్న వాడు .డేడాలస్ అంటే కపట వేషధారి అని అర్ధం .ఇదంతా ఆయన ఊహ .సింబాలిజం సృష్టి .జార్జ్ రస్సెల్ AE అనే మరు పేరుతొ రాశాదు ఈయనఐర్లాండ్ లో ఆధునిక వ్యవసాయ పద్ధతులను గురించి ‘’ఐరిష్ హోం స్తేడ్ ‘’పుస్తకం రాస్తూ ,సెల్టిక్ ఉద్యమ రచయితలపై పుస్తకం తెస్తూ జాయిస్ ను అందరికి అర్ధమయ్యేట్లు సరళంగా రాస్తే ఎడిటర్ వ్యాసానికి ఒక పౌండ్ చొప్పున ఇస్తాడని తనకు ఎప్పుడు వీలయితే అప్పుడు అగ్రిమెంట్ మీదసంతకం చేయచ్చునని మారు పేరు వాడుకోవచ్చని సలహా ఇచ్చాడు .సరేనని ‘’స్టీఫెన్ డేడాలస్ ‘’అనే మారు పేరుతొ మూడు కధలు రాశాడు .
‘’పోర్ట్రైట్ ‘’,నవల ద్వివిధమైన వ్వ్యక్తీకరణ ఉన్న నవల .అందులో తాను అమితంగా ప్రేమించి ఆరాధించే ఐర్లాండ్ ,అందులో ఒక విలువైన యువరచయిత వ్యంగ్య చిత్రం కలిసి ఉన్నాయి .శబ్దాలమీద పూర్తీ అధికారం తో ,మాంత్రిక శబ్దజాలం తో అదరగొట్టాడు దీనిపై ఆయనే స్పందిస్తూ ‘’to encounter for the millionth time the reality of experience and forge in the smithy of my soul the uncreated conscience of my race ‘’అంటూ తన ఉద్దేశ్యాన్ని వివరించాడు .ఇందులో విద్యా చరిత్ర ,అసాధారణ జ్ఞానం ఉన్న కౌమారదశలోని కుర్రాడు పరిపక్వతకు చేరుకోవటం అదే సమయం లో దాపరికం లేనిఆ వయసులోని శృంగార భావనలు కలిసి ఉంటాయి .ఇది సాధారణ రచన కాదు .తరువాత రాయబోయే ఎపిక్ కు నేపధ్యం .ఈ పుస్తకమూ ముద్రణ ప్రసవ వేదన అనుభవించింది .’’ఈగోయిస్ట్ ‘’పత్రికలో సీరియల్ గా వచ్చింది .పుస్తక రూపం లోకి తేవటానికి యే పబ్లిషర్ కూడా సాహసించలేదు .కాగితాలు అమెరికా నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది .
జాయిస్ రాసిన మరో గొప్ప రచన ‘’యులిసెస్ ‘’అది ఆయన ఐరిష్ స్వదేశీయ భక్తీ .హోమర్ రాసిన గ్రీక్ ఎపిక్ పేరును వాడుకొన్నాడు .అందులో హీరో యులిసెస్ తనలాగే దేశం వదిలి ప్రవాసం లో ఉంటూ దేశదిమ్మరిగా తిరిగాడు .హోమర్ రాసిన కధలోని సంఘటనలు ఇక్కడ ఒక రోజు 1904జూన్ 16న డబ్లిన్ లో జరుగుతాయి .అందులో టేలిమాకాస్ ,యులేసేస్ భార్య మోలీ లు బదులు డేడాలస్,లియో పోల్ద్ బ్లూమ్ పెనెలోప్ ఉన్నారు మిగతా పాత్రలూ చాలా ఉన్నాయి .కదా బ్లూమ్ మీడే ఎక్కువగా నడుస్తుంది .అతని కొడుకు తప్పిపోతాడు మరోకడికోసం తపన పడతాడు .డేడాలస్ మానవులకు దూరమై తండ్రికోసం వెతుకుతుంటాడు .ఇదిఆబాల వృద్ధుల అందరి జీవితాలలో ఉన్న సమస్య యే .దేనికోసమో పరితపించటం అంతు లేని అన్వేషణ చేయటం .దీనినే జాయిస్ తండ్రికోసం వెతుకులాటగా సింబలైజ్ చేశాడు .తన జీవితం సంగతి చెబుతూనే ఆధునిక మానవుని అయోమయ పరిస్థితిని చిత్రించాడు .
