ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –205
77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -3
మొదటి ప్రపంచ యుద్ధం లారెన్స్ జీవితం లో కొత్త చిక్కులు తెచ్చింది .మనిషి దీర్ఘ జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటే క్రమ ప్రకారం జరుగుతున్నసమూహ హత్యలు ఆయనను కలవర పర్చాయి .ఈపరిణామం మానవత మరణి౦చటానికే దారి తీస్తుందని హెచ్చరించాడు .భార్యతోకలిసి ఇంగ్లాండ్ దక్షిణ తీరం చిన్నదైన కార్న్ వాల్ టౌన్ ఆఫ్ జేన్నార్ స్వర్గ సౌఖ్య మిస్తుందని వెళ్ళాడు .అక్కడ యుద్ధ బాధిత పీడితజనం కోసం ఒక ఊహా స్వర్గం (యుటోపియ )నిర్మించే ఆలోచన చేశాడు .దీనికి పరితపించి చేయలేకపోయారు ఆ నాడు కాల్ రిడ్జ్ ,సూదీలకవులు .ఈసమయం లో లారెన్స్ చిన్న గడ్డాన్నిగుబురు వెంట్రుకలతో కప్పి పుచ్చాడు ,అది ఎర్రగా మరీ వికృతంగా కనిపించింది .దీన్నే ఒక స్నేహితుడు ‘’రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ ‘’అని పరిహసించాడు .ఇతర మనుషులలాగా పని చేసే వీలు దీని వలన కలుగుతుందని అర్ధం .ఆ ఊళ్ళో స్నేహితులెవరూ లేరు .ఒక వేళ స్నేహం చేద్దామని ఉన్నా గడ్డం ఆయన వంట చేస్తాడు ఇల్లూడుస్తాడు అంట్లు తోముతాడు అని తెలుసుకొని ఏదో గూఢ చారి మనిషేమోనని అనుమానించారు .యుద్ధ సమయమవటం ,భార్య జర్మన్ అవటం అనుమాలకు బలమైనది .ఆమె సోదరుడు మాన్ఫ్రేడ్ వాన్ రిచ్ తోఫెన్ జర్మనీలో ప్రసిద్ధ పైలట్ కూడా .ఇవన్నీ లారెన్స్ లను గూఢ చారులు అనటానికి బాగా తోడ్పడ్డాయి.ముందుగా లైట్లు తీసేయించారు. తర్వాత ఇల్లు సోదా చేయించారు .చివరికి ఊరి లోని గేట్టి౦ చేశారు .భార్యకు విచారంకలిగితే భర్తకు పిచ్చ కోపం వచ్చింది .
తరువాత రెండేళ్ళు వాళ్ళిద్దరూ ఒక ఇంటి నుంచి మరో ఇంటికి గెంటి వేయబడుతూ చివరికి లండన్ చేరారు .అక్కడ కూడా బెర్క్ షైర్ ,డేర్బి షైర్ ,మిడ్లాండ్ హిల్స్ కు మారారు .యుద్ధ సమాప్తి కాగానే 1919 లో కాంటినేంట్ కు వెళ్ళారు .రచనపై రచన ఉత్పత్తి చేస్తున్నా నిత్య దరిద్రం వెంటాడుతోంది .అతని పుస్తకాలు అచ్చువేయటం రిస్క్ అనుకొన్నారు పబ్లిషర్లు .శారీరక బలం లేకపోయినా మానసిక ధైర్యం తో రాస్తూనే ఉన్నాడు .35 వ ఏట ‘’వుమెన్ ఇన్ లవ్ ‘’రాశాడు .దీన్ని రైన్ బో కు సీక్వెల్ అన్నాడు లారెన్స్ .ఇందులో లారెన్స్ హీరో శారీరక శృంగారానికి అతీతమైన ప్రేమ ను గురించి చెప్పాడు .సూటి మనస్తత్వం ఉండటం తో మరో ఆరేళ్ళు దేశ ద్రిమ్మరిగా తిరిగాడు .అస్తిత్వనిరూపణకోసం ,రక్షణకోసం ఇంగ్లాండ్ ను 19 19 లో వదిలేసి ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాడు .వాస్తవం చెప్పాలంటే పారిపోయాడు .ఒక్కోసారి తననుంచి తానుపారిపోతున్నానేమో అనుకొన్నాడు .తనకు ఎక్కడా చోటు లేదని ఎవరూ ఆహ్వానించి ఆదరించరని తెలుసుకొన్నాడు .తీరా ఒక చోటికి ఆశగా వెళ్ళినా కొన్ని రోజుల్లోనే అది మంచిది కాదు అనుకొనేవాడు .భ్రమల్లో తేలిపోయాడు .డార్క్ మాజిక్ లో కూరుకు పోయాడు .అల్టిమాతూలేకు వెళ్ళాలనుకోన్నవాడు బేడేన్ బేడేన్ కు ,అబ్రూజి హిల్స్ కు ,కాప్రి ,టావోర్మినా,సార్దీనియా ,ఆస్ట్రియా ,లను తిరిగి అర్ధప్రపంచం చుట్టి సిలోన్ ఆస్ట్రేలియా ,తాహితి, అమెరికాకు చేరాడు . .19 20 లో మేబెల్ దాడ్జ్ లుహాన్ ఆహ్వానం పై టావోస్,న్యు మెక్సికో ,చివరికి ఓల్డ్ మెక్సికో లో అడుగు పెట్టాడు .ఇక్కడ మూడేళ్ళు తీవ్రకల్లోల పరిస్థితులలో గడిపాడు .19 24 లో ప్రయత్నం చేసి ,కొన్ని నెలలలోనే న్యు వరల్డ్ చేరాడు .మెక్సికో సిటి లో ఉండగా 1925 ఫిబ్రవరిలో తీవ్రమైన క్షయ కు గురైనాడు .ఇంకా నలభై ఏళ్ళు రాకపోయినా ఇక బతకను అనుకొన్నాడు
.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-16- ఉయ్యూరు
‘’