యులిసేస్ ను ప్రచురించటానికి చాలాముందే సెన్సార్ కత్తి ఝళిపించింది .1918లో అది ‘’ది లిటిల్ రివ్యు ‘’లో ధారావాహికగా వస్తున్నప్పుడే గుసగుసలు సాగాయి .’’గెట్టిమాక్ డేవేల్’’భాగం ప్రచురితమైనప్పుడు అమెరికాలోని ఆశ్హ్లీల సాహిత్య నిరోధక సంఘం రంగం లోకి దిగింది .అమెరికా పోస్టాఫీస్ అన్ని కాపీలను స్వాధీనం చేసుకొన్నది .సంపాదకులకు జరిమానా విధించి ,వ్రేలి ముద్రలు తీసుకొని ధారావాహికను ఆపేయించింది .అతని అభిమాని సిల్వియా బీచ్ ఆ పుస్తాకాన్ని రహస్యంగా ఫ్రాన్స్ లో ముద్రింప జేసి ,మొదటికాపీని జాయిస్ కు ఆయన 40వ పుట్టిన రోజున అందజేసింది .పుస్తకానికి గ్రీస్ కు చెందిన బ్లూ వైట్ రంగుల కవర్ పేజీనిఏర్పాటు చేయించింది .అది జాగ్రత్తగా సేకరించి భద్ర పరచాల్సిన పుస్తకం అయింది .దుకాణాలలో అమ్మారు .మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేసి దొంగాచాటుగానూ వదిలారు .ప్రముఖ రచయితా డి హెచ్ లారెన్స్ కూ ఆయన రాసిన ‘’లేడీ చాటర్లీస్ లవర్ ‘’నవల విషయం లో ఇలానే జరిగింది .పుస్తకం అయితే అనేక కాపీలు అమ్ముడు పోయి౦దికాని అయ్యగారి చేతిలో పెన్నీకూడా రాలలేదు .పోస్టాఫీస్ వారికి దొరికిన అయిదు వందల పుస్తకాలను తగల బెట్టేశారు .అది సీరియల్ దశనుండి పుస్తకం గా రావటానికి మరొక 15 ఏళ్ళు పట్టింది .ఈ కేసు విచారించితీర్పు చెప్పిన జడ్జి జాన్ ఏం . ఊల్సేచెప్పిన వాక్యాలను .’’whilst in some places ,the effect on the reader is somewhat emetic(వాంతిమందు ) ,nowhere does it tend to be an aphrodisiac (నిరోదిన్చాల్సింది కాదు ) ‘’ ప్రపంచమంతా ఘనంగా చెప్పుకొన్నది.జడ్జి ఊల్సే ఆ పుస్తకాన్ని ‘in terms of catharsis ,the purge of the emotions through pity and terror that Aristotle attributes to tragedy ‘’అని విశ్లేషకులు తెలియ జేశారు .
పుస్తకం పై నిషేధం తొలగినా విమర్శల జడి వానలు కురుస్తూనే ఉన్నాయి .’’ఇంతదరిద్ర గొట్టు ,నీచ పుస్తకం చరిత్రలో లేదు ‘’అన్నారు .అందులో పాక్షిక రాజకీయం ,ద్వేషం ఉన్నాయన్నారు .సమకాలీన సమాజ నిరర్ధకత్వం ,అరాచకం పెద్ద కాన్వాస్ పై చిత్రించాడు అన్నారు .టి ఎస్ ఇలియట్ మాత్రం ‘’సిన్జీ తర్వాత ఇంతఅద్భుతమైన వచనం రాసిన వాళ్ళు లేరు .ఇదొక మహా కావ్యం .మార్మికతను వాడుకొంటూ సమకాలీనతను ,పురాతనత్వాన్ని కలగలుపుగా చిత్రించాడు .దీనితో ఆర్ట్ లో ఒక కొత్త ప్రపంచ౦ వైపు అడుగులు వేయటం సాధ్యంఅయింది అని జేమ్స్ జాయిస్ రుజువు చేశాడు ‘’అన్నాడు .ఇందులో చాలాభాగం యే హోమర్ రిఫరెన్స్ లేకుండా హాయిగా చదువుకోవచ్చు .అయితే కొన్నిటికి అర్ధం వివరణ లేక పొతే కీకారణ్యం లో ఉన్నట్లు ఉంటుంది .ఇందులో డిసిప్లినేడ్ లాజిక్ ఉందని అన్నారు .పదాల ఆట సయ్యాటలున్నాయి .మైదాలజి ఫిలాసఫీ ,ఎక్కువ మందికి తెలియని గ్రంధాలు ,వి౦త పాత్రలు,అన్యమత నమ్మకాలు ,కేధలిక్ మత ఉత్సవాలు ,రహస్య ,గూఢవిజ్ఞాన విశేషాలు ఉన్నాయి .అందుకే యులిసెస్ ‘’un questionably the most complex ,the most confusing ,and the most learned novel-if it is a novel –in all literature ‘’
యులిసెస్ రాయటానికి జాయిస్ కు ఏడేళ్ళు పట్టింది .అమెరికాలో అది చట్ట రీత్యా చదవతగింది అని తేలినప్పుడు జాయిస్ కు 52 ఏళ్ళు వచ్చాయి .కళ్ళు కనిపించకుండా పోయాయి .చని పోయే లోపు పది ఆపరేషన్లు జరిగాయి .ఇవన్నీ ఎనేస్తీషియా ఇవ్వకుండా జరిపారు .అందుకే వేలాది పేపర్లపై పెద్ద పెద్ద అక్షరాలతో రాయాల్సి వచ్చేది .పొడుగ్గా సన్నగా ఉండి ఎక్కడికి వెళ్ళినా వారిని అతి మర్యాదగా పలకరించటం తో ఆయన్ను అందరూ తేలిగ్గా గుర్తు పట్టేవారు .ఆయన ప్రవాస జీవితం అంతా కష్టాలమయమే .మొ ప్ర యు లో ఆస్త్రియాలోని త్రిస్టీనుంచి స్విట్జర్లాండ్ పంపారు .ఎక్కడా ఆయన్ను ఉంచుకోవటానికి ఒప్పుకొనే వారు కాదు .ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాడు .యుద్ధ విరమణ తర్వాత పారిస్ వెళ్లి శాశ్వత శాంతి ఏర్పడుతుందని కలలు కన్నాడు.జబ్బు ,డబ్బులేమి ,కుటుంబ గొడవలు అతన్ని బాధిస్తూనే ఉన్నాయి .పుస్తకాల పై వచ్చే రాబడి అతి తక్కువ .స్నేహితుల అభిమానుల సాయం మీదే బతకాల్సి వస్తోంది .వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం కూతురు లూసీ నరాల జబ్బు నయం చేయటానికే ఖర్చయేది .కొంత భరోసా కలిగిన సమయం లో మళ్ళీ అగాధం లో పడ్డాడు ..1940లోరెండవ ప్రపంచ యుద్ధం లో జర్మన్ సైన్యం ఫ్రాన్స్ ను ఆక్రమించే ప్రయత్నం చేసినప్పుడు జాయిస్ ,కూతుర్ని కదిలించలేక మిగిలిన వారితో స్విట్జర్లాండ్ చేరాడు .కట్టుకొన్న బట్టలు తప్ప యే ఆధారం లేకుండా వచ్చారు.అమెరికానుంచి వచ్చిన సాయం తో జ్యూరిచ్ చేరారు .
దరిద్రం తో పోరాటం ,వంటరితనం ,త్వరగా పోతున్న కంటి చూపు తో ఉన్నా ,జాయిస్ మరొక వివాదాస్పద ‘’ఫిన్నేగాన్స్ వేక్’’రాశాడు .సరళంగా చక్కని భాషలో రాశాడు .ఇందులో కూడా యెడ తెగని ఆలోచనా స్రవంతి నిఅంటే స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ ను కొనసాగించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-16 –ఉయ్యూరు

